Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - సుట్టకోసం
'' హలో ధనుంజయరావు గారు బాగున్నారా నేను ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్యని. మీతో చిన్న పని పడింది సార్. ఒక అబ్బాయికి డిగ్రీ పాస్ అయిన సర్టిఫికెట్ కావాలి సార్. అబ్బా అవన్నీ ఉంటే మీకెం దుకు ఫోన్ చేస్తాను. తప్పదు మనవాళ్లు. అలాగే.. చేసి పెట్టండి చాలా థాంక్స్.. '' అంటూ సెల్ క్రింద పెట్టి



'' ఇదిగో ప్రభాకర్ నీ పని అయిపోయింది ఇక నువ్వు వెళ్ళవచ్చు. '' అంటూ మరొక సమస్యతో వచ్చిన వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య. 



'' నమస్తే ఎమ్మెల్యే గారు'' ఆ వచ్చిన మరో వ్యక్తి నమస్కరిస్తూ అన్నాడు. 



'' ఏరా సుందరం బావ బాగున్నావా ఎమ్మెల్యే.. గారు అంటున్నావు.. నీకేదో పెద్ద పని చేసి పెట్టాలి అవునా?''
తన బంధువుతో చిలిపిగా నవ్వుతూ అన్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య. 



'' పెద్ద పని కాదురా బావా. నా పేరున అర్జెంటుగా తెల్ల రేషన్ కార్డు కావాలిరా. ''



'''30 ఎకరాల ఆసామివి నీకెందుకురా.. సరే ఉండు మన డెవలప్మెంట్ ఆఫీసర్ గారితో మాట్లాడతాను.. 



హలో మూర్తి గారు.. నేను ఎమ్మెల్యేని. ఎలా కింద మీద పడతారో నాకు తెలియదు సాయంత్రానికి మా బావ పేరుని తెల్ల రేషన్ కార్డు కావాలి. అలాగన్నారు బాగుంది సరే సరే అలాగే. '' అంటూ సెల్ ఆఫ్ చేసి క్రింద పెట్టి. 



''ఆ నీ పని అయిపోయింది రా బావ నువ్వు వెళ్ళిపో వచ్చు మీ ఇంటికి వచ్చేస్తుంది కార్డు. ''' అంటూ అతన్ని పంపించేశాడు.. ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య



'' ఏరా శివసాగరం నువ్వొచ్చావే. ఫోన్ చెయ్యక పోయావా?'' అంటూ పలకరించాడు శివసాగరాన్ని ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య. 



'' ముఖ్యమైన విషయం. మా తమ్ముడు జేజి బాబు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడి మోటార్ సైకిల్ కింద ఓ ముసలోడు పడి చచ్చాడు. వీడిని స్టేషన్లో పెట్టేసారు ప్రాణ స్నేహితుడువి ఎమ్మెల్యే అయ్యావు ఇప్పుడు నువ్వే నాకు ఉపకారం చెయ్యాలి. కేసు లేకుండా చేయాలి. '. చేతులు పట్టుకు అడిగాడు శివసాగరం. 



'' సర్లే చేతులు వదులు ఉండు ఫోన్ చేస్తాను.. హలో.. ఎస్పీ గారు. జేజి బాబు అక్కడ ఉన్నాడు కదా స్టేషన్లో.. మనవాడే.. కొద్దిగా కేసు మనవాడి మీద పడకుండా మేకప్ చేయండి.. చూడండి వాడిని స్టేషన్ నుండి పంపేయండి. అలాగా.. అలాగా.. సరే వీలు చూసుకునే పంపండి.. ఏం చేస్తాం మరి. అలాగే మీ మేలు మరిచి పోతానా ఉంటాను. '' అంటూ తన లైట్ బ్లూ కలర్ సెల్ బల్ల మీద పెట్టాడు ఎమ్మెల్యే. 



'' ఇక నీ పని అయిపోయింది శివసాగరం వెళ్ళిపో. 
జేజి బాబు రేపు జైలు నుండి మీ ఇంటికి వచ్చేస్తాడు. ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే ఫోన్ చెయ్ చాలు పనిగట్టుకు ఈ బారులు తీరిన లైన్లో నిలబడడం ఎందుకు ఇక వెళ్ళు'' అంటూ పంపించేశాడు.. ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య. 



''మా కోడలు తనను వేధిస్తున్నట్టు మా అందరి మీద కేసు పెట్టింది రా.. కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాం. 
నీ పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా ఆ కేసు కొట్టి వేయించు'' మరో బంధువు.. డిమాండ్ గా అడిగాడు. 
ఎమ్మెల్యే ముందుకు వచ్చి. 



ఆ అభ్యర్థనలు.. డిమాండులు తన లైట్ బ్లూ కలర్
సెల్ఫోన్ ద్వారా మాట్లాడి వాళ్లకు ఏం భయం లేదు వెళ్ళండి అంటూ భరోసా ఇచ్చి పంపించేవాడు.. ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య. 



ఇలా.. ఇలా. వారంలో రెండు రోజులు ప్రజా న్యాయ స్థానం ఎమ్మెల్యే గారి ఇంటి ముందు జరుగుతూనే ఉంది. 



. ***''



మరో రెండు నెలలు గడిచింది. 



ఒక రోజు రాత్రి భర్తకు భోజనం పెడుతూ.. 



''మా చెల్లెలు గారి అబ్బాయి చక్రి ఇంజనీరింగ్ సీటు గురించి 2 నెలలు క్రితం మీకు చెప్పాను. మీరు వెంటనే ఫోన్లో మాట్లాడి పని అయిపోతుంది అన్నారు. ఆ పని అవ్వలేదట వాళ్ళు బాధపడుతున్నారు. 



రామలింగేశ్వరయ్య వినబడనట్లు మౌనంగా ఊరుకు న్నాడు. 



మరో విషయం ఇందాక.. ఎవరో ప్రభాకర్ అట.. మీరు లేనప్పుడు వచ్చాడు. వాళ్ల అబ్బాయికి డిగ్రీ సర్టి ఫికెట్ ఇస్తానన్నారట.. అది కూడా వాళ్లకి రాలేదట.. విసవిస లాడుతూ మాట్లాడి మీకు చెప్పమని వెళ్ళి పోయాడు. 



తర్వాత సుందరం అని మీకు బావ అవుతాడట. అతను నాలుగు రోజుల క్రితం వచ్చాడు. తెల్లరేషన్ కార్డు కూడా ఇప్పించలేకపోయేడేటమ్మా మీ ఆయన 
అంటూ కోపపడినట్టు మాట్లాడి వెళ్లిపోయాడు. 



నిన్న శివసాగరమని ఒక అతను వచ్చాడు. సెక్యూరిటీ అధికారి స్టేషన్లో ఉన్న అతని తమ్ముడుని స్టేషన్ నుండి తెప్పించ లేకపోయారట ఈ రెండు నెలల నుండి. అతను మరో లా ప్రయత్నించుకున్నాడట.. పాపం. మీరు ఎవరికీ ఉపకారం చేయలేకపోతున్నారని ఏమాత్రం గౌరవం లేకుండా అతను మాట్లాడుతుంటే నాకు ఎంత చిన్న తనం అనిపించిందో మీకు తెలుసా? మీకు వీలైతే నే చేస్తానని చెప్పండి లేకపోతే ఎందుకు అలా చెప్పటం. 
ఇంకా చాలామంది వచ్చారు. మీరు చేస్తానన్న పని ఏది ఎవరికి జరగలేదట. 



మీరు ఆదేశించినప్పటికీ అధికారులు ఎవరూ మీ పని చేయకపోతే మీకు విలువ లేనట్టే కదా.. ఎమ్మెల్యే అయ్యాక ఆ మాత్రం పరువు లేకపోతే ఎలాగండి. 



ఒకసారి పరిపాలన చేసే వాళ్ళందరినీ కబురు పెట్టి మీటింగ్ పెట్టి మీరు చెప్పిన పని వెంటనే చేసేలాగా గట్టిగా భయం చెప్పండి. '' అంటూ ఇంకా ఏదో చెప్ప బోయింది.. కాత్యాయని. 



రామలింగేశ్వరయ్య నవ్వకుండా నవ్వినట్టు నవ్వి సగం భోజనం చేసి పైకి లేచి పడక గదిలోకి వెళ్లి మంచం మీద వాలాడు. 



కాత్యాయని తను భోజనం చేసి వచ్చి భర్త కాళ్ల దగ్గర స్టూలు మీద కూర్చుని కాళ్లు నొక్కడం మొదలు పెట్టింది. 



కాసేపటికి టీపాయ్ మీద ఉన్న సెల్ రింగ్ అయ్యింది. 
కానీ అది ఎరుపు రంగు సెల్.. ! తన భర్త ఎప్పుడూ
లైట్ బ్లూ కలర్ సెల్ కదా ఎక్కువగా వాడేది. అందరితో మాట్లాడేది ఆ సెల్ నుండే కదా. ప్రజల సమస్యలు తీర్చేది కూడా ఆ సెల్ నుండే. మరి ఈ ఎరుపు రంగు సెల్ ఎక్కడిది?.. కాత్యాయనకి అనుమానం వచ్చింది. అది బలపడింది. 



'' ఈ ఎరుపు రంగు సెల్ ఎక్కడిది. రింగ్ అవుతుంది. సెల్ తెమ్మంటారా.. మాట్లాడతారా? అసలు మీ లైట్ బ్లూ కలర్ సెల్ ఏది?'' ప్రశ్నించింది భర్తను. 



''వద్దు.. ఇప్పుడు మాట్లాడను. రాత్రి అయింది కదా. బాగా నీరసంగా ఉంది. పడుకుంటాను. రేపు మాట్లా డతాను కాత్యాయని. '' నీరసంగా అన్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య. 



'' ఎమ్మెల్యే అయ్యాక ఈ ఆరు నెలల నుండి చూస్తు న్నాను. మీ లైట్ బ్లూ కలర్ సెల్ లోంచి మీరు మాట్లాడ తారు కానీ ఎక్కడ నుండి దానికి కాల్స్ ఏమి రావేమి 
టండి. ?''.. నిద్రలోకి జారుకోబోతున్న భర్తను తట్టి లేపి ప్రశ్నించింది కాత్యాయని. 



''కాత్యాయని.. ఆ లైట్ బ్లూ కలర్ సెల్ కి కాల్స్ రావు. అంతేకాదు ఆ సెల్ లో నేను మాట్లాడిన కాల్స్ ఎవరికి వెళ్ళవు కూడా. ''



'' అంటే.. ''



'' నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని నెలలకు ఆ లైట్ బ్లూ కలర్ సెల్లో సిమ్ తీసేసాను. ఆ డమ్మి సెల్ తోనే అందరితో మాట్లాడుతున్నాను'' మత్తుగానే చెప్పాడు రామలింగేశ్వరయ్య. 



'' అట్లా ఎందుకు చేశారు.. అసలు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? ''



'' ఎందుకంటే.. ఎందుకంటే.. పదవి నిర్వహిస్తూ మంచిపనులే చేస్తానని నా భార్యకు మాటిచ్చాను. అందు.. కన్న.. మాట!''



మత్తుగా చెప్పి నిద్రలోకి జారుకున్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య. 



కాత్యాయనికి కాసేపు అర్థం కాలేదు. కొంచెం సేపటికి అర్థం అయి.. భర్త కాళ్ల పై తన శిరస్సు ఉంచి అలా తను కూడా నిద్ర లోకి జారుకుంది. 



****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM
RE: హాస్య కథలు - నవ్వుకోండి నవ్వుకోండి ఇంకొంచెంసేపు నవ్వుకోండి! - by k3vv3 - 11-05-2026, 09:54 AM
RE: హాస్య కథలు - - - by k3vv3 - 19-06-2026, 10:04 PM



Users browsing this thread: 1 Guest(s)