13-05-2026, 05:34 AM
(This post was last modified: 13-05-2026, 05:35 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
రుద్రం భజే! ఎపిసోడ్ 35
బషీర్ వాళ్ళ నలుగురిని చంపి గబ్బర్ సింగ్ వాళ్ళ వైపు చూసి వెళ్లి ఆ కారులో ఉన్న ఆరుగురిని కూడా ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడు లింగి.
*************
లింగి చెప్పడంతో "నేను వెళ్లి వాళ్ళని తీసుకు వస్తాను." అని చెప్పి వేళుతూ తన మీద పడుతున్న రెడ్ డాట్స్ చూసుకుని నవ్వుతూ కార్ దగ్గరికి వెళ్లి "బషీర్ భాయ్ మిమ్మల్ని రమ్మంటున్నాడు." అని చెప్పాడు క్యూబ్.
ఆ మాట విని కార్ దిగుతూ "బాయ్ సిగ్నల్ ఇస్తానన్నాడు నిన్ను పంపించాడు ఏంటి?" అని డౌట్ గా అడిగాడు వాళ్లలో ఒకడు.
"ఆ విషయం నాకు తెలీదు కారులో ఉన్న ఆరుగురిని దూరంగా ఉన్న ఇద్దరి స్నైపర్స్ ని కూడా రమ్మని చెప్పాడు తర్వాత మీ ఇష్టం!" అని అక్కడి నుంచి బయలుదేరాడు క్యూబ్.
అది చూసి "ఆగు ఆగు!" అని దూరంగా ఉన్న స్నైపర్స్ రమ్మని సిగ్నల్ ఇచ్చి క్యూబ్ వెనకలా వెళుతూ "మేము వెతుకుతున్న వాళ్ళు దొరికారా..?" అని అడిగాడు వాళ్ళలో ఒకడు.
"హా.. దొరికారు వాళ్ళని తీసుకుని బషీర్ వాళ్ళు రెడీ గా ఉన్నారు మీరు కూడా వస్తే ఇంకా వెళ్లొచ్చు!" అని చెప్పి సందు చివర కనిపిస్తున్న పూజా వైపు చూసి సైగ చేశాడు క్యూబ్.
అది చూసి "అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్యూబ్ తీసుకు వస్తున్నాడు రెడీగా ఉండండి." అని చెప్పింది పూజా.
"సరే! మీరు ఆ బాడీలు తీసుకొని వెనక్కి వెళ్ళండి వాళ్ల సంగతి మేము చూసుకుంటాము." అని చెప్పాడు లింగి.
నాలుగు బాడీల్ని అక్కడ నుంచి వెనక్కి లాగుతూ "ఇంత బరువు ఉన్నారేమిటి!" అని ఆయాస పడుతూ బుక్ చూసున్న గుప్త వైపు చూసి "కాస్త హెల్ప్ చేయొచ్చు కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్.
అంతలో అక్కడ ప్రత్యక్షమైన యమకింకారుల వైపు చూసి "మీకు బొత్తిగా టైమ్ సెన్స్ లేకుండా పోతుంది ఇంత లేటుగా వస్తారా..?" అని కోపంగా అడిగాడు గుప్తా.
ఆ మాటలు విని తలపైకి ఎత్తి చూసి "ఆ బుక్ చూసి చూసి నీకు పిచ్చి ఎక్కిందా ఏమిటి? ఎవరితో మాట్లాడుతున్నావు?" అని అడిగింది పూజా.
'ఓహో మర్చిపోయాను మీ కళ్ళకు మాయా కమ్ముకుని ఉంటుంది కదా!' అని మనసులో అనుకుని "మా అసిస్టెంట్స్ వచ్చారు మీరు తప్పుకోండి ఆ నలుగురిని వాళ్ళు పక్కకి తీసుకువెళతారు." అని చెప్పాడు గుప్తా.
ఆ మాట విని వెనక్కి తిరిగి అక్కడ నల్లగా లావుగా ఉన్న ఇద్దరిని చూసి ఉలిక్కిపడి "వీళ్లిద్దరు ఎప్పుడు వచ్చారు?" అని కంగారుగా అడిగాడు గబ్బర్ సింగ్.
"మా వాళ్లు కరెక్ట్ టైం కి వస్తారు కానీ ఈసారి కాస్త లేట్ అయింది." అని చెప్పాడు గుప్తా.
"హమ్మయ్య!" అని నడుము పట్టుకుని కాస్త ముందుకు వచ్చి వెనక్కి తిరిగి నలుగురు బాడీ కనిపించకపోవడంతో "మీ వాళ్ళు అప్పుడే తీసుకు వెళ్లిపోయారా..? అంత ఫాస్ట్ గా ఉన్నారా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.
"ఏంటి? నలుగురిని అంత ఫాస్ట్ గా ఇద్దరు తీసుకువెళ్లిపోయారా..? అసలు వాళ్ళు మనుషులేనా?" అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా.
"మా వాళ్ల గురించి మీకు ఇప్పుడు తెలియదులే టైమ్ వచ్చినప్పుడు తెలుస్తుంది ముందు ఇక్కడికి వచ్చే వాళ్ళ సంగతి చూడండి." అని చెప్పాడు గుప్తా
ఆ మాట విని గన్ బయటికి తీసి వణుకుతున్న చేతిని గట్టిగా పట్టుకుని "మేడమ్ మీరు బయపడకండి నేను చూసుకుంటాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"సరే! ముందు నువ్వు భయపడకు." అని చెప్పి గబ్బర్ సింగ్ వెనకాల నుంచుని చూస్తూ ఉంది పూజా.
అంతలో క్యూబ్ తో పాటు అక్కడికి వచ్చి లింగి వాళ్ళ వైపు చూసి "బషీర్ భాయ్ ఎక్కడ?" అని అనుమానం గా అడిగాడు వాళ్ళలో ఒకడు
"నాకు ఎందుకో అనుమానంగా ఉంది అక్కడ రక్తం ఉంది ఏంటి?" అని గన్ బయటికి తీసాడు వాళ్ళలో ఒక ఒకడు.
అది చూసి "గన్ బయటికి తీసేడు షూట్ చెయ్!" అని గబ్బర్ సింగ్ ముందుకు తోసింది పూజా.
ముందుకి పడుతూ చేతీలో ఉన్న పేలడంతో గన్ తీసిన వ్యక్తి తలలోకి వెళ్ళింది బుల్లెట్.
బుల్లెట్ తగిలిన మనిషి వెనక్కి పడిపోవడం చూసి "వీళ్లని చంపేయండి." అని గట్టిగా అరిచాడు వాళ్ళలో ఒకడు.
ముందుకు వస్తున్న మిగతా వాళ్ళ గొంతులో కనురెప్ప వ్యవధిలో కత్తులు దింపి వెనక్కి తిరిగి గబ్బర్ సింగ్ వైపు చూసి "మీరు దూరం నుంచి కూడా గురి తప్పకుండా చాలా కరెక్ట్ గా షూట్ చేశారు. " అని మెచ్చుకుంటూ చెప్పాడు గుడ్డు.
ఆ మాట విని అయోమయంగా చూస్తూ పైకి లేచి పూజ వైపు చూసి "నన్ను ఎందుకు తోసేవు? కింద పడిపోయే కంగారులో ట్రిగ్గర్ కి నా వేలు తగిలింది." అని కంగారుగా చెప్పాడు గబ్బర్ సింగ్.
అక్కడికి వస్తు "నువ్వు కావాలని ఆ మనిషిని షూట్ చేయలేదా?" అని అనుమానంగా అడిగాడు క్యూబ్.
"నేను షూట్ చేయడం ఏంటి నా బొంద! కింద పడిపోతుంటే వేలు తగిలి పేలిపోయింది అన్యాయంగా నా చేతిలో ఒకడు చచ్చిపోయాడు." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"అతని చావు నీ చేతిలో రాసిపెట్టి ఉంది నువ్వు చంపాలి అనుకోకపోయినా ఖచ్చితంగా జరిగి తీరుతుంది." అని చెప్పాడు గుప్తా.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి "యోధ! ఇక్కడ అంత క్లియర్ మనవాళ్ళు నేను చెప్పినట్లు కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు." అని చెప్పింది పూజా.
ఫోన్ మాట్లాడుతున్న పూజ దగ్గరికి వెళ్లి "మేడం! నా గురించి కూడా కొంచెం చెప్పండి." అని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు గబ్బర్ సింగ్
"ల్యాబ్ సీసీ కెమెరాలో జరిగేదంతా నేను చూస్తూనే ఉన్నాను కానీ, అక్కడ లింగి వాళ్ళు చాలు మీరు వెనక్కి వచ్చేయండి." అని చెప్పాడు యోధ.
ఆ మాట విని చుట్టూ చూస్తూ "మొత్తం చూసేసావా? ఇదిగో లింగి మాట్లాడతాడంట!" అని ఫోన్ ఇచ్చింది పూజా.
ఫోన్ తీసుకుని "జై భవాని! మేము ఇక్కడ ఉండగా ఎటువంటి భయం లేదు మీ పనిలో మీరు ముందుకు వెళ్ళండి మా అభిర్ సేనా మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది." అని చెప్పాడు లింగి.
"చాలా థాంక్స్!" అని చెప్పి ఫోన్ పెట్టేసేడు యోధ.
ఫోన్ తీసుకుంటూ "నేను వాడిని షూట్ చేసి చంపకపోతే ఈరోజు నీ పని అవుట్! ఆ విషయం నీకు తెలుసా..? అని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఏమో సార్! నాకు కనబడదు నా తమ్ముడికి వినపడదు." అని చెప్పాడు లింగి.
"బాబోయ్ ఆపరా బాబు! చంపడానికి నీకు బుల్లెట్స్ కూడా అవసరం లేదు." అని దండం పెడుతూ అక్కడి నుంచి కారు దగ్గరికి పరిగెత్తాడు గబ్బర్ సింగ్.
*************
ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చిన గబ్బర్ సింగ్ వాళ్ళని చూసి "మిషన్ కంప్లీట్ చేసుకుని వచ్చినందుకు కంగ్రాట్స్!" అని చెప్పింది సుహా.
ఆ మాటకి నవ్వుతూ స్టైల్ గా గన్ తిప్పుతూ "యోధ సర్ బుల్లెట్స్ వేస్ట్ చేయద్దు అన్నారని నేను ఒక్క బుల్లెట్ మాత్రమే యూస్ చేశాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"అది కూడా నేను ముందుకు తోయడం వల్లే!" అని వెటకారంగా చూస్తూ లోపలికి వెళ్ళింది పూజా.
భూషణ్ వాళ్ళతో ఉన్న ధర్మ దగ్గరికి వెళ్లి "సార్! మనం వచ్చిన పని అయింది ఇంకా వెళదామా?" అని అడిగాడు గుప్తా.
"మీ పని ఇంకా అవలేదు చాలా ఉంది కాసేపు వెయిట్ చేయండి." అని చెప్పాడు నంద.
ఆ మాట విని డౌట్ గా చూస్తూ "మళ్ళీ ఇక్కడికి ఎవరైనా వస్తున్నారా..?" అని అడిగాడు ధర్మ.
అంతలో అక్కడికి కారు రావడం చూసి "అదిగో మాటల్లోనే వచ్చేసాడు." అని చెప్పాడు నంద.
కారులో నుంచి దిగుతున్న మనిషిని చూసి బుక్ ఓపెన్ చేసి "ఇతని పేరు విఠల్! చావు ఇంకా దగ్గర పడలేదు ఇంకా చాలా టైమ్ ఉంది." అని చెప్పాడు గుప్తా.
ఆ మాటకి నవ్వుతూ "కాసేపు వెయిట్ చేయండి మీకు తెలుస్తుంది." అని చెప్పాడు నంద.
కార్ దిగిన విఠాల్ దగ్గరికి వెళ్లి షేక్ అండ్ ఇస్తూ "హాయ్! నీ కోసమే వెయిట్ చేస్తున్నాము." అని లోపలకి తీసుకెళ్లి కంప్యూటర్లో యంగ్, భూపాల్ సింగ్ లో ఫోటోలు చూపించి
"ఈ ఇద్దరి లాగ మాలో ఇద్దరిని తయారు చేయాలి టుడేస్ మాత్రమే టైమ్ ముంది." అని చెప్పాడు యోధ.
"అవునా? అని కంప్యూటర్ లో ఫోటోలు చూస్తూ అంత ఫాస్ట్ గా రెడీ చేయాలి అంటే కొంచెం కష్టమే! మీరు వెళ్ళేది బోర్డర్ దాటి అనుమానం వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది." అని చెప్పాడు విఠల్.
"అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే ఏమీ అర్థం కాలేదు." అని డౌట్ గా చూస్తూ అడిగింది దీప్తి.
"తన పేరు విఠల్! మేమందరం ముద్దుగా విఠలాచార్య అని పిలుస్తాము, మేకప్ క్రియేటివిటీ తో మనం చూపించిన మనిషి ఫేస్ ఎలా ఉంటుందో అలాగా మనల్ని తయారు చేయగలడు.
కాకపోతే బాడీ స్ట్రక్చర్ కూడా కొంచెం మ్యాచ్ అవ్వాలి మేము ఇలా చేసి చాలాసార్లు బోర్డర్ దాటి ఎంటర్ అయ్యి వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేవాళ్ళము." అని నవ్వుతూ చెప్పేడు యోధ.
అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ దూరంగా ఉన్న ధర్మ గుప్తాలని చూసి "ఆ ఇద్దరు అయితే కరెక్ట్ గా మ్యాచ్ అవుతారు." అని చెప్పాడు విఠల్.
ఆ మాట విని "మనకి భూలోక ప్రయాణం ఉంది అంటే వెంటనే తిరిగి వెళ్ళడం కుదరదు అని నేను ముందే అనుకున్నాను." అని చెప్పాడు గుప్తా.
"అంటే! ఆ ఇద్దరు లాగా మమ్మల్ని తయారు చేస్తాడా.? మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి?" అని అనుమానంగా అడిగాడు ధర్మ.
"హిమాలయాలకి కైలాస పర్వతం దగ్గర పొంచి ఉన్న రాక్షసుల దగ్గరకి మీతో పాటు మేము కూడా ప్రయాణం అవుతాము." అని నవ్వుతూ చెప్పాడు క్యూబ్.
"అవునా? రాక్షస సంహారంతో పాటు ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం కుడా అవుతుందన్నమాట సరే మేము సిద్ధం!" అని చెప్పాడు ధర్మ.
విఠల్ చెప్పింది విని "సరే! ఆ ఇద్దరిని రెడీ చెయ్ నాయక్ సార్ దగ్గరికి తీసుకు వెళదాము." అని చెప్పాడు యోధ.
"అది సరే! దీనికి వాళ్ళిద్దరూ ఒప్పుకోవాలి కదా!" అని డౌట్ గా అడిగింది సుహా.
"ఆ ఇద్దరిని నేను ఒప్పిస్తాను." అని చెప్పాడు భూషణ్.
ఆ మాట విని భూషణ్ వైపు చూస్తూ "ఇప్పటివరకు అక్కడ ఉన్నాడు కదా మన వెనక్కి ఎప్పుడు వచ్చాడు? " అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)