10-05-2026, 07:09 AM
Part - 136
సింహ మాన్షన్ ఆ రోజు ఉదయం చాలా త్వరగా లేచింది.
సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందే… ఇంటి ముందు తోరణాలు కట్టే వాళ్లు, పూల సువాసనలు, మంగళవాయిద్యాల స్వరాలు కలిసిపోతాయి.
లలిత తెల్లవారుజామునే లేచి దీపం వెలిగిస్తుంది.
ఆమె కళ్లలో ఆనందం… హృదయంలో కృతజ్ఞత.
ఇంత సంతోషం ఒకేసారి వస్తుందని అనుకోలేదే భగవంతుడా….అని మౌనంగా ప్రార్థిస్తుంది.
మూడు గదుల్లో మూడు భావాలు…
విశి కిటికీ దగ్గర నిలబడి ఉదయాన్ని చూస్తుంది.
బయట శుభకార్యాల సందడి… లోపల ఆమె హార్ట్ మాత్రం వేగంగా కొడుతోంది.
అద్దం ముందు కూర్చుని రెడీ అవుతుంటే... అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోతుంది. ఇది నేనేనా.. ఇంతటి అదృష్టం నా జీవితంలోకి వచ్చిందా.
నాన్న చూస్తున్నారు కదా అని ఎమోషనల్ అవుతుంది. భానుమతి అది చూసి ఈరోజు నీకు చాలా ముఖ్యమైన రోజు ఇలా కంటి నీరు పెట్టుకోకూడదు అని ఆ కళ్ళు తుడిస్తే అమ్మ ఇదంతా నాన్నగారు చూస్తూ ఉంటారు కదా తప్పకుండా...
ఆ మాటతో విశి కళ్లలో ధైర్యం పెరుగుతుంది.
చందు మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ మోడ్ లో ఉంటుంది.
మేకప్ ఆర్టిస్ట్‌తో మాట్లాడుతూ కూడా తన బ్రాండ్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది.
ఈ లెహంగా కూడా నా కాన్సెప్ట్ లైన్ లో భాగమే తెలుసా? అని చెప్పగానే అందరూ నవ్వుతారు.
వైభవ్ కి వీడియో కాల్ చేస్తూ,
లేట్ అవ్వకు… నీ ఎంట్రీ కూడా గ్రాండ్ ఉండాలి అంటుంది.
సౌమ్య మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.
ఆమె చేతుల్లో చిన్న పుస్తకం –...నిన్న రాత్రి చదివిన మెడికల్ నోట్స్.
భరత్ వచ్చి చూసి ఏమిట్రా ఈరోజు కూడా చదువుతున్నావా.. కొంచెం ఇంపార్టెంట్ నోట్స్ నాన్న. ఒక పేషెంట్ కి సంబంధించినది చదువుతున్నాను కానీ ఈరోజు నీకు నిశ్చితార్థం. గుర్తుంది నాన్న అని చిన్నగా నవ్వుతుంది.
సూర్య, వైభవ్, శ్రీకర్ ముగ్గురు ఒకే గదిలో రెడీ అవుతున్నారు.
సూర్య అద్దంలో తనని చూసుకుని లోతుగా ఊపిరి తీసుకుంటాడు.
ఇది కేవలం నిశ్చితార్థం కాదు… నా లైఫ్ కి కమిట్‌మెంట్.
వైభవ్ సరదాగా, నిన్ను ఇంత సీరియస్‌గా చూడటం ఇదే మొదటిసారి అంటాడు.
శ్రీకర్ వెంటనే నువ్వు మాత్రం ఇదే కామెడీ మెయింటైన్ చెయ్. లేకపోతే చందు పెట్టే రూల్స్ కి బేర్ మన్నావు అనుకో అందరికీ తెలిసిపోతుంది.
చందు నాకేం పెట్టింది. ఆహా నేను చూడలేదా.. వీడియో కాల్ చేసి మరి నువ్వు ఎలా రావాలో కూడా చెబుతుంటే...
వెంటనే వినయ్.. ఇప్పుడు నుంచే నా కొడుకు అలవాటు పడుతున్నాడు మధ్యలో నీకేంటి రా నొప్పి. నాన్న అంటే... తప్పదురా కన్నా రెడీ అవ్వండి.
శ్రీకర్ మెల్లగా మన మాటలు ఈ రోజు నుంచి హామీలవుతాయి అంటాడు.
ముగ్గురూ ఒకరినొకరు చూసుకుని మౌనంగా నవ్వుతారు.
స్టేజ్ మీద మూడు అందమైన కుర్చీలు.
గోల్డ్, వైట్ థీమ్ మధ్యలో పూల వర్షం లాంటి డెకరేషన్.
అతిథులు ఒక్కొక్కరుగా రావడం మొదలవుతుంది.
పెద్దవాళ్లు ముహూర్తం టైమ్ చెక్ చేస్తూ ఉంటారు.
లలిత, కళ్యాణ్.. మాధవి, రమేష్... పార్ధు, కరుణ... స్టేజ్ నందు ఉన్న సోఫాలో కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ చిరునవ్వుతో విష్ చేస్తూ ఉంటారు.
విశిష్ట స్టేజ్ వెనుక నిలబడి ఉంటుంది. సూర్య ఆమె వైపు చూస్తాడు. ఇద్దరి కళ్లలో మాటలు లేకుండా ఒకే భావం..
ఇక మనం ఒకరికొకరం. మంగళవాయిద్యాల శబ్దం పెరుగుతుంది.
పెద్దవాళ్లు పిలుస్తారు…
మూడు జంటలు స్టేజ్ పైకి రండి.
విక్రమ్ అవని... సూర్యని తీసుకువస్తారు.
వినయ్ పూజిత... వైభవ్ ని తీసుకువస్తారు.
శ్రీ,, నేహా.. ఒక పక్కన శ్రీకర్ ని, మరొక పక్కన విశిష్ట ని తీసుకుని స్టేజ్ మీదకి వస్తారు.
భరత్ విద్య... సౌమ్య ని తీసుకునివస్తారు.
రాజ్ నివేదిత... చంద్రికని తీసుకునివస్తారు.
భవ్య గౌతమ్ ఫంక్షన్ దగ్గర అన్ని చక్కబెడుతూ ఉంటారు.
మూడు జంటల్ని అలా చూసి భానుమతి కూడా ఆనందపడుతుంది లలిత పిలిచి నువ్వు స్టేజి మీదకి వెళ్ళు అంటే వద్దు పిన్ని గారు నేను ఇక్కడే ఉంటాను అని పక్కనే కూర్చుంటుంది
ఆ ఉదయం…
మూడు ప్రేమ కథలు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు పెడతాయి.
జంటలను కూర్చోబెట్టండి అంటే మూడు జంటల్ని కూర్చోబెట్టి ముందు విఘ్నేశ్వరుడి పూజ చేయిపిస్తారు.
విఘ్నేశ్వరుడి పూజ పూర్తయ్యాక పండితుల మంత్రోచ్ఛారణలతో వాతావరణం మరింత పవిత్రంగా మారుతుంది.
అక్షింతలు చేతుల్లో పట్టుకుని పెద్దవాళ్లు ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తారు.
మొదటగా విక్రమ్ – అవని, వినయ్ – పూజిత కలిసి మూడు జంటల చేతుల్లో తాంబూలాలు ఇస్తారు.
పెద్దల చేతుల్లోంచి ఆశీర్వాదం అందుకుంటూ ముగ్గురు అబ్బాయిల కళ్లలో ఒకే భావం...
ఇప్పటి నుంచి బాధ్యత మొదలైంది.
ముహూర్తం సమయం దగ్గరపడుతుంటే మంగళవాయిద్యాల శబ్దం ఒక్కసారిగా పెరుగుతుంది.
మొదటగా సూర్య ... విశిష్ట.
సూర్య చేతుల్లో చిన్న వెల్వెట్ బాక్స్.
విశిష్ట చేతులు కొద్దిగా వణుకుతుంటే… సూర్య మెల్లగా ఆమె చేతిని పట్టుకుని,
ఇక నీకు భయం ఉండకూడదు… అని కళ్లతోనే చెప్పేస్తాడు.
రింగ్ వేస్తూనే చప్పట్ల వర్షం.
పూల వర్షం.
లలిత కళ్లలో ఆనంద బాష్పాలు.
భానుమతి తల పైకి ఎత్తి, చూస్తున్నారా… మీ అమ్మాయి సంతోషంగా ఉంది అని మౌనంగా అంటుంది.
తర్వాత వైభవ్... చంద్రిక.
చందు రింగ్ పెట్టే ముందు, లేట్ అవ్వకు అన్నాను కదా… కానీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది అని చెవిలో గుసగుసగా చెబుతుంది.
వైభవ్ నవ్వుకుంటూ, ఇప్పటి నుంచి నీ షెడ్యూల్ కి నేనూ అడ్జస్ట్ అవుతా మేడమ్ అంటాడు.
రాజ్ గుండెల మీద చెయ్యి వేసుకుని వీడు కూడా నా ఖాతాలోకి వచ్చేసాడు.. నాకు ఇంకా ఏ టెన్షన్ లేదు. ఆ మాటకి అందరూ నవ్వుతారు.
మూడోగా శ్రీకర్... సౌమ్య.
సౌమ్య ప్రశాంతంగా రింగ్ తీసుకుంటే, శ్రీకర్ మెల్లగా,
నువ్వు చదువు ఆపకూడదు… నీ కలలకి నేనే ఫస్ట్ సపోర్ట్ అంటాడు.
సౌమ్య కళ్లలో గౌరవం, ప్రేమ కలిసిన వెలుగు.
రింగ్స్ అయిపోయాక చిన్నపిల్లలు స్టేజ్ మీదకి పరుగెత్తుకుంటూ వస్తారు.
భవ్య, గౌతమ్ వాళ్లను కంట్రోల్ చేయాలని చూస్తే…
వినయ్ నవ్వుతూ వాళ్లు కూడా సెలబ్రేట్ చేయనివ్వు అంటాడు.
ఫోటోగ్రాఫర్ పెద్దగా, స్మైల్ ప్లీజ్… ఒక గ్రూప్ ఫోటో..
అంటే వైభవ్, మనం సీరియస్ గా నిలబడితేనే ఫన్నీగా కనిపిస్తాం అంటాడు.
శ్రీకర్ వెంటనే, అవును… మా వైభవ్ గారు కామెడీ లేకపోతే ఫంక్షన్ కంప్లీట్ కాదు అంటాడు.
మాధవి, రమేష్ స్పెషల్ గా ఆర్డర్ చేసిన పెద్ద కేక్ స్టేజ్ మీదకి తీసుకొస్తారు. మూడు జంటలు కలిసి కట్ చేయాలి అంటారు.
మూడు జంటలు ఒకేసారి కట్ చేస్తే… మళ్ళీ చప్పట్లు, హర్షధ్వానాలు.
చందు తన బ్రాండ్ లో డిజైన్ చేసిన చిన్న గిఫ్ట్ హ్యాంపర్లు అతిథులకు ఇస్తుంది.
ఇది నా ఫస్ట్ ఆఫిషియల్ కలెక్షన్ అంటుంది గర్వంగా.
వైభవ్ చూస్తూ ఇక నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను కదా? అంటాడు.
సూర్య పక్కన నిలబడి ఉన్న విశిష్ట వైపు చూసి, ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్యామిలీ మాత్రమే కాదు… నా స్ట్రెంగ్త్ అంటాడు.
విశిష్ట మెల్లగా మనం ఇద్దరం ఒకరికి ఒకరం స్ట్రెంగ్త్ అంటుంది.
లలిత, కళ్యాణ్…
మాధవి, రమేష్...
వాసు, కరుణ...
విక్రమ్, అవని...
భానుమతి…
శ్రీ, నేహా...
విద్య, భరత్…
రాజ్, నివేదిత…
అందరూ ఒకే భావంతో చూస్తుంటారు.
మన పిల్లలు మనకన్నా మెచ్యూర్ గా ఉన్నారు అని వినయ్ అంటాడు.
భానుమతి లలిత చేతిని పట్టుకుని, ఇది నిజంగా శుభదినం అంటుంది.
సూర్యాస్తమయం కాకముందే,
మూడు జంటలు కుటుంబాల మధ్య కూర్చుని నవ్వులు పంచుకుంటుంటారు.
మంగళవాయిద్యాల స్వరం మెల్లగా తగ్గిపోతుంది…
కానీ ఆ రోజు నవ్వులు, ఆశలు, హామీలు మాత్రం
ప్రతి ఒక్కరి హృదయంలో ఘనంగా నిలిచిపోతాయి.
ఆ నిశ్చితార్థం కేవలం ఉంగరాల మార్పిడి కాదు…
మూడు ప్రేమ కథలు అధికారికంగా ఒకే కుటుంబంగా మారిన రోజు.......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)