Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#91
రుద్రం భజే! ఎపిసోడ్ 29



తన శక్తి ద్వారా జింగ్ ని సముద్రంలో నుంచి బయటకు తీసుకువచ్చి మీ మనుషులు ఆ వస్తువుని, యంగ్ ని తీసుకురాగలిగితే సరి లేకపోతే నా సైన్యాన్ని రంగంలోకి దింపుతాను అని చెప్పాడు రేపాలా.

**************

సముద్రం దగ్గర నుంచి గెస్ట్ హౌస్ కి వచ్చి "నా మనుషులందరికి మెసేజ్ ఫార్వర్డ్ చేశాను స్లిప్పర్స్ సెల్స్ కూడా యాక్టివేట్ అవుతారు ఆ ఇద్దరిని ఎలాగైనా పట్టుకుని మన దగ్గరికి తీసుకు వస్తారు." అని చెప్పాడు సయ్యద్.

"ఇండియన్ గవర్నమెంట్  మీద ప్రెజర్ తీసుకువస్తే ఇంకా ఈజీ అవుతుంది వాళ్లే పట్టుకుని ఆ ఇద్దరిని మనకి అప్ప చెపుతారు." అని చెప్పాడు కళింగ.

"నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మనం ల్యాబ్ కి వెళ్ళిన వెంటనే  ఇండియన్ అంబాసితో మాట్లాడతాను." అని చెప్పాడు చింగ్ యా.

"నేను త్వరగా పర్వతాలు దగ్గరికి వెళ్ళాలి వాళ్లకి సహాయం చేసే దైవ శక్తిని ఆపే ప్రయత్నం చేస్తాను." అని చెప్పాడు రేపాలా.

"సరే! హాఫ్ ఆన్ అవర్ లో స్టార్ట్ అవుదాము రెడీ అవ్వండి." అని చెప్పాడు చింగ్ యా.

అంతలో తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ఇండియా నుంచి కాల్ వచ్చింది." అని లిఫ్ట్ చేసి "బషీర్! మెసేజ్ అందింది కదా!

నీకు పంపిన ఫోటోలో ఉన్న ఇద్దరు మీకు చూపిస్తున్న  లొకేషన్ లో ఉంటారు వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి ఇండియాలో ముసుగులో ఉన్న మన మనుషులందరినీ పంపించండి.

అవసరమైతే మీకు ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి ముష్రు కలుస్తాడు మీకు హెల్ప్ గా ఉంటాడు." అని చెప్పాడు సయ్యద్.

"సరే బాయ్! మనవాళ్ళతో పాటు స్లీపర్ సేల్స్ ని కూడా యాక్టివేట్ చేస్తాను ఎలాగైనా ఇద్దరిని పట్టుకుని బోర్డర్ దాటి వస్తాను." అని చెప్పాడు బషీర్.

"శభాష్! ఇది మన ఇజ్జత్ కి సంబంధించిన విషయం మిస్ అవ్వకూడదు." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సయ్యద్.

************

బోర్డర్ వెళ్లే రూట్లో నుంచి కార్ లో హోటల్ రూమ్ కి చేరుకుని యోధాకి కాల్ చేసి "సార్! ఎవరెవరో కాల్ చేస్తున్నారు నన్ను కలవడానికి వస్తాను అంటున్నారు చాలా భయంగా ఉంది." అని చెప్పాడు ముష్రు.

"టెన్షన్ పడకు నీ దగ్గరికి ఎవరు వచ్చినా నేను సెండ్ చేసినా లొకేషన్ కి తీసుకురా.. నువ్వు భూపాల్ సింగ్ కారు మాత్రమే యూస్ చెయ్!" అని చెప్పాడు యోధ.

"ఓకే సార్! ప్రెసెంట్ నేను హోటల్ రూమ్ లోనే ఉన్నాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముష్రు.

నోయిడా లో ఉన్న ఒక పాత ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకుని "నాయక్ సర్ మానససరోవరం వెళ్లడానికి వన్ వీక్ వెయిట్ చేయమన్నారు, అప్పటివరకు మనం ఇక్కడే ఉంటాము ఇదే మన వార్ గ్రౌండ్!" అని చెప్పాడు యోధ.

"నాకు తెలిసి ఇక్కడికి అందరూ టెర్రరిస్టులే వస్తారు వాళ్ళని ఫేస్ చేయాలి అంటే  మనకి వెపన్స్ కావాలి." అని చెప్పింది నీతూ.

"మనకి కావాల్సిన వెపన్స్ తీసుకుని నా కొలీగ్స్ కాసేపట్లో ఇక్కడ ఉంటారు అందరికీ గన్ హ్యాండిల్ చేయడం వచ్చు కదా!" అని అడిగాడు యోధ.

"ఎస్! నాకు షూటింగ్ వచ్చు కాకపోతే నువ్వు షూట్ చేసిన అంత పర్ఫెక్ట్ గా షూట్ చేయలేను." అని చెప్పింది పూజా.

"అంత పర్ఫెక్ట్ గా షూట్ చేయడానికి ఇది ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామా వచ్చిన వాడికి బుల్లెట్ ఎక్కడ తగిలినా చాలు!" అని చెప్పాడు యోధ.

"నేను షూటింగ్లో పర్ఫెక్ట్!" అని చెప్పింది దీప్తి.

"మాకు ఎటువంటి వెపన్ అవసరం లేదు మా వాటాకి వచ్చినవి కూడా మీరే యూస్ చేసుకోండి." అని చెప్పాడు క్యూబ్స్.

"సార్" నాకు ఇంకొక పిస్టల్ ఇప్పించండి." అని తన దగ్గర ఉన్న పిస్టల్ చూపిస్తూ  "ఇది నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఇచ్చారు పేలుతుందో లేదో కూడా తెలీదు." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

"అవునా?" అని పిస్టల్ తీసుకుని చూస్తూ "దీని మూతి ఏంటి వంకర పోయింది ఇంటి దగ్గర కుంకుడు కాయలు కొట్టావా..?" అని అడిగాడు నంద.

"నేను డ్యూటీ చేసే ఏరియాలో బాదం చెట్లు ఎక్కువ ఆ కాయలు పగలగొట్టుకుని తినడానికి యూస్ చేశాను." అని సిగ్గుపడుతూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"అసలు వీడిని మన టీమ్ లో ఎందుకు జాయిన్ చేసావు?' అని నీతూ వైపు చూసాడు యోధ.

"ఈ టెన్షన్స్ కి బుర్ర హీట్ ఎక్కిపోతుంది కాస్త రిలాక్స్ గా ఉంటుందని గబ్బర్ సింగ్ ని టీమ్ లో యాడ్ చేశాను." అని చెప్పింది నీతూ.

"అంటే! నన్ను కాలక్షేపానికి పిలిపించుకున్నారా..! ఇంక నాతో అవసరం ఉంది అనుకున్నాను." అని విచిత్రంగా చూస్తూ

"సార్! ఇంతకీ భుపాల్ సింగ్ దగ్గర ఉన్న వస్తువు ఏంటి? దానికోసం రెండు దేశాల వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారు?" అని డౌట్ గా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"నువ్వు ఇప్పుడు మా టీమ్ లో మెంబర్ కాబట్టి ఆ విషయం నేను చెప్తాను, మేము ఆ వస్తువుతో నుంచి ఓపెన్ అయ్యినా  బ్లాక్ హోల్ లో  మధ్యాహ్నం కజకిస్తాన్ వెళ్లి యంగ్ ని తీసుకొని సాయంత్రం ఇక్కడకి వచ్చేసాము." అని చెప్పింది పూజా.

ఆ మాట విని వెటకారంగా చూస్తూ "ఓహో! మీకు నేనే దొరికేనా... వినేవాడు ఉంటే ఇంగ్లీషులో కూడా రామాయణం చెప్తారు." అని కోపంగా చూస్తూ వెళ్లి భూషణ్ పక్కన కూర్చున్నాడు గబ్బర్ సింగ్.

"నేను నిజం చెప్పిన నమ్మట్లేదు." అని యోధ వైపు చూసి "నాకు బాగా ఆకలిగా ఉంది." అని చెప్పింది పూజా.

"అవునా?" అని జేబులో నుంచి రెండు బాదం పప్పులు తీసి చేతిలో పెట్టి "ఈవి తిని మంచినీళ్లు తాగు ఎనర్జీ వస్తుంది." అని చెప్పాడు యోధ.

చేతిలో ఉన్న రెండు బాదంపప్పులు వైపు విచిత్రంగా చూస్తూ "ఏంటి? వీటిని తిని మంచినీళ్లు తాగి పడుకోవాలా..! స్పేస్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఇంతకన్నా ఎక్కువ పెడతారు." అని చెప్పింది పూజా.

"మేము టెర్రరిస్టులు పట్టుకోడానికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మాకు అదే ఫుడ్! కొన్నిసార్లు అది కూడా ఉండదు, అయినా ఏడవకులే వెపన్స్ తో పాటు ఫుడ్ కూడా వస్తుంది." అని చెప్పాడు యోధ.

"ఆ రెండు బాదం పప్పులు తిని ఊరుకుంది అంటే, దానికి వచ్చే కోపానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద పులి పిల్ల లాగా పడుతుంది." అని నవ్వుతూ చెప్పింది దీప్తి.

"అలా అయితే ఇంకేం మరి ఈ వారం రోజులు పూజకి ఆ ఫుడ్ పెడదాము మనం రిలాక్స్ గా ఉండొచ్చు!" అని చెప్పాడు క్యూబ్.

ఆ మాటకి కోపంగా చూస్తూ "షాపింగ్ కి వెళ్ళినప్పుడు నేను కొన్న వాటికీ డబ్బులు ఇచ్చావు కాబట్టి ఏమీ మాట్లాడలేదు." అని చెప్పింది పూజా.

"నేను డబ్బులు ఊరికే ఇవ్వను అప్పు మాత్రమే ఇస్తాను తర్వాత వసూలు చేస్తాను." అని చెప్పి క్యూబ్.

"అవును! మా క్యూబ్స్ ఒక్కసారి ఇచ్చాడంటే జీవితకాలం వసూలు చేస్తూనే ఉంటాడు." అని చెప్పాడు భూషణ్.

"సార్! మీ ముగ్గురికి వెపన్స్ అవసరం లేదు అన్నారు మరి ఎవరైనా వస్తే ఎలా ఫేస్ చేస్తారు?" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"మా ముగ్గురికి సెక్యూరిటీ నువ్వు ఉన్నావు కదా!" అని నవ్వుతూ చెప్పాడు నంద.

"ఆ యంగ్ గాడి బాడీలో ఉన్న చిప్ ని అరటి పండులో పెట్టుకుని మరీ తిన్నావు, ఎవరు వచ్చినా ఫస్ట్ నీ దగ్గరికి వస్తారు. నేను నీకు సెక్యూరిటీ ఏమిటి!" అని ఏడుపు మొహం పెట్టాడు గబ్బర్ సింగ్.

అంతలో అక్కడికి కారు రావడం చూసి "నా కొలీగ్స్ వచ్చారు." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని "ముందు నా పిస్టల్ తీసుకోవాలి." అని కార్ దగ్గరికి వెళ్లి దిగిన ముగ్గురు వైపు తల పైకెత్తి చూస్తూ "వీళ్లు కూడా ఈ ఇంత ఉన్నారేమిటి" అందరికీ నేను ఆటలో అరటిపండు అయిపోతానేమో!" అనుకున్నడు గబ్బర్ సింగ్.

కారు దిగి గబ్బర్ సింగ్ చేతిలో కీస్ పెట్టి "డిక్కిలో వెపన్స్ ఉన్నాయి లోపలికి తీసుకురా..!" అని చెప్పి యోధ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు ముగ్గురు.

ముగ్గురిని నీతూ వాళ్ళకి పరిచయం చేస్తూ "రాఖి, వర్ధన్, సుహా! ఈ మిషన్ కంప్లీట్ అయ్యేవరకు మనతోపాటే ఉంటారు." అని చెప్పాడు యోధ.

పుష్కర్, ఏకవీరతో కలిసి డిక్కీలో ఉన్న బాక్స్ లు మొత్తం తీసుకు వస్తున్న గబ్బర్ సింగ్ వైపు చూసి "గుడ్! అక్కడ పెట్టండి." అని చెప్పి ఫ్యాక్టరీ చుట్టూ చూస్తూ

"ఈ ఫ్యాక్టరీ చుట్టూ కెమెరాస్ ఫిట్ చేస్తాను లోపలికి ఎవరు వచ్చినా మనకి తెలుస్తుంది వెంటనే వాడి ఫేస్ కూడా రికగ్నైజ్ అవుతుంది." అని చెప్పింది సుహా.

"ఓకే! నీకు మా ముగ్గురి అసిస్టెంట్స్ హెల్ప్ చేస్తారు." అని గబ్బర్ సింగ్ వాళ్ళ వైపు చూపించింది నీతూ.

భూషణ్ వాళ్ళ వైపు డౌట్ గా చూస్తూ "ఆ ముగ్గురు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళ లాగా లేరు." అని అడిగాడు రాఖి.

"RAW ఏజెంట్స్! వాళ్లకి ఈ మిషన్ గురించి ప్రతి విషయం తెలుసు నాయక్ సర్ పంపించారు." అని చెప్పాడు యోధ.

బాక్స్ లో నుంచి పిస్టల్ తీసి సంతోషంగా చూస్తూ "మేడం! నేను దీనిని ఉంచుకుంటాను చాలా బాగుంది." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

"అది చూడడానికి చిన్న పిస్టల్ లానే కనపడుతుంది కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. నీ భుజం లో బలం లేకపోతే షూట్ చేసిన వెంటనే నీకు చెయ్యి వెళ్లి కిలోమీటర్ దూరంలో పడుతుంది." అని చెప్పింది సుహా.

"మేడమ్! అలా అయితే నా చెయ్యి నా దగ్గర ఉండే ఫిస్టల్ ఇవ్వండి. అయ్యినా నేను మీ వెనకాల ఉంటే ఎవరికి  కనపడను." అని చేతిలో ఉన్న పిస్టల్ నెమ్మదిగా బాక్స్ లో పెట్టాడు గబ్బర్ సింగ్.

మెయిన్ గేట్ వైపు చూస్తూ  "ఎవరు రావడం లేదేమిటి! వార్ మూడ్ లోకి వచ్చి ఖాళీగా ఉండాలి అంటే ఇరిటేషన్ గా ఉంటుంది." అని చెప్పాడు వర్ధన్.

"వెయిట్ అండ్ సీ! ఉదయనికి ఇక్కడ దీపావళి స్టార్ట్ అవుతుంది." అని చెప్పి బాక్స్ లో నుంచి ఫుడ్ పాకెట్స్ తీసి దీప్తి, పూజా లకి ఇచ్చాడు యోధ......
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 10-05-2026, 07:17 AM



Users browsing this thread: 1 Guest(s)