05-05-2026, 06:58 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 22
షాపింగ్ మాల్లో కనిపించిన వ్యక్తిని దగ్గరకి వెళ్లి చూసి యోధ దగ్గరకి వచ్చి అతని దగ్గర చైనా మిలిటరీ ఐడి కార్డు ఉంది పేరు జింగ్ అతన్ని ఫాలో అయితే ప్రయోగం ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు అని చెప్పాడు భూషణ్.
***************
షాపింగ్ మాల్ లో డ్రస్ చేంజ్ చేసుకుని యోధ వాళ్ల దగ్గరికి వచ్చి "అతన్ని ఫాలో అవడానికి మేము రెడీ! మా మీద ఇంకా ఎవరికి అనుమానం రాదు." అని తల మీద చున్ని కట్టుకుంటూ చెప్పింది పూజా.
"నువ్వు అచ్చు ఏ దేశం అమ్మాయి లానే ఉన్నావు." అని చెప్పి అక్కడికి వస్తున్న నీతూ వాళ్ళ వైపు చూసి "జాగ్రత్తగా ఫాలో అవుతారా..?" అని అడిగాడు యోధ.
"యా.. అతనికి ఏ మాత్రం అనుమానం రాదు పుష్కర్ ఏకవీర మాకు బ్యాకప్ గా ఉంటారు మీరు వేరే వైపు చూడండి." అని చెప్పింది నీతూ.
"గుడ్! ఫాలో అయ్యేటప్పుడు వెపన్ హ్యాండిల్ చేయకండి ఒకవేళ దొరికిపోయిన అనుమానం రాకుండా ఉంటుంది." అని చెప్పి పుష్కర్ వైపు చూసి "మీరు ఇద్దరు ఎలర్ట్ గా ఉండండి." అని చెప్పాడు యోధ.
"ఓకే సార్! ఏదైనా ప్రాబ్లం అయితే కమ్యూనికేషన్ చేయడానికి ఫోన్లు కూడా ఏమి పని చేయడం లేదు లోకల్ సిమ్ తీసుకుందాము అంటే పాస్పోర్ట్ కూడా లేదు." అని చెప్పాడు పుష్కర్.
తన జేబులో నుంచి ఒక కాయిన్ తీసి నీతూ చేతిలో పెట్టి "ఇది కొత్త టెక్నాలజీతో తయారు చేసింది ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఆ కాయిన్ గట్టిగా ప్రెస్ చేయండి. మీరు ఉన్న లొకేషన్ మాకు తెలిసిపోతుంది." అని చెప్పాడు క్యూబ్.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "క్యూబ్! నీ గురించి భూషణ్ చెబుతుంటే ఏమో అనుకున్నాను నువ్వు నిజంగా గ్రేట్!" అని కాయిన్ వైపు చూస్తూ చెప్పింది దీప్తి.
"పొట్టి వాళ్ళు ఎప్పుడు గట్టివాళ్లే!" అని కాయిన్ తీసుకొని తన జేబులో పెట్టుకుంది పూజా.
"త్వరగా వెళ్ళండి జింగ్ ఇక్కడి నుంచి బయలుదేరాడు." అని కజకిస్తాన్ కరెన్సీ ఇచ్చాడు క్యూబ్.
అది చూసి మనం ఇక్కడే ఉన్నాము కదా నువ్వు ఎప్పుడు వెళ్లి విత్ డ్రా చేసావు." అని అనుమానంగా అడిగాడు యోధ.
"ఆ విషయం చెప్తాలే కానీ ముందు మీరు వెళ్ళండి." అని అక్కడి నుంచి నీతూ వాళ్ళని పంపించాడు క్యూబ్.
జింక్ కారు వెనకాలే టాక్సీలో ఫాలో అవుతూ వెళ్లారు నీతూ వాళ్ళు.
నీతూ వాళ్ళ వెనకలే వేరే టాక్సీలో ఫాలో అవుతూ వేళ్లారు పుష్కర్, ఏకవీర.
"మనం వేరే వైపు వెతుకుదామా?" అని అడిగాడు నంద.
"సరే!" అని షాపింగ్ మాల్ లో నుంచి సముద్రం దగ్గరికి వెళ్లి ముగ్గురు వైపు అనుమానంగా చూస్తూ "మీ మాటలు చేతలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, మీరు కచ్చితంగా ఏజెంట్స్ కాదు ఎవరు మీరు?" అని డౌట్ గా చూస్తూ అడిగాడు యోధ.
"నాయక్ సర్ నీకు కాల్ చేసి మమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పారు కదా మళ్లీ ఎవరు అని అడుగుతావేమిటి?" అని కంగారుగా చూస్తూ అడిగాడు నంద.
"మాకు హెల్ప్ చేస్తున్నారు కానీ మీరు ఏజెంట్స్ కాదు, ఆ పద్మం ఎలా పనిచేస్తుందో దొరికిన సాధువులకి తెలియదు, ప్రయోగం చేయడానికి రెడీ అయిన రెండు దేశాలకి తెలియదు, కానీ మీ ముగ్గురికి ఆ పద్మం గురించి అన్ని విషయాలు తెలుసు!" అని భూషణ్ వైపు చూస్తూ
"ముష్రూ రూమ్లో ఎవరికి కనపడకుండా వెళ్లి బ్యాగులో వస్తువుని పెట్టావు, జింగ్ పర్సు బయటకు తీయకుండానే అతని దగ్గర మిలిటరీ ఐడి ఉందని చెప్పావు,ముష్రు చెప్పకుండానే ఆ ప్రయోగం కజకిస్తాన్ లో జరుగుతుంది అని చెప్పావు." అని క్యూబ్ వైపు చూసి
"నువ్వు ఇక్కడి నుంచి కదలకుండానే ఈ దేశం కరెన్సీ బయటికి తీస్తున్నావు ఏవో కాయిన్స్ ఇచ్చి కొత్త టెక్నాలజీ అని నాతోనే కబుర్లు చెబుతున్నవు ఇంతకీ మీరు ముగ్గురు ఆ వస్తువును దొంగిలించడానికి వచ్చిన మాంత్రికుల లేక రావణాసురుడి సైన్యంలో రాక్షసులా..?" అని అడిగాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "నీలో ఉన్న శక్తి ఇచ్చిన మాటకి సహాయం చేయడానికి వచ్చాము." అని చెప్పాడు నంద.
"ఏంటి? నాలో ఉన్న శక్తి ఇచ్చిన మాటకా..! అసలు నాలో ఏ శక్తి లేదు." అని చెప్పాడు యోధ.
యోధ షర్ట్ ని పక్కకు జరిపి ఛాతి మీద ఉన్న గద సింబల్ ని చూపించి "నీలో ఉన్న శక్తి ఇదే!" అని చెప్పాడు భూషణ్.
"అవును! నీ తండ్రి ఆ వస్తువుని దుర్మార్గుల బారి నుంచి కాపాడినప్పుడే ఆ శక్తీ నీ తల్లి గర్భంలోకి ప్రవేశించి తన దగ్గరకు వచ్చేటట్లు చేసుకుంది. అందుకే నువ్వు ఆ ఆంజనేయుడు సన్నిధిలోనే పెరిగావు." అని చెప్పాడు క్యూబ్స్.
"నేను హనుమ భక్తుడినే కానీ మీ మాటలు ఎలా నమ్మాలి అసలు మీ ముగ్గురు ఎవరు?" అని అడిగాడు యోధ.
"నీ శరీరంలో ఉన్న శక్తి యాక్టివేట్ అయినప్పుడు మీము ముగ్గురం ఎవరమో నీకు తెలుస్తుంది. అప్పటివరకు మమ్మల్ని నమ్మి ముందుకు నడువు అలాగే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు." అని చెప్పాడు భూషణ్.
"నాలో ఉన్న శక్తి హనుమంతుడిది అంటున్నారు అంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ పద్మాన్ని కుబేరుడి నగరానికి చేర్చాలి అంతే కదా!" అని అడిగాడు యోధ.
"అవును! అది నీ చేతుల మీదే జరగాలి ఇది విధి నిర్ణయం కానీ దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి వాటిని దాటుకుని నువ్వు ముందుకు వెళ్లాలి నీకు మార్గం చూపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము." అని చెప్పాడు నంద.
"ఆ పద్మ నా దగ్గరే ఉంది మీకు ఇస్తాను తీసుకువెళ్లి అలకాపురిలో భద్రంగా ఉంచండి." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "హిమాలయాలలో ఉన్న ఆ పద్మాన్ని వెతికి కుబేరుడికి ఇవ్వడం దైవానికి చేతకాక కాదు, సృష్టిలో జరిగే ప్రతి పనికి ఏదో ఒక కారణం ఉంటుంది.
అలాగే ఆ పద్మం నీ ద్వారా అక్కడికి చేరుకోవడానికి కూడా ఏదో ఒక కారణం కచ్చితంగా ఉండే ఉంటుంది." అని చెప్పాడు నంద.
"అవును! రావణాసురుని సంహరించడానికి నారాయణడు మానవ అవతారం ఎత్తి 14 ఏళ్లు వనవాసం చేసి లక్ష్మీ మాతను దూరం చేసుకుని వనరుల సహాయం తీసుకుని సముద్రం దాటి వెళ్లి యుద్ధం చేయవలసిన అవసరం లేదు.
ఆయన తలుచుకుంటే సుదర్శన చక్రంతో అంతం చేసేవారు కానీ ఆ 14 సంవత్సరాల వనవాసంలో కొన్ని లక్షల మంది రాక్షసులను సంహరించారు దైవానికే కాదు మానవుడికి కూడా ఏదైనా సాధ్యమని నిరూపించారు.
నాయకుడు ఎలా ఉండాలో చూపించారు ప్రజలను ఎలా పరిపాలించాలో నేర్పించారు కానీ మనకు కనిపించేది రావణాసురుని అంతం చేయడం మాత్రమే వెనుకల చాలా ఉంటుంది." అని చెప్పాడు భూషణ్.
"అంటే! ఈ పద్మాన్ని తీసుకుని అలకాపురి నగరానికి వెళ్లే మధ్యలో మనకి చాలామంది ఎదురవుతారు అన్నమాట!" అని చెప్పాడు యోధ.
"అవును! ఈ కలికాలంలో సృష్టిని నాశనం చేయడానికి చాలా దుష్టశక్తులు మానవ రూపంలో ప్రయత్నిస్తూ ఉంటాయి వాడిని అంతం చేసే పని కుడా మానవుడిదే అతనికి దైవం సహాయం మాత్రం చేస్తుంది." అని చెప్పాడు నంద.
"అంటే! మీరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన దేవుళ్ల!" అని అడిగాడు యోధ.
"నువ్వు ఎలాగైనా అనుకో ఈ పని పూర్తి వరకు నీకు తోడుగా ఉంటాము." అని చెప్పాడు క్యూబ్స్.
"మీరు నాకు సహాయం చేసిన చేయకపోయినా నా స్వామి ఇచ్చిన మాట కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే! ఎంతమంది నా దారికి అడ్డు వచ్చినా ఈ పద్మాన్ని అలకపురికి చేర్చే బాధ్యత నాది." అని చెప్పాడు యోధ.
************
జింగ్ వెనకాల వెళుతూ అతను కారు దిగి ఒక హోటల్లోకి వెళ్లడం చూసి "మనం కూడా లోపలికి వెళదాము." అని చెప్పింది నీతూ.
హోటల్ లోపలికి వెళుతున్న ఒక అమ్మాయిని చూసి "దీప్తి! మనం వేసుకున్న డ్రస్సులు హోటల్లో సర్వార్స్ వేసుకునేది." ఆ చికాకుగా చూస్తూ చెప్పింది పూజా.
ఆ మాట విని "అది కూడా మనం మంచికే నేను సర్వర్ లాగా లోపలికి వెళ్ళి జింగ్ ఏం చేస్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో చూస్తాను." అని చెప్పింది నీతూ.
"ఓకే! మేమిద్దరం ఇక్కడే వెయిట్ చేస్తాము ఏదైనా అవసరమైతే సిగ్నల్ ఇవ్వు చాలు!" అని చెప్పింది పూజా.
"సరే!" అని లోపలికి వెళ్లి జింగ్ ఒక టేబుల్ దగ్గర కూర్చోవడం చూసి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకువెళ్లి టేబుల్ మీద పెట్టి "సార్ ఆర్డర్!" అని అడిగింది నీతూ.
"వన్ మినిట్!" అని తన టేబుల్ దగ్గరికి వస్తున్న మనిషిని చూసి "హాయ్ యంగ్! మెడిసిన్ వేసుకున్నావా..?" అని అడిగాడు జింగ్.
"ఎస్ సార్! సముద్రంలోకి వెళ్లడానికి నేను రెడీ మీరు చెప్పినట్లు నా ఫ్యామిలీ కి డబ్బు అందింది." అని సంతోషంగా చెప్పాడు యాంగ్.
ఆ మాటకి నవ్వుతూ ఫోన్ తీసి కాల్ చేసి "మిస్టర్ కళింగ! సముద్రంలో మీరు చెప్పిన ప్లేస్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నాము." అని చెప్పాడు జింగ్.
"గుడ్! నువ్వు యాంగ్ ని సముద్రం మధ్యలో వదిలిపెట్టి వెనక్కి వచ్చేయ్! అక్కడ నిన్ను పికప్ చేసుకోని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేయడానికి మనిషి రెడీగా ఉంటాడు." అని చెప్పాడు కళింగ.
"ఓకే థాంక్యూ!" అని నీతూ వైపే చూసి "టూ సూప్స్!" అని చెప్పాడు జింగ్.
"ఓకే సార్! అక్కడినుంచి హడావుడిగా దీప్తి వాళ్ళ దగ్గరికివచ్చి "కాయిన్ ప్రెస్ చెయ్! మన అనుమానం నిజమే అతను కళింగతో మాట్లాడాడు, ఇప్పుడు సముద్రంలోకి ఒక మనిషిని పంపించబోతున్నారు." అని కంగారుగా చెప్పింది నీతూ.
అంతలో నలుగురు అక్కడికి వచ్చి నీతూ వెనకాల గన్ పెట్టి "సైలెంట్ గా వచ్చి కార్ ఎక్కండి." అని చెప్పాడు వాళ్లలో ఒకడు.
ఆ మాట విని టెన్షన్ గా చూస్తూ "కూల్ కూల్ గన్ లోపల పెట్టు!" అని చెప్పి కారు దగ్గరికి వెళుతూ జేబులో ఉన్న కాయిన్ ప్రెస్ చేసింది పూజా.
అంతలో కారు దిగి అక్కడికి వస్తున్న పుష్కర్ వైపు చూసి సైగ చేసింది నీతూ.

" రుద్రం భజే! ఎపిసోడ్ 22 " రచనకు రేటింగ్ ఇవ్వండి......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)