Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#73
రుద్రం భజే! ఎపిసోడ్ 24



ఆ నలుగురు జింగ్ చెప్పిన మాట మాత్రమే వింటున్నారు అని నీతూ చెప్పడంతో జింగ్ రెండు కాళ్లు పట్టుకొని వెనక్కి తిప్పి వెన్నుముక మీద ఒక్క తొక్కు తొక్కి సముద్రంలోకి గిరాటు వేశాడు యోధ.

*************

గాలిలో ఎగిరి సముద్రంలో పడిన జింగ్ ని చూసి కోపంతో యోధ మీదికి పరిగెత్తుకుంటూ వచ్చారు నలుగురు.

అది చూసి పుష్కర్ చేతిలో ఉన్న గన్ తీసుకుని నలుగురిని షూట్ చేసింది నీతూ.

బుల్లెట్ దిగిన ఆగకుండా పరిగెత్తుకుంటూ వస్తున్నా  నలుగురిని చూసి "ఏంటి? వాళ్లకి బ్లడ్ కూడా రావడం లేదు నిజంగా మనుషులు కాదా!" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీతూ.

"ఒకవేళ రాక్షసులు ఏమో!" అని భయంగా  చూస్తూ చెప్పింది పూజా.

నలుగురిని ఆపడానికి వెళుతున్న నందని అపి "యోధ ని పోరాడనివ్వు తన లో ఉన్న శక్తి బయటికి రావాలి కదా!" అని చెప్పాడు భూషణ్.

ఆ మాట విని ఆశ్చర్యంగా భూషణ్ వైపు చూసి "అంటే! ఆ నలుగురు మనుషులు కదా!" అని అడిగాడు క్యూబ్స్.

"నాకు వాళ్ళ దగ్గర రేపాలా తాంత్రికుడి వాసన వస్తుంది అతను మనిషిని కుడా రాక్షసుడుగా చేయగలడు." అని చెప్పాడు భూషణ్.

"అసలు ఈ రేపాల ఎవరు?" అని అనుమానంగా అడిగాడు క్యూబ్స్.

"రావణాసురుడి సైన్యంలో తాంత్రిక విద్యలు తెలిసిన హిడాచి వంశానికి చెందినవాడు, వాళ్ళ దగ్గర రావణుడు కుడా చాలా విద్యలు నేర్చుకున్నాడు యుద్ధంలో ఆ హిడాచి వంశం వాళ్ళని ఆంజనేయుడు హతమార్చాడు.

ఒక మహిళ గర్భంతో ఉంది అని దయతలిచాడు దానికి పర్యవసానం ఆ వంశం వృద్ధి చెంది ఇప్పుడు రెపాల రూపంలో మన ముందుకు వచ్చడు." అని చెప్పాడు భూషణ్.

"అంటే! రేపాలా కి తన పూర్వీకులకుల శక్తి వచ్చిందా..?"  అని అనుమానంగా అడిగాడు క్యూబ్స్.

"దైవ శక్తి భూమి మీదకి వచ్చినప్పుడు క్షుద్ర శక్తి కూడా వస్తుంది కదా!" అని చెప్పాడు భూషణ్.

నలుగురిని కొడుతూ మళ్లీ మీదకి వస్తున్న వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నేను కొట్టిన దెబ్బలు వీళ్ళకి తగులుతున్నాయా లేదా? తిరిగి మళ్లీ వస్తున్నారు." అని అనుమానంగా చూస్తూ అడిగాడు యోధ.

నలుగురు కలిసి ఒక్కసారిగా యోధ మీద పడడంతో "ఎవరైనా వెళ్లి తనకి హెల్ప్ చేయండి." అని కంగారు చెప్పింది పూజా.

నలుగురిని రెండు చేతులతో ఎత్తి గిరాటు వేసిన యోధ దగ్గరకు వెళ్లి "పుర్రె పగిలితే కానీ దారిలోకి రారు, నీ శక్తి మొత్తం చేతిలోకి తీసుకుని తల మీద బలంగా ఒక్క దెబ్బ కొట్టు!" అని చెప్పాడు నంద.

అంతలో యోధ ఛాతి మీద ఉన్న సింబల్ మెరవడం చూసి "హనుమంతుడి శక్తి బయటికి వస్తుంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు భూషణ్.

మీదకి వచ్చిన నలుగురిలో ఒకడి తల మీద తన మోచేతితో బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు యోధ.

ఆ దెబ్బకి పుర్రె పగిలి చెవులు ముక్కు కళ్ళలో నుంచి రక్తం రావడం చూసి "గుడ్ షాట్!" అని చెప్పిన దీప్తి.

నలుగురులో ఒకడు చనిపోవడం చూసి అక్కడ నుంచి పారిపోతున్న ముగ్గురు వెంటపడి మరి పట్టుకొని తలలు పగలగొట్టాడు యోధ.

నలుగురు దారుణంగా చావడం చూసి భయంతో దగ్గరికి వచ్చి "నాకు చావాలని లేదు ఎలాగైనా బతికించండి." అని ఏడుస్తూ అడిగాడు యంగ్.

"మాయ వదిలినట్లు ఉంది." అని మనసులో అనుకున్నడు క్యూబ్.

"యోధ! మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." అని చెప్పాడు భూషణ్.

"ఆ కళింగ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా ఒక్కసారి కలిసి వద్దాము." అని చెప్పాడు యోధ.

"ఆ టైమ్ ఇంకా రాలేదు సూర్యాస్తమయం అయ్యే టైమ్ అయ్యింది కిరణాలు లేకపోతే మనం ఇక్కడి నుంచి వెళ్లలేము." అని చెప్పాడు భూషణ్

"సరే!" అని తన దగ్గర ఉన్న పద్మాన్ని తీసి సూర్యకిరణం పడేటట్లు పెట్టి బ్లాక్ హోల్  ఓపెన్ అవ్వడంతో యంగ్ చెయ్యి పట్టుకుని అడుగుపెడుతూ మేము వచ్చిన ప్లేస్ కి  వెళ్ళాలి." అని చెప్పాడు యోధ.

వెనకాల మిగతా వాళ్ళు కూడా  బ్లాక్ హోల్ లోకి వెళ్లిపోయారు.

************

కిజికిస్తాన్ లో ఆ ప్లేస్ కి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ లో రూమ్ లో నుంచి హడావుడిగా బయటకి వచ్చి కళింగ వైపు చూసి "సముద్రంలోకి వెళ్లడానికి బయలుదేరిన నా మనుషులు నలుగురు చనిపోయారు." అని కంగారుగా చెప్పాడు రేపాలా.

ఆ మాటకి షాక్ అయి చూస్తు "ఆ నలుగురిని ఎవరు చంపలేరు అని చెప్పావు కదా!" అని టెన్షన్ గా చూస్తూ  జింగ్ సెల్ కి కాల్ చేసి నాట్ రీచబుల్ రావడంతో సయ్యద్ వైపు చూసి

"వెంటనే అక్కడికి మనుషుల్ని పంపించండి ఏం జరిగిందో నాకు తెలియాలి." అని చెప్పాడు కలింగ.

"అది మాత్రమే కాదు చనిపోయిన నలుగురు శరీరాలు కూడా మన దగ్గరికి రావాలి అప్పుడు వాళ్ళని చంపింది ఎవరో నేను తెలుసుకుంటాను." అని చెప్పాడు రేపాలా.

పక్కనే ఉన్న చింగ్ యా వైపు చూసి "యంగ్ ని ఎలాగైనా  పట్టుకోండి నాకు వాడి బాడీలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కావాలి." అని కోపంగా చూస్తూ చెప్పాడు కళింగ.

"సరే!' అని చెప్పి తన మనుషులను తీసుకుని సముద్రం దగ్గరికి బయలుదేరాడు సయ్యద్.

*************
ఢిల్లీ హోటల్ రూమ్ లోకి రావడంతో బ్లాక్ హోల్ క్లోజ్ చేసి యంగ్ వైపు చూసి "ఇప్పుడు వీడిని ఏం చేద్దాము?" అని అడిగాడు యోధ.

"యుంగ్ ని అర్జెంటుగా ల్యాబ్ కి తీసుకెళ్లి  బాడీలో ఎటువంటి వైరస్ ఉందొ తెలుసుకోవాలి." అని చెప్పింది దీప్తి.

"నా శరీరంలో ఉన్న వైరస్ గురించి నాకు తెలుసు!" అని చెప్పాడు యంగ్.

ఆ మాటకి యంగ్ వైపు చూస్తూ "అసలు ఎవరు నువ్వు? నిన్ను సముద్రంలోకి తీసుకెళ్లి ఏమి చేయబోతున్నారు?" అని అడిగింది దీప్తి.

"నా పేరు షిలో యంగ్! నాది బీజింగ్ దగ్గర చిన్న పల్లెటూరు తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం నా మీద పడింది. ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగం కోసం వెతుకుతూ జింగ్ ని కలిసాను.

అతను ఒక ఆర్కియాలజిస్ట్ పురాతన నిధులు కోసం వెతుకుతూ ఉండేవాడు వాటి కోసం ఎక్కడెక్కడికో తిరిగేవాడు అది చూసి అతని దగ్గర పనిచేయడానికి ఎవరు ముందుకు రాలేదు అందుకే ఎక్కువ జీతం ఇస్తానని అనౌన్స్మెంట్ ఇచ్చాడు.

నా కుటుంబాన్ని కాపాడుకోవడం జింగ్ దగ్గర పనిలో చేరాను కొన్ని రోజులకి నా వర్క్ నచ్చడంతో కళింగ దగ్గరికి తీసుకువెళ్లాడు.

ఒకరోజు టిబెట్లో హిమాలయాల దగ్గర కొన్ని జంతువుల కళేబరాలు దొరికాయి అవి అంతరించిపోయిన భయంకరమైన జంతువులు అని తెలుసుకుని వాటి డిఎన్ఏ తో కళింగ ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు.

ఆ ప్రయోగానికి మనిషి కావాలని ఎంత డబ్బు అయినా ఇస్తాను చూడమని నాతో చెప్పాడు అప్పుడు నా ఇద్దరు అక్కల పెళ్లికి సహాయం చేస్తే ఆ ప్రయోగం నామీద చేయడానికి ఒప్పుకుంటానని ముందుకు వచ్చాను.

ఆ డీల్ కి సరే అని నన్ను  కొరకారం పర్వతాల్లో ఉన్న ల్యాబ్ దగ్గరికి తీసుకువెళ్లి రెండు సంవత్సరాలు అన్ని రకాల ప్రయోగాలు చేశారు అక్కడకి ఒక తాంత్రికుడుని కూడా తీసుకువచ్చారు కానీ ప్రయోగం విఫలమైంది ఆ కళేబరాలకు ప్రాణం రాలేదు.

అనుకోకుండా ఒక రోజు ఎక్వేరియం ఫుడ్ వేస్తూ ఉండగా నా చెయ్యి తెగి బ్లడ్ వాటర్ లో పడింది కొన్ని నిమిషాలకి లోపల ఉన్న చేపలు మొత్తం రాక్షసా చేపల్లాగా మారిపోయాయి.

అది చూసి వాటిల్లో ఒక చేపని టెస్ట్ చేసి తన ప్రయోగం సక్సెస్ అయిందని నా రక్తంతో నీటిలో ఉన్న జంతువులను రాక్షస జంతువులుగా మార్చవచ్చని తెలుసుకున్నాడు.

ఆ ప్రయోగం చేయడానికి కజకిస్తాన్ ని ఎంచుకున్నాడు నన్ను సముద్రం మధ్యలోకి తీసుకువెళ్లి వదిలేస్తారు అక్కడ ఉన్న చేపలు మిగతా జంతువులు నా శరీరాన్ని తినడం వల్ల రాక్షసా జంతువులుగా మారతాయి. " అని చెప్పాడు యంగ్.

ఆదివిని కోపంగా చూస్తూ "నీ ఫ్యామిలీ సుఖంగా ఉండడం కోసం వందల మంది ప్రాణాలు తీయడానికి రెడీ అయ్యావా.?" అని అడిగాడు యోధ.

"నేనేం చేస్తున్నానో నాకే తెలియని మైకంలో ఉన్నాను నువ్వు ఆ నలుగురిని చంపిన తర్వాతే మత్తు వదిలినట్లు అయింది నేను చేస్తుంది తప్పు అని తెలుసుకున్నాను." అని ఏడుస్తూ చెప్పాడు యంగ్.

"యోధ! ఇది ఇతని తప్పు కాదు కళింగ దగ్గర ఉండే తాంత్రికుడు రేపాలా చేసిన మాయ అతను మనిషిని తన ఆధీనంలో ఉంచుకోగలడు." అని చెప్పాడు భూషణ్.

ఆ మాట విని యంగ్ వైపు విచిత్రంగా చూస్తూ "అలా అయితే ఇప్పుడు నీ బ్లడ్ డేంజర్స్ వేపన్ ఆ..!" అని అడిగింది పూజా.

"అవును" నన్ను ఎలాగైనా మళ్ళీ మామూలు మనిషిని చేయండి నాకోసం నా ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది." అని రిక్వెస్ట్ గా అడిగాడు యంగ్.

అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హలో ముష్రు చెప్పు!" అని అడిగింది నీతూ.

"నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లడానికి వస్తున్నానని భూపాల్ సింగ్ ఫోన్ చేశాడు ఇప్పుడేం చేయమంటారు." అని అడిగాడు ముష్రు.

"ఒక్క నిమిషం లైన్లో ఉండు అని యోధ వైపు చూసి "ముష్రుని ఏం చేయమంటావు?" అని అడిగింది నీతూ.

ఫోన్ తీసుకుని "నీ దగ్గర ఆ వస్తువు ఉంది కదా ధైర్యంగా భూపాల్ సింగ్ తో పాటు వేళ్ళు!" అని చెప్పాడు యోధ.

"మీరు నిజంగానే చెబుతున్నారా..? ఈ వస్తువుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటారా?" అని కంగారుగా అడిగాడు ముష్రు.

"నేను చెబుతున్న కదా హ్యాపీగా వెళ్లి ఆ వస్తువు ఇచ్చి అక్కడే ఉండు నేను వచ్చి కలుస్తాను." అని చెప్పాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ "అర్థమైంది మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముష్రు.

ఫోన్ పెట్టేసిన యోధ వైపు చూసి "అది డూప్లికేట్ అని తెలిస్తే ముష్రుని చంపేస్తారు." అని కంగారుగా చెప్పింది దీప్తి.

"ఆ పద్మం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు తెలిసిన జింగ్ చనిపోయాడు." అని నవ్వుతూ చెప్పాడు యోధ.

"ఆ వస్తువు అసలైంది కాదు అని రేపాల కనిపెట్టగలడు." అని చెప్పాడు భూషణ్.



" రుద్రం భజే! ఎపిసోడ్ 24 " రచనకు రేటింగ్ ఇవ్వండి....
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 06-05-2026, 05:58 AM



Users browsing this thread: 1 Guest(s)