09-05-2026, 03:26 AM
Part - 133
సాయంత్రం సూర్యాస్తమయం.. చిన్న హిల్ టాప్ మీద సూర్య, విశిష్ట నిశ్శబ్దంగా కూర్చున్నారు.
గాలి మెల్లగా వీచుతోంది.
విశిష్ట చేతిలో టీ కప్పు. సూర్య ఆకాశాన్ని చూస్తూ…
ఎంత తుపాను వచ్చినా… చివరికి ప్రశాంతత వస్తుందా? అని అడుగుతాడు.
విశిష్ట చిరునవ్వు. ప్రశాంతత బయట నుంచి రాదు దేవా సార్ … మనలో నుంచి రావాలి.
వారి జీవితం ఇప్పుడు…
గౌతమ్ బిజినెస్ మెల్లగా స్టేబుల్ అయింది.
ఈసారి అతను అహంకారం కాదు… విలువ నేర్చుకున్నాడు.
హిమ కేసు ముగిసింది. ఆమె పేరు ఇప్పుడు వార్తల్లో లేదు.
సూర్య తన సోషల్ వర్క్‌ను మళ్లీ మొదలుపెట్టాడు.
విశిష్ట తన ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తోంది.
కాని ఈసారి ఇద్దరూ ఒక్కరికొకరు దూరంగా కాదు…
పక్కపక్కనే.
విశిష్ట ఒక చిన్న పేపర్ తీసి సూర్యకి ఇస్తుంది.
ఇది ఏమిటి? అని అడుగుతాడు.
మన కొత్త ఆరంభం.
సూర్య చూస్తాడు.. ఒక చిన్న ట్రస్ట్ పేరు రాసి ఉంది.
అందులో ట్యాగ్ లైన్... నమ్మకం… ప్రేమ కంటే గొప్పది.
సూర్య కళ్లలో తడి...
ఇంతగా నన్ను నమ్ముతున్నావా? అని నవ్వుతూ అడుగుతాడు.
విశిష్ట అతని వైపు చూసి మెల్లగా చెబుతుంది.. నిన్ను కాదు… మనల్ని.
సూర్య చేతిని ముందుకు చాపుతాడు. ఇకపై సమస్యలు వచ్చినా… మనిద్దరం ఒకే టీమ్ కదా?
విశిష్ట అతని చెయ్యి పట్టుకుంటుంది.
ఇప్పుడే కాదు… ఎప్పటికీ. ఆమె కళ్లలో ఇప్పుడు భయం లేదు. అనుమానం లేదు.
పూర్తి నమ్మకం.
సూర్యాస్తమయం ముగుస్తోంది. చీకటి పడుతోంది. కాని వాళ్లిద్దరి మధ్య వెలుగు ఉంది.
సూర్య మెల్లగా చెబుతాడు.. హిమ మనకు ఒక విషయం నేర్పింది.
ఏమిటి? అని విశిష్ట అడుగుతుంది.
ప్రేమను కాపాడుకోవడం అంటే పోరాడడం కాదు…
అర్థం చేసుకోవడం.
విశిష్ట తల అతని భుజంపై ఆనిస్తుంది. చంద్రుడు చిన్నగా మొదలై పెద్దగా మారతాడు.. వారి బంధం లాగానే
ముగింపు కాదు…
మనసులు ఒకరికొకరు తోడుగా ఉంటే
ప్రతి రోజు కొత్త ప్రారంభమే.
ఒకరోజు ఆఫీసులో విశి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. సూర్య వచ్చింది కూడా పట్టించుకోదు. ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుని ఏమైంది క్యూటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.
మీరు ఎప్పుడు వచ్చారు దేవా సార్. నేను ఎప్పుడు వస్తే ఏమైంది లే.. దేని గురించి ఆలోచిస్తున్నావు. గౌతమ్ గురించి. గౌతమ్ గురించి ఇప్పుడు అంత స్పెషల్ గా ఏముంది.
చెబితే మీరు కోప్పడరు కదా. నీ మీద నేను ఎప్పుడైనా కోపం చూపించానా.. లేదనుకో బట్ ఇది ఎలా తీసుకుంటారో అర్థం కాక ఆలోచిస్తున్నావు.
ముందు నువ్వు బయటికి చెప్పు. అప్పుడు నేను అది ఎంతవరకు అర్థమయ్యే విషయమో తెలుసుకుంటాను.
గౌతమ్ లో చాలా మార్పు వచ్చింది కదా.. విలువలతో బిజినెస్ చేసుకుంటున్నాడు కదా. అవును గౌతమ్ కి భవ్యకి జంట కలిపితే ఎలా ఉంటుంది.
సూర్య సీరియస్గా చూస్తాడు. అదిగో మీరు అలా చూస్తారని నేను చెప్పను అన్నాను..నీకు అన్నీ ఇలాంటి వెరైటీ ఐడియాస్ ఎలా వస్తాయి క్యూటి.
ఇప్పుడు మీకు నచ్చిందా నచ్చలేదా... చాలా బాగుంది. భవ్యకి కూడా దూరంగా వెళ్లడానికి ఇష్టం లేదు. వీళ్ళిద్దరికీ జంట చేస్తే బాగానే ఉంటుంది.
ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది.. ఏముంది. గౌతమ్ ఒకసారి జైలుకి వెళ్లి వచ్చాడు. ఆ విషయాన్ని అంకుల్ వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియడం లేదు. నేను మాట్లాడతాను.
ముందు గౌతమ్ తో మాట్లాడతాను. గౌతమ్ భవ్య విషయంలో ఎలా ఫీలవుతున్నాడో తెలిస్తే అప్పుడు మనిద్దరం వెళ్లి భవ్య పేరెంట్స్ తో మాట్లాడదాము. ఏమంటావు క్యూటి. మీరు ఎలా చెబితే అలా దేవా సార్.
సూర్య గౌతమ్‌కి కాల్ చేస్తాడు...ఫ్రీగా ఉన్నావా? కాఫీకి బయటకి వస్తావా?
గౌతమ్ నవ్వుతూ... ఇంత సీరియస్ టోన్‌లో అడిగితే భయంగా ఉంది. వస్తాను.
గౌతమ్ ముందే వచ్చి కూర్చుంటాడు..సూర్య ఎదురుగా కూర్చుంటాడు. ఏమైంది సూర్య ? మళ్లీ ఏదైనా సోషల్ రీఫార్మ్ ప్లాన్ చేస్తున్నావా? అని సరదాగా అడుగుతాడు.
సూర్య నేరుగా విషయానికి వస్తాడు.భవ్య గురించి ఏమనుకుంటున్నావు? గౌతమ్ ఒక్కసారిగా సైలెంట్ అవుతాడు.
ఎందుకు ఒక్కసారిగా ఆ ప్రశ్న? సింపుల్. మీ ఇద్దరికీ జంట బాగుంటుంది అని మా ఒపీనియన్ కానీ నీ నిర్ణయం తెలుసుకోకుండా ముందుకే అడిగేయలేమ కదా..
గౌతమ్ లోతుగా ఊపిరి పీల్చుకుంటాడు. నాకు ఆమెంటే గౌరవం ఉంది. ఆమె నన్ను నా పాస్ట్‌తో కాదు… నా ప్రెజెంట్‌తో చూస్తుంది. కాని నా జైలు విషయాన్ని వాళ్లు అంగీకరిస్తారా?
సూర్య చిన్నగా నవ్వుతాడు. నీ గతం శిక్ష పడింది.
ఇప్పుడు నీ జీవితం విలువలు నేర్చుకుంది. ఇది ఎవరికైనా చెప్పడానికి నాకు గర్వమే.
గౌతమ్ కళ్లలో నిజమైన కృతజ్ఞత.
అయితే… నువ్వు ఓకే అనుకుంటే… నేను రెడీ.
విశిష్ట ఆనందంగా సూర్యని చూస్తుంది. అంటే గౌతమ్ ఓకే అన్నాడా? అవును క్యూటి… కానీ ఇప్పుడు అసలు టెస్ట్ స్టార్ట్ అవుతుంది.
భవ్య తండ్రి కాస్త గంభీరంగా కూర్చున్నారు. సూర్య, విశిష్ట ఇద్దరూ ఎదుట. మీరు చెప్పింది మంచి ఆలోచనే.
కాని గౌతమ్ గతం… అతను ఆగిపోతాడు.
సూర్య ప్రశాంతంగా... అంకుల్… ఒక మనిషి తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. కాని శిక్ష తర్వాత కూడా అతను జీవితాంతం నిందపడాలా? లేక మార్పుకు అవకాశం ఇవ్వాలా?
విశిష్ట కూడా మెల్లగా చెబుతుంది. గౌతమ్ ఇప్పుడు విలువలతో నిలబడుతున్నాడు. భవ్య అతని పక్కన ఉంటే… అతను ఇంకా బలంగా మారుతాడు.
భవ్య తండ్రి కొంతసేపు ఆలోచిస్తారు. అంతలో భవ్య ముందుకు వస్తుంది.
డాడ్… నేను అతన్ని అతని గతం కోసం కాదు…
ఇప్పటి మనసు కోసం ఇష్టపడుతున్నాను. ఆ ఒక్క మాట గదిలోని వాతావరణాన్ని మార్చేస్తుంది.
కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత… సరే అని భవ్య తండ్రి చెబుతారు.
గౌతమ్ నిజంగా మారాడని మీరు ఇద్దరూ చెబుతున్నారంటే… నాకు నమ్మకం ఉంది.
విశిష్ట ఆనందంతో సూర్య వైపు చూస్తుంది.
సూర్య కళ్లతోనే చెబుతాడు... టీమ్ వర్క్ సక్సెస్.
ఎంగేజ్‌మెంట్ రోజు. గౌతమ్, భవ్య పక్కపక్కనే నిలబడి ఉన్నారు. సూర్య, విశిష్ట కొంచెం దూరంగా నిలబడి చూస్తున్నారు.
చూశావా క్యూటి… మనం పోరాడి కాపాడుకున్న ప్రేమ…
ఇప్పుడు ఇంకో ప్రేమకి దారి చూపుతోంది. విశిష్ట చిరునవ్వు.
అందుకే చెప్పాను కదా దేవా సార్… ప్రశాంతత మనలో నుంచే మొదలవుతుంది. సూర్య ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు.
ఈసారి వాళ్ల కథలో డ్రామా లేదు.
ప్రతీకారం లేదు.
అనుమానం లేదు.
కేవలం నమ్మకం…
మరియు పక్కన నడిచే తోడు.
కొన్ని కథలు గెలుపుతో ముగుస్తాయి.
కొన్ని కథలు ప్రేమతో నిలుస్తాయి.
సూర్య❤️ విశిష్ట కథ… నమ్మకంతో ముందుకు సాగుతుంది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)