Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#72
రుద్రం భజే! ఎపిసోడ్ 23



భూషణ్ వాళ్ళ ముగ్గురు మీద అనుమానం వచ్చి మీరు ఏజెంట్లు కాదు ఎవరు మీరు అని అడిగిన యోధతో నీలో ఉన్న శక్తి ఇచ్చిన మాటకి సహాయం చేయడానికి వచ్చాము ఆ పద్మాన్ని అలకాపురికి చేర్చే బాధ్యత నీదే అని చెప్పారు.

నలుగురు వ్యక్తులు వచ్చి నీతూ వాళ్ళని రౌండ్ అప్ చేసి  గన్ చూపించి కారు ఎక్కండి అని బెదిరించడంతో వెళ్ళుతు తన దగ్గర ఉన్న కాయిన్ ని ప్రెస్ చేసింది పూజా.

**************

కారు దగ్గరికి వెళుతూ దూరంగా ఉన్న పుష్కర్ వాళ్ళ వైపు చూసి సైగ చేసిన నీతూ ని చూసి "మేడం వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు ఎలాగైనా కాపాడాలి." అని కారు వైపు వెళ్లారు ఇద్దరు.

చుట్టూ ఉన్న నలుగురు వైపు చూసి "అసలు ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు?" అని అడిగింది దీప్తి.

"యంగ్ తో పాటు సముద్రంలోకి వెళ్లడానికి బుక్ చేసిన అమ్మాయిలు మీ ముగ్గురే కదా! వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎందుకు?" అని అడిగాడు నలుగురులో ఒక వ్యక్తి.

ఆ మాట విని 'మన గురించి వీళ్ళకి తెలీదు.' అనుకుని "మేము వెనక్కి వెళ్లడం లేదు లగేజ్ తీసుకోవడానికి వెళుతున్నము." అని చెప్పింది పూజా.

"అయినా మమల్ని బెదిరిస్తున్నారు ఎందుకు? మీతో పాటు మేమురాము." అని కోపంగా చెప్పింది నీతూ.

అంతలో జింగ్ తో పాటు కారు దగ్గరికి వచ్చి నలుగురితో గొడవ పడుతున్న నీతూ వాళ్ళని చూసి "ఈ అమ్మాయిలు నాకు నచ్చలేదు నాతో పాటు సముద్రంలోకి వద్దు." అని చెప్పాడు యాంగ్.

"సరే!' అని నలుగురు వైపు చూసి "ఆ ముగ్గురిని పంపించేయండి మనకి లేట్ అవుతుంది స్పీడ్ గా వెళ్లాలి." అని చెప్పాడు జింగ్.

ఆ మాట విని ముగ్గురు ఊపిరి పీల్చుకుంటూ ఉండగా స్పీడ్ గా అక్కడికి వచ్చి నలుగురులో ఒక వ్యక్తి తలకి గన్ పెట్టి "మర్యాదగా మా మేడం వాళ్ళని వదలి పెట్టండి." అని చెప్పాడు ఏకవీర.

"మేడం! మేము వచ్చేసాము మీరు టెన్షన్ పడకండి." అని చెప్తున్న పుష్కర వైపు చూసి  "ఒరేయ్! మీరు కరెక్ట్ టైం కి రాలేదు పానకంలో పుడకల్లాగా వచ్చారు." అని కంగారుగా చూస్తూ చెప్పింది పూజా.

"మేడం అంటున్నాడు ఏమిటి?" అని ముగ్గురి వైపు అనుమానంగా చూస్తూ మొహం మీద ఉన్న చున్నీ తీసి "వీళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు మనల్ని ఫాలో అవుతూ వచ్చినట్లు ఉన్నారు పట్టుకోండి." అని చెప్పాడు జింగ్.

ఆ మాట విని ఏకవీర చేతిని వెనక్కి విరిచి గన్ తీసుకొని
ఐదుగురు చేతులు కట్టేసి కార్ లో కూర్చోబెట్టి జింగ్ వైపు చూసి "సార్! వీళ్ళని ఏం చేద్దాము." అని అడిగాడు నలుగురిలో ఒకడు.

"నేను యంగ్ ని తీసుకుని సముద్రం దగ్గరికి వెళుతున్నను  వీళ్లను కూడా అక్కడికి తీసుకురండి మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసుకుందాము." అని చెప్పాడు జింగ్.

"ఓకే సార్!" అని కార్ స్టార్ట్ చేసి నీతూ వాళ్ళని ఎక్కించి  జింగ్ కార్ వెనకాలే బయలుదేరారు నలుగురు.

పుష్కర్ వైపు కోపంగా చూస్తూ "మీరు మాకు బ్యాకప్ కాదు మమ్మల్ని పట్టించడానికి వచ్చారు, చక్కగా విడిచిపెట్టారు అనుకున్నాము అంతలో వచ్చి చచ్చారు." అని ఏడుపు ముఖం పెట్టుకుని చెప్పింది పూజా.

"మాకు ఏమి తెలుసు నీతూ మేడం సైగ చేసారు  వచ్చేసాము." అని చెప్పాడు పుష్కర్.

"టెన్షన్ పడకు కాయిన్ ప్రెస్ చేశావు కదా! యోధ వాళ్ళు వస్తారు." అని చెప్పింది దీప్తి.

నలుగురి వైపు చూస్తూ "ఏంటి మేడం! వీళ్ళు మనుషులు కదా అలా బిగుసుకుపోయి ఉన్నారు." అని డౌట్ గా అడిగాడు ఏకవీర.

"నాకు అదే డౌట్ గా ఉంది జింగ్ చెప్పిన మాట మాత్రమే వింటున్నారు. " అని నలుగురు వైపు చూస్తూ ఉంది నీతూ.

***********

యోధ వైపు చూసి "మనవాళ్లు డేంజర్ లో ఉన్నారు మనం వెంటనే వెళ్లాలి." అని చెప్పాడు క్యూబ్స్.

"మనం ఎక్కడికి వెళ్లనవసరం లేదు వాళ్లే ఇక్కడికి వస్తున్నారు." అని అక్కడకి వస్తున్నా రెండు కార్ల వైపు చూపించాడు భూషణ్.

"ఆ వెనక ఉన్న కార్లో మన వాళ్ళు ఉన్నారు." అని చెప్పాడు నంద.

"సరే! నేను ఆ కారు అపుతాను మీరు ముందు వచ్చే కార్ ని ఆపండి." అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు యోధ.

భూషణ్, నంద వైపు చూసి "నాకు యుద్ధం చేయడం రాదు వాళ్ళ సంగతి మీ ఇద్దరూ చూసుకోండి నేను చూస్తూ ఉంటాను." అని చెప్పాడు క్యూబ్స్.

"సరే!" అని తుమ్మెదలాగా మరి ఎగురుకుంటూ జింగ్ వాళ్ళ కార్ లోకి వెళ్లి వెనక సీట్ లో కూర్చున్నాడు భూషణ్.

డ్రైవింగ్ చేస్తూ అద్దంలో నుంచి వెనక సీట్లో ఉన్న మనిషిని చూసి షాక్ అయ్యి సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి "ఎవరు నువ్వు? అసలు కార్లోకి ఎలా వచ్చావు?" అని కంగారుగా గన్ చూపించి అడిగాడు జింగ్.

చేతిలో ఉన్న గన్ చూసి "అసలు మనుషులు ప్రతిదానికి దీనిని ఎందుకు వాడతారు?" అని గన్ ని పట్టుకుని రెండు ముక్కలు చేశాడు భూషణ్.

గన్ రెండు ముక్కలు అవడం భయంతో యంగ్ వైపు చూసి "కారు దిగు పారిపోదాము." అని కంగారుగా చెప్పాడు జింగ్.

పరిగెత్తుతున్న ఇద్దరిని చూసి "చిన్న విషయానికి పారిపోతున్నారు ఇక వీళ్ళు యుద్ధం ఏమి చేస్తారు." అనుకుంటూ కారు దిగాడు భూషణ్.

కారుకి ఎదురుగా నిలబడ్డ యోధని చూసి "మన బీమ్ బాయ్ వచ్చేసాడు ఇంక మనం సేఫ్!" అని సంతోషంగా చెప్పింది పూజా.

కార్ లో ఫాస్ట్ గా వెళుతూ  ఎదురుగా ఉన్న యోధని చూసి డ్రైవింగ్ చేస్తున్న మనిషి వైపు తిరిగి "వాడిని తొక్కించెయ్!" అని చెప్పాడు జింగ్ మనిషి.

కారు ఫాస్ట్ గా యోధ మీదికి వెళ్లడం చూసి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకున్నారు నీతూ వాళ్ళు.

యోధ దగ్గరకి కారు ఫాస్ట్ గా రావడం చూసి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి నంది రూపంలోకి మారి కంటి రెప్ప వ్యవధిలో తన కొమ్ములతో కారుని పైకి లేపి వెనక్కి తిప్పి కింద పెట్టి మామూలు మనిషిగా మరిగి యోధ వెనక నుంచున్నాడు నంద.

కారు బోర్లా పడి ఉండడం చూసి ఏమైందో అర్థం కాక వెనక్కి తిరిగి నంద వైపు చూస్తూ "నువ్వే ఏదో చేసావు నాకు అర్థమైంది. లోపల మన వాళ్లు కూడా ఉన్నారు మర్చిపోయావా..?" అంటూ కార్ దగ్గరికి వెళ్లి నీతూ వాళ్ళని బయటికి తీసాడు యోధ.

మరొకవైపు నుంచి పుష్కర్ వాళ్లని బయటికి లాగుతూ "ఎవ్వరికి ఏమీ అవ్వదు నిదానంగా వెనక్కి తిప్పి పెట్టాను." అని చెప్పాడు నంద.

బయటికి వచ్చి డ్రైవింగ్ సీట్లో ఉన్న వాడి వైపు కోపంగా చూస్తూ "నీకు డ్రైవింగ్ చేయడం కూడా రాదా గాడిద లాగా ఉన్నావు." అని కాలితో తంతు అడిగింది పూజా.

బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంటూ "ఇంక నయం కారు పిల్టీలు కొట్టిన మాకు ఏమీ అవలేదు అందుకే ఇసుకలో డ్రైవింగ్ చేయకూడదు అంటారు." అని భయంగా చూస్తూ చెప్పాడు పుష్కర్.

డ్రైవర్ ని కొడుతున్న పూజని పట్టుకుని చేతి కట్లు విప్పి "సేఫ్ గానే ఉన్నావు కదా ఇంక వాడిని కొట్టడం ఆపు!" అని చెప్పాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ "దానికి భయం వేస్తే అంతే పిచ్చి కోపం వస్తుంది. అయినా సడన్ కారు అలా వెనక్కి ఎలా తిరిగిపోయింది." అని డౌట్ గా అడిగింది దీప్తి.

"కజకిస్తాన్ లో అంతే త్వరగా పదండి అసలైన వాళ్ళు పారిపోతున్నారు." అని బోట్ ఎక్కుతున్న జింగ్ వాళ్ళని చూపించాడు నంద.

యంగ్ తో కలిసి వేగంగా బోట్ దగ్గరికి వెళ్లి లోపల ఉన్న క్యూబ్స్ ని చూసి "ఎవడ్రా నువ్వు?" అని అడిగాడు జింగ్.

"మీ ఇద్దరిని జాగ్రత్తగా తీసుకు వెళ్ళడానికి వచ్చాను." అని బోర్డ్ స్టార్ట్ చేశాడు క్యూబ్స్.

"కరెక్ట్ టైం కి వచ్చావు." అని లోపలకి ఎక్కి కూర్చుని "స్పీడ్ గా సముద్రం మధ్యలోకి వేళ్ళు!" అని చెప్పాడు జింగ్.

"సరే!" అని బోట్ ని ఒడ్డున అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు క్యూబ్స్.

అది చూసి "సముద్రం మధ్యలోకి వెళ్ళమంటే ఒడ్డున అటు ఇటు తిరుగుతున్నావు ఏమిటి?" అని కోపంగా అడిగాడు జింగ్.

"సార్! నాకు సముద్రం మధ్యలోకి వెళ్లడం అంటే భయం నేను మునిగిపోతే మళ్ళీ బయటికి రావాలి అంటే పర్వతాన్ని తీసుకువచ్చి సముద్రం మదనం చేయాలి." అని చెప్పాడు క్యూబ్స్.

"అసలు ఏం మాట్లాడుతున్నావు ఒక్క ముక్క అర్థం కాలేదు, మర్యాదగా సముద్రం మధ్యలోకి వేళ్ళు లేకపోతే చంపేస్తాను." అని తన చేతిలో ఉన్న సగం ముక్క గన్ ని చూపించాడు జింగ్.

నవ్వుతూ "మా యోధుడు వస్తున్నాడు కాస్త ప్రశాంతంగా ఉండండి." అని చెప్పాడు క్యూబ్స్.

అంతలో వేగంగా బోట్ దగ్గరికి వచ్చి లోపల ఉన్న ఇద్దరిని రెండు చేతులతో పట్టుకుని ఒడ్డుకి తీసుకువచ్చాడు యోధ.

జింగ్, యంగ్ ని రెండు చేతులతో పట్టుకొని వస్తున్నా యోదని చూసి "ఒక్కడే 24 మందిని ఎలా చంపేశాడో ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు ఒక్కొక్కడు యోధ చేతి సైజు కూడా లేరు." అని నవ్వుతూ చెప్పింది పూజా.

ఇద్దరిని కింద పడేసి కాలితో తొక్కుతున్న యోధని ఆపి యంగ్ ని పైకి లేపి "ఇతని మీద ప్రయోగం చేశారు అదేంటో మనం తెలుసుకోవాలి." అని చెప్పింది నీతూ.

"సరే! అయితే వీడిని చంపేస్తాను." అని జింగ్ వైపు చూసాడు యోధ.

ఆ మాట విని తన జేబులో ఉన్న ఐడీ కార్డు చూపిస్తూ "నేను మిలిటరీ ఆఫీసర్ ని నన్ను చంపితే మీరు రిస్క్ లో పడతారు.' అని భయంగా చూస్తూ అక్కడికి వస్తున్న తన మనుషులు వైపు చూసి "వీడిని చంపేసి నన్ను కాపాడండి." అని గట్టిగా అరిచాడు జింగ్.

అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళని చూసి "యోధ! ఆ నలుగురికి ఏలాంటి ఫీలింగ్స్ లేవు జింగ్ చెప్పిన పని మాత్రమే చేస్తున్నారు నాకెందుకో డౌట్ గా ఉంది." అని చెప్పింది దీప్తి.

ఆ మాట విని కింద పడి ఉన్న జింగ్ రెండు కాళ్లు పట్టుకుని వెనక్కి తిప్పి వెన్నుపూస మీద కాలు పెట్టి ఒక్క తొక్కు తొక్కి పైకి లేపి సముద్రంలోకి గిరాటు వేసి నలుగురు వైపు చూశాడు యోధ.................
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 06-05-2026, 05:55 AM



Users browsing this thread: 1 Guest(s)