10-05-2026, 07:12 AM
Part - 138
సింహ ఫ్యామిలీలో పెళ్లి హడావిడి జరుగుతూ ఉండగానే భవ్య, గౌతమ్ పెళ్లి డేట్ కూడా వచ్చేస్తుంది.
గౌతమ్ ని పెళ్లికొడుకుగా రెడీ చేస్తారు. సూర్య అది చూసి సూపర్ ఉన్నావు..మంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు. సూర్యని హత్తుకుని ఎమోషనల్ అవుతాడు.
నా తప్పు నీ క్షమించి నన్ను నీ స్నేహితుడిగా చేసుకున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. ఆ మాటకి సూర్య కూడా బుజం పైన చేయి వేసి..
నీ తప్పు నువ్వు తెలుసుకుని రియలైజ్ అయ్యావు. కాబట్టే నా పక్కన ఉండే అవకాశం ఇచ్చాను. లేకపోతే హిమలాగానే ఉండేది కదా..
ఇప్పుడు జరిగిపోయిన విషయాలు గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నీ ముందు ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచించు.
భవ్య కంటతడి పెట్టకుండ చూసుకో. అదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఎందుకంటే వాళ్లు నాన్నగారికి నీ విషయంలో స్ట్రాంగ్ గా నిలబడి హామీ ఇచ్చాను. తప్పకుండా భవ్య నా ప్రాణం. నీ స్నేహం నా ఊపిరి.
ఇక మరో గదిలో…
భవ్యకి పసుపు రంగు కాన్జీవరం చీర కట్టిస్తున్నారు.
చందు, విశిష్ట, సౌమ్య ముగ్గురూ ఆమె చుట్టూ తిరుగుతూ సెటప్ చెక్ చేస్తున్నారు.
చందు.. నీ జడ డిజైన్ నా బ్రాండ్ స్టాండర్డ్ కి తగ్గట్టే ఉంది అంటుంది.
సౌమ్య నవ్వుతూ.. డాక్టర్ అప్రూవ్ చేసింది అంటే పర్ఫెక్ట్.
విశిష్ట మెల్లగా భవ్య చెవిలో... ఇవాళ నువ్వు కేవలం పెళ్లికూతురు కాదు… మన ఫ్యామిలీకి లక్కీ చార్మ్.
భవ్య నవ్వుతూ... నేను ఏడవను. హామీ.
బ్యాండ్ బాజాలతో గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు.
వైభవ్ డ్యాన్స్ మొదలు పెడితే… శ్రీకర్ కూడా జాయిన్ అవుతాడు.
సూర్య మాత్రం మధ్యలో స్టెప్స్ వేసి అందరినీ షాక్ చేస్తాడు.
లలిత నవ్వుతూ మన ఇంటి అబ్బాయిలు ఇలా డ్యాన్స్ చేస్తారని ఊహించలేదు.
స్టేజ్ మీద భవ్య.. గౌతమ్ ఎదురెదురుగా నిలబడతారు.
వైభవ్, శ్రీకర్ ఇద్దరూ గౌతమ్ ని పైకి లేపేస్తారు.
చందు, విశిష్ట భవ్యకి సపోర్ట్ చేస్తారు.
ఇది ఫేర్ కాదు అంటుంది భవ్య నవ్వుతూ.
చివరికి గౌతమ్ వంగి.... ఇప్పటినుంచి ఎప్పుడూ నీకు ఈజీ చేస్తా అంటాడు. మాలలు మార్చుకుంటారు.
పూల వర్షం.
అది చూసిన భవ్య తల్లిదండ్రులకి కూడా ధైర్యంగా అనిపిస్తుంది. సూర్య వైపు చూసి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
పండితుల మంత్రాల మధ్య… గౌతమ్ తాళి కట్టే సమయం. సూర్య వెనుక నిలబడి అతని భుజం మీద చేయి ఉంచుతాడు.
ఒక సైలెంట్ సపోర్ట్.
తాళి కట్టగానే… మంగళవాయిద్యాల గోల, చప్పట్లు, హర్షధ్వానాలు. భవ్య నవ్వుతూనే గౌతమ్ వైపు చూస్తుంది. ఎక్కడా కన్నీళ్లు లేవు.
కేవలం ఆనందం మాత్రమే.
సాయంత్రం రిసెప్షన్‌లో డీజే నైట్.
చందు, వైభవ్ కపుల్ డ్యాన్స్.
సౌమ్య, శ్రీకర్ క్లాసిక్ స్టెప్స్.
విశిష్ట, సూర్య స్లో రొమాంటిక్ మ్యూజిక్ కి డ్యాన్స్ చేస్తుంటే… అందరూ వాళ్లని చూస్తూ హర్షిస్తారు.
గౌతమ్, భవ్య స్టేజ్ మీద కూర్చుని అందరినీ చూస్తూ…
ఇంత ప్రేమ మధ్య పెళ్లి కావడం నా అదృష్టం అంటాడు గౌతమ్.
భవ్య... గౌతమ్ చెయ్యి పట్టుకుని.. ఇది మొదలు మాత్రమే.
పెళ్లి వేడుక ముగిసేసరికి… సింహ ఫ్యామిలీ ఒకచోట చేరి గ్రూప్ ఫోటో దిగుతుంది.
వినయ్ గర్వంగా... మన ఇంటి బంధాలు ఇలా బలంగా ఉండాలి.
లలిత తల ఊపుతూ ఇది నిజంగా శుభ సమయం.
సూర్య గౌతమ్ వైపు చూసి నవ్వుతాడు.
అది కేవలం స్నేహితుడి నవ్వు కాదు…
ఒక కొత్త కుటుంబ సభ్యుడిని గర్వంగా అంగీకరించిన నవ్వు.
విక్రమ్ అవనీ భుజం మీద చెయ్యి వేసి.. ఏమిటి భార్యామణి గారు సంతోషంతో కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉన్నట్టు ఉన్నాయి. అవునండి మన కుటుంబం మొత్తం సంతోషంగా ఉండడం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది.
మన సూర్య కూడా మీలాగానే సైలెంట్ గా ఉంటాడు. ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంతా ఇస్తాడు. కానీ ముందుకు రాడు. బ్యాక్ బోన్ లాగా నిలబడి కుటుంబాన్ని నిలబెడుతున్నాడు.
ఉదయం సూర్య కిరణాలు కిటికీ గుండా లోపలికి వస్తుంటాయి.. కొత్త ఇంటి హాల్‌లో ఇంకా పూల సువాసన, కొత్త ఫర్నిచర్ వాసన కలిసిపోతాయి.
భవ్య చేతిలో పాలు గ్లాస్ తీసుకుని లోపలికి వస్తుంది.
గౌతమ్ ఇంకా సోఫాలో కూర్చుని హాల్ చుట్టూ చూస్తుంటాడు.
ఏమిటి ఇంత సీరియస్‌గా?.అంటుంది భవ్య.
గౌతమ్ నవ్వుతూ..... ఇది నిజంగా మన ఇల్లు అనిపిస్తోంది.
నిన్నటి వరకూ నేను ఒంటరిగా ప్లాన్ చేసుకున్న ఫ్యూచర్…
ఇప్పుడది మనిద్దరి ఫ్యూచర్. భవ్య టేబుల్ మీద చిన్న గణపతి విగ్రహం పెట్టి దీపం వెలిగిస్తుంది.
ఇక్కడ నుంచి మన స్టార్ట్ పాజిటివ్ గా ఉండాలి.
గౌతమ్ ఆమె దగ్గరకు వచ్చి... నీ నవ్వు ఈ ఇంటి లైటింగ్ కంటే బ్రైట్‌గా ఉంది అంటాడు.
భవ్య నవ్వుతూ... ఇలా పొగడ్తలు చెప్పి బ్రేక్‌ఫాస్ట్ తప్పించుకోలేవు...ఇద్దరూ కలిసి కిచెన్‌లో మొదటి కాఫీ తయారు చేస్తారు.
చిన్నగా చిందులు పడినా… ఇద్దరూ నవ్వుకుంటారు.
అది ఒక పర్ఫెక్ట్ స్టార్ట్.
ఇంతలో సింహ మాన్షన్‌లో…
లలిత, మాధవి పెద్ద హాల్ మధ్యలో డెకరేషన్ శాంపిల్స్ చూసుకుంటు ఉంటారు.
చందు... నివి భుజం చుట్టూ చెయ్యి వేసి.. నా మెహందీ ఫంక్షన్ ఓపెన్ లాన్‌లో ఉండాలి. ఫెయిరీ లైట్స్, ఫ్లోరల్ జార్స్.
వైభవ్.. చందు చెప్పిన దానికి చూస్తూ.. సరే… కానీ డీజే వాల్యూమ్ కంట్రోల్ నా దగ్గర ఉంటుంది.
పూజిత కొడుకు తల మీద ఒకటి వేసి మెహేందిలో మీ మగవాళ్ళ గొడవ ఏమిటి. ఆ మాటకి చందు నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది.
అమ్మ నాకు ఇంకా పెళ్లి అవుతుంది. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే కొడతావా.. నీ పిల్లలకు పెళ్లి అవుతున్న నా చేతిలో దెబ్బలు ఇలాగే తింటావు.
సౌమ్య మాత్రం క్యాలెండర్ చూస్తూ... ముహూర్తం టైమ్ కి ముందు హాస్పిటల్ షిఫ్ట్ క్లియర్ చేసుకోవాలి.
శ్రీకర్ వెంటనే నీ షెడ్యూల్ కి పెళ్లి షెడ్యూల్ అడ్జస్ట్ అవుతుంది.
విశిష్ట సైలెంట్‌గా కార్డ్ డిజైన్ చూసి... ఇది చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంది.
సూర్య మెల్లగా ఆమె దగ్గరకి వచ్చి.. నీకు నచ్చిందే ఫైనల్.
సాయంత్రం భవ్య, గౌతమ్ కొత్త ఇంటి నుంచి సింహ మాన్షన్‌కి వస్తారు. అందరూ చప్పట్లతో వెల్‌కమ్ చెబుతారు.
చందు సరదాగా... మరి కొత్త కపుల్ సలహా ఏమిటి?
భవ్య నవ్వుతూ... ఒక్కటే. ఒకరిని ఒకరు వినాలి. మిగతా వన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి.
గౌతమ్ సూర్య వైపు చూసి చిన్నగా తల ఊపుతాడు.
అది థాంక్స్ చెప్పినట్టు.
రాత్రి అందరూ ఒకచోట కూర్చుని పెళ్లి ప్లాన్స్ మాట్లాడుకుంటుంటారు.
వినయ్.. ఈసారి మూడు పెళ్లిళ్లు ఇంకా గ్రాండ్‌గా జరగాలి.
విద్యా వెంటనే.. కానీ ఒత్తిడి లేకుండా. భరత్ భార్య చెయ్యి పట్టుకుని.. మన ఇంట్లో టెన్షన్ ఉండదు. కేవలం ప్లానింగ్ మాత్రమే ఉంటుంది.
అందరూ నవ్వుతారు.
భవ్య గమనిస్తుంది. ఇది కేవలం కుటుంబం కాదు…
ఇది ఒక టీమ్.
పెళ్లి పనులు మొదలు అయ్యాయి....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)