06-05-2026, 06:06 AM
Part - 122
కంగారు పడవలసిన విషయమే ఉంది. ఆ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినా ఆ దేవా ఎవరో కాదు సూర్యనే..
రమేష్ ఆ మాట చెప్పగానే హిమ చేతిలో నైల్ పాలిష్ బాటిల్ నేలపైన పడుతుంది. ఏమంటున్నారు డాడీ అని దగ్గరికి వచ్చి కంగారుగా అడుగుతుంది.
అవును బేబీ ఆ సూర్య, దేవా ఇద్దరూ ఒక్కటే. అలా జరగడానికి వీలు లేదు ఆ దేవ ఒక నార్మల్ ఎంప్లాయ్. మీకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు.
లేదు బేబీ ఈరోజు ఆ విక్రమ్ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసాడంట. అంతే హిమ ఆశలన్నీ పేక ముక్కల లాగా కూలిపోతాయి.
అలా ఎలా జరుగుతుంది డాడీ ఆ దేవ ఆ ఇడియట్ విశిష్ట వెనుక తిరుగుతాడు. తనతో ఉంటాడు. అంటే విశిష్ట కోసం సూర్య ఒక నార్మల్ ఎంప్లొయ్ గా వచ్చాడా..
గౌతమ్ నుంచి ప్రతిసారి ప్రొటెక్ట్ చేస్తున్నాడా... నేలపైన కూర్చుండి పోయి.. తలలో చేతులు పెట్టుకొని జుట్టు పీక్కుకుంటూ ఉంటుంది.
హిమ ఒక్కసారిగా నేల మీదే కూర్చుంటుంది.
చేతులతో తల పట్టుకుని జుట్టు పీక్కుంటూ ఉంటుంది.
హిమ హిస్టారికల్‌గా అరుస్తూ... అంటే… అర్థమవుతుందా డాడీ… నేను నమ్మినదంతా అబద్ధమా?
సూర్య… దేవా… నా కోసం కాదు…
విశిష్ట కోసం… ఆ అమ్మాయి కోసం…
కళ్లల్లో నీళ్లు కాదు… మండుతున్న అగ్ని.
బ్రేక్ అయిన ఆశలు ఒక్కొక్కటి గుర్తుకు వస్తాయి.
సూర్య నవ్వు…
తనని చూడగానే మారిన అతని చూపు…
ప్రతిసారి గౌతమ్ దగ్గర నుంచి విశి ని కాపాడిన తీరు…
హిమ గట్టిగా అరుస్తూ.... అంతా నాటకం డాడీ
నేను ఎర్రి పువ్వు ని. అతను నా కోసం కాదు…
ఆ విశిష్టని కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు.
దానికోసమే నాతో నవ్వుతూ మాట్లాడాడు. ఆఫీస్ లో కలవకుండా ఫోన్ నెంబర్ నాకు దొరకకుండా ప్లాన్ చేశాడు.
టేబుల్ మీద ఉన్న నైల్ పాలిష్ బాటిల్స్ ను గట్టిగా గోడకి విసిరేస్తుంది.
చిన్న చిన్న గాజు ముక్కలు చెల్లాచెదురవుతాయి... హిమ హృదయంలానే. రమేష్ వెంటనే దగ్గరికి వెళ్లి ఆమె భుజాలు పట్టుకుంటాడు.
రమేష్ రగిలిపోతూ... హిమ! కంట్రోల్ యువర్ సెల్ఫ్..
హిమ వణుకుతూ... నేను ఎలా కంట్రోల్ అవ్వాలి డాడీ?
ఆ అమ్మాయి ఏం చేసిందని? ఏం ఉంది ఆమె దగ్గర?
నాకన్నా ఏం ఎక్కువ??
నా దగ్గర ఉన్నట్టుగా డబ్బు లేదు. సోషల్ స్టేటస్ లేదు. ఏమి చూసి ఆ విశిష్ట వెనకాల పడ్డాడు.
అసూయ…
అవమానం…
అహంకారం…
అన్నీ కలిసిపోతాయి.
హిమ పళ్ళు బిగించి... విశిష్ట వల్లే నాకు అన్నీ పోయాయి.
సూర్యని… నా లైఫ్‌ని… అతన్ని కూడా ఆమె నుంచే దూరం చేయాలి.
అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న రమేష్ కళ్లలో ఒక మెరుపు.
బిజినెస్ మైండ్ ఆన్ అవుతుంది.
రమేష్ వంకరగా నవ్వుతూ... అందుకే నువ్వు నా కూతురివి హిమ.
ఏడవడం కాదు…
ఎదుటివాడిని నేలకొరిగించడం మన స్టైల్.
హిమ అతని వైపు చూస్తుంది. కళ్లల్లో ఆశ కాదు… ప్రతీకారం. విశి నీ ఎలాగైనా నాశనం చేయాలి అన్న అసూయ.
ఏం చేయాలి డాడీ? నాకు ఆ విశిష్ట ముఖం చూడగానే కోపం వస్తోంది. గౌతమ్ నాతో ఉన్నప్పుడు కూడా కూల్ గా ఉంది అంటే అప్పటికే అది సూర్య తో రిలేషన్ లో ఉన్నట్టుంది డాడీ.
రమేష్ కుర్చీలో కూర్చొని వేళ్లను కలిపి ఆలోచిస్తాడు.
రమేష్ స్లోగా... విశిష్ట బలహీనత ఏంటో తెలుసా?
ఆమె ఇమేజ్. ఆఫీస్ లో ఆమెని పర్ఫెక్ట్ గర్ల్ గా చూస్తారు.
ఆమె అమ్మ కూడా బలహీనతే కదా..
కొంచెం ముందుకు వాలి… ఆ ఇమేజ్‌ని ఒక్కసారి పగలగొడితే… సూర్యే కాదు… ఈ ఆఫీస్ మొత్తం ఆమే ని తప్పుగా చూస్తుంది.
హిమ కళ్లలో క్రూరమైన సంతోషం మెరుస్తుంది.
హిమ చెప్పలేనంత ఆనందంతో...
అంటే… ఆమెనే తప్పు చేసినట్టు చూపించాలా?
రమేష్ చిరునవ్వు... అది ప్రేమ కాదు, విషం.
తప్పు చేసినట్టు కాదు హిమ… తప్పు చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టాలి. హిమ నెమ్మదిగా లేచి నిలబడుతుంది.
ఇప్పుడామె విరిగిపోయిన అమ్మాయి కాదు…
ప్లాన్‌లో భాగమైన శత్రువు.
హిమ.కూల్ గా నవ్వుతూ... సూర్య నావాడు కాకపోయినా… విశిష్టకి మాత్రం దక్కనివ్వను అని నిరూపిస్తాను డాడీ.
హిమ కళ్లలో అసూయ…
రమేష్ కళ్లలో కుట్ర…
ఆఫీసులో మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా... డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు బేబీ .అయితే ఇమీడియట్ గా కొనేయండి.
ఒకసారి గౌతమ్ నీ కలిస్తే అని రమేష్ అడుగుతాడు. అవసరం లేదు డాడ్ వాడొక వేస్ట్ ఫెలో.
ఒక్కొక్కసారి వేస్ట్ ఫెలోస్ తో కూడా పని అవుతాయి నువ్వే వెళ్లి నాలుగు సింపతి మాటలు మాట్లాడి విషయం కనుక్కో అప్పుడు మనం ఎలాంటి స్టెప్ వేయాలి అన్నది ఆలోచిద్దాం.
హిమ సరే అని గౌతమ్ ని కలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళుతుంది. జైల్లో చూడగానే ఏమిటి గౌతమ్ ఇలాగయింది అని రాని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది.
నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు అని చిరాకుగా అడుగుతాడు. అలా మాట్లాడతావేమిటి. మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము.
అలాంటిది నువ్వు జైల్లో ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పు. దీని అంతటికీ కారణం విశిష్ట నే కదా. వదలను.
నీ పగ నా పగ కలిపి నాశనం చేస్తాను అని అక్కడ ఊచలు పట్టుకొని ఆవేశంగా చెబుతుంది. ఆ మాటకి గౌతమ్ గట్టిగా నవ్వుతూ నువ్వు ఇంకా ఊహల్లోనే ఉన్నావా...
నా ఊహలన్నీ మబ్బులు విడినట్టుగా విడి ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డాను. నువ్వు ఆ విశిష్ట జోలికి వెళ్ళావు అంటే ఆడదానివి అని కూడా చూడకుండా నా పక్క సెల్లోనే కూర్చో పెడతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు.
నిజమే చెబుతున్నాను. మొత్తం ఆ జై సింహ ఫ్యామిలీ మొత్తం విశిష్ట కి సపోర్టుగా ఉన్నారు. ఒక్కరోజులోనే నేను పెట్టిన మనిషిని పట్టుకోవడంతో పాటు నా కంపెనీని కూడా క్లోజ్ చేసారు.
అలాంటిది నువ్వు వెళతావా.. ఏ నేనెందుకు చేయలేను అని పొగరుగా అడుగుతుంది. అసలు నీ దగ్గర ఏముందని వెళ్లి ఢీకొట్టగలవు.
టాలెంట్ ఉందా లేదు. పోనీ నిజాయితీ ఉందా సున్నా. ఇంకా ఎలా వెళతావు.
గౌతమ్ నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అవమానించడం లేదు నిజమే చెబుతున్నాను. నువ్వు ఈరోజు ఒక పాపులర్ ఆర్కిటెక్చర్ గా మారావు అంటే దానికి కారణం విశిష్ట వర్క్.
తన టాలెంట్ ని వాడుకునే నువ్వు ఇక్కడ వరకు వచ్చావు. నాకున్న అత్యాశతో విశిష్ట ని చీట్ చేశాను. నువ్వు నన్ను చీట్ చేసి ఆ సూర్య చెయ్యి పట్టుకోవాలి అనుకుంటున్నావు.
హిమ కంగారుగా నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆ సూర్య చెయ్యి నేను ఎందుకు పట్టుకోవాలి అనుకుంటాను. నీ గురించి నాకు తెలుసు.
ఒక తోడేలకి ఇంకో తోడేలు గురించి తెలియదా... ఇప్పుడు నీకు విశిష్ట మీద కోపం కూడా.. సూర్య విశిష్టాని ప్రేమించాడు అన్న విషయం మీదే.. అంతేగాని నా గురించే కాదు కదా..
నీ మంచి కోసమే చెబుతున్నాను. ఇప్పటికీ వచ్చిన పేరుని వాడుకుంటూ నీ కంపెనీ గ్రోత్ కి ఏదో ఒకటి చేసుకో. అంతేగాని విశిష్ట జోలికి వెళ్లడం కానీ సూర్య మీద మోజుతో గానే ఉన్నావు అనుకో...
నెక్స్ట్ నువ్వు మీ బాబు ఇద్దరూ వచ్చి నా పక్కనే కూర్చుంటారు. జాగ్రత్త అని వెళ్ళిపోతాడు. వెళుతున్న గౌతమ్ ని చూస్తూ ఆ ఊచలు గట్టిగా పట్టుకుని నాకే అడ్వైస్ ఇస్తావా..
నేనంటే ఏమిటో చూపిస్తాను. ఆ విశి ని నలుగురిలో తలెత్తుకో లేకుండా చేస్తాను అని అక్కడ నుండి వెళ్లిపోతుంది.
విశి రోజు వెళ్లినట్టే గానే ఆరోజు కూడా ఆఫీస్ కి వెళుతుంది. స్కూటీ పార్క్ చేసి భవ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.
భవ్య పరిగెత్తుకుంటూ వచ్చి సారీ లేట్అయ్యానా.. మరి కాదా పదా అని నవ్వుతూ వెళుతూఉంటారు. వీళ్లిద్దరూ వెళుతూ ఉంటే పక్కన ఒక లేడీ ఎంప్లాయి మీరు లేటుగా వస్తే ఏమయింది..
సూర్య సార్ మీ గ్రిప్ లో ఉన్నారు కదా అని వెటకారంగా మాట్లాడుతుంది. భవ్య కోపంగా అనబోతే విశి చేయి పట్టుకుని ఆపుతుంది.
చూడండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు. ఆ ఎంప్లాయ్ కోపంగా నన్ను కరెక్ట్ కాదు అంటున్నావా. ఎలా అనగలుగుతావు.
నేనిక్కడ ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాను. నువ్వు బ్యాక్ డోర్ నుంచి ప్రాజెక్ట్ పట్టుకుని వచ్చావు. సూర్య సార్ తో నీకున్న రిలేషన్ బట్టే కదా ఇక్కడ ప్రాజెక్ట్ నీకు ఇచ్చారు. లేకపోతే విక్రమ్ సార్ మీ వైపు చూస్తారా..
ఆ మాటకి విశికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇది నేను బ్యాక్ డోర్ నుంచి వచ్చింది కాదు. నా వర్క్ జెన్యూన్ గా ఉంది కాబట్టే విక్రమ్ సార్ తీసుకున్నారు.
మీకు నా గురించి తెలియకపోవచ్చు కానీ విక్రమ్ సార్ గురించి తెలుసు కదా.. ఎందుకు తెలియదు. సార్ గురించి మా అందరికీ బాగా తెలుసు కానీ నువ్వు సూర్య సార్ ని ఎలా ట్రాప్ చేసావో మాకు తెలియదు కదా.
ఆయన కొడుకు మీద ఉన్న ప్రేమతో ఒప్పుకొని ఉండవచ్చు. లేకపోతే స్టడీస్ అవ్వకుండానే నీతో ప్రాజెక్ట్ కోలాబరేట్ అవ్వడమా..
నీకన్నా బెస్ట్ ఆర్కిటెక్చర్ మన కంపెనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కనే పెట్టి నీకే ఎందుకు ఈ ప్రాజెక్టు ఇచ్చారు. ఏముంది నీలో అంత స్పెషల్.
భవ్య కోపంగా మీకు విశి గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు. తను ఇదే కాదు ఇప్పటికే చాలా ప్రాజెక్ట్ చేసింది.
కాలేజీలోనే తను చాలా బెస్ట్ స్టూడెంట్. బెస్ట్ స్టూడెంట్ అయినంత మాత్రాన ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇస్తారా ఆ ఎంప్లాయ్ ఇంకా చులకనగా మాట్లాడుతుంది.
ఏం జరుగుతుంది ఇక్కడ అన్న వాయిస్ వినపడగానే... ఆ ఎంప్లాయ్ భయపడుతూ చూస్తుంది.
వచ్చింది ఎవరు......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)