Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#80
రుద్రం భజే! ఎపిసోడ్ 25



హోటల్ రూమ్ లో నుంచి ముష్రుతో ఫోన్లో మాట్లాడి ఆ వస్తువుల గురించి తెలిసిన జింగ్ చనిపోయాడు కాబట్టి దాని గురించి ఎవరికీ తెలీదు అని చెప్పాడు యోధ.

***********

"ముష్రు దగ్గర ఉన్న పద్మాన్ని చూసిన వెంటనే అది అసలైంది కాదు అని రేపాలా కనిపెడతాడు, అంతేకాదు నువ్వు చంపిన నలుగురిని చూసి చాలా విషయాలు తెలుసుకుంటాడు." అని చెప్పాడు భూషణ్.

"అలా అయితే ఆ పద్మం వాళ్ళ చేతికి వెళ్లినట్లే ఉండాలి  కానీ వెళ్ళకూడదు దానికి ఏదైనా ఐడియా ఆలోచించండి." అని చెప్పింది పూజా.

"ముష్రు ఇక్కడి నుంచి బయలుదేరిన వెంటనే తన దగ్గర ఉన్న పద్మాన్ని  భూపాల్ సింగ్ కి ఇవ్వమని చెప్పండి చాలు నేను చూసుకుంటాను." అని చెప్పాడు భూషణ్.

అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "టైమ్ కి ముష్రు కాల్ చేసాడు." అని యోధాకి ఫోన్ ఇచ్చింది లేదు నీతూ.

ఫోన్ లిఫ్ట్ చేసి "చెప్పు ముష్రు!" అని అడిగాడు యోధ.

"సార్! నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి భూపాల్ సింగ్ వచ్చే టైమ్ అయింది." అని చెప్పాడు ముష్రు.

"నాకు తెలుసు! నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ఆ వస్తువుని భూపాల్ సింగ్ కి ఇవ్వు ఆ విషయం కళింగకు కూడా తెలిసేటట్లు చెయ్! తర్వాత సంగతి మేము చూసుకుంటాము ఇంక నువ్వు సేఫ్ గా ఉంటావు." అని చెప్పాడు యోధ.

"సార్! మీ ప్లాన్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు నేనయితే సేఫ్ గా ఉంటా కదా!" అని కంగారుగా అడిగాడు ముష్రు.

"నేను నీకు మాట ఇచ్చాను కదా నువ్వు సేఫ్ గా ఇండియాలోనే ఉంటావు." అని చెప్పాడు యోధ.

"ఓకే సర్ థాంక్యూ!" అని ఫోన్ పెట్టేసాను ముష్రు.

భూషణ్ వైపు చూసి "మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్లి ఒకసారి నాయక్ సార్ కలిసి వస్తాము పుష్కర్ వాళ్లు కూడా మీతో పాటే ఉంటారు." అని చెప్పాడు యోధ.

"సరే! నువ్వు వచ్చేసరికి జరగవలసినదంతా జరిగిపోతుంది." అని చెప్పాడు నంద.

"యోధ! నీ దగ్గర ఉన్న పద్మం జాగ్రత్త!" అని చెప్పాడు క్యూబ్స్.

"ఆ రెండు దేశాల ఆర్మీ మొత్తం వచ్చిన సరే నా దగ్గర నుంచి ఈ పద్మన్ని తీసుకు వెళ్ళలేరు." అని నవ్వుతూ నీతూ వాళ్లతో కలిసి అక్కడనుంచి వెళ్ళాడు యోధ.

**************

కజకిస్తాన్ గెస్ట్ హౌస్ దగ్గరికి నలుగురి శవాన్ని తీసుకుని వస్తున్న సయ్యద్ వైపు చూసి "యంగ్ అక్కడ?" అని టెన్షన్ గా చూస్తూ అడిగాడు కళింగ.

"సముద్రం దగ్గర నలుగురి శవాలు బోర్ల పడిన కార్ లో డ్రైవర్ తప్పితే ఎవరు కనిపించలేదు." అని చెప్పాడు సయ్యద్.

"మరి జింగ్ ఏమైపోయాడు?" అని అడిగాడు చింగ్ యా.

"ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్లారో తెలియదు ఈ డ్రైవర్ మాత్రం షాక్ లో ఉన్నాడు ఎంత అడిగినా ఏమి మాట్లాడలేదు." అని చెప్పాడు సయ్యద్.

అక్కడికి వస్తూ చేతిలో నీళ్లు తీసుకుని డ్రైవర్ మోహన కొట్టి కంగారుగా చూస్తున్న అతని వైపు చూసి "అక్కడ ఏం జరిగింది?" అని అడిగాడు రేపాల.

"సార్! మేము సముద్రం దగ్గరికి బయలుదేరే ముందు ముగ్గురు లేడీస్ ఇద్దరు జెంట్స్ వచ్చారు. వాళ్ళ చేతులు కట్టేసి కార్లు కూర్చోబెట్టి సముద్రం దగ్గరికి తీసుకు వెళ్ళమని జింగ్ గారు చెప్పారు.

మేము సముద్రం దగ్గరికి వెళ్లేసరికి ఏమైందో తెలియదు ఎవరో వచ్చి తిప్పినట్టు సడన్గా మా కారు బోర్ల పడింది. అప్పుడక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు నా మీద డబల్ ఉన్నడు.

బోట్ లో సముద్రంలోకి వెళుతున్న జింగ్, యంగ్ ని రెండు చేతులతో ఒడ్డుకు తీసుకువచ్చి జింగ్ వెన్నుపూస విరకొట్టి  సముద్రంలోకి గిరాటు వేశాడు ఈ నలుగురిని ఒక్క దెబ్బతో చంపేసాడు.

తరువాత గాల్లో ఒక డోర్ ఓపెన్ తీసుకుని దాంట్లోకి యంగ్ ని తీసుకుని అందరూ వెళ్ళిపోయారు అంతం మాయ లాగా ఉంది ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు డ్రైవర్.

అతని మాటలు విని "వీడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు మైండ్ దొబ్బినట్లు ఉంది. గాలిలో డోర్ ఓపెన్ అవ్వడం ఏమిటి! దాంట్లోకి అందరూ వెళ్లడం ఏమిటి!" అని విసుగ్గా చెప్పాడు చింగ్ యా.

చనిపోయిన నలుగురు దగ్గరికి వెళ్లి తల మీద చేయ్యి పెట్టి చూసి "వీళ్లని చంపింది మనిషే కానీ అతనికి ఏదో శక్తి తోడుగా ఉంది. డ్రైవర్ చెప్పేది నిజమే!" అని చెప్పాడు రేపాలా.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ లాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ "యంగ్ బాడీలో ఉన్న చిప్ లొకేషన్ ఇండియాలో చూపిస్తుంది." అని చెప్పాడు కళింగ.

"ఏంటి? లోకేషన్ ఇండియాలో చూపిస్తుందా? అప్పుడే ఎలా వెళ్లగలరు." అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సయ్యద్.

"కాలంలో ప్రయాణం ఆ పద్మం ద్వారా సాధ్యమవుతుంది నా శక్తి గురించి, ఆ పద్మం గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తున్నారు." అని చెప్పాడు రేపాలా.

"ఏంటి? ఆ వస్తువు ద్వారా కాలంలో ప్రయాణం చేయాచ్చా  మరి ఈ విషయం ఇప్పుటీ వరకు నాతో ఎందుకు చెప్పలేదు." అని అడిగాడు చింగ్ యా.

"ఆ విషయం నాకు కూడా తెలుసు అంతే, నేను కూడా ఆ పద్మాన్ని ఎప్పుడు ఉపయోగించలేదు కదా! ముందు అది మన మనిషి దగ్గర ఉందో లేదో తెలుసుకోండి." అని చెప్పాడు రేపాలా.

సయ్యద్ వైపు చూసి "భూపాల్ సింగ్ కి కాల్ చెయ్ ఇమీడియట్ గా ముష్రు దగ్గరికి వెళ్లి వీడియో కాల్ చేయమను." అని చెప్పాడు కళింగ.

"నాకు తెలిసి ఈ టైంకి అక్కడే ఉంటాడు." అని కాల్ చేసి "భూపాల్ ఎక్కడ ఉన్నావు? ముష్రు దగ్గరికి వెళ్ళావా?" అని అడిగాడు సయ్యద్.

"బాయ్! ముష్రు రూమ్ డోర్ కొడుతున్నాను నువ్వు కాల్ చేసావు కాసేపట్లో ఇక్కడ నుంచి కుడా స్టార్ట్ అవుతాము." అని చెప్పాడు భూపాల్.

"రూమ్ లోపలికి వెళ్లి అర్జెంటుగా వీడియో కాల్ చెయ్, నేను లైన్ లోనే ఉంటాను." అని చెప్పాడు సయ్యద్.

"సరే!" అని ముష్రు డోర్ ఓపెనింగ్ చేయడంతో లోపలికి వెళ్లి లాప్టాప్ ఆన్ చేసి వీడియో కాల్ చేసి "ఏమైంది భాయ్! అంత టెన్షన్ పడుతున్నావు?" అని అడిగాడు భూపాల్.

వీడియో కాల్ లో చూస్తూ "ముష్రు నీ దగ్గర ఉన్న వస్తువు భూపాల్ కి ఇవ్వు!" అని చెప్పాడు కళింగ.

"ఓకే సార్!" అని బ్యాగ్ లో ఉన్న వస్తువు తీసి భుపాల్ చేతికి ఇచ్చి ఇప్పుడు నాకు పెద్ద భారం దిగినట్లు ఉంది." అని ఊపిరి పీల్చుకున్నాడు ముష్రు.

వీడియో కాల్ లో భోపాల్ చేతిలో పద్మాన్ని చూసి "ఆ వస్తువు అక్కడే ఉంటే మరి ఇక్కడికి ఎలా వచ్చారు? మనవాళ్ళని ఎలా చంపారు? ఎలా వెళ్ళిపోయారు?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు సయ్యద్.

"ఆ విషయం నేను తెలుసుకుంటాను." అని చనిపోయిన నలుగురు తలల మీద ఉన్న రక్తాన్ని తీసుకుని గదిలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నారు రేపాలా.

వీడియో కాల్ లో భూపాల్ వైపు చూసి "ఇమ్మీడియేట్ గా అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి." అని చెప్పాడు కళింగ.

"ఓకే సార్!" అని కాల్ కట్ చేసి ముష్రుతో కలిసి రూమ్ దగ్గర నుంచి బయలుదేరాడు భూపాల్ సింగ్.

వీడియో కాల్ కట్ అవడంతో చింగ్ యా వైపు చూసి "ఇండియాలో ఉన్న యంగ్ ని కనిపెట్టి ఎలాగైనా మన దగ్గరికి తీసుకురావాలి." అని చెప్పాడు కళింగ.

"యంగ్ బాడీ లో ఉన్న వైరస్ గురించి తెలుసుకున్నారు అంటే మన పని అవుట్! అసలు ఇక్కడ నుంచి అంత స్పీడ్ గా ఇండియా ఎలా వెళ్లారు ముందు అది తెలుసుకోండి." అని చెప్పాడు చింగ్ యా.

"రేపాలా గదిలో నుంచి బయటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి." అని వెయిట్ చేస్తూ ఉన్నాడు కళింగ.

************

అదే సమయంలో రూమ్ లో నుంచి బైనో క్లోర్ లో ముష్రు రూమ్లో జరిగిందంతా చూసి భూషణ్ వైపు తిరిగి "మనం అనుకున్నట్లు ఆ వస్తువు భూపాల్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు దానిని ఎలా తీసుకువస్తారు?" అని అడిగాడు పుష్కర్.

"మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి ఆ వస్తువుని ఎలాగైనా తీసుకువస్తాను." అని చెప్పి రూమ్ నుంచి వెళ్ళాడు భూషణ్.

ఆ మాటకి నందా వైపు చూసి "భూషణ్ కి మ్యాజిక్  ఏమైనా తెలుసా! భూపాల్ దగ్గర నుంచి అంత తేలిక వస్తువులు తీసుకొస్తానని చెప్పి ఒక్కడే వెళ్ళాడు." అని అడిగాడు ఏకవీర.

"ఎవరికి కనిపించకుండా పెట్టిన వస్తువుని కనిపించకుండా తీయలేడా?" అని అడిగాడు నంద.

"కరెక్ట్ కదా! అసలు ఎలా పెట్టాడు ఇప్పుడు ఎలా తీసుకొస్తాడు." అని ఆలోచిస్తూ ఉన్నాడు పుష్కర్.

"నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఏ చేత్తో అయితే పెట్టాడో ఆ చేతితోనే తీసుకువస్తాడు." అని చెప్పాడు క్యూబ్

*************

అదే సమయంలో నాయక్ దగ్గరికి వెళ్లి సెల్యూట్ చేసి తన దగ్గర ఉన్న పద్మాన్ని టేబుల్ మీద పెట్టి పక్కన ఉన్న యంగ్ ని చూపించి జరిగిన విషయం మొత్తం చెప్పాడు యోధ.

చెప్పింది మొత్తం విని ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? ఈ ప్లేట్ ద్వారా కజకిస్తాన్ వెళ్లి అక్కడి నుంచి ఈ మనిషిని తీసుకువచ్చారా?

ఇతని ఒంట్లో ఉన్న బ్లడ్ తాగితే జంతువులు రాక్షసా జంతువులుగా మారిపోతాయా? అసలు మీ అందరికీ ఏమైంది బానే ఉన్నారా?" అని అడిగాడు నాయక్.

"డాడ్! మేము చెప్పేది నిజం నేను కూడా వెళ్లాను." అని చెప్పింది దీప్తి.

"సార్! మీకు చూపించడానికి ఇప్పుడు సూర్యకిరణాలు కూడా లేవు ఈ పద్మం పనిచేయదు కావాలి అంటే యంగ్ బాడీలో ఉన్న బ్లడ్ టెస్ట్ చేయించండి మీకు అర్థం అవుతుంది." అని చెప్పాడు యోధ.

నీతూ వైపు చూసి "మీ ఇద్దరి అసిస్టెంట్స్ ఎక్కడ కజకిస్తాన్లో వదిలేసి వచ్చారా?' అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు నాయక్.

"సార్! మేము చెప్పిన మాట మీరు నమ్మడం లేదు కదూ!" అని అడిగాడు యోధ.

నేను కాదు ఈ మాట ఎవరికీ చెప్పిన నమ్మరు మీకు ఈ కట్టు కథ చెప్పి మిమ్మల్ని ఎవరో పిచ్చోళ్లను చేస్తున్నారు ముందు ఆ విషయం తెలుసుకోండి." అని చెప్పాడు నాయక్.

"సార్! అయితే ఒక్కసారి ఇటు వైపు చూడండి." అని చెప్పి తన దగ్గర ఉన్న కత్తితో యంగ్ వేలుని కోసి బ్లడ్ టేబుల్ మీద పడేటట్లు చేసి కింద పాకుతున్న చీమను తీసుకొచ్చి ఆ బ్లడ్ లో వేసాడు యోధ.

టేబుల్ మీద బ్లడ్ లో అటు ఇటు కొట్టుకుంటున్న చీమను చూసి నవ్వుతూ ఉన్నాడు నాయక్.
[+] 5 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 08-05-2026, 10:12 AM



Users browsing this thread: 1 Guest(s)