Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#81
రుద్రం భజే! ఎపిసోడ్ 26



బ్యాగ్ లో ఉన్న పద్మాని భూపాల్ సింగ్ ఇచ్చి తనతో పాటు రూమ్ నుంచి బయలుదేరాడు ముష్రు, వాళ్ళ వెనకాలే బయలుదేరి వెళ్లాడు భూషణ్.

మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన విషయం చెప్పిన నాయక్ నమ్మకపోవడంతో యంగ్ బ్లడ్ ని టేబుల్ మీద వేసి దాంట్లో చీమని వేసాడు యోధ.

**************

టేబుల్ మీద బ్లడ్ లో చీమ అటు ఇటు కొట్టుకుంటూ ఉండటం చూసి నవ్వుతూ "మిమ్మల్ని ఎవరో పిచ్చోళ్లని చేశారు." అని నవ్వుతూ చెప్పాడు నాయక్.

ఆ మాటకి అయోమయంగా చూస్తూ ఉండగా బాటిల్ లో ఉన్న వాటర్ ని టేబుల్ మీద పోసాడు యంగ్.

వాటర్ పడ్డ కాసేపటికి చీమ కొంచెం కొంచెం పెరుగుతూ  ఉండడం ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? దీనికి సైజు పెరుగుతుంది." అని దూరంగా జరుగుతూ అడిగాడు నాయక్.

అది చూసి "ఈ చీమ ఇప్పుడు డైనోసార్ అవుతుందా ఏంటి?" అని కంగారుగా అడిగింది పూజా.

యోధ వైపు చూస్తూ "ముందు యంగ్ చేతికి బ్లడ్ కారకుండా కట్టు కట్టండి." అని కంగారుగా చెప్పాడు నాయక్.

చీమ ఇంకా పెరగడం చూసి "ముందు దీనిని చంపేయాలి లేకపోతే చాలా డేంజర్!" అని చెప్పాడు యంగ్.

టేబుల్ మీద నుంచి కింద పడి నెమ్మదిగా నడుస్తూ సైజు పెరుగుతున్న ఉన్న చీమను చూసి కాలుతో తొక్కి "సార్! ఇప్పటికైనా మేము చెప్పిన విషయం నమ్ముతారా..?" అని అడిగాడు యోధ.

పద్మం వైపు చూసి "మీరు దీంట్లో నుంచి ఓపెన్ అయిన బ్లాక్ హోల్ లో కజ్జికిస్తాన్ వెళ్లి సముద్రంలో జరిగే ప్రయోగం ఆపి యంగ్ ని తీసుకొచ్చారు అంతే కదా! ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి." అని చెమటలు తుడుచుకుంటూ అడిగాడు నాయక్.

"సార్! యంగ్ మళ్ళీ వాళ్ళ చేతికి దొరికాడు అంటే ఎంత డేంజరో చూశారు కదా! తనని ఒక బంకర్లో సేఫ్ గా ఉంచి మామూలు మనిషిగా ఎలా చేయాలో ఆలోచించండి." అని చెప్పాడు యోధ.

"ఓకే!"అని హడావుడిగా ఫోన్ తీసి కాల్ చేసి "సైంటిస్ట్ ఉన్ని కృష్ణనాన్ ఇమీడియట్ గా ఇక్కడికి తీసుకురండి." అని చెప్పి యోధ వైపు చూసి "మరి ఈ పద్మం సంగతి ఏమిటి!" అని అడిగాడు నాయక్.

"ఈ పద్మం కోసం, యంగ్ కోసం రెండు దేశాలు మన మీద యుద్ధం ప్రకటించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు ముందు బోర్డర్ లో ఎమర్జెన్సీ అనౌన్స్ చేయండి ఒక్కడు కూడా లోపలికి రాకూడదు." అని చెప్పాడు యోధ.

"మనం ఎంత కాలం ఎమర్జెన్సీ అనౌన్స్ చేస్తాము దీనికి ఏదైనా సొల్యూషన్ చూడాలి." అని అడిగాడు నాయక్.

"మీరు పర్మిషన్ ఇస్తే బోర్డర్ దాటి నేను వెళతాను, ఈ పద్మన్ని చేరవలసిన ప్లేస్ కి చేర్చి ఈ ప్రయోగం చేసే కళింగ ల్యాబ్ కి వెళ్లి ఒక్కసారి చూసి వస్తాను." అని చెప్పాడు యోధ.

"నువ్వు చూసి రావడం అంటే కాల్చిరావడమే అంత రిస్క్ నేను చేయలేను." అని చెప్పాడు నాయక్

"సార్! మనం రిస్క్ చేయకపోతే యంగ్ లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది పుట్టుకు వస్తారు." అని చెప్పింది నీతూ.

"కరెక్ట్ కానీ నేను అఫీషియల్గా ఈ వర్క్ చేయడం కుదరదు." అని చెప్పాడు నాయక్.

"సార్! నా టీం తో మానస సరోవరం దగ్గరికి వెళతాను దానికి కావలసిన పర్మిషన్స్ ఇప్పించండి చాలు మిగతా విషయం నేను చూసుకుంటాను." అని చెప్పాడు యోధ.

ఆ మాటకి ఆలోచిస్తూ "నాకు వన్ వీక్ టైమ్ ఇవ్వు!" అని చెప్పి అక్కడికి వచ్చిన ఉన్ని కృష్ణనాన్ వైపు చూసి

"హాయ్! నీ కోసమే వెయిట్ చేస్తున్నాను." అని యంగ్ ని చూపించి "ఇతను ఒక విచిత్రమైన మనిషి తన బ్లడ్ ఒక భయంకరమైన వెపన్ లాంటిది.

తనని మన సీక్రెట్ ల్యాబ్ కి తీసుకువెళ్లి టెస్ట్ చేయండి ఎలా క్యూర్ చేయాలో చూడండి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్! యంగ్ ని టెస్ట్ చేసి మీకు మార్నింగ్ కి రిజల్ట్ చెప్తాను." అని చెప్పాడు ఉన్ని కృష్ణనాన్.

"ఆల్రెడీ రిజల్ట్ నేను చూశాను." అని చనిపోయిన చీమను చూపించి జరిగిందంతా చెప్పి "కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేయండి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని మిలటరీ జీప్ లో యంగ్ తీసుకుని ల్యాబ్ దగ్గరికి బయలుదేరాడు ఉన్నికృష్ణన్.

అంతలో ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "భూషణ్ ఏమైంది?" అని అడిగాడు  యోధ.

"నా వర్క్ కంప్లీట్ అయ్యింది ఇంక మీ పని మొదలు పెట్టండి." అని చెప్పాడు భూషణ్.

"ఓకే గుడ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి నాయక్ వైపు చూసి "సార్! మన దేశంలో ఉంటూ పరాయి దేశానికి సహాయం చేసే కొంతమందిని కనిపెట్టాము, వాళ్ళని క్లోజ్ చేసే ఛాన్స్ వచ్చింది మీరు పర్మిషన్ ఇస్తే ఈ వారం రోజుల్లో ఆ వర్క్ కంప్లీట్ చేస్తాను." అని చెప్పాడు యోధ.

"బోర్డర్ లోపల నీ ఇష్టం అలాంటి వాళ్ళందరినీ ఏరిపారేయ్ కావాలి అంటే ఫోర్స్ కూడా తీసుకువెళ్లు!" అని చెప్పాడు నాయక్.

"థాంక్యూ సర్!" అని చెప్పి టేబుల్ మీద ఉన్న పద్మాన్ని తీసుకుని నీతూ వాళ్ళతో కలిసి అక్కడి నుంచి రూమ్ కి బయలుదేరాడు యోధ.

************

రూమ్ కి వచ్చిన భూషణ్ వైపు చూసి "డూప్లికేట్ పద్మాన్ని తీసుకువచ్చావా..? నీ మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా!" అని అడిగాడు ఏకవీర.

"మా భూషణ్ ఏది చేసిన పర్ఫెక్ట్ గా ఉంటుంది." అని చెప్పాడు క్యూబ్స్.

అంతలో రూమ్ లోకి వచ్చిన యోధ వాళ్ళని చూసి "యంగ్ ని సేవ్ గా ఉంచారు కదా!" అని అడిగాడు నంద.

"ఎస్! సేఫ్ గా ఉన్నాడు ఇంక మనం అతని గురించి భయపడాల్సిన పనిలేదు ఇప్పుడు చేయవలసిన పని చాలా ఉంది." అని చెప్పాడు యోధ.

"భూపాల్ సింగ్ ని మన కస్టడీ లోకి తీసుకుందామా.?" అని అడిగింది నీతూ.

"భూపాల్ సింగ్ ని మాత్రమే కస్టడీలోకి తీసుకుందాము వాడిని వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కడిని లేపేద్దాము, ఈ ఛాన్స్ మిస్ అయ్యితే మళ్ళీ వాళ్ళు మనకి అంత ఈజీగా దొరకరు." అని చెప్పాడు యోధ.

ఆ మాటకి అనుమానంగా చూస్తూ "ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతారు?" అని అడిగాడు ఏకవీర.

"నా దగ్గర ప్లాన్ రెడీగా ఉంది." అని దీప్తి, పూజ వైపు చూసి "మీరు మాతో ఉండడం కొంచెం రిస్క్!" అని చెప్పాడు యోధ.

"అవునా? కొన్ని రోజులకి స్పేస్ లో కూడా యుద్ధం జరుగుతుంది అన్నావు మేము ట్రైనింగ్ అవ్వాలి కదా!" అని చెప్పింది దీప్తి.

"యోధ! మేము ఉన్నాం కదా వీళ్ళని సేఫ్ గా ఉంచే బాధ్యత మాది." అని చెప్పాడు నంద.

"సరే! అని కారులో వెళుతూ లాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ "భూపాల్ సింగ్ వాళ్ళు నేపాల్ వైపు వెళుతున్నారు." అని చెప్పాడు యోధ.

"ఓకే!" అని కాల్ చేసి  "హలో!  గబ్బర్ సింగ్  నీకు కార్ నెంబర్  సెండ్ చేశాను చెప్పింది గుర్తుంది కదా ఈ పని నువ్వు పర్ఫెక్ట్ గా చేస్తే మా టీమ్ లోకి వస్తావు." అని చెప్పింది నీతూ.

"ఎస్ మేడం!" అని ఫోన్ పెట్టేసి స్టాఫ్ ని తీసుకొని లోకేషన్ వైపు వెళ్ళాడు గబ్బర్ సింగ్.

ఫోన్ కట్ అవడంతో యోధా వైపు చూసి "ముష్రుకి  మెసేజ్ పంపించు." అని చెప్పింది నీతూ

*************

కారులో వెళ్ళుతు తన పేజర్ కి మెసేజ్ రావడం చూసి కాసేపటి తర్వాత హైవేలో సెక్యూరిటీ ఆఫీసర్లు కనిపించడంతో  డ్రైవింగ్ చేస్తున్న భూపాల్ సింగ్ వైపు తిరిగి " బోర్డర్ లో సెక్యూరిటీ అధికారి చెకింగ్ ఉంటుంది ఆ వస్తువు జాగ్రత్తగా ఉంది కదా!" అని అడిగాడు ముష్రు.

"నో ప్రాబ్లం! సీట్ కింద సేఫ్ గా ఉంది ఎవ్వరు కనిపెట్టలేరు." అని చెప్పి సెక్యూరిటీ అధికారి చెకింగ్ దగ్గర కార్ స్లో చేసాడు భూపాల్ సింగ్.

కార్ దగ్గరికి వచ్చి ఇద్దరి వైపు చూసి "ఐడీలు చూపించండి." అని అడిగాడు గబ్బర్ సింగ్.

తన ఐడి చూపించి "మా ఫ్రెండ్ వచ్చాడని సరదాగా నేపాల్ కి వెళుతున్నాము సార్!" అని చెప్పాడు భూపాల్.

ఐడి చూస్తూ "మీ ఇద్దరిని చూస్తుంటే టెర్రరిస్టులు అని డౌట్ గా ఉంది కారు దిగండి చెక్ చేయాలి." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

కార్ దిగుతూ గబ్బర్ సింగ్ వైపు చూసి సైగ చేసి డ్రైవింగ్ సీట్ చూపించాడు ముష్రు.

సైగ చేయడం చూసి స్మైల్ ఇచ్చి కార్ చెక్ చేస్తున్న కానిస్టేబుల్స్ దగ్గరికి వెళ్లి "ఆ సీట్ కింద కూడా చూడండి." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని కంగారుగా దగ్గరికి వెళ్లి "సార్! దాని కింద ఏమీ లేదు." అని డబ్బులు చేతిలో పెట్టాడు భూపాల్.

"నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే ఈ సీటు కింద ఏదో ఉంది." అని చెయ్యి పెట్టి వెతికి ప్యాకెట్ బయటికి తీసి  "దీంట్లో ఆర్డిఎక్స్ ఉందా డ్రగ్స్ ఉన్నాయా?" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"ఆ ప్యాకెట్ లో ఏమీ లేదు సర్ తినడానికి బిర్యానీ పెట్టుకున్నాను." అని చెప్పాడు భూపాల్.

"అవునా? నాకు బాగా ఆకలిగా ఉంది." అని ఓపెన్ చేసాడు గబ్బర్ సింగ్.

ప్యాకెట్ లో ఉన్న బిరియాని వైపు ఆశ్చర్యంగా చూస్తూ  'బిర్యానీ ఎలా వచ్చింది.' అనుకున్నాడు భూపాల్.

ప్యాకెట్ లో ఉన్న బిర్యానీ తింటూ "టేస్ట్ బాగుందిరా..!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.

బిర్యానీ తీసుకుని చూసి పక్కన పడేసి సీట్ కింద వెతికి  ముష్రు వైపు కంగారుగా చూస్తూ  "నువ్వు ఇచ్చిన వస్తువు ఏమైపోయింది?" అని అడిగాడు భూపాల్.

"నన్ను అడుగుతావేంటి నాకేం తెలుసు!" అని చెప్పాడు ముష్రు.

అంతలో అక్కడికి కార్ లో వస్తున్న నీతూ వాళ్లని చూసి  "చెకింగ్ అయిపోయింది ఇంక మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు!" అని నవ్వుతూ జీప్ దగ్గరికి వెళ్ళాడు గబ్బర్ సింగ్.



" రుద్రం భజే! ఎపిసోడ్ 26 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 9 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 08-05-2026, 10:14 AM



Users browsing this thread: 1 Guest(s)