Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
రుద్రం భజే! ఎపిసోడ్ 34



నాయక్ తో ఫోన్లో మాట్లాడి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి సుహా వైపు చూసి మన విఠలాచార్యకి కాల్ చేసి ఇక్కడికి రమ్మను అని చెప్పాడు యోధ.

తన దగ్గరికి వచ్చి జై భవాని అని కోడ్ చెప్పడంతో  రెండు కార్లు ఆగినా సౌండ్ వచ్చింది టెర్రరిస్టులు వస్తున్నారు అనుకుంటా మీరు పక్కకు వెళ్ళండి అని పూజా వాళ్లకి  చెప్పాడు లింగి

**********

ల్యాబ్ ఉన్న ఏరియాకి వచ్చి "సార్! పంపించిన లొకేషన్ ఇదే కానీ ఇక్కడ ల్యాబ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం!" అని చూస్తూ చెప్పాడు బషీర్.

"ల్యాబ్ దగ్గర కచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది సీక్రెట్ ప్లేస్ కాబట్టి సివిల్ డ్రెస్ లో ఉంటారు అక్కడ ఇద్దరు ఉన్నారు కొంచెం దూరం నలుగురు ఉన్నారు." అని చూస్తూ చెప్పాడు షారుఖ్.

కారులో నుంచి దిగి వేరే కార్ లో ఉన్న తన మనుషుల వైపు చూసి "నేను చెప్పే వరకు కిందకు దిగకండి గన్స్ కూడా బయటకి కనబడకూడదు." అని చెప్పాడు బషీర్.

"సరే బాయ్!" అని గ్లాస్ క్లోజ్ చేసుకుని లోపల కూర్చుని ఉన్నారు.

కారులోకి చూస్తూ  "ఖాసీం, రజాక్! మీరిద్దరూ అక్కడ ఉన్న నలుగురు దగ్గరికి వెళ్ళండి. నేను షారుక్ ఆ ఇద్దరి దగ్గరికి వెళతాము చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఏమాత్రం అనుమానం రాకూడదు." అని చెప్పాడు బషీర్.

"సరే!" అని రజాక్ తో కలిసి పూజ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఖాసీం.

అది చూసి "వాళ్ళిద్దరూ మన వైపే వస్తున్నారు మీరు ముగ్గురు సైలెంట్ గా ఉండండి నేను చూసుకుంటాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

అడుగుల చప్పుడు విని గుడ్డు భుజం మీద చేయి వేసి వేళ్ళు కదిలించాడు లింగి.

"అన్న! ఇద్దరు మన దగ్గరికి వస్తున్నారు ఇద్దరు ఆ ఏజెంట్స్ దగ్గరికి వెళ్లారు, వెనుక కారులో ఆరుగురు ఉన్నారు మొత్తం పదిమంది రెండు నిమిషాలు పడుతుంది చంపేద్దామా?" అని అడిగాడు గుడ్డు.

"కంగారు పడకు వాళ్ళు ఒకసారి దెబ్బతిన్నారు కచ్చితంగా  జాగ్రత్త పడతారు నాకు తెలిసి దూరంగా స్నైపర్స్ ఉంటారు వాళ్లు మన దగ్గరికి రాగానే ఎర్రటి చుక్క ఒంటి మీద పడి కదులుతూ ఉంటుంది సరిగ్గా గమనించు." అని చెప్పాడు లింగి.

"కరెక్టే అన్న! వాళ్ళు మన దగ్గరికి వస్తూ చెవిలో ఉన్న మిషన్ లో మాట్లాడుతున్నారు." అని చెప్పాడు గుడ్డు.

లింగి వాళ్ళ దగ్గరికి వచ్చి "మేము మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తున్నాము ల్యాబ్ దగ్గరికి వెళ్ళాలి." అని అడిగాడు బషీర్.

"అవునా సారు! అయితే వెళ్ళండి మాకు ఎందుకు చెబుతున్నారు." అని అమాయకంగా  ఫేస్ పెట్టి చేతిలో కర్ర ఆడించుకుంటూ చెప్పాడు లింగి.

"ఏంటి నీకు కళ్ళు కనపడవా..? మారి ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాడు షారుఖ్.

"నాకు కళ్ళు కనపడవు సారు, నా తమ్ముడికి వినపడదు ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు అంటే చూపించుకోవడానికి వచ్చాము మీకు ఏమైనా తెలుసా..?" అని అడిగాడు లింగి.

"ఈ ఏరియాలో హాస్పిటల్స్ ఉండవు." అని చెప్పాడు బషీర్.

"సారు! మీకు కళ్ళు బానే కనబడతాయి కదా మారి హాస్పిటల్స్ లేని ప్లేస్ కి వచ్చి ల్యాబ్ ఉందా అని మమ్మల్ని అడుగుతారు ఏంటి?" అని వెటకారంగా అడిగాడు లింగి.

"బాయ్! విడికి కళ్ళు లేకపోయినా పొగరుకు ఏమి తక్కువ లేదు, మేము అడిగింది మిలిటరీ ల్యాబ్ గురించి నీకు ఏమైనా తెలుసా?" అని షారుఖ్.

"ఏమో సార్" మీరు చెప్పింది నా తమ్ముడికి వినపడదు ఎలా చెబుతాడు? " అని చెప్పాడు లింగి.

ఆ మాటకి విచిత్రంగా చూస్తూ "నీకు వినపడుతుంది కదా!" అని అడిగేడు బషీర్.

"ఏమో సార్! నాకు కనపడదు." అని చెప్పాడు లింగి.

ఆ మాటకి కోపంగా చూస్తూ "ఒరేయ్ మెంటల్ నా కొడకా..! నేను అడిగింది ఏంటి? నువ్వు చెప్పేది ఏమిటి? తెలిస్తే తెలుసు అని చెప్పు లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోండి లేకపోతే కాల్చిపారదొబ్బుతాను." అని చెప్పాడు షారుఖ్.

అది చూసి నవ్వుకుంటూ "వాళ్లకు కూడా ఇరిటేషన్ తెప్పించినట్లు ఉన్నాడు ఇప్పుడు చూడండి." అని తన దగ్గరికి వచ్చిన ఇద్దరి వైపు చూసి "ఏంటి సర్ వెతుకుతున్నారు?" అని అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ మాటకి దగ్గరికి వెళ్లి "మేము వెతుకుతున్నామని నీకు ఎలా తెలుసు?" అని అనుమానంగా అడిగాడు రజాక్.

"అది కాదు సార్! అటు ఇటు చూస్తుంటే ఏమైనా వెతుకుతున్నారేమో తెలియకపోతే చెబుదామని అడిగాను." అని స్లోగా చెప్పాడు గబ్బర్ సింగ్.

"మీ నలుగురు ఇక్కడ ఏం చేస్తున్నారు? ల్యాబ్ కి సెక్యూరిటీగా ఉన్నారా?" అని అడిగాడు ఖాసీం.

"ఏమే సార్! మిలిటరీ ల్యాబ్ గురించి మాకు తెలియదు." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాటకి గన్ బయటికి తీసి "నేను ల్యాబ్ గురించి అడిగితే నువ్వు మిలటరీ ల్యాబ్ అంటున్నావు అంటే నీకు అన్ని విషయాలు తెలుసు మర్యాదగా ఆ ల్యాబ్ కి ఎలా వెళ్లాలో చెప్పు!" అని అడిగాడు  ఖాసీం.

చేతిలో గన్ వైపు భయంగా చూస్తూ క్యూబ్ వైపు చూసి "సార్ అడుగుతున్నారు కదా! నేనొక్కడినే మాట్లాడాలా..? మీ ముగ్గురు మాట్లాడరా..?" అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగాడు గబ్బర్ సింగ్.

"నువ్వే కదా! వచ్చే వెధవల్ని నేను డీల్ చేస్తాను మీ ముగ్గురు సైలెంట్ గా ఉండండి అన్నావు, మళ్ళీ మాట్లాడడం లేదని అరుస్తున్నావేమిటి!" అని కోపంగా అడిగాడు క్యూబ్.

ఆ మాటకి షాక్ అయ్యి ఎదురుగా కోపంగా ఉన్న ఖాసీం వైపు చూసి "సార్! నేను మిమ్మల్ని నిజంగా వెధవలు అనలేదు అతను కావాలని అలా చెబుతున్నాడు." అని భయంగా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"మనకి వాళ్లతో గొడవ ఎందుకు ల్యాబ్ చూపిస్తే సరిపోతుంది కదా!" అని చెప్పి రజాక్ వైపు చూసి "ఆ సందు చివరికి వెళ్ళండి అక్కడ పెద్ద ల్యాబ్ ఉంది వెళ్ళగానే బ్లడ్ తీసి టెస్ట్ చేసి వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తారు." అని చెప్పింది పూజా.

ఆ మాట విని దూరంగా ఉన్న బషీర్ వైపు చూసి "బాయ్! వీళ్ల నలుగురికి ల్యాబ్ గురించి తెలుసు కావాలని నాటకాలు ఆడుతున్నారు." అని పిలిచాడు రజాక్.

ఆ మాట విని లింగి వాళ్ళ వైపు చూసి "మీరు ఇక్కడ నుంచి పోండి ఇంకొకసారి నా కంటికి కనిపించరో కాల్చిపడేస్తాను." అని చెప్పి గబ్బర్ సింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చారు బషీర్.

అక్కడికి వసు సూట్ కేసు పట్టుకున్న గుప్తా వైపు చూసి "దాంట్లో ఏముంది?" అని అడిగాడు షారుఖ్.

"ఈ సూట్ కేస్ లో బుక్ ఉంది ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో దాంట్లో ఉంటుంది మీ గురించి చూడమంటారా..!" అని అడిగాడు గుప్తా.

ఆ మాట విని విచిత్రంగా చూస్తూ "బాయ్! వీళ్ళు నలుగురు మెంటల్ గాళ్ళు లాగ ఉన్నారు." అని చెప్పాడు ఖాసీం.

అంతలో అక్కడికి వచ్చిన లింగి వాళ్ళ వైపు చూసి "మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమన్నాను కదా మళ్ళీ ఎందుకు వచ్చారు?" అని కోపంగా అడిగాడు బషీర్.

"సారు! ఇందాక మిలటరీ ల్యాబ్ గురించి అడిగారు కదా గుర్తుకు వచ్చింది నాతో పాటు వస్తే తీసుకువెళతాను." అని చెప్పాడు లింగి.

ఆ మాటకి సంతోషంగా చూస్తూ "కరెక్ట్ గా చూపిస్తే నీకు డబ్బులు కూడా ఇస్తాను." అని చెప్పి ఖాసీం వైపు చూసి "ఎందుకైనా మంచిది  వీళ్ళ నలుగురిని కూడా తీసుకురండి." అని చెప్పాడు బషీర్.

"నాకు డబ్బులు వద్దులే సారు రెండు కళ్ళు ఇప్పించండి పెట్టుకుంటాను." అని గుడ్డుతో కలిసి ముందుకు వెళ్ళాడు లింగి.

"సరే! ఇస్తాను కానీ ముందు ల్యాబ్ చూపించు." అని చెప్పాడు బషీర్

ఖాసీం తో పాటు లింగు వాళ్లకు వెనకాలే వెళుతూ ఉన్నారు గబ్బర్ సింగ్ వారు

మెయిన్ రోడ్డు నుంచి ఒక సందులోకి తీసుకువెళ్లి "సార్! ల్యాబ్ ఇక్కడే ఉంది నేను కళ్ళు అడిగాను కదా మీ నలుగురిలో ఎవరివి ఇస్తారు?" అని అడిగాడు లింగి.

"ఏంట్రా? పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావా..!" అని గన్ బయటికి తీసాడు బషీర్.

ఆ మాట విని చేతి కర్రలో ఉన్న కత్తి తీసి బషీర్ గొంతులో పొడిచి స్పీడ్ గా బయటికి తీసి పక్కనే ఉన్న రజాక్ గుండెల్లో పొడిచాడు లింగి.

అది చూసి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారు గబ్బర్ సింగ్, పూజా లు.

అది చూసి కోపంతో గన్ తీసి షూట్ చేయబోతున్న ఖాసీం, షారుఖ్ ల మీదకి దూకి తన చేతిలో ఉన్న కత్తులతో తల మీద పొడిచాడు గుడ్డు.

నలుగురిని చంపడం చూసి భయంతో వణుకుతూ "ఏంట్రా? ఇంత దారుణంగా చంపారు మీ మాటలకి చేతలకి అసలు సంబంధం లేదు." అని టెన్షన్ చూస్తూ  చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరేగాని! ఆ కారులో ఉన్న ఆరుగురిని కూడా ఇక్కడికి తీసుకురా..!" అని చెప్పాడు లింగి.

"అక్కడ స్నేపర్ గన్స్ తో మన వైపే ఎయిమ్ చేసి ఉన్నారు జాగ్రత్తగా మాట్లాడు." అని చెప్పాడు గుడ్డు.

"ఏంటి స్నైపర్స్ ఉన్నారా..? ఆ విషయం తెలిసి కూడా నలుగురిని చంపేశారా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"అందుకే కదా సందులోకి తీసుకొచ్చి చంపాము లేకపోతే ఇందాకే చంపేసేవాళ్ళము." అని చెప్పాడు లింగి

"ఏంటి! వీళ్ళిద్దరికీ హెల్ప్ చేయడానికి మనల్ని పంపించారా..!" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది పూజా.

గబ్బర్ సింగ్ భుజం మీద చేయి వేసి "త్వరగా వెళ్లి వాళ్ళ ఆరుగురు కూడా తీసుకురా ఆయుషు తీరిపోయే సమయం వచ్చింది." అని చెప్పాడు గుప్తా.

ఆ మాటకి ఉలిక్కిపడి చూసి "నువ్వు ఉండవయ్యా బాబు! టెన్షన్తో చచ్చిపోతుంటే నీ బుక్కు గోల ఒకటి, అక్కడికి వెళితే నా ఆయుషు తీరిపోతుంది." అని భయంగా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరే! నేను వెళ్లి ఆ ఆరుగురు ఇక్కడికి తీసుకు వస్తాను మీరు రెడీగా ఉండండి." అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాడు క్యూబ్.

చనిపోయి కిందపడి ఉన్న బషీర్ వాళ్ల వైపు చూసి "అక్కడ అయితే బులెట్ తగిలి హాయిగా చచ్చేవారు అనవసరంగా ఇక్కడికి వచ్చి దారుణంగా చచ్చారు." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

"ఆ నలుగురి చావు వీళ్ళిద్దరి చేతిలో రాసిపెట్టి ఉంటే అక్కడ ఎలా చస్తారు." అని చెప్పాడు గుప్తా.

"ఏంటి! వీళ్ళ చేతిలో రాసిపెట్టి ఉందా? ఎవరు రాసారు నువ్వు రాసావా..?" అని వెటకారంగా  చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"అవును నేనే రాశాను." అని స్టైల్ గా నుంచొని చెప్పాడు గుప్తా.

ఆ మాట విని లింగు చూసి "విన్నావా..? ఇతను రాశాడు అంట!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.

"ఏమో సార్ నాకు కనపడదు నా తమ్ముడికి వినపడదు." అని చెప్పాడు లింగి.

ఆ మాటకి గుప్త వైపు విచిత్రంగా చూస్తూ "నలుగురిని కసా కసా పొడిచి ఇప్పుడు అమాయకంగా పేస్ పెట్టి ఎలా మాట్లాడుతున్నాడో, ఇది చూడడానికి నేను  ఇంకా బతికి ఉన్నాను, నా చావు ఎప్పుడో మీరు రాయలేదా..?" అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగాడు గబ్బర్ సింగ్.

బుక్ ఓపెన్ చేసి చూస్తూ "నీ చావు నీ పెళ్ళాం చేతిలోనే రాసిపెట్టి ఉంది." అని చెప్పాడు గుప్తా.

"అవునా? ఇంకా ఆ బుక్కు మూసేయ్! నన్ను హిమాలయాలకు తీసుకువెళ్తాను అని చెప్పారు కదా ఇంక అక్కడే ఉంటాను జన్మలో ఇంటికి వెళ్ళాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్.



" రుద్రం భజే! ఎపిసోడ్ 34 " రచనకు రేటింగ్ ఇవ్వండి.........
[+] 9 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 12-05-2026, 06:43 AM



Users browsing this thread: 1 Guest(s)