Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
రుద్రం భజే! ఎపిసోడ్ 37


ముష్రు చెప్పింది విని ల్యాబ్లో ఏ డిఎన్ఎతో అయినా కృత్రిమంగా జంతువును సృష్టించిరా.. అని అడిగింది దీప్తి.

***********

దీప్తి అడిగినాదానికి సైలెంట్ గా ఉన్న ముష్షు దగ్గరికి వెళ్లి "ఏంట్రా? ఏ డైనోసార్ నైనా మళ్ళీ పుట్టించారా...?" అని కంగారుగా అడిగింది పూజా.

"డీఎన్ఏ క్లోనింగ్ ప్రాసెస్ లో మూడు రకాలు ఉంటుంది ఒకటి ఈమధ్యకాలంలో అంతరించిపోయినా జంతువులను సులభంగా క్లోనింగ్ ద్వారా మళ్ళీ సృష్టించొచ్చు ఆ ప్రయోగం అన్ని దేశాలలో చేస్తున్నారు.

రెండవది కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువుల డీఎన్ఏలు దొరికినప్పుడు వాటిని ప్రాసెసింగ్ చేసి పోలికలు ఉన్న జంతువు డిఎన్ఏ తో మిక్స్ చేసి అంతరించిపోయిన జంతువులు మళ్ళీ సృష్టించవచ్చు.

మూడోది మీరు అడిగిన డైనోసార్ లాంటి జంతువు దానిని డిఎన్ఏ  ఇప్పటివరకు ఎక్కడ లభించలేదు అటువంటి వాటిని మళ్లీ సృష్టించి కృత్రిమంగా జంతువును సృష్టించడం ఇప్పటివరకు ఎవరు చేయలేదు అది సాధ్యం కాదు

మేము టిబెట్ లో ఉన్నప్పుడు కళింగ కి చింగ్ యా పరిచయమయ్యాడు వాళ్లు మీ దగ్గర ఉన్న వస్తువు కోసం వెతికే క్రమంలో హిమాలయాలలో కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన కొన్ని జంతువుల కళేబరాలు దొరికాయి  అక్కడకి మమ్మల్ని తీసుకువెళ్లి చూపించాడు.

అక్కడే ఉన్న వాటిలో ఎక్కువగా మంచు తోడేళ్ల కళేబరాలు  ఉన్నాయి అవి ఇప్పుడున్న తోడేళ్లు కన్నా నాలుగు రెట్లు పెద్దగా బలిష్టంగా ఉంటుంది మనిషిని ఒక్క దెబ్బతో రెండు ముక్కలు చేస్తుంది.

ఆ మంచు తోడేలు యొక్క పన్ను తలభాగం దొరకడంతో వాటి ద్వారా డీఎన్ఏ ప్రాసెసింగ్ చేసి క్లోనింగ్ లో తోడేళ్లను సృష్టించాడు వాటిని చూస్తేనే మనం భయంతో ముందు చనిపోతాము.

ఆ ల్యాబ్ చుట్టూ నైట్ టైమ్ అవే సెక్యూరిటీగా ఉంటాయి అందుకే అక్కడికి ఎవరు వెళ్లిన వారు ఎవరు తిరిగి రాలేకపోయారు.

ఆ ప్రయోగంలో ఉండగానే మాకు రేపాలా పరిచయం అయ్యాడు అతని దగ్గర ఉన్న విద్యతో కళింగ, యంగ్ తయారు చేశాడు కానీ అతని బ్లడ్ తో తయారైన జంతువు 24 గంటల కన్నా ఎక్కువ టైమ్ బ్రతకదు.

కానీ ఆ జంతువు చనిపోయిన తర్వాత దాని నుంచి ఒక కొత్త రకం వైరస్ గాలిలో కలుస్తుంది అందుకోసమే ఫార్మా కంపెనీ వాళ్ళు కళింగ కి కొన్ని వేల కోట్లు ఫండింగ్ ఇచ్చారు ఆ ప్రయోగం చేసే లోపు మీరు యాంగ్ ని కిడ్నాప్ చేశారు." అని చెప్పాడు ముష్రు.

"ఆ ల్యాబ్ దగ్గరికి వచ్చిన రేపాల కళింగకి వేరే ప్రయోగం గురించి ఏమి చెప్పలేదా..?" అని అడిగాడు నంద.

"రేపాలా కొన్ని గ్రంథాలు తీసుకువచ్చాడు దాని ద్వారా ఒక లిక్విడ్ ని తయారు చేశారు దాంతో హిమాలయాలలో  ఒక డేంజరస్ జోన్ లోకి వెళ్లి ప్రయోగం చేశారు ఆ లిక్విడ్ పోయగానే అక్కడ ఉన్న మంచు మొత్తం కరిగిపోయింది.

మంచు కరిగిపోవడంతో అక్కడ ఒక గుహ బయటపడింది లోపలి నుంచి చాలా భయంకరమైన శబ్దాలు వినిపించాయి రేపాలా ఆ గుహలోకి వెళ్లి నెలరోజుల తర్వాత బయటికి వచ్చాడు లోపల ఏం చేశాడో ఎవరికీ తెలియదు.

ఆ విషయం తెలిసి చింగ్ యా అటువంటి లిక్విడ్ నాకు కావాలి అని అడిగాడు దానికోసమే ఇప్పుడు ల్యాబ్లో ప్రయోగం జరుగుతుంది అది సక్సెస్ అయింది అంటే ఇండియాకి రక్షణ కవచం లాగా ఉన్న హిమాలయాలు ఇంకా ఉండవు." అని చెప్పాడు ముష్రు.

"ఏంటి? రేపాలా, కళింగ కలిసి ఒక లిక్విడ్ ని సృష్టించారా..? దాంతో మంచు కరిగిపోతుందా..?" అని ఆశ్చర్యంగా అడిగింది దీప్తి.

"ఎస్! వన్ ఎంఎల్ లిక్విడ్ తో రెండు కిలోమీటర్ల వరకు మంచు కరిగిపోతుంది." అని చెప్పాడు ముష్రు.

"ఆది జరిగి హిమాలయాలు కరిగిపోతే ఈ సృష్టి అంతమవుతుంది భూమి మీద ఎవరు బతికి ఉండరు." అని చెప్పాడు నంద.

"అవును! హిమాలయాల అడుగున భయంకరమైన వైరస్ ఉంది అది మంచు కప్పి ఉండడం వల్ల  బయటికి రావడం లేదు ఆ మంచు కరిగిపోతే అది బయటికి వస్తుంది అప్పుడు నంద చెప్పింది జరుగుతుంది." అని చెప్పాడు ముష్రు.

ఆ మాట విని యోధ వైపు చూసి "నువ్వు వెంటనే కళింగతో మాట్లాడు మనం ఆ ల్యాబ్ దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి." అని చెప్పింది సుహా.

"మనుషుల ప్రయోజనం కోసం ప్రయోగాలు చేస్తే కొంతమంది వాటిని మనుషుల్ని అంతం చేయడానికి వాడుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళని హిమాలయాలో తొక్కి చంపాలి." అని కోపంగా ముష్రు చేతికి ఫోన్ ఇచ్చి "కళింగ కి కాల్ చెయ్!" అని చెప్పాడు యోధ.

"ఆ ప్రయోగాలు చేస్తున్నారు ఓకే మారి ఈ వస్తువు కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?" అని డౌట్ గా అడిగింది నీతూ.

"ఆ వస్తువు దొరికితేనే ఈ ప్రయోగం చేస్తారు అది ఎందుకు అనేది నాకు కూడా తెలియదు." అని చెప్పాడు ముష్రు.

"అది తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు మన ల్యాబ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన్ని కలుద్దాము." అని చెప్పాడు నంద.

కళింగ కి కాల్ చేయడానికి ఫోన్ తీస్తున్న ముష్రుని ఆపి "యోధ! మనం ఈ విషయాలన్నీ సార్ తో ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత ఫోన్ మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది." అని చెప్పింది నీతూ.

"అవును! ఆ వస్తువు లేకపోతే ప్రయోగం చేయరు అని చెబుతున్నాడు కదా అది మన దగ్గర ఉన్నంతవరకు వాళ్ళు ఏమి చేయరు కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయాలి." అని చెప్పింది దీప్తి.

"సరే!" అని చెప్పి భూషణ్ వాళ్ళ వైపు చూసి "మీరందరూ ఇక్కడే ఉండండి నేను దీప్తి, నీతూ వెళ్లి  సార్ ని కలిసి వస్తాము." అని బ్యాగ్ లో ఉన్న పద్మన్ని తీసుకుని జేబులో పెట్టుకుని రాఖీ వాళ్ళ వైపు చూసి "టేక్ కేర్!" అని చెప్పి కార్ లో బయలుదేరేడు యోధ.

అక్కడినుంచి యోధ వాళ్ళు వెళ్లడంతో "మీ ముగ్గురం పైన ఉంటాము ఏదైనా అవసరమైతే పిలవండి." అని స్నైపర్ గన్స్ తీసుకొని ఫ్యాక్టరీ పైకి వెళ్లారు సుహా వాళ్ళు.

క్యూబ్ వాళ్ళతో పాటు ట్యాంక్ మీద కూర్చుని "నన్ను ఒక విషయం వెంటాడుతుంది యమధర్మరాజు  ఇక్కడికి వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ కి ఎలా కనిపించాడు? ఆయనా మానవులకి కనిపించరు కదా!" అని అనుమానంగా అడిగాడు భూషణ్.

"గబ్బర్ సింగ్ కంటికి మాయ ఉన్న కనిపిస్తుంది అందుకే అతన్ని యోధ దగ్గరికి వచ్చేటట్లు చేసాను." అని చెప్పాడు నంద.

"అవునా? అయితే గబ్బర్ సింగ్ ని ఒక ఆట ఆడుకోవచ్చు!" అని నవ్వుతూ చెప్పాడు క్యూబ్.

కంప్యూటర్ ముందు కూర్చుని సీసీ కెమెరాలో చూస్తూన్న పూజ దగ్గరికి వెళ్లి "మేడం! మీరు అంతరిక్షంలోకి రాకెట్స్ ప్రయోగించినప్పుడు లోపల కుక్కనో పిల్లినో  పెట్టి పంపుతారు మనిషిని ఎందుకు పంపించారు." అని డౌట్ గా అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ మాటకి కోపంగా చూస్తూ "వేరే గ్రహాలలో మనుషులు ఉండరు ఆత్మలు ఉంటాయి ఒకవేళ మనుషులు ఉన్న వాళ్ళకి శక్తులు ఉంటాయి వాళ్లని మనుషులు కనిపెట్టలేరు కుక్కలు పిల్లలు మాత్రమే కనిపెడతాయి అందుకునే వాటిని పంపిస్తాము." అని వెటకారంగా చూస్తూ  చెప్పింది పూజా.

"మేడం! అప్పుడప్పుడు నాకు కూడా గాలిలో ఏవో ఆకరాలు కనిపిస్తూ ఉంటాయి." అని భయంగా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

అక్కడికి వస్తూ "నువ్వు గత జన్మలో ఏ కుక్కవో పిల్లి వో అయి ఉంటావు అందుకే నీకు కనిపిస్తున్నాయి ఈసారి రాకెట్ లో నిన్ను పంపించే ఏర్పాటు చేయమంటను." అని చెప్పాడు క్యూబ్.

"నువ్వు ఆగవయ్య బాబు! నేనేదో టైం పాస్ కి మాట్లాడుతుంటే నన్ను రాకెట్ లో పంపిస్తావా ముందు మేకప్ ఎంత వరకు వచ్చిందో వెళ్లి చూడు." అని విసుగ్గా చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరే కానీ! మనం త్వరలో హిమాలయాలకి వెళ్లబోతున్నము కదా ఆ ల్యాబ్ దగ్గర ఉన్న తోడేళ్లతో ఎలా ఫైట్ చేయాలో ఆలోచించావా..?" అని చెప్పాడు క్యూబ్.

"ఆ ముష్రు గాడు చెప్పాడు కదా అది మనిషిని ఒక్క దెబ్బకి రెండు ముక్కలు చేస్తుందని ఇంకా దాంతో ఫైట్ చేసే పనేముంది ఎదురుపడితే సాష్టాంగం పడి నమస్కారం చేయడమే!

అది దయ తలిస్తే ప్రాణాలతో వదులుతుంది లేకపోతే మన బాడీ కుడా మంచు కింద ఉండిపోతుంది ఏ కళింగ లాంటివాడో తవ్వి బయటకి తీస్తాడు." అని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు చెబుతుంటే గుర్తుకు వచ్చింది రావణాసురుడి సైన్యం ఒకసారి అలకాపూరిని వెతుకుతూ వెళ్లి ఒక గుహలో చిక్కుకుపోయారు అనే విషయం తెలిసింది.

అప్పుడు రావణబ్రహ్మ మరో సైన్యాన్ని పంపించారు ఎంత వెతికిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ముష్రు  చెప్పిన దాన్ని బట్టి రేపాలా వెళ్ళిన గుహ అదే అనుకుంటున్నాను అంటే ఆ రాక్షసులను మళ్ళీ బ్రతికించి భూమి మీదకు తీసుకు వస్తున్నాడు." అని అనుమానంగా చూస్తూ చెప్పాడు భూషణ్.

"ఓరి బాబోయ్! ఆ రాక్షసులు మళ్లీ పుడితే వాళ్ళని చంపడానికి ఆంజనేయ స్వామి రావలసిందే!" అని చెప్పింది పూజా.

"నా స్నేహితుడు వాళ్ళ కోసమే హిమాలయాల్లో  ఎదురుచూస్తున్నాడు అనుకుంటా తప్పకుండా వస్తాడు." అని నవ్వుతూ చెప్పాడు భూషణ్.

"ఏంటి? ఆంజనేయ స్వామి నీ ఫ్రెండా..? ఎప్పుడు కలిసావు బాబు!" అని వెటకారంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"హనుమ దగ్గరకు వెళ్లి  కలవడం ఎవరి తరం కాదు ఆయనే మనల్ని కలవాలి అనుకోవాలి అప్పుడు మాత్రమే ఆయన్ని మనం చూడగలము." అని చెప్పాడు భూషణ్.

************

ల్యాబ్ లో ఉన్నికృష్ణన్ తో మాట్లాడుతున్న నాయక్  దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసి "సార్! ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాము." అని చెప్పాడు యోధ.

"నేను కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి." అని అక్కడ ఉన్న ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి స్క్రీన్ ఆన్ చేసి "బోర్డర్లో మన మిలిటరీ క్యాంప్ మీద ఎటాక్ జరిగింది 18 మంది సోల్జర్స్ కనపడటం లేదు అక్కడ దొరికిన సీసీటీవీ ఫుటేజ్  ఒకసారి చూడండి." అని చెప్పాడు నాయక్.

ఆరుగురు తో కలిసి బోర్డర్ దగ్గర ఉన్న ఇండియన్ మిలిటరీ క్యాంప్ దగ్గరికి వస్తున్న జింగ్ ని ఆశ్చర్యంగా చూస్తూ "సార్! నేను వీడిని చంపి సముద్రంలో పడేసాను మళ్ళీ ఎలా బతికి వచ్చాడు? " అని చెప్పాడు యోధ.

"వీడియో మొత్తం చూడు షాకింగ్ విజువల్స్ చాలా ఉన్నాయి." అని చెప్పాడు నాయక్.

ఆ మాట విని టెన్షన్ గా స్క్రీన్ మీద వస్తున్న వీడియో చూస్తూ ఉన్నారు ముగ్గురు.


[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 14-05-2026, 06:34 AM



Users browsing this thread: 1 Guest(s)