05-05-2026, 07:13 AM
Part - 116
వైభవ్ చందు విషయం తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పోనీలే ఇప్పటికైనా వాళ్ళిద్దరి మనసులో ఉన్నది వాళ్ళకి అర్థం అయింది అనుకుంటారు.
అర్ధరాత్రి సమయానికి చందు ఇంటి దగ్గరికి వస్తారు. చందు బైక్ దిగి థాంక్యూ అంటుంది. చందు ని సూటిగా చూస్తూ చెయ్యి పట్టి లాగుతాడు.
హేయ్.. ఏం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది. ఇంకా ఏమీ చేయలేదు కానీ ఇంకొకసారి థాంక్స్ అని చెప్పావు అనుకో ఆ చెప్పిన చోటే ముద్దు పెట్టేస్తాను అర్థమవుతుందా..
ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి అయ్యగారికి చాలా ధైర్యం వచ్చినట్టు ఉంది. అది ఎప్పుడూ ఉంది.. నువ్వు ఓకే చేసిన తర్వాత ఇంకా ఎక్కువ అయింది.
నేనేమీ ఓకే చెయ్యలేదే.. నా బైకు ఎక్కి కాన్ఫిడెంట్గా నా భుజం పైన చేయి వేసినప్పుడే నాకు అర్థమైంది కానీ ఓవరాక్షన్ ఆపి వెళ్లి రెస్ట్ తీసుకో.
రేపు ఫుల్లుగా రెస్ట్ తీసుకో ఎల్లుండి ఏటైనా వెళదాము. ఇప్పటివరకు తిరిగింది చాలదా.. అది ఒకరికి ఒకరం ఇష్టమని తెలిసినా దూరంగా ఉన్నప్పుడు. ఇది దగ్గర అయినప్పుడు.
రెండింటికి చాలా తేడా ఉంది. తెలియకపోతే వెళ్లి మా అత్తయ్య దగ్గర ట్రైనింగ్ తీసుకో.. పొరపాటున కూడా మీ నాన్న దగ్గర తీసుకోకే..
బుంగమూతి పెడుతూ మా నాన్న చాలా గ్రేట్ తెలుసా.. అవును.. అవును.. మీ ఇద్దరిని భరించడం అంటే మాటలు కాదు కదా. ఇదిగో అని వేలు పెట్టి చూపిస్తుంది.
అప్పుడే ఇంట్లో అన్ని లైట్లు వెలుగుతాయి. రాజ్ బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చి మాట్లాడుకోండి లేదా గుడ్ నైట్ చెప్పుకుని ఎవరింటికి వాళ్లు వెళ్ళండి.
అలా రోడ్డు మీద ఉంటే చండాలంగా ఉంటుంది. చెప్పేనా ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలో అని బాయ్... ఐ లవ్ యు అని అరుచుకుంటూ వెళతాడు.
వెళ్తున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ కూతురు భుజం పైన చేయి వేసి ట్రిప్ ఎలా జరిగింది రా..చాలా బాగా జరిగింది నాన్న అని హగ్ చేసుకుంటుంది.
ఇప్పటికైనా వాడి మనసు అర్థం అయిందా.. పైకి అల్లరిగా ఉంటాడు కానీ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. నాకు ఈ రెండు రోజుల్లో అదే తెలిసింది నాన్న అని ఇద్దరు లోపలికి వెళతారు.
గదిలోకి వెళ్లి స్నానం చేసి మంచం పైన వాలిపోతుంది. రెండు రోజుల నుంచి జరిగినవన్నీ తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతుంది.
వైభవ్ ఇంటికి వచ్చేటప్పటికి అందరూ హాల్లోనే ఉంటారు. ఏమిటి ఇంత అర్ధరాత్రి అయినా ఎవరూ పడుకోకుండా దెయ్యాల్లాగా కాపు కాసారు.
పూజిత వెంటనే ఒక మగ దెయ్యం రావాలి. ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాము. అమ్మ అని గారంగా పిలుస్తాడు. నోరు ముయ్యరా...
చందు ఓకే చేసిన వెంటనే ఫోన్ చేసి చెప్పకుండా ఇంత అర్ధరాత్రి వచ్చి అమ్మ అని గారాలు పోతున్నావా.. అరే అక్కడ సిగ్నల్స్ లేవు.
సిగ్నల్స్ లేకుండానే సౌమ్య కి ఫోను వచ్చిందా.. ఎవరు చేశారు. మీతో పాటు వచ్చిన డాక్టర్స్ అని కళ్ళు ఎగరేస్తుంది.
మా వెనకాల స్పై పెట్టావా అని కోపంగా అడుగుతాడు. నీకు అంత అవసరం లేదు గాని ఎందుకు ఫోన్ చేయలేదు చెప్పు.
చేద్దామనుకునే సమయానికి సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ వచ్చే సమయానికి... మనసు అదుపులో లేదు అంతేనా అని వినయ్ అందిస్తాడు.
నాన్న మీరు కూడా నా.. లవ్ లో ఉన్న వాళ్ళని టీస్ చేస్తే అదొక మజారా.. నా కొడుకుని టీస్ చేసే అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు వదిలేసుకుంటాను.
తండ్రిని గట్టిగా హగ్ చేసుకుని మీరన్నది నిజమే నాన్న. ప్రేమించడం గొప్ప కాదు నమ్మకాన్ని ఇవ్వడమే ప్రేమ అని చెప్పారు.
ఈ రెండు రోజుల్లో చందుకి నేను అదే చూపించాను. థాంక్యూ ఫర్ యువర్ గైడెన్స్. చుట్టూ చేతులు వేసుకొని ఇప్పుడు హ్యాపీయేనా..
చాలా అంటే చాలా. పెళ్లి చేసేయండి నాన్న అని అడుగుతాడు. ఆ మాటకి అందరూ ఒరేయ్ ఇప్పుడే కదరా లవ్ లో పడ్డావు అప్పుడే పెళ్లంటే..
మేము చిన్నప్పటినుంచి లవ్ లోనే ఉన్నాము. అది అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది అంతే. మా అన్నయ్య ఎప్పుడు చేసుకుంటాడో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇప్పుడే పెళ్లి కావాలి.
దీనితో చెయ్యనా అని పూజిత చీపిరి కట్ట తీసుకు వస్తుంది. వద్దమ్మా నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు.
బాగా అలసిపోయాను గుడ్ నైట్ అని పరుగు అందుకుంటాడు. అందరూ నవ్వుకుంటూ వీడు ఒక్కరోజు లేకపోతేనే ఇల్లు బోసిపోయినట్టు ఉంటుంది కదా అనుకుంటారు.
మర్నాడు జిమ్ చేసే సమయంలో సూర్య విక్రమ్ తో మాట్లాడుతాడు. ప్రాజెక్టు తొందరగా ఓకే చేసేయండి నాన్న. ఏరా నీకు అంత కంగారుగా ఉందా.
నాకు కాదు నా వెనకాల ఉన్న వీళ్ళకి కంగారుగా ఉంది. నేను పెళ్లి చేసుకుంటే గాని సౌమ్య, చందు ముందుకు అడుగువేయరు.
ఇక్కడ వీడు అక్కడ శ్రీకర్ ఇద్దరు విలవిల లాడిపోతున్నారు. ఆ మాటకి నవ్వుతూ వయసు ప్రభావాలు అలాగే ఉంటాయి.
పెళ్లయితే గానీ తెలియదు ఆ టార్చర్ ఏమిటో. శ్రీకర్ కి ఎప్పుడో స్టార్ట్ అయింది గాని ఇంకా ఇంకా కావాలి అనుకుంటున్నాడు అని సూర్య నవ్వుతాడు.
భరత్ వచ్చి మరి నా కూతుర్ని చేసుకోవాలి అంటే ఒక అదృష్టం ఉండాలి రా... అలాగే ఇంకా ఇంకా కావాలి అనుకుంటారు.
మావయ్య నీ మీద వాడైతే గట్టిగా అలిగాడు. వై.. నేనేం చేశాను వాడు అలగడానికి... ఏది మాట్లాడినా సౌమ్య మా నాన్న గ్రేట్.. మా నాన్న ఒప్పుకున్నారు కాబట్టి అని చెబుతూ ఉంటే వాడికి ఎక్కడో కాలుతుంది.
వాడెప్పుడో ఫిక్స్ అయిపోయాడు. ఎంతమంది పుట్టిన ఆడపిల్లలే కావాలి అంట. అలా పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి రా..
భరత్ ఆ మాట అన్నాక జిమ్ అంతా నవ్వులతో నిండిపోతుంది. విక్రమ్ బార్బెల్ దించుతూ
అదృష్టం కాదు రా… ప్లాన్ ఉండాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం పెంచే విధానంలో ఉంటుంది. ఫ్యామిలీ వాల్యూస్ చూసే నేర్చుకుంటారు.
వినయ్ నవ్వుతూ శ్రీకర్ గాడికి ఎంతమంది కావాలి అంట.. వాడి లిస్టులో పదిమంది దాకా ఉన్నారు బాబాయ్ అని సూర్య కూడా నవ్వుతాడు.
ఒకటి కాదు, ఇద్దరు కాదు… అంత మంది పిల్లలంటే వీడు ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ చేస్తూ ఆఫీసులోనే ఉండిపోవాలి ఎందుకంటే ఆ ఇల్లు ఒక కిష్కిందకాండ లాగా ఉంటుంది.
సూర్య కళ్లెత్తి.. ఏంటి నాన్నా… ప్రాజెక్ట్ కాదు … లైఫ్‌టైం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని నవ్వుతాడు.
అంతలో ట్రెడ్‌మిల్ మీద ఉన్న వైభవ్ వినిపించేలా
పెదనాన్న … పెళ్లయితే అర్థమవుతుంది అంటున్నారు కదా… మీరు మాత్రం సేఫ్. మా పెద్దమ్మ లాంటి లక్కీ గర్ల్ వచ్చింది.
ఎప్పుడు పక్కన వాళ్లది చూస్తే చాలా హ్యాపీగా కనిపిస్తుంది రా. కానీ ఎవరే లోటుపాట్లు వాళ్లకే కనిపిస్తాయి. ఉన్నదాంట్లో తృప్తి పడితే సంతోషంగా ఉంటాము. లేని దానికోసం పరుగులు పెడితే అంతే..
రోజు గొడవలే ఈ విషయంలో మాత్రం మన ఫ్యామిలీ అంతా లక్కీ ఫెలోసే..
భరత్ చేతిలో టవల్ తిప్పుతూ.. అదే కదా… పెళ్లంటే ఒకటి కాదు రా. అమ్మాయిల కుటుంబం, అబ్బాయి కుటుంబం… మధ్యలో ఈ అబ్బాయిలు. జిమ్ కంటే ఇంట్లోనే ఎక్కువ కార్డియో అవుతుంది అంటాడు.
విక్రమ్ చిరునవ్వుతో.. అందుకే మీ అందరికీ ఒకే సలహా. పెళ్లి ముందు జిమ్‌లో బలం పెంచుకోండి. తర్వాత మానసిక బలం కావాలి అంటాడు.
సూర్య వెంటనే... అయితే శ్రీకర్‌కి డబుల్ డోస్ ఇవ్వాలి నాన్న. ఒకటి ఫిజికల్… ఇంకొకటి సౌమ్య మాటలకు తట్టుకునేలా అంటాడు.
భరత్ వెంటనే.. నువ్వు కూడా విశి ని పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. అప్పటివరకు నవ్వు అని రివర్స్ వేస్తాడు.
అంతలో విక్రమ్ మొబైల్ చూసి ఓహో… ఇదిగో కాల్. మీ అత్తయ్య. వీళ్ళిద్దరి లవ్ తెలిసిన తరువాత నివి అసలు ఊరుకోదు.
అర్జెంటుగా నేను విశి ప్రాజెక్ట్ ఓకే చేయాలి. లేకపోతే నివి వెళ్లి విశి కి అంతా చెప్పి మన ఇంటికి తీసుకు వచ్చిన తీసుకోవచ్చేస్తుంది.
అందరూ ఒక్కసారిగా అయ్యో…అని కలిసి అంటారు.
సూర్య నవ్వుతూ.. జిమ్ లో వెయిట్స్ ఎత్తాం నాన్న… కానీ ఈ ఫ్యామిలీ టాపిక్స్ ఎత్తడం మన వల్ల కాదు అంటాడు.
భరత్.. ఏం కాదు రా… ఇదే ఫన్. ఇదే ఫ్యామిలీ. నవ్వుకుంటూ భరించడమే అంటాడు. అందరూ మళ్లీ వర్కౌట్‌కి తిరిగిపోతారు…
వైభవ్ ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి రాజ్ మావయ్య చాలా త్యాగశీలి కదా నాన్న. ఇప్పుడు మీ రాజ్ మావయ్య ఎందుకు గుర్తొచ్చాడు.
నివి అత్తని, ఆ చందు ని భరించడం అంటే మాటలా.. ఫ్యాషన్ షో కి ఎన్ని చోట్ల తిప్పి ఉంటాడు. మరీ ఎక్కువ జాలి పడకరా..
ఫ్యూచర్లో తమరు కూడా అంతే. అప్పుడు నిన్ను చూసి మేము జాలిపడాలి. నేనేమి రాజ్ మావయ్య లాగా తిరగను.
ముందే చెప్పేస్తాను. నీ షాపింగ్ ఏదైనా ఉంటే చూసుకో గాని నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అని. అందరూ ఒకేసారి అబ్బా ఛ అంటారు.
ఏంటి డౌటా.. వైభవ్ తల మీద వెంట్రుకలు తీసి చూపిస్తూ ఇంతమందిని చూసామురా... అప్పుడే ఏమైపోయింది అని నవ్వుకుంటారు.
నవ్వుల మధ్య పెళ్లి ప్రాజెక్టులు మాత్రం ఇంకా పరుగెడుతూనే ఉంటాయి.
ఆఫీస్ వెళ్లిన తరువాత విక్రమ్ పీఏతో విశి కి ఫోన్ చేయిపించి ప్రాజెక్ట్ డేట్ ఫిక్స్ చేయిపిస్తాడు. సూర్యకి కాల్ చేస్తుంది.
సూర్య మీటింగులో ఉండి ఫోన్ సైలెంట్ లో ఉంటుంది. సార్ ఏంటి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. కాలేజ్ కి కూడా వచ్చినట్టు లేరు ఏమయింది అని టెన్షన్ పడుతూ అవని కి కాల్ చేస్తుంది.
విశి కాల్ చేస్తుందేమిటి అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేసి చెప్పరా.. అత్తయ్య దేవా సార్ బాగానే ఉన్నాడా అని కంగారుగా అడుగుతుంది.
విశి మాటలో కంగారు చూసి అవనికి కూడా కంగారు వస్తుంది. వాడికేమైంది పొద్దున్నే బానే ఆఫీస్ కి వెళ్ళాడు కదా అని అడుగుతుంది. ఆఫీసా అని ఆగిపోతుంది.
విశి తెలుసుకోగలుగుతుందా........

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)