06-05-2026, 11:48 PM
జఫర్ పని చేస్తుందే కానీ శ్రద్ధ లేదు. అమృత వచ్చి కదిలిస్తే ఆలోచనల్లో నుంచి బైటికి వచ్చింది. అడిగితే బంధువుల ఇంటికి వెళ్లానని చెప్పి మళ్ళీ పనిలో పడింది. అమృత కాసేపు చూసి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం రాజారావు భోజనం చేస్తుంటే జఫర్ లోపలికి వచ్చింది. ఇద్దరు కాసేపు తన గురించి మాట్లాడుకున్నాక టాపిక్ గోపి వైపు మళ్లింది. గీత దగ్గర తనేం విన్నదో అదే మళ్ళీ రాజారావు నోట విన్నది.
గోపీ చిన్నతనం అంతా ఒంటరిగానే గడిచింది. ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడే అందరూ వాడిని వాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పింది చేస్తే ఏదో ఒకరోజు తమలో కలుపుకుంటారని ఆశతో ఎవరే పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. అది అందరికి అలుసు అయ్యి గోపీని నిజంగానే పని వాడిని చేసింది. హాస్టల్లో చదివించాను. అమ్మ మీద బెంగ పెట్టుకునే వాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అందరికీ దూరంగా ఉండేవాడు. జనని గోపీని పట్టించుకునేది కాదు. తన వెంట కుక్క పిల్లలా తిరిగేవాడు. జనని పనులు చేయించేది కానీ ప్రేమ చూపించేది కాదు. హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మతో ఆడుకున్నట్టు, అమ్మ ఎప్పుడూ తన దెగ్గరే ఉన్నట్టు తనలో తానే ఊహించుకునేవాడు. ఎప్పుడూ ఊహల్లోనే ఉండేవాడు. ఎన్ని హాస్పిటళ్ళు తిప్పినా లాభం లేకపోయింది. కానీ జనని గోపీ మీదున్న 2% వాటా కోసం వాడిని హింసపెట్టినప్పుడు వాడి గుండె మొదటిసారి పగిలింది. ఊహా లోకం నుంచి బైటికి వచ్చాడు కానీ మామూలు మనిషి కాలేకపోయాడు. నాలుగేళ్లు ఇంట్లో నుంచి పారిపోయాడు. వాడి కోసం వెతకని చోటు లేదు. చివరికి సౌదీ అరేబియాలో దొరికాడు. పిచ్చివాడిలా రోడ్డు మీద ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ కనిపించాడు. ఇండియా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిలా మార్చడానికి చాలా సమయం పట్టింది. ఆ రోజు నుంచి గోపీ మళ్ళీ ఇంటి నుంచి బైటికి అడుగు పెట్టలేదు. ఆ చెట్లు, పాత బడిన షెడ్‌లో పనికిరాని కార్లు.. అవే వాడి ప్రపంచం. ఆ తరువాత ఇంట్లో నుంచి ఎలా బైటికి వచ్చాడో నీకు తెలుసు అని ముగించాడు రాజారావు.
ఎందుకో ఈ నిమిషం గోపీ పక్కన ఉండాలనిపించి, లేచి నేను ఇంటికి వెళ్తానంది జఫర్. ఎందుకు అని అడిగాడు రావు. జఫర్ సమాధానం చెప్పలేదు, "వెళ్తాను" అంది. సరే అన్నాడు రావు. జఫర్ తన షెడ్‌లో బట్టలు మార్చుకుని వెళ్లిపోతుంటే అమృత వచ్చి నీతో మాట్లాడాలి నా ఆఫీసుకి రా అంది. నేను ఇంటికి వెళుతున్నాను అని చెప్పేసి అమృత వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్కనే తన అన్న పవన్ కూడా ఉన్నాడు. చూసి అమృత వంక చులకనగా నవ్వాడు.
ఏంటే ఎవ్వరూ నీ మాట వినరా.. ఎందుకే నీకివన్నీ అని హేళన చేస్తే పవన్ వైపు కోపంగా చూసి జఫర్‌ని తలుచుకుని పిడికిలి బిగించింది. రాజారావు ఆఫీస్ ముందు ఉన్న రిసెప్షన్‌లో ప్రీతీ కాలు మీద కాలు వేసుకుని ఫోన్ మాట్లాడటం చూసి ఒక్కసారి తాతయ్య కుర్చీలో కూర్చొనీ.. మీ అందరి సంగతి తేలుస్తాను అనుకుని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది అమృత. తన వెనకే పవన్ కూడా వెళ్ళిపోయాడు.
రిసెప్షన్‌లో కూర్చున్న ప్రీతీ తన స్నేహితుడు విశాల్‌తో మాట్లాడుతుంది.
ఏమైనా తెలిసిందా ?
మీ అమ్మ పేరు మీద బిల్ కట్టింది స్వర్ణ.
అది నాకు తెలుసు. ఆమె కాదేమోనని నా అనుమానం, అందుకే కదా నిన్ను కనుక్కోమని చెప్పింది. నాకు తెలిసిందే చెప్తావ్ ఎందుకు అని కసురుకుంది ప్రీతీ.
ఎందుకే అంత కోపం, నన్ను మొత్తం చెప్పనీవా ?
ఆ.. సారీ.. చెప్పు
ఈ స్వర్ణ బ్యాక్‌గ్రౌండ్ ఏంటా అని చెక్ చేస్తే తెలిసింది తన వెనక ఎవరున్నారో
ఎవరున్నారు ?
గోపి
ఏ గోపీ !!
మీ రావు మోటార్స్ అధినేత చిన్న మనవడు. గోపి గోవర్ధన్ రావ్. చెక్ మీద అదే సంతకం ఉంది మరి.
వాట్ !! నిజంగానా ?
అవునే.. నాకు పనుంది.
సరే సరే.. థాంక్స్ అని ఫోన్ పెట్టేసి అంతే వేగంగా గోపి నెంబరు డయల్ చేసింది, ఇంకో రెండు సార్లు చేసినా ఎత్తలేదు. ఆఫీస్ అయిపోయాక తన ఇంటికి వెళ్లి మాట్లాడతాను అనుకుంది.
జఫర్ కాఫీ పెట్టి ఇస్తే తీసుకున్నాడు గోపీ. నాలికతో రుచి చూసే ముందు వాసన చూసి, దీని కోసం మొన్న పిచ్చోడిలా రోడ్లు పట్టుకుని తిరిగాను అని తనలో తనే నవ్వుతూ కాఫీ తాగాడు.
ఏంటి అప్పుడే వచ్చేసావ్ ?
ఎందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావ్ ? కంగారు మొహం పెట్టింది జఫర్.
అదా.. నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం. నేను ఒంటరితనానికి అలవాటు పడిపోయాను. నువ్వేదో కొన్ని రోజులు ఉంటావని చెప్పారు తాతయ్య. అయినా ఎల్లకాలం నా దెగ్గరే ఉండవు కదా. అందుకే అన్నాను.
మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాముగా.. నేను నీకు నచ్చలేదా? నేనేమైనా తప్పు చేశానా?
జఫర్ కళ్ళలో చిన్న మెరుపు కనిపించగానే కరిగిపోయాడు గోపి. వాడి గురించి ఎంత బెంగ పడ్డాడో అదే బెంగ జఫర్ కళ్ళలో కనిపించేసరికి గోపి మనసులో కొంచెం బరువు తగ్గినట్టు అనిపించింది. అయినా తను చెప్పాలనుకున్నవి అనాలనుకున్నవి అనేశాడు.
వద్దురా బాబు. మొన్న నాలుగు రోజులు ఏటో పోయావ్. నేను కాఫీ కోసం రోడ్లు పట్టుకు తిరిగాను. నీ చేతి రుచి అలవాటు పడ్డాక బైట బిర్యానీ కూడా నాకు నచ్చట్లేదు. నువ్వేదో రోజు సడన్‌గా వెళ్ళిపోతావ్. ఇప్పటివరకు నేనెవ్వరికోసం ఏడ్చింది లేదు. నీకోసం ఏడవాలని అసలు లేదు.
మురిసిపోయింది జఫర్. గోపీ అలకకి, కోపానికి కారణం తనేనని తెలిసాక నవ్వొచ్చింది. వెంటనే లేచి గోపీ వీపు మీద ధభీమని గుద్దింది. కూర్చున్నోడు కూర్చున్నట్టే చతికిల పడ్డాడు గోపి.
సాయంత్రం హిమజ ఆంటీతో మాట్లాడతా అన్నాడు లేస్తూ.. వెళ్తున్నది ఆ మాట వినగానే వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో నాలుగు గుద్ది పోయింది. ఇద్దరు నవ్వుకుని ఎటైనా తిరుగుదాం అనుకుంటుంటే గోపీ ఫోన్ మోగడం చూసింది జఫర్.

***

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)