Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#66
రుద్రం భజే! ఎపిసోడ్ 21

మనం అంత ఫాస్ట్ గా కజకిస్తాన్ వెళ్లడానికి నీ దగ్గర ఏమైనా మంత్రాలు ఉన్నాయా అని అడిగిన పూజ వైపు చూసి యోధ దగ్గర పద్మం ఉంది కదా అని చెప్పాడు క్యూబ్స్.

***************

క్యూబ్స్ చెప్పిన మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "నా దగ్గర ఉన్న పద్మం ద్వారా ఎలా వెళ్తాము?" అని అడిగాడు యోధ.

"మేము తెలుసుకున్న దాని బట్టి ఆ పద్మం యాక్టివేట్ అయితే బ్లాక్ హోల్ ఓపెన్ అవుతుంది అప్పుడు మనం ఏ ప్లేస్ కి కావాలి అంటే ఆ ప్లేస్ కి ఈజీగా వెళ్లొచ్చు!" అని  చెప్పాడు నంద.

'బ్లాక్ హోల్ లోకి మనం వెళితే ఎక్కడికి వెళుతున్నామో కుడా తెలియదు అటువంటిది మనం అనుకున్న ప్లేస్ కి ఎలా వెళ్లగలము?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"ఆ పద్మానికి ఉన్న ప్రత్యేకత అదే మనం అనుకున్న ప్లేస్ కి తీసుకు వెళుతుంది." అని చెప్పాడు భూషణ్.

"మరి పద్మాన్ని ఆక్టివేట్ చేస్తే అలకాపురి నగరం తలుపులు తెరుచుకుంటాయి అని చెప్పారు." అని అనుమానంగా అడిగింది నీతూ.

"కైలాస పర్వతంలో అలంకాపురి నగరం ఎక్కడ ఉందో ఎవ్వరు కనిపెట్టలేరు కానీ ఈ పద్మం వాళ్ళ ఏర్పడిన బ్లాక్ హోల్ ద్వారా ఆ నగరనికి చేరుకోవచ్చు తర్వాత అక్కడ ఉన్న సైన్యాన్ని గెలిస్తే ఆ నగరంలోకి ఎంటర్ అవుతారు." అని చెప్పాడు నంద.

"అంటే! అప్పుడు రావణాసురుడు పంపించిన రాక్షసులు ఈ పద్మం ద్వారా ఏర్పడిన బ్లాక్ కోల్ నుంచి ఆ నగరం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న శివగణాల చేతిలో ఓడిపోయారా..?" అని అడిగింది పూజా.

"కచ్చితంగా అలాగే జరిగి ఉంటుంది ఎందుకంటే అప్పుడు మనం ఎవరం లేము కదా!" అని చెప్పాడు క్యూబ్స్.

"ఈ పద్మం యాక్టివేట్ చేయాలి అంటే లేజర్ కిరణాలు ఉండాలి కదా!" అని డౌట్ గా అడిగాడు పుష్కర్.

"సూర్యకిరణం కన్నా  లేజర్ కిరణం పవర్ ఫుల్ ఆ..!" అని నవ్వుతూ అడిగాడు భూషణ్.

"మీరు చెప్పింది కరెక్టే! లేజర్ కిరణాలు కన్నా సూర్యకిరణాలే పవర్ఫుల్, కానీ ఈ పద్మం గురించి ఇప్పటివరకు ఎవరకి తెలియదు మీ ముగ్గురికి ఎలా తెలిసింది?" అని అనుమానంగా అడిగింది దీప్తి.

"మన క్యూబ్స్ ఉన్నాడు కదా ఇటువంటి విషయాలు కనిపెట్టడంలో దిట్ట!" అని చెప్పాడు నంద.

"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మనం ఈ పద్మం ద్వారా ఓపెన్ అయిన బ్లాక్ హోల్ లోంచి వెళ్లి మళ్లీ ఆ పద్మం ద్వారా ఏర్పడిన బ్లాక్ హోల్ ద్వారానే వెనక్కి రావాలి అలా జరగకపోతే మన ప్రాణాలకు ప్రమాదం!" అని చెప్పాడు  క్యూబ్స్

"అంటే! ఆ పద్మం మన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు." అని చెప్పాడు యోధ.

"కరెక్ట్! అంతే కాదు పద్మాన్ని యాక్టివేట్ చేసి మొదట ఎవరైతే లోపలికి ఎంటర్ అయ్యారో మనం రిటన్ అయ్యేటప్పుడు కూడా ఆ మనిషే ఫస్ట్ ఏంట్రార్ అవ్వాలి." అని చెప్పాడు క్యూబ్స్.

"అబ్బో!:ఈ పద్మానికి చాలా రూల్స్ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా వాడాలి లేకపోతే మనం మటష్!" అని చెప్పింది పూజా.

"మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాము అసలు ఈ పద్మం ఎప్పటిదో కదా వర్కింగ్ లో ఉందో లేదో!" అని డౌట్ గా అడిగాడు ఏకవీర.

"ఆ  పద్మం మధ్యలో సూర్యకిరణం పడేటట్లు ఉంచండి పనిచేస్తుందో లేదో అర్థమవుతుంది." అని చెప్పాడు భూషణ్.

"మనం ఈ పద్మాన్ని యూస్ చేసే ముందు సార్ కి ఒక మాట చెప్పాలి." అని చెప్పింది నీతూ.

"మనం కొన్ని విషయాలలో ఓన్ డెసిషన్ తీసుకోవాలి ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తే జరగాల్సింది జరిగిపోతుంది. అసలు వీళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో తెలియాలి కదా!" అని తన బ్యాగ్ లో ఉన్న పద్మాన్ని బయటకి తీసాడు యోధ.

"సన్ లైట్ పడాలి కదా!" అని రూమ్ కిటికీ ఓపెన్ చేసింది పూజా.

పద్మం మీద సూర్యకిరణాలు పడగానే యోధ చాతి మీద ఉన్న గద సింబల్ మెరుస్తూ కనిపించడంతో క్యూబ్స్ వైపు చూసి సైగ చేశాడు భూషణ్.

అది చూసి యోధ వైపు తిరిగి  ఛాతి మీద ఉన్న సింబల్ చూస్తూ 'నాకు సహాయం చేయడానికి హనుమంతుని శక్తి ముందే వచ్చిందా..?' అని సంతోషంగా మనసులో అనుకున్నడు కుబేరుడు.

"యోధ! ఆ సూర్యకిరణాలు పద్మం మీద సరిగ్గా పడేటట్లు ఉంచు అప్పుడే ఆక్టివేట్ అవుతుంది." అని చెప్పాడు భూషణ్.

"సరే!" అని కిరణాలు పద్మం మధ్యలో పడేటట్లు ఉంచాడు యోధ.

కాసేపటికి రూమ్ మధ్యలో తెల్లటి కాంతి కనిపించడంతో "వండర్ఫుల్! నేను నమ్మలేకపోతున్నాను అసలు ఇదంతా నిజంగా జరుగుతుందా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అంది దీప్తి.

"యోధ! ఆ పద్మాన్ని చేతిలోకి తీసుకుని మనం ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నామో మనసులో తలుచుకుని ఆ వెలుతురులో అడుగు పెట్టు వెనకాల మేమందరం కూడా వస్తాము." అని చెప్పాడు క్యూబ్స్.

"సరే!"అని పద్మాన్ని చేతిలోకి తీసుకుని తెల్లని కాంతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "కజకిస్తాన్ లో ప్రయోగం జరిగే చోటుకి వెళ్లాలి.." అని లోపలికి అడుగుపెట్టాడు యోధ.

ఆ తెల్లటి కాంతి లోపలికి అడుగు పెట్టిన వెళ్ళిన యోధ కనిపించకపోవడంతో వెనకాలే వెళ్ళింది నీతూ.

"మనం కూడా వెళదాం పద!" అని దీప్తి చేయ్యి పట్టుకుని కాంతిలోకి వెళ్ళింది పూజా.

"మేడం వాళ్లతో పాటు మనం!" అని ఏకవీరని తీసుకుని కాంతి లోపలికి వెళుతూ "ఇన్ని విషయాలు చెప్పిన మీరు రాకపోతే ఎట్లా త్వరగా రండి." అని లోపలికి వెళ్ళాడు పుష్కర్.

అందరూ కాంతి లోపలికి వెళ్లడంతో "నంది, కుబేర వెళ్లండి హనుమంతుని శక్తి వెనకాలే మనం!" అని చెప్పాడు విభీషణుడు.

"హనుమంతుడికి తన శక్తి తనకి తెలియదు యోధ లోపల దాగి ఉన్న హనుమంతుడి శక్తిని మనం బయటకు తీయాలి అప్పుడే సృష్టికర్యం మొదలవుతుంది." అని కాంతిలోకి అడుగు పెట్టాడు నంది.

"కుబేరుడు వైపు చూసే హనుమంతుడికి తన శక్తి తనకి తెలియదు నిజమే! కానీ ఎప్పుడు ఏమి చేయాలో మాత్రం బాగా తెలుసు!" అని తెల్లటి కాంతులోకి కుబేరుడుతో కలిసి వెళ్ళాడు విభీషణుడు.

ఆ తెల్లటి కాంతి లో నుంచి అందరూ సముద్రపు ఒడ్డుకి రావడంతో యోధ వైపు చూసి "ఆ పద్మాన్ని ఈ బ్లాక్ హోల్ దగ్గర పెట్టు మూసుకుపోతుంది." అని చెప్పాడు భూషణ్.

తన జేబులో ఉన్న పద్మాన్ని తీసి బ్లాక్ హోల్ దగ్గర పెట్టడంతోనే క్లోజ్ అవ్వడం చూసి "నువ్వు వచ్చేటప్పుడు కరెక్ట్ గానే చెప్పవా.? మనం కరెక్ట్ ప్లేస్ కి వచ్చామ?" అని చుట్టూ ఉన్న సముద్రాన్ని చూస్తూ అడిగింది పూజా.

"నేను కరెక్ట్ గానే చెప్పాను ఈ ఏరియా మొత్తం చూస్తే వాళ్ళు ఉన్నారో లేదో తెలుస్తుంది లేకపోతే వెనక్కి వెళ్ళిపోదాము." అని చెప్పాడు యోధ.

"క్యూబ్స్! దీనికి టైం లిమిట్ ఏమీ లేదు కదా!" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"నో" ఇది అన్ లిమిటెడ్ ఆ పద్మం మన దగ్గర ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు!" అని చెప్పాడు క్యూబ్స్.

"మన దగ్గర పాస్పోర్ట్ వీసా ఏమీ లేదు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా దొరికేమో అంతే సంగతులు!" అని చెప్పింది నీతూ.

ఆ మాట విని "కరెక్టే కదా! నేను ఇంకా షాపింగ్ కి వెళ్దాము అనుకున్నాను" అని చెప్పింది పూజా.

"మనం ఫాస్ట్ గా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని వెనక్కి వెళ్ళాలి మళ్లీ సాయంత్రం ముష్రుని తీసుకెళ్లడానికి మనుషులు వస్తారు." అని చెప్పాడు యోధ.

"మనం ఎక్కడని వెతుకుతాము కనీసం ఇక్కడ తిరగడానికి మన దగ్గర ఈ కంట్రీ కరెన్సీ కూడా లేదు." అని చెప్పింది దీప్తి.

"మీరేమీ కంగారు పడకండి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన డబ్బు మార్చుకునే ఏటీఎం కార్డు మన క్యూబ్ దగ్గర ఉంది." అని చెప్పాడు నంద.

"మనం కరెక్ట్ ప్లేస్ కి వచ్చాము ఈ చుట్టుపక్కల మొత్తం వెతికితే సరిపోతుంది వాళ్ళు ఇక్కడే ఎక్కడో ప్రయోగం చేస్తూ ఉంటారు." అని చెప్పి దీప్తి వాళ్ళ వైపు చూసి

"మీరు ఎక్కడైనా వెయిట్ చేయండి యోధ తో కలిసి మేము ముగ్గురం వెళ్లి వెతుకుతాము వాళ్లు కనబడ్డ తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేద్దాము." అని చెప్పాడు భూషణ్.

"వెయిట్! ఇది '' కంట్రీ మీ మోహన బొట్టులు మెడలో గొలుసులు చూస్తే ఈ దేశం వాళ్లు కాదని వెంటనే కనిపెట్టేస్తారు, మేము ముగ్గురం వేషాలు మార్చుకుని వెళ్లి వెతుకుతాము ఎవరికి అనుమానం రాదు కాకపోతే కాస్తా షాపింగ్ చేయాలి." అని చెప్పింది పూజా.

ఆ మాటకు క్యూబ్ వైపు చూసి "వెళదామా!" అని అడిగాను అందరు.

"ఒప్పుకున్న తర్వాత తప్పుతుందా అవసరం నాది పదండి షాపింగ్ కి వెళ్దాము." అని చెప్పాడు క్యూబ్.

అక్కడినుంచి షాపింగ్ కి బయలుదేరి "అవును! అవసరం నాది అంటున్నావు ఏంటి?" అని డౌట్ గా అడిగాడు యోధ.

"ఈ కేసు సక్సెస్ అయితే ప్రమోషన్ ఇస్తానని క్యూబ్ కి సార్ మాట ఇచ్చారు అందుకే అవసరం నాది అంటున్నాడు." అని చెప్పాడు నంది.

"అవునా? అలా అయితే కచ్చితంగా నీకు ప్రమోషన్ వస్తుంది." అని చెప్పాడు యోధ.

షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వెళ్లి "ఈ పద్మం, క్యూబ్ ఉంటే చాలు పాస్పోర్ట్ వీసా లేకుండా ఏ దేశమైనా వెళ్ళచ్చు ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు!" అని సంతోషంగా లోపలికి వెళ్ళింది పూజా.

షాపింగ్ చేస్తూ ఉండగా దూరంగా ఉన్న ఒక మనిషిని చూసి "ఒకసారి అతన్ని చూడండి  చైనా వాడిలాగా ఉన్నాడు నాకెందుకో వాళ్ళ మనిషేమో అని డౌట్ గా ఉంది." అని చెప్పాడు యోధ.

"మీరు షాపింగ్ చేయండి నేను తెలుసుకుంటాను."  అని చెప్పి దూరంగా ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు భూషణ్.

షాపింగ్ చేస్తూ దూరంగా ఉన్న వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు యోధ.

కాసేపటికి యోధ వాళ్ల దగ్గరికి వచ్చి "నీ అనుమానం నిజమే! అతని పేరు జింగ్ పర్సులో  చైనా మిలిటరీ ఐడి ఉంది మనం అతన్ని ఫాలో అయితే ప్రయోగం చేసే ప్లేస్ తెలిసే ఛాన్స్ ఉంది." అని చెప్పాడు భూషణ్.

అంతలో పంజాబీ డ్రెస్సులు వేసుకుని తల మీద చున్ని కట్టుకుని అక్కడికి వస్తూ "ఫాలో చేయడానికి మేము రెడీ." అని చెప్పింది పూజా............
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 05-05-2026, 06:56 AM



Users browsing this thread: 1 Guest(s)