Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
రుద్రం భజే! ఎపిసోడ్ 39



కళింగ, రేపాలా తో ఫోన్లో మాట్లాడిన యోధ వైపు చూసి అక్కడికి వెళ్లడానికి నీతో పాటు వచ్చే టీమ్ మెంబర్స్ ఎవరెవరు అని అడిగాడు నాయక్.

ఆ విషయం నేను చెబుతాను అని సూట్ కేస్ పట్టుకొని యంగ్ రూపంలో బయటికి వచ్చాడు గుప్తా.

************

రూమ్ లో నుంచి బయటికి వచ్చిన గుప్త వైపు చూసి "యంగ్ పోలికలు ఉన్నాయి కానీ ఇంకా సెట్ చేయాలి." అని చెప్పాడు నాయక్.

అంతలో రూమ్ లో నుంచి బయటకి వస్తూ "సార్! నా పని ఇంకా పూర్తవలేదు మీ మాటలు విని టీమ్ ని సెట్ చేయాలి అంటూ హడావుడిగా బయటికి వచ్చాడు." అని చెప్పాడు విఠల్.

"గుడ్! డ్యూటీ మీద ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండాలి." అని చెప్పి గుప్తా వైపు చూసి "సరే! మొదలు పెట్టావు కదా ఎవరెవరు వెళ్లాలో నువ్వే చెప్పు!" అని అడిగాడు నాయక్.

"మీరు అరవకొండ పంపించిన టీమ్ మా టీమ్ కలిసి యోధతో పాటు వెళ్లి మిషన్ కంప్లీట్ చేసుకొని వస్తాము." అని చెప్పాడు గుప్తా.

"ఆ ప్లేస్ కి లేడీస్ ని పంపించాలా నెవర్! అవసరమైతే మరో నలుగురు సోల్జర్స్ ని టీమ్ లో యాడ్ చేస్తాను." అని చెప్పాడు నాయక్.

ఆ మాట విని నంద వైపు చూసి "నందీశ్వర! మాయని సృష్టించు నాయక్ గారితో మనం మాట్లాడే మాటలు ఎవరు వినకూడదు." అని చెప్పాడు భూషణ్.

"సరే!" అని చెప్పి తన చేతిని పైకి ఎత్తాడు నంద.

ఫ్యాక్టరీ లోపల అంత మాయా కమ్మడంతో నాయక్ వైపు చూసి "నేను చెప్పిన వారు కాకుండా అక్కడకి ఎవరు వచ్చిన ప్రాణాలతో తిరిగిరారు." అని చెప్పాడు గుప్తా.

"ఆ విషయం నీకు ఎలా తెలుసు? అయినా నా కూతుర్ని ప్రమాదంలోకి పంపడం నాకు ఇష్టం లేదు, తను సోల్జర్ కూడా కాదు ఒక సైంటిస్ట్!"   అని చెప్పాడు నాయక్

"దీప్తి, నీతూ లు కచ్చితంగా యోధతో పాటు ఉండాలి వారికి ఈ పద్మానికి ఉన్న బంధం అటువంటిది." అని చెప్పాడు గుప్తా.

"నా కూతురికి ఆ పద్మానికి ఎటువంటి సంబంధం లేదు." అని చెప్పాడు నాయక్.

"ఆ విషయం మీరు ఎలా చెప్తారు దీప్తి మీ కూతురు కాదు కదా! ఆ పద్మాన్ని తీసుకొచ్చే ప్రమాదంలో చనిపోయిన ఏజెంట్ సాదిక్ కూతురు." అని చెప్పాడు గుప్తా.

ఆ మాటకి షాక్ అయి చూస్తూ "నాకు మాత్రమే తెలిసిన ఈ విషయం మీకు ఎలా తెలిసింది?" అని అడిగి అందరూ బొమ్మలాగా నిలబడి ఉండడం చూసి "ఏమైంది?ఎవరు మాట్లాడలేదు." అని కంగారుగా చూస్తూ అడిగాడు నాయక్.

"నేను చెబుతాను." అని అక్కడికి భారీ ఆకారంలో నడుచుకుంటూ వచ్చాడు విభీషణుడు.

ఆ మాట విని వెనక్కి తిరిగి భారీ ఆకారంలో ఉన్న విభీషుడి వైపు ఆశ్చర్యంగా చూస్తు "ఎవరు నువ్వు!" అని కంగారుగా అడిగాడు నాయక్.

"స్వర్ణ లంకాధిపతి విభీషుణుడు!" అని చెప్పాడు గుప్తా.

ఆ మాట విని "ఏంటి విభీషణుడా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు నాయక్.

"అవును! మీరు ధైర్యంగా వాళ్ళని పంపించండి సృష్టికార్యం ఎవరి చేతులు మీద జరగాలో దైవం నిర్వహించింది  దానిని ఆపే ప్రయత్నం చేయకండి వారికి ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు." అని చెప్పాడు విభీషణుడు.

"నేను చూస్తుంది మీరు చెబుతుంది నిజమేనా..? నమ్మలేకపోతున్నాను." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు నాయక్.

"మీరు జరుగుతున్న ఏ విషయాలన్నీ నమ్మలేరు, పద్మన్ని కాపాడిన సాధిక్ కూతురు దీప్తి, పాండే కూతురు నీతూ, ప్రకాష్ కొడుకు యోధ లని ఈ కార్యానికి దైవం ఎంచుకుంది.

ఆ ముగ్గురికి సహాయం చేయడానికి దైవమే కదిలి వస్తుంది వారి చేతుల మీద గానే ఆ పద్మం అలకాపురికి చేరాలి ఇది ఆ భగవంతుడు వాళ్ల నుదుటినా రాసిన తలరాత దీనిని ఎవరు మార్చలేరు." అని చెప్పాడు విభీషణుడు.

"నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాను తను జీవితం సుఖంగా ఉండాలని సోల్జర్ అవుతాను అని చెప్పిన ఒప్పించి సైంటిస్ట్ చేశాను, కానీ నేనే మళ్ళీ ఆ పద్మం మీద రీసెర్చ్ కోసం పంపించాను అలా చేయకుండా ఉన్న బాగుండేదేమో!"  అన్నాడు నాయక్.

"మానవుడు ప్రతి పని నేను చేశాను అనుకుంటాడు కానీ దైవ నిర్ణయం ఎలా ఉంటే ఆలా జరుగుతుంది. పెంచిన ప్రేమతో దీప్తి కాళ్ళకి బంధాలు వేస్తే సృష్టి వినాశనం జరుగుతుంది." అని చెప్పాడు విభీషణుడు.

"నావల్ల ఆ తప్పు జరగనివ్వను." అని నమస్కారం చేస్తూ  చెప్పాడు నాయక్.

ఆ మాట పూర్తవడంతోనే మాయ తొలిగి నాయక్ వైపు చూసి "సార్! అలా మాట్లాడుతున్నారు లేడీస్ అని మమ్మల్ని తక్కువ చేసి చేస్తున్నారు." అని అడిగింది నీతూ.

"నో నో! నేను అలా అనడం లేదు ఇది రిస్కీ మిషన్ మీరు సోల్జర్స్ కాదు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడిగిన తర్వాత చెబుదామని అలా అన్నాను." అని చెప్పాడు నాయక్.

"డాడ్! నేను సైంటిస్ట్ అయినా మీ ట్రైనింగ్ లో ఒక సోల్జర్ గానే పెరిగాను  మీరు కంగారు పడకండి యోధ తోడు ఉంటే ఏదైనా చేయగలము." అని చెప్పింది దీప్తి.

"ఓకే ఓకే! మీరు ప్రిపేర్ అవ్వండి." అని చెప్పి భూషణ్ వైపు చూసి "అంత మీ మీదే భారం!" అని చెప్పాడు నాయక్.

"మిషన్ కంప్లీట్ అయ్యేంతవరకు యోధ టీం తోనే మేము కూడా ఉంటాము సార్!" అని చెప్పాడు భూషణ్.

గుప్తా వైపు చూసి "సార్!  మీరు లోపలికి రండి మేకప్ లేట్ అయిపోతుంది." అని తీసుకువెళ్లాడు విఠల్.

"నాకు కాల్ వస్తుంది అర్జెంటుగా వెళ్లాలి మీరు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు వచ్చేస్తాను రెడీగా ఉండండి." అని కార్ దగ్గరికి వెళ్ళాడు నాయక్.

"సార్ ని డ్రాప్ చేసి వస్తాను." అని చెప్పాడు యోధ.

కారు అక్కడ నుంచి వెళ్లడంతో "నాయక్ సర్ ఇక్కడ ఉంటే గబ్బర్ సింగ్ ఏంటి ప్రశాంతంగా పడుకున్నాడు."  అని డౌట్ గా చూస్తూ అడిగింది పూజా.

"గబ్బర్ సింగ్ సంగతి నేను చూసుకుంటాను మీరు మీ వర్క్ చూసుకోండి." అని చెప్పి మోహనా నీళ్లు చల్లాడు క్యూబ్.

స్పృహలోకి వచ్చి భూషణ్  వైపు భయంగా చూస్తూ "మీరు ఏజెంట్లు కాదు అని తెలుసు! కానీ మనుషులే కాదు అని తెలుసుకోలేకపోయాను, బాబోయ్ నన్ను వదిలేయండి." అని ఏడుస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందామా?" అని గబ్బర్ సింగ్ భుజం మీద చెయ్యి వేసి తీసుకు వెళ్ళాడు భూషణ్.

గబ్బర్ సింగ్ వైపు చూసి "ఆ ముగ్గురితో బాగా కలిసిపోయావే!" అని నవ్వుతూ అడిగింది నీతూ.

"నేను కలిసిపోవడం ఏమిటి మేడమ్ అడుగు కూడా వేయడం లేదు వాళ్లే తీసుకు వెళ్లిపోతున్నారు." అని ఏడుపు మొహం పెట్టుకుని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని నవ్వుతూ వెళ్ళిపోతున్న నీతూ వైపు ఆశ్చర్యంగా చూస్తున్న గబ్బర్ సింగ్ ని చూసి "నువ్వు మాట్లాడేది ఏమీ వాళ్లకి వినపడదు సైలెంట్ గా ఉండు." అని చెప్పాడు క్యూబ్.

"సార్! నన్ను వదిలేస్తే నేను పారిపోతాను ఈ విషయం కూడా ఎక్కడ చెప్పను." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"నీకు మాయని చేదించి చూసే శక్తి ఉంది అందుకే నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చాము ముందు ముందు నీతో చాలా పని ఉంది." అని చెప్పాడు నంద.

"అవునా? నాకు ఒక చిన్న డౌట్స్ మీరు నిజంగా రావణాసురుడి తమ్ముడు విభీషణుడు గారా..?" అని వేలుతో నొక్కుతూ అడిగాడు గబ్బర్ సింగ్.

"అవును! నీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పు బంగారు లంక కి తీసుకు వెళ్లి చూపిస్తాను." అని చెప్పాడు భూషణ్.

ఆ మాటకి భయంగా చూస్తూ "అవసరం లేదు సార్! ఇందాక మీ అసలు రూపం చూశాను కదా! ఇంతకీ మీ ఇద్దరు ఎవరు?" అని క్యూబ్ వాళ్ళ వైపు చూసి అడిగాడు గబ్బర్ సింగ్.

"ముందు ముందుం ప్రయాణం మాతోనే కదా నీకే తెలుస్తుందిలే!" అని నవ్వుతూ చెప్పాడు క్యూబ్.

"అసలు నాకే ఈ బంపర్ ఎవరు ఎందుకు వచ్చింది." అని అనుమానంగా అడిగాడు గబ్బర్ సింగ్.

"మీ పూర్వీకులు తపస్సు చేసి ఈ శక్తిని సంపాదించారు వాళ్ల తపస్సు ఫలితం వారసుడువి అయిన నీకు మళ్ళీ ఆ శక్తీ వచ్చింది." అని చెప్పాడు నంద.

"అబ్బో! ఆస్తులు ఇవ్వకపోయినా ఈ శక్తి ఇచ్చారు అన్నమాట! ఇంక మీ ముగ్గురు నన్ను వదలరు నా పక్కనే ఉంటారు అర్థమైంది.

మిమల్ని వదిలి పారిపోవడానికి కూడా కుదరదు క్షణాల్లో పట్టుకుంటారు." అని ఏడుస్తూ భూషణ్ వాళ్ళతో పాటు ట్యాంక్ మీద కూర్చుని క్యూబ్ వైపు చూసి

"మీ ఇద్దరి గురించి చెప్పలేదు సరే ధర్మ, గుప్తా ఎవరో కనీసం అదైనా చెప్పండి." అని అడిగాడు గబ్బర్ సింగ్.

"యమధర్మరాజు చిత్రగుప్తుడు." అని చెప్పాడు భూషణ్.

ఆ మాటకి షాక్ అయి చూస్తూ "ఏంటి? డైరెక్ట్ గా యమధర్మరాజులా వారు వచ్చేసారా? ఇంక మాతో పని ఏంటి సార్ వాళ్ళు చూసుకుంటారు కదా!" అని నవ్వుతూ అడిగాడు గబ్బర్ సింగ్.

"మేము మీకు దారి మాత్రం చూపిస్తాము వెళ్ళవలసింది మీరే!" అని చెప్పాడు నంద.

"ఓహో! మాకు ఈ ఆఫర్ కూడా ఉందా..? అక్కడికి వెళ్లిన తర్వాత మనిషి రెండు ముక్కలు చేసే తోడేలుని చూపిస్తారు దానిని చంపే బాధ్యత మాది అంతే కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"అవును! నువ్వు చాలా తెలివైన వాడివి నిన్నే అందరికంటే ముందు నడిపిస్తాము." అని చెప్పాడు క్యూబ్.

"సార్! యమధర్మరాజుల వారు మనతోపాటే ఉన్నారు కాబట్టి  నాకు ఈ శక్తి ఇచ్చిన మా ముత్తాతని ఒక్కసారి చూపించండి ప్లీజ్!" అని అడిగాడు గబ్బర్ సింగ్.
[+] 7 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 15-05-2026, 06:11 AM



Users browsing this thread: 1 Guest(s)