06-05-2026, 06:03 AM
Part - 121
ఆ అరుపులకి గోలకి విశి బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. సూర్య నవ్వుతూ ఏమయ్యింది. ఏమిటి ఇలా ఉన్నారు..
చెప్పాను కదా...బిజినెస్ వేరే.. ఫ్యామిలీ వేరు అని. భరత్ దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చెయ్యి వేసి నాకు ఇప్పటినుంచి సౌమ్యాతో పాటు ఇంకొక కూతురు కూడా ఉంది.
ఒరేయ్ ముందే చెబుతున్నాను నా కూతుళ్ళని ఎవరైనా ఏడిపించారే అనుకో అని శ్రీకర్ వైపు చూస్తాడు. సైలెంట్ గా ఒక నమస్కారం పెడితే అందరూ గట్టిగా నవ్వుతారు.
వైభవ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన వినయ్ నువ్వేంటి రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమీ లేదు నాన్న.
భరత్ మావయ్య వాళ్ళ కూతుళ్ళని ఏడిపిస్తే అంటున్నాడు. మరి అల్లుళ్ళని ఏడిపిస్తే ఆ మాటకి శ్రీకర్ మొఖం వెలిగిపోతుంది.
రాజ్ వైభవ్ భుజం మీద చెయ్యి వేసి.. ఒరేయ్ మీ అత్తలు టార్చర్ పెడుతున్నారు.. మేము పైకి ఏమైనా చెబుతున్నామా..
పళ్లు ఇకిలిస్తూ తిరగడం లేదా.. మీరు అంతే.. ఇది అన్యాయం మావయ్య.. మేము ఒప్పుకోము అని శ్రీకర్ గట్టిగా అంటాడు.
ఏది ఒప్పుకోరు రా.. వాళ్లకైతే ఒక న్యాయము మాకైతే ఇంకొక న్యాయమా..
అంతేగా అంతేగా..
విక్రమ్ వచ్చి ఇంకా ఆపండి.. కోడలు పిల్లని భయపెట్టకండి. రారా బంగారం. ఈరోజు నుంచి జై సింహా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యావు.
సో ఎంజాయ్ అని అన్నం కలిపి నోట్లో ముద్ద పెడతాడు. అది చూడగానే విశి కి కళ్ళు నీళ్లు తిరుగుతాయి. ఆ కళ్ళు ఇంకొక చేత్తో తూడుస్తూ... మేమంతా నీ వాళ్ళము సరదాగా కూడా నీ కళ్ళల్లో ఇవి చూడకూడదు అర్థమవుతుందా అని తినిపిస్తాడు.
వైభవ్ వచ్చి పెదనాన్న నాకు అంటే.. మీకు లేకుండానా అందరికీ తినిపిస్తాడు. అది చూసిన విశికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
విశి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అది అర్థం అయిన సూర్య అక్కడ ఉన్నంతసేపు కంట్రోల్ లో ఉంటాడు.
భోజనాలు అయిన తర్వాత సూర్య విశిని తన కాబిన్ కి తీసుకువెళతాడు. లాక్ చేయగానే వెంటనే గట్టిగా హగ్ చేసుకుంటుంది.
తల మీద చేయి వేసి ఏమైందిరా. చాలా థాంక్యూ దేవా సార్. ఇది నేను ఊహించలేదు..ఇంత మంచి ఫ్యామిలీ నాకోసం ఉంటుంది అని అస్సలు అనుకోలేదు తెలుసా..
నాన్న దూరమైన తరువాత అమ్మతో ప్రతిరోజు దిన దిన గండం గానే బ్రతికాను. ఇటు అమ్మకి ఏమవుతుందో.. రేపు తెల్లారితే ఖర్చులు ఎలాగా అన్న టెన్షన్ తోనే గడిపేసాను.
కానీ మీరు నా జీవితంలోకి వచ్చాక అని ఎక్కిళ్ళు పెడుతూ ఉంటే.. ష్.. అని నోటి మీద వేలు పెడతాడు. ఇప్పుడేనా డాడీ చెప్పారు సరదాగా కూడా నీ కళ్ళ వెంట ఇవి రాకూడదు అని.
కళ్ళు తుడుచుకుంటూ అవే వచ్చేస్తున్నాయి సార్ అంటుంది. ఆ వెచ్చటి కన్నీళ్లపైన పెదవులు ఉంచుతాడు.
సూర్య ఆమె కన్నీళ్లపై పెదవులు ఉంచిన క్షణం…
విశి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అవుతుంది.
ఆమె ముఖాన్ని రెండు చేతులతో మెల్లగా పట్టుకుని, నుదిటిపై తల పెట్టి నిశ్శబ్దంగా ఉంటాడు. మాటలు అవసరం లేని నిశ్శబ్దం అది.
విశి మాత్రం అతని షర్ట్ కాలర్ ని బిగించి పట్టుకుని ఇంకా దగ్గరగా చేరుతుంది.
సార్…
ఆ స్వరం కంపిస్తుంది.
ఇంకా సార్ అంటావా? అని చాలా సాఫ్ట్‌గా అడుగుతాడు. కోపం లేదు, హక్కు మాత్రమే.
ఆమె కళ్లలోకి చూస్తూ... ఇక్కడ నువ్వు ఒంటరిది కాదు విశి. భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఏడిపించిన ప్రపంచం ముందు నువ్వు ఒంటరిగా నిలబడాల్సిన పని కూడా లేదు అంటాడు.
విశి తల ఊపుతూ… అంత ధైర్యం నాకు ఎప్పుడూ రాలేదు సర్. మొదటిసారి… ఎవరో నన్ను ఇలా చూసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తోంది అంటుంది.
అతను ఆమెను తన ఛాతికి దగ్గరగా తీసుకుని, జుట్టులోకి వేళ్లు జారుస్తూ అది చూసుకోవడం కాదు… అంగీకరించడం. నిన్ను నువ్వుగా అంగీకరించడం అంటాడు.
ఆ మాటకి ఆమె మరింత బిగించి అతన్ని హగ్ చేస్తుంది.
ఆమె కన్నీళ్లు అతని షర్ట్ ని తడిపేస్తాయి.
ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు అని మెల్లగా నవ్వుతాడు.
ఇవి బాధ కన్నీళ్లు కావు సర్… రిలీఫ్ కన్నీళ్లు అంటుంది.
అతను ఆమెను కొంచెం వెనక్కి తీసి, చెంప మీద బొటనవేలు తో కన్నీటి గీతను తుడుస్తూ
అయితే ఇవి చివరివి. ఇక ముందు నీ కళ్ళలో ఉంటాయి నవ్వులే అంటాడు.
విశి పెదవులు స్వల్పంగా వణుకుతాయి. మీరు ఉన్నంతవరకు కదా… అంటుంది అణుకువగా.
సూర్య నవ్వుతూ నేను ఉన్నంతవరకు కాదు విశి… నువ్వు నిన్ను నమ్మేంతవరకు. కానీ ఆ దాకా నేను నీ పక్కనే ఉంటాను అంటాడు.
ఆ మాటలకి ఆమె కళ్ళు వెలిగిపోతాయి. మెల్లగా అతని భుజంపై తల పెట్టేస్తుంది. అతను ఆమె నుదిటిపై చిన్నగా ఒక ముద్దు పెట్టి ఇలా… ఇదే సరిపోతుంది. ఎక్కువేమీ అవసరం లేదు అంటాడు.
క్యాబిన్ లో బయట ప్రపంచం గోలంతా మాయమైపోయి
ఆ ఇద్దరి మధ్యన మాత్రం సాఫ్ట్ గా… వెచ్చగా…
భద్రత అనే భావమే మిగిలి ఉంటుంది.
గౌతమ్ ఫోన్ స్క్రీన్ వైపు అలా చూస్తూ నిలబడి పోతాడు.
చెవుల్లో ఇంకా అదే మాట మారుమోగుతోంది.
సూర్య దేవా ఒక్కరే…
సూర్య దేవాన్ష్ జై సింహ..
అంతే.
గుండె ఒక్కసారిగా దడపడుతుంది.
ఇన్నాళ్లూ అతడు నమ్ముకున్న కథ కూలిపోయింది.
సూర్య దేవా అంటే...
ఒక గ్రూప్.
ఒక నెట్‌వర్క్.
వెనుక ఎన్నో చేతులు.
కానీ ఇప్పుడు…
ఒక్కరే.
ఒక్క మనిషే.
గౌతమ్ నుదుటిపై చెమట చుక్క పడుతుంది.
ఒక్కడే అయితే… నన్ను ట్రేస్ చేయడం ఎంత టైం పడుతుంది?
అతడి మెదడు స్పీడ్ గా పరుగు పెడుతుంది .
అతడు చేసిన పనులు…
ఫేక్ డాక్యుమెంట్స్…
షెల్ కంపెనీలు…
మధ్యలో వేసిన మనుషులు…
అన్నిటికీ మూలం చివరికి గౌతమ్ అనే పేరు దగ్గరే ఆగుతుంది.
అతడు వెంటనే ల్యాప్‌టాప్ మూసేస్తాడు. రూమ్ లో అటూ ఇటూ తిరుగుతాడు.
విక్రమ్ జై సింహ..
సూర్య దేవాన్ష్ జై సింహా...
విశిష్ట....
మూడు పేర్లు…
మూడు ముప్పులు.
అతడికి అర్థమవుతుంది.
ఇప్పుడు నేరుగా ఎదురెళ్లడం ఆత్మహత్య. తప్పించుకోవాలి. కానీ పారిపోవడం కాదు.
గౌతమ్ ఫోన్ తీసుకుని ఒక నెంబర్ డయల్ చేస్తాడు.
అటు పక్కనుంచి లిఫ్ట్ చేయగానే ప్లీజ్ సేవ్ మీ. మా వల్ల కాదు. నువ్వు పెట్టుకుంది జై సింహా ఫ్యామిలీతో. మాకు ఎప్పుడూ ఫోన్ చేయొద్దు అని పెట్టేస్తారు.
ఏమి చెయ్యాలో అర్థం కాదు..దేవా ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వస్తుంది..అప్పుడు దేవా ఒక ఆర్డినరీ లెక్చరర్ అనుకుని విర్రవిగాను కానీ ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని కేవలం ఆ విశి కోసం ఒక లెక్చరర్ గా వచ్చాడా..
ఒక్కరోజులోనే ఫ్రాడ్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు అంటే నన్ను నాశనం చేయడం వాళ్లకి చిటికె వేసిన అంత పని. ఈలోపే నేను ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ సర్దుతూ ఉంటాడు.
కానీ ఈలోపే జరగవలసిన అనర్థం మొత్తం జరిగిపోతుంది. గౌతమ్ కంపెనీ తో డిల్స్ కుదుర్చుకున్న అందరూ క్యాన్సిల్ చేసుకుని రిటర్న్ మనీ ఇమ్మని గొడవ చేస్తూ ఉంటారు. షేర్స్ మొత్తం పడిపోతాయి.
బయటికి అడుగుపెట్టే సమయానికి సెక్యూరిటీ ఆఫీసర్లు రెడీగా ఉంటారు.
ఒకటికి నాలుగు కేసులు బుక్ అవుతాయి. మొదటిది విశిష్ట ని హెర్రాస్ చేయడం.. రెండు కంపెనీ లో ఫేక్ ఆర్కిటెక్చర్ ని పెట్టుకుని వేరే కంపెనీస్ ని మోసం చేయడం.
మూడు లేని ఫండ్స్ ని ఉన్నవిగా క్రియేట్ చేయడం నాలుగు వి. జె. స్ కంపెనీ లో ప్రాజెక్టు విషయంలో చీట్ చేయడం.
బెయిల్ కూడా దొరకనంత పకడ్బందీగా కేసు ఫైల్ చేస్తారు. అంతా అయిపోయింది అని గౌతమ్ కి అర్థమవుతుంది. అక్కడ ఉన్న సూర్యా మనిషికి కాల్ వస్తే...
లిఫ్ట్ చేసి ఓకే సార్ అని వీడియో కాల్ ఆన్ చేసి గౌతమ్ ముందు పెడతాడు. ఏంటి మిస్టర్ గౌతమ్ ఎలా ఉన్నావు. సూర్య అని పిడికిలి బిగిస్తాడు.
ఎస్ సూర్య దేవాన్ష్ జై సింహ అని పొగరుగా చెబుతాడు. నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాను విశి జోలికి రావద్దు అని. వార్నింగ్ వదిలేస్తున్నాడు వీడేమి చేస్తాడు అని లైట్ తీసుకున్నావు.
కానీ ఏమి జరిగింది. డెవలప్ అవుతున్నావు కదా నీ లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు అని వార్నింగ్ ఇస్తే లెక్క చేయలేదు.
ఆఖరికి మా కంపెనీలోనే చీట్ చేయడానికి కూడా రెడీ అయ్యావు.. ఇంకా నిన్ను వదులుతాను అని ఎలా అనుకున్నావు మిస్టర్.
గౌతమ్ చిన్నగా నువ్వు ఎవరో ముందే చెప్పి ఉండి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు కదా.. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ మనిషి పొజిషన్ బట్టి విలువ ఇవ్వడం కాదు.
వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి విలువ ఇవ్వాలి. నేనెవరో తెలిస్తే నా అడుగులకి మడుగులు వత్తేవాడివి.. నేను ఎవరో తెలియదు కాబట్టే నీ క్యారెక్టర్ మాకు తెలిసింది.
ఇప్పుడైనా జైల్లో బుద్ధిగా ఉండు. నీ ప్రవర్తన బాగుంది అంటే బయటకు వచ్చాక నువ్వు నిలబడడానికి హెల్ప్ చేస్తాను.. లేదు ఇలాంటి వేషాలే వేస్తాను అంటే జైల్లోనే ఆ పొగలో మాయమైపోతావు.
సూర్య మనిషి ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. గౌతమ్ సైలెంట్ గా సెక్యూరిటీ ఆఫీసర్లకి సరెండర్ అయ్యి జైలుకి వెళతాడు.
రమేష్ కంగారుగా హిమా... హిమా అని అరుస్తూ వస్తాడు. నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా హిమ ఏమైంది డాడీ ఎందుకు అలా అరుస్తున్నారు.
నీకు ఈ విషయం తెలిసిందా... ఏ విషయం గురించి. ఆ గౌతమ్ ని అరెస్టు చేశారంట. అది మనం ముందే ఊహించము కదా. ఇప్పుడు ఎందుకు అంత కంగారు పడుతున్నారు.
కంగారు పడవలసిన విషయమే ఉంది. ఆ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినా ఆ దేవా ఎవరో కాదు సూర్యనే..
హిమ రియాక్షన్......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)