05-05-2026, 07:21 AM
Part - 118
శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటే ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.. ఫ్యూచర్లో సౌమ్య కూడా నా కోసం ఇలాగే తీసుకు వస్తుందంటావా..
ఫోన్ చేసి అడగమంటావా.. వద్దులే ఇప్పుడు నీకోసం నేను వంట నేర్చుకోవాలా అని నా మీద అరుస్తుంది. మరి తెలిసి ఎందుకురా..
ఎందుకురా ఈ అమ్మాయిలు ముందు పిల్లల్లాగా ఉండి తర్వాత పులుల్లాగా మారిపోతారు. ప్రొపోజ్ చేయకముందు ఎంత క్యూట్ గా.. దొంగ చూపులు చూస్తూ నేను మాట్లాడడానికి ట్రై చేస్తే పారిపోతూ.. అబ్బబ్బ ఆ ఫీల్ ఎంత బాగుంది.
ఇప్పుడు చూడు నేను పరిగెత్తాలి వస్తుంది. ఏదైనా అంటే గేయ్యమని అరుస్తుంది.
అప్పుడు నువ్వు లైన్లోకి వస్తావో లేదో అని భయపడుతూ ఉండిఉంటది రా. ఇప్పుడు ఇంకా ప్రాబ్లం లేదు కదా ఒరిజినల్టి బయటికి చూపిస్తుంది అని నవ్వుతూఉంటే..
ఒరేయ్ మిత్ర ద్రోహి చిన్నప్పటినుంచి అందరం ఒకే చోట ఉన్నాము కదా.. ఆ మాత్రం తెలియదా. తెలిసి కూడా అనుమానం పడుతున్నావు అంటే ఏమనుకోవాలి రా.
నీ దగ్గర తనకి ఆ స్వతంత్రం వచ్చింది. మన అనుకున్నప్పుడే ఎలాగైనా మాట్లాడతారు ఆ ఫీల్ కంఫర్ట్ నువ్వు ఇచ్చావు కాబట్టే సౌమ్య తనలాగే ఉండగలుగుతుంది.
అర్థమైందా మొద్దు. అర్థమయింది దేవా సార్ అని సాగదీస్తూ నమస్కారం చేస్తాడు. ఏడిచావులే కానీ మీటింగ్ ఎంతవరకు వచ్చింది కనుక్కో..
అబ్బో ఎందుకు అంత కంగారు. ఔటింగ్ కి వెళ్ళదామని. దీనికి నేను ఒప్పుకోను. మా మేడం ఫుల్ బిజీగా ఉంది. దానికి నేనేం చేస్తాను రా. మరి నువ్వు అలా వెళ్ళిపోతే నేను ఎలా.
పైనుంచి కిందకి చూస్తూ ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా. మీరు అన్నవరం వెళ్లే ముందు ఏం చెప్పారు రా..
వైభవ్ ది కూడా క్లియర్ అయిపోతే మూడు జంటలు జాలీగా వెళదాం అన్నావు కానీ మమ్మల్ని అందరినీ వదిలేసి నువ్వు మాత్రం తిరుగుతున్నావు.
మీరు ప్లాన్ చేస్తే నేను వద్దంటానా.. గట్టిగా ప్లాన్ చేయండి. వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళదాం. ఇది బాగుంది. ఈ వీకెండ్ ఫిక్స్ అయిపోదాం.
మనం అనుకుంటే సరిపోదు మన హీరోయిన్స్ కూడా ఓకే చేయాలి వాళ్లు మనకన్నా బిజీ అయిపోతున్నారు కదా.
విశి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే సైలన్స్ అని చెప్పి లిఫ్ట్ చేసి చెప్పు క్యూటి. ఎక్కడున్నారు సార్ అని ఆనందంతో ఎగురుతుంది.
ఏంటి మేడం గారు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎక్కడున్నారు చెప్పండి ప్లీజ్.
నువ్వెక్కడున్నావో చెప్పు. నేనే వస్తాను. నిలబడిన ప్లేస్ చెప్తుంది. సరే వెయిట్ చేయి వస్తాను అని ఫేస్ కి మాస్క్ పెట్టుకునే వెళతాడు.
సూర్య ని చూడగానే దగ్గరికి వెళ్లి దేవా సార్ అని హగ్ చేసుకుంటుంది. ఏమిటి. ఎనీ గుడ్ న్యూస్. నా ప్రాజెక్టు ఓకే అయింది.
మీకు ఒక విషయం తెలుసా..నన్ను ఇక్కడ జాబ్ చేయమనడం లేదు. నాతో కొలాబరేట్ అవుతున్నారు. ఇది నా సెల్ఫ్ వర్క్ కింద తీసుకుంటాము అన్నారు.
ప్రాఫిట్ లో 75% నాకే ఇస్తున్నారు అని సంతోషంగా చెబుతోంది. సూర్య కళ్ళతోనే విక్రమ్ ని వెతుకుతాడు. దూరంగా నిలబడి చూసి నవ్వుతూ ఉంటే...థాంక్యూ అని లిప్ మూమెంట్ ఇస్తే. పోరా అని చేత్తో చూపించి వెళ్ళిపోతాడు.
శ్రీకర్ వచ్చి కంగ్రాట్స్ విశి అంటే సూర్యని వదిలి థాంక్యూ అన్నయ్య..మరి మాకు పార్టీ లేదా. చెప్పండి ఏది కావాలో చిటికెలో చేసేస్తాను.
అబ్బా ఇంట్లో ఎప్పుడైనా చేస్తావు. ఈ వీకెండ్ మన మూడు జంటలు అలా అలా జాలీగా వెళదాము. ఆ మాటకి సూర్య వైపు చూస్తే నవ్వుతూ ఉంటాడు.
ఏదైనా దేవా సార్ ఇష్టమే అని తలవంచుకుని చెబుతుంది. నా బంగారు చెల్లె. పెళ్లికి ముందే అన్నీ మా బావ ఇష్టమని చెబుతున్నావు.
అదే నా బుజ్జి పప్పీ ఉంది చూసావు ఏదైనా మా నాన్న ఇష్టమే అని చెబుతుంది. ఆ మాటకి ఒక్కసారిగా డల్ అవుతుంది.
శ్రీకర్ ఏం మాట్లాడాడో అర్థమయి.. నాలుక కర్చుకుని అంటే అది కాదు బంగారం ఇట్స్ ఓకే అన్నయ్య. తండ్రి ఉన్నప్పుడు ఎవరినైనా అదే చెబుతారు.
ఇప్పుడు నాకు తండ్రి అయినా, స్నేహితుడైన భర్త అయినా అంతా దేవాసారే కదా అని చేయి పట్టుకుంటుంది.
ఇన్ని రోజులు నువ్వు లక్కీ ఫెలో అనుకున్నాను కానీ అసలు లక్కీ ఫెలో మా వాడే. అదేమీ కాదు అన్నయ్య నేనే లక్కీ అంటుంది.
అయ్యో నీకు అర్థం కావడం లేదు రా అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటే. మీ ఇద్దరూ వాదన ఆపితే మనం బయటికి వెళదాం.
ఇక్కడ స్టాఫ్ అందరు మనల్ని చూస్తున్నారు. పద పదా అని బయటికి వచ్చేస్తారు.
బయటికి రాగానే భానుమతికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. అలాగే అవనికి కూడా చేసి చెబుతుంది.
అది చూసిన శ్రీకర్ అమ్మకి ఫోన్ చేశావు అంటే ఒక అర్థం ఉంది. అవని ఆంటీ కి కూడా ఎందుకు చేసావు. సూర్య వైపు నవ్వుతూ చూస్తూ..
మేమిద్దరం ఒకటే అయినప్పుడు అత్తయ్య కూడా నాకు అమ్మే కదా.. మరి అమ్మకి చేసి చెప్పడంలో వింత ఏముంది.
ఆ మాటకి సూర్య చాలా ప్రౌడ్ గా చూస్తాడు. నేను ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటున్నావు క్యూటీ అనుకుంటాడు.
సరే సరే పొగడ్తల కార్యక్రమం అయిపోతే అలా స్నాక్స్ తిని అలా అలా తిరిగి ఇంటికి వెళదాము..మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు ఎంజాయ్ అని శ్రీకర్ వెళ్ళిపోతాడు.
శ్రీకర్ వెళ్ళిపోయిన వెంటనే క్షణం పాటు నిశ్శబ్దం పడుతుంది. సూర్య చేతిలో ఉన్న ఫోన్‌ని జేబులో పెట్టుకుంటూ చూశావా… వాడి టైమింగ్ అని నవ్వుతాడు.
విశి కూడా నవ్వే ప్రయత్నం చేస్తుంది కానీ కళ్ళలో ఇంకో భావం దాగి ఉంటుంది. ఏమైంది? అని అడుగుతాడు సూర్య.
ఏం లేదు దేవా సార్ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సూర్య ఆగిపోతాడు.
క్యూటి … నన్ను దేవా సార్ అని పిలిచినప్పుడు నువ్వు ఇలా కళ్ళు దాచుకుంటే నాకు భయం వేస్తుంది. నీ కళ్ళల్లో ఎప్పుడూ నన్ను చూడగానే కనిపించే మెరుపు మాయం అవితే నాకు ఆందోళనగా ఉంటుంది ఏమైందిరా నాకు చెప్పవా అని లాలనగా అడుగుతాడు.
ఆ మాటకి విశి కళ్ళు తడుస్తాయి. నాకు భయం లేదు…
కానీ ఈరోజు అన్నయ్య అన్న మాటకి, నాన్న అన్న మాటకి… ఒక్కసారిగా నాన్న గుర్తొచ్చారు. నా గెలుపుని ఆయన సంతోషంగా మలుచుకుని మురిసిపోవడం గుర్తుకు వచ్చింది అంతే...
సూర్య మెల్లగా ఆమె దగ్గరకి వచ్చి, నువ్వు ఒంటరిగా లేవు క్యూటి.. నువ్వు నాన్నని మిస్ అయితే…
నేను నీకు లవర్ గా కాదు, ముందు నీకు భద్రతగా ఉంటాను.
ఆ మాటలు వింటూనే ఆమె చేయి గట్టిగా పట్టుకుంటుంది.
అందుకే కదా… నాకు ఈ విజయం వచ్చినప్పుడు మొదట మీ ముఖమే చూడాలి అనుకున్నాను.
నాన్నకి చెప్పాలి అనిపించినప్పుడు కూడా మీకే చెప్పాను.
సూర్య కళ్ళలో తడి నిలుస్తుంది. ఈ రోజు నీ ప్రాజెక్ట్ ఓకే అయిందని కాదు క్యూటి... నువ్వు నిన్ను నువ్వే నిలబెట్టుకున్న రోజు ఇది.
విశి నవ్వుతుంది. అయితే ఈ సెలబ్రేషన్ స్నాక్స్‌తో సరిపోతుందా? లేదు, అని సూర్య గట్టిగా చెబుతాడు.
ఈ వీకెండ్ వికారాబాద్ ఫారెస్ట్‌లో… మూడు జంటలు, ఒకే నవ్వు, ఒకే కథ.
విశి కళ్ళు మెరిసిపోతాయి. అయితే నేను కూడా ఓకే అంటున్నా… మా వారి ఇష్టమే. అని అల్లరి గా చెప్పగానే
సూర్య నవ్వుతూ...
ఇంకా పెళ్లి కాలేదు క్యూటీ… ఇప్పటికే ఇలా ఉంటే పెళ్లి తర్వాత నా పరిస్థితి ఏంటో అంటాడు.
విశి అతని భుజంపై తల ఆనిస్తుంది. పరిస్థితి కాదు దేవా సార్… జీవితం అంటారు దాన్ని.
ఆ మాటతో ఇద్దరూ ముందుకు నడుస్తారు. వెనక సూర్య కళ్లలో మాత్రం ఒక్క ఆలోచనే. నా క్యూటి ని నేను ఎప్పుడూ ఒంటరిగా అనిపించనివ్వకూడదు.
బైక్ స్టార్ట్ చేయగానే విశి టూ సైడ్స్ కి కూర్చుంటుంది. సరదాగా తిరిగి డిన్నర్ కూడా బయటే కంప్లీట్ చేసి విశి ని ఇంటి దగ్గర దింపుతాడు.
గుడ్ నైట్ క్యూటి. టేక్ కేర్. నైట్ ఫుల్ గా పడుకో ఓకేనా అని జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరుతాడు.
ఇదంతా దూరం నుంచి చూస్తున్న గౌతమ్ మాత్రం కోపంతో రగిలిపోతాడు. ఆఫీస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉంటాడు.
ఇంటికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ప్రాజెక్టు చేజారిపోయింది అది విశి చేతికి వెళ్ళింది అని తెలిసిన తర్వాత ఇంకా కోపం పెంచుకుంటాడు.
సూర్య ఇంటికి వెళ్లేటప్పటికి అందరూ హాల్లోనే ఉంటారు. డైరెక్టుగా వెళ్లే విక్రమ్ ని హగ్ చేసుకుని థాంక్యూ నాన్న. దేనికి రా అని అవని అడుగుతుంది.
ఆఫీసులో జరిగింది మొత్తం చెబుతాడు. అది విని విక్రమ్ ఒరేయ్ విశి నా కోడలు అని నేను ఈ ఫేవర్ చేయలేదు. బిజినెస్ బిజినెసే. రిలేషన్ రిలేషనే.
తనకి చాలా టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్ మన కంపెనీకి యూస్ అవ్వాలి. చేజారి పోకూడదు కాబట్టి... ఆ ఆఫర్ ఇచ్చాము.
ఇలాంటి ఆఫర్స్ అంతకుముందు కూడా చాలా ఇచ్చాము. కావాలి అంటే మీ మావయ్యని, బాబాయిని అడుగు .
నువ్వు ఇంకా పూర్తిగా బిజినెస్ లోకి రాలేదు కదా సో ఈ బిజినెస్ డీల్సు నీకు తెలియదు.
హిమ ఇంటికి వెళ్లి అరుస్తూ ఉంటుంది.. రమేష్ వచ్చి ఏమైంది బేబీ అలా అరుస్తున్నావు. ఆ విక్రమ్ కి ఎంత ధైర్యం డాడీ.
సెక్యూరిటీ ముందు నన్ను అవమానిస్తున్నాడు. రేపు ఆ జై సింహ ఫ్యామిలీకి కాబోయే కోడలని.. అందరూ నేను చెప్పినట్టు వినాలి..
అలాంటిది నన్ను ఏ విధంగా నువ్వు నా కొడుకు పక్కన సెట్ అవుతావు అని క్యూస్షన్ చేస్తాడా ఎంత ధైర్యం.
రమేష్ స్పందన......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)