Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#97
రుద్రం భజే! ఎపిసోడ్ 31



రూమ్ దగ్గరికి వచ్చి ముష్రుని కలిసి పరిచయం చేసుకుని  చెప్పింది విని లొకేషన్ చూసి కరెక్ట్ గానే ఉంది నా మనుషులందరికి లొకేషన్ ఫార్వర్డ్ చేశాను మనం వెళ్లేసరికి అందరూ అక్కడే ఉంటరు అని కారు దగ్గరికి వెళ్ళాడు బషీర్.

రూమ్ డోర్ లాక్ చేస్తూ యోద కి మెసేజ్ చేసి కార్ దగ్గరకి వెళ్లి డ్రైవింగ్ సీట్ లోకి ఎక్కడు ముష్రు.

************

ఫ్యాక్టరీ దగ్గర గన్ క్లీన్ చేస్తూ మెసేజ్ రావడం చూసి చప్పట్లు కొడుతూ "ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్లి ఎలర్ట్ గా ఉండండి టెర్రరిస్టులు స్టార్ట్ అయ్యారు." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని "వెధవలకి పని పాట లేదనుకుంటా పోద్దు పొద్దున్నే తయారవుతున్నారు." అని కంప్యూటర్ దగ్గర ఉన్న సుహా దగ్గరికి వెళ్లి

"మేడం! మీరు ఎటాక్ చేయడానికి వెళతారు కదా నేను వాచ్ చేస్తూ ఉండనా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"సరే! ఎప్పటికప్పుడు లోపలికి ఎంత మంది వస్తున్నారు అనే విషయం మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండు." అని చెప్పి పూజ వైపు చూసి "నువ్వు కుడా హెల్ప్ గా ఉండు." అని గన్ తీసుకొని వెళ్ళింది సుహా.

"ఓకే!" అని కంప్యూటర్ ముందు ఉన్న చైర్ లో కూర్చుని గబ్బర్ సింగ్ వైపు చూసి "నువ్వు కూడా ఒక చైర్ తెచ్చుకో వీడియో గేమ్ ఆడుకుందాము." అని చెప్పింది పూజా.

ఆ మాటకి సంతోషంగా చూస్తూ చైర్ పక్కనే వేసుకోని "మేడమ్ పబ్జి గేమ్ ఆడుకుందామా..?"  అని అడిగాడు గబ్బర్ సింగ్.

"మనం ఆడనవసరం లేదు చూడడం వరకే వాళ్ళు ఆడుకుంటారు మనం బెట్టింగ్ వేసుకుందాము." అని చెప్పింది పూజా.

అక్కడకి వస్తు "డబ్బుతో ఆటలు అంటే నాకు భలే ఇష్టం! నేను కూడా జాయిన్ అవుతాను." అని పక్కన చైర్ వేసుకుని కూర్చున్నాడు క్యూబ్.

బయటకు వచ్చిన అందరి వైపు చూస్తూ "నీతు, దీప్తి మీరిద్దరు స్నైపర్ గన్స్ తీసుకుని పైకి వెళ్ళండి. ఒక్కడికి ఒక బుల్లెట్ మాత్రమే వేస్ట్ అవ్వకూడదు." అని చెప్పాడు యోధ.

భూషణ్ వాళ్ళతో పాటు కూర్చుని ఆ మాట విని "ఆహా! యోధ కి చాలా జాగ్రత్త ఎక్కువ!" అని చెప్పాడు గుప్తా.

"నీకు అర్థం కాలేదనుకుంటా! హెడ్ షాట్ కొట్టమని అర్ధం ఒక్క బుల్లెట్ దెబ్బకి చచ్చిపోవాలి అని చెప్తున్నాడు."  అని చెప్పాడు భూషణ్.

"పుష్కర్, ఏకవీర మీరు వెపన్స్ దగ్గర ఉండండి ఎవరికి ఏది అవసరమైన వెంటనే తీసుకువెళ్లి ఇవ్వాలి అందరూ కాన్ఫరెన్స్ లో ఉండండి." అని చెప్పాడు యోధ.

భూషణ్ వాళ్ళ వైపు చూసి "మరి వాళ్ళు ఫీల్డ్ లోకి రారా...!" అని అడిగాడు రాఖి.

"వస్తారు కానీ వెపన్ యూస్ చేయరు మనకి హెల్ప్ గా ఉంటారు." అని చెప్పాడు యోధ.

"కెప్టెన్! నేను ఫీల్ లోకి వస్తాను.' అని చెప్పాడు ధర్మ.

"ఓకే థాంక్యూ! మీకు ఏ వెపన్ కావాలి అంటే అది తెచ్చుకోండి." అని చెప్పాడు యోధ.

"మీ వెపన్స్ నాకు అవసరం లేదు నా వెపన్ నా దగ్గర ఉంది." అని చేతిలో ఉన్న కర్ర నీకు చూపించడు ధర్మ.

అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "నాయక్ సర్ కాల్ చేస్తున్నారు సైలెంట్ గా ఉండండి." అని చెప్పి లిఫ్ట్ చేసి "జైహింద్ సార్!" అని చెప్పాడు యోధ.

"జై హింద్ యోధ!" అని కంప్యూటర్ లోకేషన్ చూస్తూ "మీరందరూ పాత ఫ్యాక్టరీ దగ్గర ఏం చేస్తున్నారు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న టెర్రరిస్ట్ గ్యాంగ్ లు మొత్తం బయటికి వస్తున్నాయి.

సిటీ మొత్తం రెడ్ అలార్ట్ ఎనౌన్స్ చేశారు మీరు అర్జెంటుగా మిలిటరీ హెడ్ కోటర్స్ కు రండి." అని చెప్పాడు నాయక్.

"సార్! వాళ్ళందరూ బయటికి వచ్చిందే మేము ఉన్న లొకేషన్ కి రావడానికి ఎవరికి డిస్టబెన్స్ లేకుండా అందర్నీ లేపేస్తాము నా టీమ్ కూడా ఇక్కడికి వచ్చింది." అని చెప్పాడు యోధ.

"నాకు విషయం అర్థమైంది టెర్రరిస్టులు మూర్ఖులే కానీ మూర్ఖంగా ఆలోచిస్తారని మాత్రం అనుకోకు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు అని అర్థం అవ్వగానే వాళ్లకి కావలసింది అక్కడ లేదని తెలుసుకుంటారు.

కచ్చితంగా మిలటరీ ల్యాబ్ ని వెతుక్కుంటూ వస్తారు అక్కడ స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉండాలి ఎవరిని పంపిస్తే బాగుంటుందో ఆలోచించు." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్! అభీర్ కి కి కాల్ చేసి వాళ్ల టీమ్ నుంచి ఇద్దరు ఏజెంట్స్ ని ల్యాబ్ దగ్గరికి సెక్యూరిటీగా పంపించమని చెప్తాను." అని చెప్పాడు యోధ.

"గుడ్ థింకింగ్! వెంటనే కాల్ చెయ్ చైనా అంబాసి నుంచి కాల్ వచ్చింది అర్జెంట్ మీటింగ్ అని ఇన్ఫామ్ చేసారు, నేను వెళుతున్నాను ఏదైనా అవసరమైతే మెసేజ్ చెయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాయక్.

ఫోన్ కట్ అవ్వడంతో "ఈ అభీర్ ఏ దేశంలో ఉన్నాడో!" అని కాల్ చేసాడు యోధ.

ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ యోధ! హౌ ఆర్ యు?" అని అడిగాడు అభీర్.

"గుడ్ మార్నింగ్ అభీర్! స్టోరీ చెప్పే అంత టైం లేదు అర్జెంటుగా మిలిటరీ ల్యాబ్ దగ్గరికి ఇద్దరు చాకు లాంటి ఏజెంట్స్ వెళ్లాలి, అక్కడ టెర్రరిస్ట్ ఎటాక్ జరిగే ఛాన్స్ ఉంది వాళ్ళని చూస్తే ఎవరికి అనుమానం రాకూడదు." అని చెప్పాడు యోధ.

"ఓకే! లింగు, గుడ్డు అని ఇద్దరు ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళని చూస్తే ఎవరికి అనుమానం రాదు 15 మినిట్స్ లో అక్కడ ఉంటారు." అని చెప్పాడు అభీర్.

"థాంక్యూ! ఈ మిషన్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినపుడు మీ అభీర్ సేనా అవసరం ఉంటుంది." అని చెప్పాడు యోధ.

"దేశం కోసం ఎప్పుడు మా అభీర్ సేనా సిద్ధంగా ఉంటుంది. ఒక్క పిలుపు చాలు క్షణాల్లో వాలిపోతాము జైహింద్!" అని ఫోన్ పెట్టేసాడు అభీర్.

ఫోన్ కట్ అవ్వడంతో నవ్వుతూ జేబులో పెట్టుకుని వర్ధన్ వాళ్ళ వైపు చూసి "అభీర్ మాట ఇచ్చాడు అంటే తిరుగు ఉండదు ఇంక ల్యాబ్ దగ్గరికి ఒక్కడు కూడా వెళ్లలేడు." అని చెప్పాడు యోధ.

*************

కారకొరం పర్వతాల దగ్గర ఉన్న ల్యాబ్ కి చేరుకుని  "ఇండియన్ అంబాసీ తో చైనా అంబాసి ఎమర్జెన్సీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది నేను లైవ్ కాల్ లో అక్కడి ఆఫీసర్స్ మాట్లాడి

భూపాల్ సింగ్, యంగ్ అనే ఇద్దరు మన ల్యాబ్ నుంచి ఒక విలువైన వస్తువుని దొంగలించి పారిపోయారు వాళ్ళు ఇండియాలో ఉన్నారు అని తెలిసింది అప్ప చెప్పమని అడుగుతాను." అని చెప్పాడు చింగ్ యా.

"నువ్వు చెప్పిన మాట ఇండియన్ గవర్నమెంట్ అంత ఈజీగా నమ్ముతుంది అనుకుంటున్నావా..?" అని అడిగాడు కళింగ.

"ప్రజెంట్" ఇండియా చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూస్తుంది. ఈ టైమ్ లో ఎటువంటి డిస్కషన్ పెట్టుకోదు. ఒకవేళ వాళ్ళిద్దరినీ పట్టుకున్న ఆ వస్తువు గురించి యంగ్ గురించి వాళ్ళు తెలుసుకోలేరు." అని చెప్పాడు చింగ్ యా.

"ఆల్రెడీ ఆ వస్తువుతో మనం ప్రయోగం చేస్తున్నామని ఇండియన్ మిలిటరీ కి తెలిసిందాని నువ్వే చెప్పావు కదా!" అని అడిగాడు సయ్యద్.

"కరెక్టే! అందుకే ల్యాబ్ నుంచి వస్తువు దొంగిలించారు అని చెబుతున్నాము కదా! రెండు మాటలు కరెక్ట్ గా సింక్ అవుతాయి వాళ్లు కచ్చితంగా నమ్ముతారు." అని చెప్పాడు చింగ్ యా.

"మన ప్రయోగం గురించి వాళ్ళకి తెలిసేలాగా మనమే చెప్పడం అవసరమా? వాళ్ళకి కచ్చితంగా  అనుమానం వస్తుంది ఎలాగో సయ్యద్ మనుషులు వెళ్లారు కదా!" అని అడిగాడు కళింగ.

"భూపాల్ సింగ్ దగ్గర ఆ వస్తువు ఉంది దాన్ని ఎలా యూస్ చేయాలో కూడా తెలుసుకున్నాడు ఇప్పుడు సయ్యద్ మనుషులు వెళ్లినంత మాత్రాన దొరుకుతాడు అనుకుంటున్నావా..?" అని అడిగాడు చింగ్ యా.

"యంగ్ ఒంట్లో ఉన్న రక్తం గురించి ఇండియన్ ఆర్మీ వాళ్ళు  తెలుసుకున్నారు అంటే మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము." అని చెప్పాడు కళింగ.

"సయ్యద్ మనుషులు ఆ ఇద్దరి కోసం ట్రై చేయడం వల్ల టెర్రరిస్టుల గోలా కుడా ఎక్కువైందని ఇండియన్ గవర్నమెంట్ యంగ్ వాళ్ళని పట్టుకుని పువ్వుల్లో పెట్టి  మన దగ్గరకి పంపిస్తుంది చూస్తూ ఉండు." అని చెప్పాడు చింగ్ యా.

"ఇండియాలో ఎప్పటినుంచో బ్లాస్ట్ లు గొడవలు చేయాలి అనుకుంటున్నాము వాళ్ల ఇద్దరి వల్ల మా వాళ్ళు అందరూ బయటికి వస్తున్నారు ఇప్పుడు రెండు విధాల ఉపయోగపడుతుంది." అని నవ్వుతూ చెప్పాడు సయ్యద్.

"మీ ప్రయత్నాలు మీరు చేయండి అక్కడ దైవం ఎవరికో సహాయం చేస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీరుతారు, ఈ లోపు నా సైన్యాన్ని నిద్ర లేపుతాను." అని చెప్పి అక్కడి నుంచి జింగ్ ని తీసుకుని వెళ్ళాడు రేపాలా.

అంతలో తన దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "బషీర్! ఏమైంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిందా?" అని అడిగాడు సయ్యద్.

"బాయ్! లొకేషన్ తెలుసుకున్నాము ముష్రుతో కలిసి వెళుతున్నాను మనవాళ్ళందరూ ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్లేస్ ని చుట్టూ ముడుతున్నారు కాసేపట్లో ఇద్దరినీ హ్యాండ్ఓవర్ చేసుకుని నీకు కాల్ చేస్తాను." అని చెప్పాడు బషీర్.

"చాలా మంచి విషయం చెప్పావు నిన్ను అలా చల్లగా చూస్తాడు." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సయ్యద్.

ఫోన్ కట్ చేసి ముష్రు వైపు చూసి "ఫాస్ట్గా వేళ్ళు మన వాళ్ళందరూ ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నారు." అని చెప్పాడు బషీర్.

"ఓకే!" అని ఫాస్ట్ గా వెళుతూ  లోకేషన్ చూసి "వచ్చేసాము." అని స్లో చేసాడు ముష్రు.

కారు దిగి అక్కడ ఉన్న తన మనుషులని దగ్గరకు పిలిచి ట్యాబ్ ఓపెన్ చేసి ఇద్దరు లొకేషన్ చూపించి "రజాక్!నువ్వు ఫ్రంట్ డోర్ లో నుంచి లోపలకి వేళ్ళు, ఖాసీం నువ్వు లెఫ్ట్ లో నుంచి వేళ్ళు, షారుక్  నువ్వు రైట్ లో నుంచి వేళ్ళు, నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తాను.

నాకు తెలిసి వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ ఉంటాయి మనుషులు కుడా ఉంటారు కేర్ ఫుల్ గా ఉండండి ఎవరు చచ్చిన పర్వాలేదు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇద్దరు మాత్రం ప్రాణాలతో కావాలి." అని అక్కడ ఉన్న వాళ్ళకీ చూపించాడు బషీర్.

"సరే బాయ్!" అని తన వాళ్ళ వైపు చూసి "ఫ్రెంట్ డోర్ పగలగొట్టుకుని లోపలికి వెళ్ళండి." అని చెప్పాడు రజాక్.

"స్పీడ్ గా ఈ వర్క్ కంప్లీట్ చేయాలి మనం అందరం ఇక్కడ ఉన్నామని ఇంటిలిజెన్స్ వాళ్ళకి తెలిసింది అంటే మిలిటరీ ఎంటర్ అవుతుంది." అని చెప్పి కొంతమందిని తీసుకుని ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ కి వెళ్ళాడు బషీర్.

ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తున్న కొంత మందిని చూసి కాన్ఫరెన్స్ లో ఉన్న అందరికీ "అలర్ట్!" అని చెప్పి మొదటగా లోపలికి అడుగుపెట్టిన వాడిని షూట్ చేసింది సుహా.
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 11-05-2026, 07:11 AM



Users browsing this thread: 1 Guest(s)