12-05-2026, 06:41 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 33
సయ్యద్, కళింగతో మాట్లాడి ల్యాబ్ లొకేషన్ రావడంతో షారుక్ వాళ్ళతో కలిసి మిలిటరీ ల్యాబ్ దగ్గరికి బయలుదేరాడు బషీర్.
**************
ఫ్యాక్టరీ గోడౌన్ లో యోధ దగ్గరకి వచ్చి నలుగురు మాత్రం పారిపోయారు మిగతా వాళ్ళందరూ చనిపోయారు వాళ్ళు మనం ట్రేసింగ్ చీప్ పెట్టిన కారులోనే వెళ్లారు." అని చెప్పింది నీతూ.
"గుడ్!" అని చెప్పి తన లాప్టాప్ ఆన్ చేసి కార్ లోకేషన్ చూసి "మిలిటరీ ల్యాబ్ వైపు వెళుతున్నారు అక్కడ అభిర్ ఏజెంట్స్ ఉన్నారు కానీ వాళ్లకి హెల్ప్ గా మన వాళ్లు కూడా వెళ్లాలి." అని చెప్పాడు యోధ.
"ఇక్కడి నుంచి పారిపోయిన నలుగురు మనల్ని చూశారు అక్కడ మనలో ఎవరిని చూసినా యంగ్ వాళ్ళు ల్యాబ్ లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుంటారు కాబట్టి కొత్త వాళ్ళని పంపించాలి." అని చెప్పింది దీప్తి.
"అలా అయితే! క్యూబ్, పూజా, గబ్బర్ సింగ్ కంప్యూటర్ దగ్గర ఉన్నారు కదా వీళ్ళని ఎవరు చూడలేదు ఆ ముగ్గురిని పంపించండి." అని చెప్పాడు భూషణ్.
"నన్ను కూడా ఎవరు చూడలేదు వీళ్ళతో పాటు నేను కూడా వెళతాను కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు ఉంటుంది." అని చెప్పాడు గుప్తా.
ఆ మాటకి కాసేపు ఆలోచించి పూజా వైపు చూసి "జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరు కదా!" అని అడిగాడు యోధ.
"నో ప్రాబ్లం సార్! నేను ఉన్నాను కదా ఇలాంటి విషయాలు నాకు కొట్టిన పిండి." అని గొప్పగా చెప్పాడు గబ్బర్ సింగ్.
"కెప్టెన్ అనుమానం కూడా నువ్వు ఉన్నావనే!" అని చెప్పింది నీతూ.
"మీ నలుగురు అక్కడ ఏం జరుగుతుందో మాత్రం చూడండి అవసరమైనప్పుడు ఎంటర్ అవ్వండి. మిగతా విషయాలు మొత్తం అభీర్ ఏజెంట్స్ చూసుకుంటారు." అని చెప్పాడు యోధ.
"సరే! ఇంతకీ అక్కడికి వచ్చిన ఏజెంట్స్ పేర్లు ఏమిటి వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయా?" అని అడిగింది పూజా.
"నో! వాళ్ళు ఎలా ఉంటారో నాకు కూడా తెలియదు పేర్లు మాత్రం లింగి, గుడ్డు వాళ్ళని కలిసినప్పుడు 'జై భవాని' అని చెప్పండి అదే కోడ్!" అని చెప్పాడు యోధ.
"మీరు ఫాస్ట్ గా వెళ్లాలి ల్యాబ్ దగ్గరికి ఎంతమంది వస్తున్నారో కూడా మనకి తెలియదు." అని చెప్పింది దీప్తి.
"సరే!' అని చెప్పి క్యూబ్ వైవు చూసి "స్టార్ట్ అవుదామా?" అని అడిగింది పూజా.
"సరే! నేను డ్రైవింగ్ చేస్తాను మిమ్మల్ని క్షణాల్లో అక్కడికి తీసుకువెళ్తాను." అని చెప్పాడు క్యూబ్.
జీప్ కీస్ ఇచ్చి "జాగ్రత్త హెవీ ఇంజన్! ఎక్స్ లెటర్ మీద కాలు పెడితే స్టార్టింగ్ 100 స్పీడ్ వెళుతుంది." అని చెప్పాడు రాఖి.
"నో ప్రాబ్లం!" అని కీస్ తీసుకుని ముగ్గురితో కలిసి వెళ్ళాడు క్యూబ్.
అక్కడి నుంచి పూజా వాళ్ళు వెళ్లడంతో నాయక్ కి మెసెజ్ చేసాడు యోధ.
మీటింగ్ లో నుంచి బయటకు వస్తూ మెసేజ్ చూసి యోధ కి కాల్ చేసాడు నాయక్.
ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జైహింద్ సార్! ఇక్కడ అంత క్లియర్ మీరు అనుమానించినట్లే నలుగురు ల్యాబ్ దగ్గరికి వెళ్లారు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అక్కడ అభీర్ ఏజెంట్స్ ఉన్నారు మన వాళ్లు కూడా వెళుతున్నారు." అని చెప్పాడు యోధ.
"ఓకే! ఉన్ని కృష్ణన్ కి కాల్ చేసి సెక్యూరిటీ డోర్ లాక్ చేయమంటాను ఇంకా ఎవరూ లోపలికి వెళ్ళలేరు." అని చెప్పి
చైనా అంబసీతో మీటింగ్ అయింది యంగ్, భూపాల్ సింగ్ లు వాళ్ల ల్యాబ్ లో నుంచి ఇంపార్టెంట్ వస్తువుని దొంగలించి ఇండియాకి వచ్చారు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నారు. " అని చెప్పాడు నాయక్.
"సార్" ఆ ఇద్దరిని వెతుకుతున్నాము అని చెప్పండి ఈలోపు ఇండియాలో దాక్కున్న టెర్రరిస్టులు మొత్తం క్లోజ్ అయిపోతారు." అని చెప్పాడు యోధ.
"కరెక్టే! కానీ ఈ ఇన్సిడెంట్ తో మిలటరీ ఎంట్రీ అయ్యింది అని వాళ్లకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువ రోజులు ప్రోలాంగ్ చేయలేము కానీ యంగ్ ని ఆ విధంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా చాలా డేంజర్!" అని చెప్పాడు నాయక్.
"సార్! నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దానికి టుడేస్ టైమ్ కావాలి అప్పటివరకు డిస్కషన్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడికి ఒక మిలిటరీ ట్రక్ పంపించండి బాడీస్ క్లియర్ చేస్తాము." అని చెప్పాడు యోధ.
"ఓకే! ఇప్పుడే పంపిస్తాను ఇంతకీ నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏమిటి?" అని అడిగాడు నాయక్.
"టూ డేస్ వెయిట్ చేయండి సార్ అన్ని విషయాలు క్లియర్ గా చెబుతాను." అని చెప్పి ఫోన్ పెట్టేసి సుహా వైపు చూసి "మన విఠలాచార్యని అర్జెంటుగా ఇక్కడికి రమ్మని కాల్ చెయ్!" అని చెప్పాడు యోధ.
ఆ మాట విని నవ్వుతూ "ఓకే! నీ ప్లాన్ నాకు అర్థమైంది." అని ఫోన్ తీసుకుని కాల్ చేస్తూ పక్కకు వెళ్ళింది సుహా.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "అసలు ఇంతకీ ఈ విఠలాచార్య ఎవరు?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"టెన్షన్ ఎందుకు వస్తాడు కదా మీరే చూడండి వాడు ఒక అద్భుతమైన సృష్టికర్త!" అని నవ్వుతూ చెప్పాడు యోధ.
************
కార్ లో ల్యాబ్ దగ్గరికి వెళుతూ డ్రైవింగ్ చేస్తున్న క్యూబ్ వైపు చూసి "ఇలా వెళితే మనం వెళ్లినట్లే!" అని వెటకారంగా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.
ఆ మాటకి క్యూబ్ వైపు చూసి "పుష్పక విమానాన్ని డ్రైవింగ్ చేసిన వాడివి ఈ కార్ కుడా అదే అనుకుని స్పీడ్ గా వేళ్ళు!" అని చెప్పాడు గుప్త.
"సరే! అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోని ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి." అని చెప్పాడు క్యూబ్.
ఆ మాటకి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ "నేను రాకెట్ ని పైకి పంపించేదాన్ని నాకు స్పీడ్ అంటే భయం లేదు." అని చెప్పింది పూజా.
"నేను ఆ రాకెట్ లో జర్నీ చేసే టైప్!" అని నవ్వుతూ చెప్పాడు గబ్బర్ సింగ్.
"సరే మీ ఇష్టం!" అని గేర్ మార్చి ఎక్సలేటర్ ని గట్టిగా ఒక్క తొక్కు తొక్కి "ల్యాబ్ లొకేషన్ కి వచ్చేసాము కిందకి దిగండి." అని చెప్పాడు క్యూబ్. క్యూబ్.
"అయ్య బాబోయ్! సుయ్ మని మెరుపు మాత్రమే కనిపించింది. ఇంతకీ మనం ఉన్నామా? పోయామా?" అని కంగారుగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.
"నీకు ఆ మెరుపైనా కనిపించింది నాకు అది కూడా కనిపించలేదు." అని రెండు చేతులతో తల పట్టుకుని చెప్పింది పూజా.
"మా బాస్ వెహికల్ ఇంతకన్నా ఫాస్ట్ గా వెళుతుంది దినికే భయపడుతున్నారా..?" అని కిందకి దిగాడు గుప్తా.
స్లోగా కిందకి దిగి "మిలిటరీ ల్యాబ్ ఉన్న లోకేషన్ ఇదే కానీ ఇక్కడ ఏమి కనిపించడం లేదు." అని అడిగాడు గబ్బర్ సింగ్.
"అది మిలటరీ సీక్రెట్ ల్యాబ్ తెలుసుకోవడం చాలా కష్టం! బయటికి నార్మల్ ఇల్లు లేదా షాప్ లాగా కనిపిస్తుంది." అని చెప్పింది పూజా.
"అదిగో అక్కడ ఇద్దరు కూర్చుని ఉన్నారు నాకు తెలిసి వాళ్లే మీ ఏజెంట్స్ అనుకుంటా!" అని చెప్పాడు క్యూబ్.
"సరే పదండి." అని చెప్పి కూర్చున్న ఇద్దరి దగ్గరకి వెళ్ళి "హలో మిస్టర్! మీ ఇద్దరి పేర్లు ఏమిటి?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
ఆ మాట విని కర్ర ఆడించుకుంటూ లేచి నుంచుని "నా పేరు లింగి సార్ వాడు నా తమ్ముడు గుడ్డు!" అని చెప్పాడు.
అక్కడికి వస్తున్న క్యూబ్ వైపు చూసి "నువ్వు కరెక్ట్ గానే గెస్ చేసావు మనం వచ్చింది వీళ్లకోసమే!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"మేము మీ ఇద్దరికీ హెల్ప్ గా ఉండడానికి వచ్చాము ఇంతకీ ల్యాబ్ లోకి ఎలా వెళ్లాలి?" అని అడిగింది పూజా.
"ఏమో మేడం నాకు కనపడదు." అని చెప్పాడు లింగి.
"ఏంటి నీకు కనపడదా..! మేము చెప్పింది వినపడుతుంది కదా ల్యాబ్ లోకి ఎటు వెళ్ళాలో చెప్పు!" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఏమో సార్ నా తమ్ముడు గుడ్డు కి వినపడదు." అని చెప్పాడు లింగి.
"ఒరేయ్! నీకు కనపడదు వాడికి వినపడదు సరే మేము చెప్పింది నీకు వినపడుతుంది వాడికి మేము కనపడుతున్నాము ల్యాబ్ లోపలికి ఎటు వెళ్ళాలో చెప్పండి." అని గట్టిగా అరిచేడు గబ్బర్ సింగ్.
"ఏమో సార్! నాకు కనపడదు కదా ఎలా వెళ్లాలో నాకు ఎలా తెలుస్తుంది." అని చెప్పాడు లింగి.
ఆ మాటకి గుడ్డు దగ్గరికి వెళ్లి "ల్యాబ్ లోకి ఎలా వెళ్లాలి?" అని గట్టిగా అరుస్తూ అడిగింది పూజా.
"మేడం! మీరు ఎంత అరిచిన వాడికి వినపడదు ఏదైనా ఉంటే నాతో చెప్పండి." అని చెప్పాడు లింగి.
"ఓరి మొగడా! ల్యాబ్ లోకి ఎలా వెళ్లాలో చెప్పు మేము మీ ఇద్దరికీ హెల్ప్ చేయడానికి వచ్చాము." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"ఏమో సార్! నాకు కనపడదు కదా!" అని అమాయకంగా పేస్ పెట్టి చెప్పాడు లింగి.
ఆ మాటకి అయోమయంగా చూస్తూ "నేను చచ్చిపోతా లేకపోతే వీళ్లిద్దరిని చంపేస్తాను." అని కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు గబ్బర్ సింగ్.
"మీ ఇష్టం సార్! నాకు కనపడదు నా తమ్ముడికి వినపడదు ఏదైనా చేసుకోండి." అని చెప్పాడు లింగి.
"ఆ ఇద్దరు మనల్ని ఏజెంట్స్ అనుకోవడం లేదు యోధ చెప్పిన కోడ్ చెప్పండి అప్పుడు కరెక్ట్ గా మాట్లాడతారు." అని చెప్పాడు గుప్తా.
లింగు, గుడ్డులను చూసి ఏడుస్తూ గుప్త చెప్పిన మాట విని "హ.. మర్చిపోయాను జై భవాని!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"ఆ కోడ్ మీరు వచ్చినప్పుడే చెప్పాల్సింది ఇంత డిస్కషన్ ఉండేది కాదు కదా!" అని చెప్పాడు గుడ్డు.
ఆ మాట విని గుడ్డు వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఒరేయ్! నీకు వినపడుతుందా..? మరి ఇప్పటి దాకా అంత యాక్షన్ చేసావ్ ఏమిటి రా..!" అని ఏడుస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.
"నాకు వినపడదు మీ లిఫ్ మూమెంట్ చూసి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటాను." అని చెప్పాడు గుడ్డు.
"సరే! ఒక పక్కకు వెళ్లి నుంచోండి కార్ లు ఆగిన సౌండ్ వచ్చింది టెర్రరిస్టులు వచ్చారు అనుకుంటా!" అని చెప్పాడు లింగి.
"ఇక్కడ దగ్గరలో కార్లు ఏమి కనబడడం లేదు నీకు సౌండ్ ఎలా వినిపించింది?" అని డౌట్ గా చూస్తూ అడిగింది పూజా.
"లింగి చెప్పింది కరెక్టే దూరంగా రెండు కార్లు ఆగాయి పదండి మనం పక్కకు వెళ్లి నిలబడదాము." అని చెప్పాడు క్యూబ్.
అక్కడి నుంచి వెళుతూ "ఈ ఇద్దరు మామూలు ఏజెంట్స్ కాదు వీళ్ళకి కత్తులు తుపాకులు అక్కర్లేదు మాటలతో చంపేస్తారు.
ఆ కోడ్ చెప్పబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళ టార్చెర్ కి ఏ గోడకో తలబాదుకుని చచ్చిపోయేవాడిని!" అని ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు గబ్బర్ సింగ్.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)