Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
రుద్రం భజే! ఎపిసోడ్ 38



ల్యాబ్ దగ్గరికి వచ్చిన యోధ వాళ్ళని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి స్క్రీన్ ఆన్ చేసి మిలిటరీ క్యాంప్ మీద జరిగిన ఎటాక్ విజువల్స్ చూపించాడు నాయక్.

ఆ వీడియోలో ఉన్న జింగ్ ని చూసి సార్ నేను వీడిని చంపేసి సముద్రంలో పడేసాను మళ్ళీ ఎలా బతికాడు అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు యోధ.

*************

యోధ చెప్పింది విని కంప్లీట్ వీడియో చూడండి "చాలా మిస్టీరియస్ గా ఉంది." అని చెప్పాడు నాయక్.

వీడియో చూస్తూ "మన సోల్జర్ షూట్ చేస్తున్న వాళ్ళకి బుల్లెట్స్ తగలడం లేదు ఏమిటి?" అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది నీతూ.

"డాడ్! ఒక్కసారి పాస్ చేయండి." అని చెప్పి జూమ్ చేసి "అక్కడికి వచ్చిన వాళ్ళ కళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వాళ్లు కచ్చితంగా మనుషులు కాదు." అని చెప్పింది దీప్తి.

వీడియో చూస్తూ "సార్! వీళ్లు మన సోల్జర్స్ ని చంపలేదు స్పృహ తప్పేటట్లు చేసి కిడ్నాప్ చేసారు అంటే మన దగ్గర ఉన్న వస్తువు, యంగ్ కోసం ఇదంతా చేస్తున్నారు." అని చెప్పాడు యోధ.

"కరెక్ట్! కానీ జింగ్ వెనకాల వచ్చిన ఆరుగురు ఫేస్ లు మనవాళ్లు ఐడెంటిఫై చేశారు వాళ్ళు లాస్ట్ ఇయర్ బోర్డర్లో జరిగిన షూట్ అవుట్ లో చనిపోయిన టెర్రరిస్టులు బాడీ లు కుడా పాకిస్తాన్ మిలటరీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది.

ఈ వీడియో చూపించి మనం అడగడానికి కుడా సరిపోవు అంతర్జాతీయ వేదిక మీద చూపించిన చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా తిరిగి వస్తారు అనే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు." అని చెప్పాడు నాయక్.

"సార్! ముష్రు చెప్పినట్టు కళింగ దగ్గర రేపలా అనే ఒక తాంత్రికుడు ఉన్నాడు. అతనే చనిపోయిన వాళ్ళ బాడీ లోకి వేరే ఆత్మల్ని పంపించి మళ్ళీ బ్రతికిస్తున్నాడు అంట అలాంటి వాళ్ళని  నలుగురిని కజకిస్తాన్ లో మేము కుడా చూసాము వాళ్ళని నేను చంపెను."అని చెప్పాడు యోధ.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "బుల్లెట్ తగిలిన చావని వాళ్ళు నీ చేతిలో ఎలా చనిపోయారు?" అని అడిగాడు నాయక్.

"యోధ! ఆ నలుగురి కాపాలం పగిలిపోయేలాగా కొట్టాడు అప్పుడు చనిపోయారు." అని చెప్పింది దీప్తి.

"ఈ కళింగ సైన్స్ ని మైథాలజీని మిక్స్ చేసి ప్రపంచానికి సవాల్ విసిరుతున్నాడు." అని చెప్పాడు నాయక్.

"సర్! మంచి మీద సవాల్ విసిరిన వాడు ఇప్పటివరకు ఎవరు గెలవలేదు ఫ్యాక్టరీ దగ్గరికి విఠలాచార్య వచ్చాడు యంగ్, భూపాల్ సింగ్ రెడీ అవుతాన్నారు, మీరు ఓకే అంటే వాళ్ళని తీసుకువెళ్లి హ్యాండ్ ఓవర్ చేసి మన సోల్జర్స్ ని తీసుకొస్తాను." అని చెప్పాడు యోధ.

"ఎటువంటి నెగోషేషన్ చేయకుండా నువ్వు అక్కడకి ఎలా వెళతావు అయినా నీ ప్లాన్ చాలా డేంజర్ అక్కడ రెండు దేశాల ఆర్మీ కూడా ఉంటుంది." అని చెప్పాడు నాయక్.

"మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి కళింగతో మాట్లాడదాము అతను నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు." అని చెప్పాడు యోధ.

"అలా అయితే! ఈ మిషన్ కంప్లీట్ అయ్యేంతవరకు మీ టీమ్ కి ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధం లేదు." అని స్మైల్ ఇచ్చాడు నాయక్.

"నాకు అదే కావాలి సార్ అప్పుడే పైనుంచి ఎటువంటి ఆర్డర్స్ ఉండవు అక్కడ ఏం జరిగినా మీకు  కుడా హెడేక్ ఉండదు." అని నవ్వుతూ చెప్పాడు యోధ.

ఆ రూమ్ లోకి వస్తూ "సార్! యంగ్ మీద చేసినా ప్రయోగం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను కరెక్ట్ చెప్పాలంటే ఇతను ఇంకా రెడీ అవ్వలేదు ఇతని బ్లడ్ వల్ల భారీ ఆకారంలో పెరిగిన జంతువులు నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుంది.

అది ఎలాంటిది అంటే మనిషి ఇచ్చావనివ్వదు బతకనివ్వదు బాడీలో ఉన్న పార్ట్స్ ఒక్కొక్కటిగా చెడిపోతూ ఉంటాయి ఇంక అతను జీవితాంతం మెడిసిన్ యూస్ చేస్తూనే బతకాలి కావాలనే యంగ్ ని ఈ విధంగా తయారు చేశారు అనుకుంటున్నాను.

అతనన్ని క్యూర్ చేయడం కొంచెం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు కానీ అతను బతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది." అని చెప్పాడు ఉన్నికృష్ణన్.

"మీరు వెంటనే యంగ్ ని క్యూర్ చేసే పనిలో ఉండండి అతని మీద చేసిన ప్రయోగం గురించి ప్రతిదీ వివరంగా ఒక వీడియో రెడీ చేయండి మనవాళ్లు ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు రెండు దేశాల ఆర్మీ అక్కడికి రాకుండా ఎలా  చేయాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని చెప్పాడు ఉన్ని కృష్ణన్.

"యోధ వైపు చూసి మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళదామా?" అని అడిగాడు నాయక్.

"ఎస్ సార్!" అని చెప్పి ల్యాబ్ దగ్గర్నుంచి కార్ లో గోడౌన్ దగ్గరికి బయలుదేరారు అందరు.

ఫ్యాక్టరీ దగ్గరికి యోధ తో కార్ లో వచ్చిన నాయక్ ని చూసి "మనం ఆయనకి ఏజెంట్లు లానే కనపడతాము ఎవరు నోరు మెదపకండి."  అని చెప్పాడు నంద.

ట్యాంక్ వెనకాల నిద్రపోతూ ముగ్గురు మాటలు విని "ఏంటి? ఏజెంట్స్ లాగా కనపడతారా..? అంటే వీళ్ళు నిజమైన ఏజెంట్లు కాదా!" అని కంగారుగా క్యూబ్స్ వాళ్ళ వైపు చూసి

"మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది ఇప్పుడే మీ సంగతి తెలుస్తాను." అని పరిగెత్తుకుంటూ వెళ్లి నాయక్ కనపడడంతో సెల్యూట్ చేసి యోధ వెనకాలే వెళుతూ "సార్! మీకు ఒక సీక్రెట్ చెప్పాలి భూషణ్ వాళ్ళు ముగ్గురు ఏజెంట్లు కాదు." అని నెమ్మదిగా చెప్పాడు గబ్బర్ సింగ్.

"ఆ విషయం నాకు తెలుసు!" అని చెప్పాడు యోధ.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ  "ఈ విషయం మీకు తెలుసా మరి వాళ్ళు ఏజెంట్లు కాకపోతే ఎవరు? " అని మనసులో అనుకున్నడు గబ్బర్ సింగ్

ఫ్యాక్టరీ లోపలకి వెళుతు భూషణ్ వాళ్ళ వైపు చూసి "నేను పంపించిన ముగ్గురు ఏజెంట్స్ నీకు హెల్ప్ ఫుల్ గా ఉన్నారు కదా!" అని అడిగాడు నాయక్.

"ఎస్ సార్! మేము ఇదంతా చేయగలిగము అంటే ఆ ముగ్గురు వల్లే!"  అని చెప్పాడు యోధ.

ఆ మాటలు విని అయోమయంగా చూస్తూ "అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. నాయక్ సర్ ఇక్కడ నుంచి వెళ్లే లోపు ఈ ముగ్గురు విషయం తేల్చేయాలి ప్రమోషన్ కొట్టేయాలి." అనుకున్నడు గబ్బర్ సింగ్.

ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి ముష్రు చేతికి ఫోన్ ఇచ్చి "కళింగ కి కాల్ చెయ్ మాట్లాడతాను." అని చెప్పాడు యోధ.

"సరే సార్!" అని ఫోన్ చేసాడు ముష్రు.

ఫోన్ లిఫ్ట్ చేసి "ఏంటి ముష్రు? లోపలికి వెళ్ళావా? వాళ్లలో ఎవరినైనా కలిసావా?" అని అడిగాడు కళింగ.

"సార్! నేను లోపలికి వెళ్ళాను అప్పటికే మన మనుషులందరూ చనిపోయారు నన్ను కూడా చంపబోయరు కానీ మీతో ఒక్కసారి మాట్లాడమని రిక్వెస్ట్ చేశాను ఫోన్ ఇస్తున్నాను భూపాల్ సింగ్ ని కిడ్నాప్ చేసిన వాళ్ల లీడర్ తో మాట్లాడండి." అని యోధకి ఫోన్ ఇచ్చాడు ముష్రు.

ఫోన్ తీసుకుని "ఎవరు మాట్లాడేది?" అని అడిగాడు యోధ.

"ఆ విషయం నీకు అనవసరం మా వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేసావు నువ్వు మిలటరీ నా.. RAW నా..?" అని అడిగాడు కళింగ.

"నువ్వు చెప్పిన రెండు కాదు, పేరు చెప్పడానికి భయపడే వాడితో నేను మాట్లాడను నాకు సమఉజ్జి అయిన రేపాలాకి ఫోన్ ఇవ్వు వాడితోనే మాట్లాడుతాను." అని చెప్పాడు యోధ.

ఆ మాటకి షాక్ అయి "నీకు రేపాలా తెలుసా? అసలు ఎవరు నువ్వు? నీకు ఏమీకావాలి?" అని అడిగాడు కళింగ.

"నేను రేపాలా తో మాత్రమే మాట్లాడుతాను మళ్ళీ నీ నోటి నుంచి మరో మాట వచ్చింది అంటే పద్మంలో అక్కడికి వచ్చి నా శక్తిని ఉపయోగించి నువ్వు తయారు చేసిన మంచు తోడేలు తోనే నిన్ను చంపిస్తాను." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని రేపాలా వైపు కంగారుగా చూస్తూ "వీడెవడో నీ కన్నా పెద్ద మాంత్రికుడు లాగా ఉన్నాడు నీతోనే మాట్లాడుతాను అంటున్నాడు." అని టెన్షన్ చూస్తూ ఫోన్ చెప్పాడు కళింగ.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "నాతో మాట్లాడతాడా? నాకు సమవుజ్జి అయినవాడా..?" అని ఫోన్ తీసుకుని "ఎవరు మాట్లాడేది?" అని అడిగాడు రేపాలా.

"నీ నలుగురు మనుషుల కాపాలలు పగలగొట్టి చంపినవాడిని!" అని చెప్పాడు యోధ.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "నీకు దైవశక్తి సహాయం చేస్తుందని నాకు తెలుసు! కానీ ఇది కలికాలం వాళ్ళ శక్తి భూమి మీద పనిచేయదు.

కాబట్టి నువ్వు ఈ కలికాల బ్రహ్మ రేపాలాని నమ్ముకో ఆ ఇద్దరిని పద్మన్ని తీసుకొని నా దగ్గరకురా... నీకుకావాల్సింది నేను ఇస్తాను." అని చెప్పాడు రేపాలా.

"సరే! రేపు సూర్యోదయం అవ్వగానే నా ప్రయాణం ఇచ్చిన మాట మీద ఉండు అక్కడ ఏదైనా తేడా జరిగిందో హిడిచి వంశంలో మిగిలిన ఒక్కడు ఉండడు." అని చెప్పాడు యోధ.

"సరే! మీరు కారకొరం పర్వతాల పోస్టు దగ్గరికి రండి అక్కడ మీకోసం వెహికల్ రెడీగా ఉంటుంది ఇండియన్ మిలటరీని తప్పించుకునే రావలసిన బాధ్యత మీదే ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఆపారు." అని చెప్పాడు రేపాలా.

"సరే!" అని ఫోన్ పెట్టేసాడు యోధ.

ఫోన్ పెట్టేసిన యోధ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "అసలు ఆ రేపాలా ఎవడు? వాడి గురించి నీకు ఎలా తెలుసు? నువ్వు చెప్పిన ప్రతి దానికి వాడు సరే అని ఎందుకు అన్నాడు?" అని డౌట్ గా అడిగాడు నాయక్.

"కొన్ని విషయాలు తెలియకుండా ఉండడమే బెటర్ సార్!" అని భూషణ్ వాళ్ళ వైపు చూసి నవ్వుతూ "మీకు చెప్పినట్లు నా టీమ్ తో అక్కడికి వెళతాను మిషన్ కంప్లీట్ చేసుకుని వస్తాను." అని చెప్పాడు యోధ.

"మరి యంగ్, భూపాల్ సింగ్ వాళ్లకి హ్యాండ్ ఓవర్ చేస్తే డేంజర్ కదా!" అని అడిగాడు నాయక్.

"మన విఠలాచార్య రెడీ చేసే యంగ్ వాళ్లని హ్యాండ్ ఓవర్ చేస్తాము వాళ్ల గురించి అసలు విషయం తెలుసుకునే లేపు కథ ముగించేస్తాము." అని చెప్పాడు యోధ.

"నువ్వు ఒక విషయం మర్చిపోయావ్ మీకు హెల్ప్ చేయడానికి ఇండియన్ మిలిటరీ ఆ ప్లేస్ కి ఎంటర్ అవ్వలేదు." అని చెప్పాడు నాయక్.

"మీరు చెప్పినట్లు రెండు దేశాల మిలటరీ కుడా అక్కడ లేకుండా చేయండి చాలు మిగతా సంగతి మా టీమ్ చూసుకుంటుంది." అని చెప్పాడు యోధ.

"ఓకే! అక్కడికి నీ టీమ్ మెంబెర్స్ ఎవరెవరు వెళతారు." అని అడిగాడు నాయక్.

"ఆ విషయం నేను చెబుతాను." అని సూట్ కేస్ పట్టుకొని యంగ్ వేషంలో బయటికి వచ్చాడు గుప్తా.



" రుద్రం భజే! ఎపిసోడ్ 38 " రచనకు రేటింగ్ ఇవ్వండి..
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 14-05-2026, 06:36 AM



Users browsing this thread: 1 Guest(s)