15-05-2026, 06:17 AM
రుద్రంభజే! ఎపిసోడ్ 41
ఫ్యాక్టరీ దగ్గర యంగ్ వాళ్ల రూపంలో ఉన్న ధర్మ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ విఠల్ ని అందరు మెచ్చుకుంటూ ఉండగా వాళ్లకి మేకప్ వేయ్యాలా ఏమిటి వీడి బొంద ఎలా కావాలంటే అలా మారిపోతారు అని మనసులో అనుకున్నాడు గబ్బర్ సింగ్.
**************
ఆ మాటకి అందరూ తన వైపు కోపంగా చూస్తూ ఉండడం చూసి "నాకు మనసులో అనుకునే అదృష్టం కూడా లేదు కదా మర్చిపోయాను." అని గుటకలు మింగుతూ ఉన్న గబ్బర్ సింగ్ వైపు చూసి
"నీకు ఏది కరెక్ట్ గా మాట్లాడడం రాదా!" అని కోపంగా అడిగింది నీతూ.
"సారీ మేడం! మనసులో అనుకునేది బయటకి అనేసాను." అని విఠల్ వైపు కంగారుగా చూస్తూ "మీరు బాగా మేకప్ చేశారు సార్!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"థాంక్యూ!" అని చెప్పి "నేను వేసిన మేకప్ త్రీ డేస్ ఉంటుంది తర్వాత టచ్ అప్ ఇవ్వకపోతే వీళ్ళని ఎవరైనా ఈజీగా గుర్తుపడతారు మీరు ఈ లోపు వర్కు కంప్లీట్ చేసుకోవాలి." అని చెప్పాడు విఠల్.
"మీరేమీ కంగారు పడకండి ఆ ఇద్దరికి మేకప్ టచ్ అప్ ఇవ్వడానికి మా క్యూబ్ ఉన్నడు." అని చెప్పాడు నంద.
"ఎస్! ఆ విషయం నేను చూసుకుంటాను ఇప్పుడు మనం వాళ్ళ ప్లేస్ కి వెళ్లిన తర్వాత ఎవరెవరు ఏం చేయాలో ముందుగా అనుకుంటే బాగుంటుంది." అని చెప్పాడు క్యూబ్.
"అవును! రేపాలా తో మాట్లాడిన యోధని ముందు పెట్టడం మంచిది కాదు కాబట్టి నాయకుడి స్థానంలో గబ్బర్ సింగ్ ఉంటాడు మనం వెనక ఉండి చేయవలసిన పని చేద్దాము." అని చెప్పాడు భూషణ్.
ఆ మాట విని "ఏంటి? నేను ముందు నడవాలా..! మహారాజా మీకు ఇది న్యాయమా!" అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఏంటి భూషణ్ ని మహారాజుని చేసావు?" అని నవ్వుతూ అడిగింది పూజా.
"నాకు భయం వేసినప్పుడు అలాగే మాట్లాడుతాను నువ్వు ఉండవమ్మా!" అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.
దగ్గరికి వెళ్లి "యామాధర్మరాజు తోడు ఉండగా నీకు భయమెందుకు నీతో పటే ఉంటారు కదా!" అని చెప్పాడు క్యూబ్.
"అవునా? అయితే నేనే ముందుంటాను." అని సంతోషం గా చెప్పాడు గబ్బర్ సింగ్.
"ఓకే! వీళ్ళిద్దరితోపాటు గబ్బర్ సింగ్ ఉంటాడు." అని చెప్పి ఎవరెవరు ఏం చేయాలో వివరంగా చెప్పాడు యోధ.
అంతలో మిలటరీ వ్యాన్ రావడంతో "స్టార్ట్ అవుదామా? మనకోసం సార్ వెయిట్ చేస్తూ ఉంటారు." అని చెప్పింది నీతూ.
"సరే! ఈ ఆట చాలా బాగుంది." అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని గబ్బర్ సింగ్ చేతిలో పెట్టి వ్యాన్ ఎక్కాడు ధర్మ.
గుప్తా తో పాటు వ్యాన్ ఎక్కుతూ "సార్! ఇది యమ పాశమ?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.
"అవును!" అని చెప్పి సూట్ కేస్ చేతిలో పెట్టి "ఇది అందరి లెక్కలు రాసే పుస్తకం రెండు జాగ్రత్తగా ఉంచు." అని చెప్పాడు గుప్తా.
ఒక చేతిలో సూట్ కేస్, ఒక చేతిలో కర్ర చూసి "వీటిని మోయడానికి నన్ను వీళ్ళతో పాటు ఉంచుకున్నట్లు ఉన్నారు." అనుకుంటూ "బాబోయ్! మనసులో అనుకున్న వినపడుతుంది కదా!" అని వ్యాన్ ఎక్కడు గబ్బర్ సింగ్.
వ్యాన్ ఎక్కుతూ "పుష్కర్! మన వస్తువులు మొత్తం తీసుకొచ్చేయండి ఇక్కడ ఏమి ఉండకూడదు." అని చెప్పాడు యోధ.
"ఓకే సార్!" అని చెప్పి అక్కడ ఉన్నవి మొత్తం వ్యాన్లో ఎక్కించి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి బయలుదేరారు అందరు.
మిలిటరీ హెడ్ కోటర్స్ వచ్చి వ్యాన్ దిగుతున్న యోధ వాళ్ల దగ్గరికి వెళ్లి "బోర్డర్ దాటి వెళుతున్న మీ అందరి ఐడెంటిటీ ఇండియన్ మిలిటరీ కి వెళ్ళింది మిమ్మల్ని ఎవరు ఆపరు
కానీ బోర్డర్ దాటినా తర్వాత మీరే హ్యాండిల్ చేసుకోవాలి!" అని చెప్పి ఒక బాక్స్ చేతిలో పెట్టి
"మీరు సేఫ్గా అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత దీనిని ఓపెన్ చెయ్!" అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్!" అని సెల్యూట్ చేసి అక్కడ రెడీగా ఉన్న మిలటరీ చాపర్ వైపు చూసి "మాకు వెళ్లడానికి ఇవి అవసరం లేదు సార్!" అని చెప్పాడు యోధ.
ఆ మాటకి అనుమానంగా చూస్తూ "మరి బోర్డర్ దగ్గరికి ఎలా వెళ్తారు?" అని అడిగాడు నాయక్.
"మాకు సూర్య భగవానుడు తోడు ఉంటాడు." అని నవ్వుతూ చెప్పాడు నంద.
"సూర్యభగవానుడు తోడు ఉంటాడా..? ఉంటే మాత్రం ఎలా వెళ్తారు?" అని అనుమానంగా చూస్తున్న నాయక్ ని చూసి తన దగ్గర ఉన్న పద్మాన్ని బయటకు తీసి
"సార్! మేము దీని ద్వారా వెళతాము." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ అక్కడ ఉన్న ఆఫీసర్ వైపు చూసి "అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి చాపర్ కుడా ఇక్కడి నుంచి పంపించేయండి." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్!' అని సెల్యూట్ చేసి చాపర్ ని అక్కడి నుంచి పంపించి సోల్జర్స్ మొత్తం మొత్తం బయటికి వెళ్లిపోయారు.
అక్కడినుంచి అందరూ బయటికి వెళ్లడంతో తన దగ్గర ఉన్న పద్మన్ని బయటకి తీసి సూర్యకిరణం పడేటట్టు చేసి బ్లాక్ హోల్ ఓపెన్ అవడంతో నాయక్ వైపు చూసి "సార్! విజయంతో తిరిగి వస్తాము." అని మొదటగా లోపల అడుగు పెట్టాడు యోధ.
లోపలికి వెళ్ళిన యోధ కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తున్న నాయక్ దగ్గరికి వెళ్లి "వండర్ సార్" దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు.
కానీ మన పూర్వీకులు మన కన్నా గొప్ప సైంటిస్టులు అని మాత్రం తెలుసుకున్నాను." అని కళ్ళు ఆర్పకుండా చూస్తూ చెప్పాడు ముకుంద్.
"ఎస్!" అని చెప్పి బ్లాక్ హోల్ లోకి వెళ్లడానికి రెడీ అవుతున్న కూతురు దగ్గరికి వెళ్లి "ఈ మిషన్ లో నుంచి నీకు వెనక్కి వచ్చేయాలి అనిపించినప్పుడు ఈ కవరు ఓపెన్ చెయ్!" అని చేతికి ఇచ్చాడు నాయక్.
"ఓకే డాడ్!" అని హగ్ ఇచ్చి యోధ వెనకాల బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళింది దీప్తి.
భూషణ్ వైపు చూసి "అంత మీమేదే భారం!" అని చెప్పాడు నాయక్.
ఆ మాటకి నవ్వుతూ "దేవుడి మీద భారం వేసి మనిషి మీద నమ్మకం ఉంచండి." అని చెప్పాడు భూషణ్.
నాయక్ దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసి "సార్! నా తండ్రి గురించి యోధ నాకు అన్ని విషయాలు చెప్పాడు, నా బాధ్యత నెరవేర్చడానికి వెళుతున్నాను." అని చెప్పి బ్లాక్ హోల్ లోకి వెళ్ళింది నీతూ.
అక్కడ ఉన్న ధర్మ, గుప్తాల వైపు చూసి "మీరు చూపించిన ధైర్యం దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది జాగ్రత్తగా తిరిగి రండి." అని చెప్పాడు నాయక్.
"సార్! నాకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ఎందుకంటే వాళ్ళిద్దరితోపాటు టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళేది నేనే!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"పదపద! నీకు పరమవీరచక్ర ఇస్తారులే!" అని గబ్బర్ సింగ్ చెయ్యి పట్టుకుని బ్లాక్ హోల్ లోకి తీసుకువెళ్ళాడు క్యూబ్.
అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్లడంతో క్లోజ్ అవ్వడం చూసి "సార్! వీళ్ళలో నలుగురు మాత్రమే మిలిటరీ లాగా కనబడుతున్నారు ప్రాబ్లం ఏమి ఉండదు కదా!" అని అడిగాడు ముకుంద్.
ఆ మాటకి ధైర్యంగా చూస్తూ "యుద్ధం చేయడాకి లంక సముద్ర తీరంలో ఉన్న రాముల వారి సైన్యాన్ని చూసి మామూలు మనుషులు వానరులు వచ్చారు వీళ్ల నాతో యుద్ధం చేసేది అని తక్కువగా అంచిన వేసి మనసులో నవ్వుకున్నాడు అంట రావణాసురుడు.
ఎవరిలో ఏ శక్తి ఉందో యుద్ధ రంగంలోకి దిగితేనే కదా తెలిసేది. ఆ దైవమే వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది మనం కళ్ళారా చూశాం కదా! ఇంకా వీళ్ళకి ఆ దైవమే తోడు ఉంటుంది." అని చెప్పి ఫోన్ తీసి కాల్ చేసి
"త్రివిదా దళాలను ఎలర్ట్ చెయ్యండి. బోర్డర్ శాటిలైట్స్ మొత్తం ఆన్ చేయండి శత్రు దేశాల సైనికుల కదలికలు ఎప్పటికప్పుడు మనకి తెలియాలి." అని చెప్పాడు నాయక్.
**************
పర్వతాలు దగ్గర ఉన్న ల్యాబ్ లో కలింగ దగ్గరకు వచ్చి "ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది బోర్డర్లో సోల్జర్స్ అలర్ట్ గా ఉన్నారు రెండు దేశాల వైపు ఆయుధాలు ఎయిమ్ చేసి ఉంచారు.
మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎలర్ట్ మెసేజ్ వచ్చింది మన దగ్గర సైనికులు ఎవరు ఉండడం కుదరదు అందరూ క్యాంప్స్ దగ్గరికి వెళ్లాలి శాటిలైట్ లో ఇక్కడ సోల్జర్స్ ఉన్నట్లు ఇండియన్ మిలిటరీ చూసారు అంటే వెంటనే అటాక్ చేస్తారు." అని చెప్పాడు చింగ్ యా.
"ఈ ల్యాబ్ కి నా సైన్యం రక్షణ చాలు మీ సైన్యాన్ని వెనక్కి పంపించండి." అని చెప్పాడు రేపాలా.
"అసలు వాళ్ళు పర్వతాలు దాటి ల్యాబ్ వరకు రావాలి కదా సయ్యద్ తన మనుషులతో రెడీగా ఉన్నాడు." అని చెప్పాడు కళింగ.
"ఎస్! ఈ ల్యాబ్ కి రేడార్ సిస్టం పెట్టించాను ఇండియన్ మిలిటరీ ఎయిర్ ఎటాక్ చేయలేరు ఒకవేళ ఎటాక్ చేయాలి అంటే డైరెక్ట్ గా రావాల్సిందే!" అని చెప్పాడు చింగ్ యా.
ఆ మాటకి నవ్వుతూ " డైరెక్ట్ గా ల్యాబ్ దగ్గరికి వచ్చి బతికే ఛాన్స్ లేదు నేను తయారు చేసిన జంతువులు lఆకలితో ఉన్నాయి." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.
"ఓకే గుడ్! ఇప్పుటి వరకు ఇండియన్ బోర్డర్ దాటి మన బోర్డర్ లోకి ఎవరు ఎంటర్ అయినట్టు ఇంటిమేషన్ లేదు అసలు వాళ్ళు బయలుదేరారా..?" అని అడిగాడు చింగ్ యా.
"నాతో మాట్లాడిన వ్యక్తి మాటలను బట్టి కచ్చితంగా వస్తారు." అని తనతో పాటు ఉన్న మనిషి చాతి మీద సింబల్ ని చూపించి
"నేను సృష్టించిన శక్తి హిడిచి అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు." అని నవ్వుతూ చెప్పాడు రేపాలా.
హిడిచి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "జింగ్ ని ఇలా తయారు చేసావా..?" అని అడిగాడు కళింగ.
"అవును! జింగ్ శరీరంలోకి నా పూర్వీకుల శక్తిని పంపించాను ఇతన్ని జయించడం ఎవరి తరం కాదు! వాళ్లు రావడం ఆలస్యం ఆ వస్తువుని చేజిక్కించుకొని అలకాపురి లో నా పాదం పెడతాను." అని నవ్వుతూ చెప్పాడు రేపాలా.

" రుద్రంభజే! ఎపిసోడ్ 41 " రచనకు రేటింగ్ ఇవ్వండి

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)