Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
రుద్రం భజే! ఎపిసోడ్ 36


ఫ్యాక్టరీ గోడౌన్ దగ్గరికి వచ్చి భూపాల్ సింగ్, యంగ్ ఫోటోలు చూసి వీళ్ళలాగా తయారు చేయడానికి వాళ్ళిద్దరూ కరెక్ట్ గా సరిపోతారు అని ధర్మ, గుప్తాలని చూపించాడు విఠల్.

*************

విఠల్ చెప్పింది విని "అసలు ధర్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా!" అని అడిగినా దీప్తి మాట విని "నేను ఒప్పిస్తాను." అని వెళ్ళాడు భూషణ్.

"భూషణ్ ఇప్పుటి వరకు అక్కడే ఉన్నాడు కదా మన వెనక్కి ఎప్పుడు వచ్చాడు?" అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా.

"అవును! వీళ్లు చాలా మిస్టేరియస్ గా ఉన్నారు ఇలాంటి ఏంజెంట్స్ ని నేను ఇప్పుడు వరకు చూడలేదు." అని చెప్పింది నీతూ.

"మేడం! ఆ గుప్తా అయితే బుక్కు తీసి ఎవరి చేతిలో ఎవరు పోతారో చెప్పేస్తున్నాడు నా గురించి కూడా ఒక భయంకరమైన నిజం చెప్పాడు." అని డల్ గా చెప్పాడు గబ్బర్ సింగ్.

"గుప్త చెప్పింది నేను విన్నాను నా దగ్గర ఒక ఐడియా ఉంది విఠల్ దగ్గరికి వెళ్లి నీ వేషం కుడా మార్చేయమను అప్పుడు మీ ఆవిడ నిన్ను గుర్తుపట్టదు." అని చెప్పింది పూజా.

ఆ మాట విని సంతోషంగా విఠల్ దగ్గరికి వెళ్లి "సార్! చిన్న రిక్వెస్ట్ నన్ను ఎవరు గుర్తు పట్టకుండా మార్చగలరా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ మాటకి తలతిప్పి గబ్బర్ సింగ్ వైపు చూసి "నీకు మేకప్ వేయాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ అధికారి అని చెప్పు చాలు ఎవరు నమ్మరు." అని చెప్పాడు విఠల్.

"మీరు చెప్పింది కరెక్టే!" అని మాట్లాడకుండా వెనక్కి వచ్చాడు గబ్బర్ సింగ్.

ధర్మ, గుప్తాలని వెంటపెట్టుకుని వచ్చి "వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు కానీ ఒక కండిషన్ ఉంది." అని చెప్పాడు భూషణ్.

"ఏంటి ఆ కండిషన్!" అని అడిగాడు యోధ.

"నా చేతిలో కర్ర గుప్తా చేతిలో సూట్ కేస్ ఎప్పుడూ ఉంటాయి దానికి ఓకే అంటేనే మేము అక్కడికి వెళతాము." అని చెప్పాడు ధర్మ.

'ఇంకా నయం ఆ రెండు మోయడానికి నేను కూడా రావాలని చెప్పలేదు.' అని మనసులో అనుకున్నాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని గబ్బర్ సింగ్ వైపు చూసి "ఆ రెండు మోస్తూ నువ్వు మా వెనకాల వచ్చిన అభ్యంతరం లేదు." అని చెప్పాడు గుప్తా.

ఆ మాట విని పక్కనే ఉన్న పుష్కర్ వైపు చూసి "నేను మనసులో అనుకున్నా మాట గుప్తాకి ఎలా వినిపించింది?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"నువ్వు మాట్లాడిన మాట మా అందరికీ కూడా వినిపించింది మనసులో అనుకుంటున్నాను అనుకుని పైకి మాట్లాడేసావు." అని చెప్పింది పూజా.

ఆ మాటకి ఆలోచిస్తున్న గబ్బర్ సింగ్ భుజం మీద చేయి వేసి "ఏంటి నువ్వు మనసులో అనుకుంటే పైకి వినపడుతుందా..?" అని నవ్వుతూ అడిగాడు క్యూబ్.

"అవును సార్! మీకు కూడా వినిపించిందా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"నాకు కూడా వినిపించిందిలే కానీ అలా జరగకుండా ఉండాలంటే నా అప్పు తీర్చేయ్ అప్పుడు నీ మనసులో మాట నీలోనే ఉంటుంది." అని చెప్పాడు క్యూబ్.

ఆ మాట విని క్యూబ్ ని కిందనుంచి పైకి చూసి "ఎవరు నువ్వు? నా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతున్నావు." అని అడిగాడు గబ్బర్ సింగ్.

"సరే నీ కర్మ!" అని చెప్పాడు క్యూబ్.

ధర్మ, గుప్తాల వైపు చూసి "మీ కండిషన్స్ ఓకే ముందు స్క్రీన్ టెస్ట్ చేయించుకోండి." అని చెప్పాడు యోధ.

"సరే!" అని విఠల్ తో పాటు రూమ్ లోకి వెళ్లారు ధర్మ, గుప్తాలు.

అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో కంగారుగా చూస్తూ "స్విచ్ ఆఫ్ చేశాను అనుకున్నాను." అని చెప్పి నెమ్మదిగా బయటికి తీసాడు గబ్బర్ సింగ్.

బయటికి తీసిన ఫోన్ ని చూసి "ఇది బషీర్ ఫోన్ కదా నీ దగ్గర ఉంది ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు ముష్రు.

"అదా! ఎలాగో పోయాడు కదా వాడికి ఫోన్తో పనేముందిలే కొత్త మోడల్ లాగా ఉంది అని తీసుకున్నాను." అని బిత్తర చూపులు చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"నువ్వు వెధవ పని చేసినా ఉపయోగపడే పని చేశావు." అని ఫోన్ తీసుకుని చుసి "సయ్యద్ కాల్ చేస్తున్నాడు." అని  మష్రూ వైపు చూసి

"లిఫ్ట్ చేసి నేను ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాను బహిర్ వాళ్ళు ఆ ఇద్దరి కోసం ల్యాబ్ దగ్గరకు వెళ్లారు అని నమ్మేటట్లు చెప్పాలి." అని చెప్పాడు యోధ.

"ఓకే సార్!"అని ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి "సయ్యద్ భాయ్! నేను ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాను బషీర్ వాళ్ళు ల్యాబ్ దగ్గరకు వెళ్లారు." అని చెప్పాడు ముష్రు.

ఫోన్లో మాట్లాడుతున్న సయ్యద్ వైపు చూసి లాప్టాప్ లో లొకేషన్స్ చూస్తూ ఫోన్ తీసుకుని "ముష్రు! యంగ్ లోకేషన్ ఆ వస్తువు లొకేషన్ నువ్వు ఉన్న ఏరియా లోనే కనబడుతుంది ఎలాగైనా లోపలికి వెళ్లి మన వాళ్ళ మీద ఎటాక్ చేసిన వాళ్లతో ఒక్కసారి మాట్లాడించు." అని చెప్పాడు కళింగ.

"సార్! మనవాళ్లే లోపలికి వెళ్లలేకపోతున్నారు నేను ఎలా వెళ్ళగలను? వాళ్లతో ఫోన్ ఎలా మాట్లాడించగలను?" అని కంగారుగా చెప్పాడు ముష్రు.

"ఎలా వెళ్తావో ఎలా మాట్లాడిస్తావో నువ్వే డిసైడ్ చేసుకో ఇది చేస్తే నీ లైఫ్ మారిపోతుంది." అని చెప్పాడు కళింగ.

ఫోన్లో కళింగ చెబుతుంది విని 'ఒప్పుకో!' అని సైగ చేసేడు యోధ.

"ఓకే సర్! మీ కోసం ట్రై చేస్తాను." అని చెప్పాడు ముష్రు.

"గుడ్! నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అని ఫోన్ కట్ చేశాడు కళింగ.

ఫోన్ పెట్టేసిన కళింగ దగ్గరికి వెళ్లి "సైంటిస్ట్! ఆ ముష్రుని కుడా లోపలికి ఎందుకు వెళ్ళమన్నావు? అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే వాడు బయటే ఉండాలి." అని చెప్పాడు సయ్యద్.

"నువ్వు ఒక విషయం మర్చిపోయావు సయ్యద్! ఒక్కసారి మనతో ఫోన్లో మాట్లాడిన వాడు మళ్ళీ మాట్లాడలేదు ముష్రూ మాత్రమే మాట్లాడుతున్నాడు.

అంటే యంగ్ వాళ్ళు ఎవరి హ్యాండ్ ఓవర్ ఉన్నారో ముష్రు కుడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాడు, వాళ్లే వీడితో ఫోన్లో మాట్లాడిస్తున్నారు.

ఇప్పుడు ఫోన్ వస్తుంది దీని వెనకాల ఉన్న వాడు మనతో మాట్లాడుతాడు చూస్తూ ఉండు." అని చెప్పాడు కళింగ.

"అంటే! బషీర్ వాళ్ళందరూ చచ్చిపోయారా..?" అని కంగారుగా అడిగాడు సయ్యద్.

"నాకు తెలిసి అక్కడికి వెళ్లినా నీ మనుషులు ఎవరు బతికి లేరు." అని చెప్పాడు కళింగ.

అక్కడికి వస్తూ "అవును కళింగ చెప్పింది కరెక్ట్! నేను  ఇండియన్ గవర్నమెంట్ తో మాట్లాడాను వాళ్ళ మాటల్లో నాకు కాన్ఫిడెన్స్ కనిపించింది. నా డౌట్ నిజమైతే యంగ్ వాళ్ళు మిలిటరీ హ్యాండ్ ఓవర్ లో ఉండి ఉంటారు."  అని చెప్పాడు చింగ్ యా.

"అలా అయితే ఆ వస్తువు యంగ్ ఇద్దరు మన చేతిలో నుంచి పోయినట్టేనా..!" అని కంగారుగా అడిగాడు సయ్యద్.

జింగ్ తో కలిసి అక్కడికి వస్తూ "నేను ఉండగా అలా జరగదు." అని చెప్పాడు రేపాలా.

ఆ మాట విని "ఏం చేస్తావు? నువ్వు వెళ్లి తీసుకు వస్తావా..?" అని అడిగాడు సయ్యద్.

"నేను కాదు జింగ్ తో పాటు నా మనుషులు వెళ్లి బోర్డర్ లో ఉన్న ఇండియన్ మిలిటరీ సోల్జర్స్ ని ప్రాణాలతో తీసుకువస్తారు తర్వాత ఏం చేయాలో  తెలుసు కదా!" అని నవ్వుతూ చెప్పాడు రేపాలా.

ఆ మాట విని "ఏంటి! బోర్డర్లో ఉన్న ఇండియన్ సోల్జర్స్ ని కిడ్నాప్ చేస్తారా...? అది అయ్యే పని కాదు వెళ్లిన వాళ్లు వెనక్కి రారు." అని చెప్పాడు చింగ్ యా.

"అక్కడికి వెళ్ళేది నీ మనుషులు  సయ్యద్ మనుషులు కాదు నేను సృష్టించిన సైన్యం! అక్కడికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయండి." అని చెప్పాడు రేపాలా.

*************

ఫ్యాక్టరీ దగ్గర ముష్రు చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని "కళింగ మనతో ఫోన్ ఎందుకు మాట్లాడించమన్నాడు? ఒక వేళ మష్రూ మీద అనుమానం వచ్చిందంటారా..?" అని అడిగాడు యోధ.

"నాకు తెలిసి డెఫినెట్గా అనుమానం వచ్చింది." అని చెప్పింది సుహా.

"సరే! ఒకవేళ అనుమానం వచ్చింది అనుకోండి మనతో మాట్లాడించమని ఎందుకు చెప్పాడు? ఏం మాట్లాడతాడు?" అని డౌట్ గా అడిగాడు రాఖి.

"యంగ్ ని ఆ వస్తువుని తీసుకుని అక్కడికి రమ్మని చెపుతాడు." అని చెప్పాడు నంద.

"ఫోన్లో చెబితే మనం తీసుకువెళ్లి వాళ్ళకి అప్ప చెబుతామా ఏంటి!" అని అడిగింది నీతూ.

"మనం అక్కడకి వచ్చేలాగా ఏదో చేయబోతున్నారు." అని ఆలోచిస్తూ చెప్పాడు యోధ.

ఆ మాట విని ముష్రు వైపు చూసి "అసలు ఆ ల్యాబ్లో  యంగ్ లాంటి వాళ్ళని తయారు చేయడమేనా ఇంకా వేరే ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారా...?" అని అడిగింది దీప్తి.

"యంగ్ మీద చేసిన ప్రయోగం చాలా చిన్నది అది ఇంకా పూర్తి అవలేదు ఫస్ట్ స్టేజ్ లోనే ఉంది." అని చెప్పాడు ముష్రు.

"అవునా? అయితే మరి ఆ ల్యాబ్ లో చేస్తున్న ప్రయోగాలు ఏమిటి?" అని అనుమానంగా అడిగింది సుహా.

"ఈ భూమి మీద మనకి తెలిసిన జంతువులు కొన్ని మాత్రమే ఎప్పుడు చూడనటువంటి అంతరించిపోయిన జంతువులు కొన్ని వేల జాతులు ఉన్నాయి.

అంతరించిపోయిన జాతులలో కొన్ని మానవుడికి ఉపయోగపడేవి ఉన్నాయి కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నాయి.

అలా ఉపయోగపడే కొన్ని జాతుల జంతువులను, పక్షులను తిరిగి సృష్టించడానికి యునైటెడ్ అమెరికా కొన్ని దేశాలుతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి కొంత మంది సైంటిస్టులను ఎంపిక చేశారు.

ఆ సైంటిస్టులలో కళింగ కూడా ఒకడు కొన్ని టీములుగా విడిపోయి అంతరించిపోయిన జంతువులు పక్షుల డీఎన్ఏలు సేకరించడం మొదలుపెట్టారు.

ప్రపంచ నలుమూలల నుంచి సేకరించిన డిఎన్ఏ లని టెస్ట్ చేసి వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నాయని వాటి వల్ల మనిషి మనుగడకే ప్రమాదం అని గ్రహించి ఆ డిన్ఏలను టెస్ట్ చేయడం బ్యాన్ చేశారు.

ఆ టైమ్ లోనే టిబేట్ లో కళింగ కి చైనా మిలిటరీ జనరల్ చింగ్ యా పరిచయం అయ్యాడు." అని చెప్పాడు ముష్రు.

తను చెప్పింది విని "ఆ ల్యాబ్ లో ఆ జంతువుల డిఎన్ఏలతో ఏమైనా ప్రయోగాలు చేశారా..?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"ఎస్!" అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ముష్రు.

"కృత్రిమంగా ఏ జంతువులైన తయారు చేశారా..?" అని అనుమానంగా అడిగింది సుహా.



" రుద్రం భజే! ఎపిసోడ్ 36 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 13-05-2026, 05:37 AM



Users browsing this thread: 1 Guest(s)