Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
 ఒకనాటి వుదయం, పలహారం చేసాక, " రోజు నో ప్రోగ్రాం! నువ్వీ రోజు కవిత్వం చెప్పాల్సిందే, నో వాయిదా" అంది హిమజ రఘుతో. 



" సరే సరే" ముందు బుద్ధిగా కూర్చో. నా దగ్గరికి రాకూడదు" అని సోఫాలో హిమజని కూర్చోబెట్టి, కొద్ది దూరంలో నిలబడి, తన కవిత్వం చదివాడు రఘు. 



నా కంటిచూపు రధమెక్కి నీ వరుదెంచు
నా పలుకు ప్రేమామృతమాస్వాదించు 
నా బిగి కౌగిట హాయిగా నిదురించు 
 రా సుందరీ! నా ప్రణయేశ్వరీ!” 



 హిమజ ఒక్క వుదుటన లేచి, " వాహ్వా!" అంటూ అతన్ని తన బిగి కౌగిలిలో బంధించింది. 



"వదులు. ఇలా రాకూడదని చెప్పానా' అంటూ ఆమెను విడిపించుకునే ప్రయత్నం చేసాడు రఘు. హిమజ అతని మాటలు లెక్క చేయకుండా, ఒక చేతితో అతని తలను తన వైపుకు లాగి, ముఖం నిండా ముద్దులు కురిపించింది. 



ఒక ప్రక్క అంగాంగ స్పర్శ, ఇంకో ప్రక్క అతని పెదవుల చేరువలో ఆమె పెదవులు. నిగ్రహించుకోవడమింక కష్టసాధ్యమని రఘు గ్రహించాడు. బలంగా ఆమెను తోసి వేసి వడి వడిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. 



 అలా వేగంగా వెడుతున్న అతనికి ఒక కోవెల కనిపించి, లోనికి వెళ్ళాడు. అది చిదానంద స్వామి జీవ సమాధి యైన ప్రాంతంలోని శివాలయం. శివుని దర్శించి, యెదుటనున్న కొలనుదగ్గర సిమెంట్ బెంచిపై కూర్చుని, " స్వామీ! నాకేమిటీ పరీక్ష! నువ్వంటే కామ దహనం చేయగల పరమాత్ముడవు. నేనొక అర్భకుడిని. ధర్మబద్ధం కాని వ్యామోహంలో, తేనెలో పడిన ఈగలా, కొట్టుకు పోతున్నా! కాపాడు" అని వేదనతో ప్రార్ధించసాగాడు రఘు. 



ఇంతలో ఫోన్ రింగయ్యింది. శబ్దానికి కనులు తెరిచి, ఎవరిదీ నంబరనుకుంటూ 'హలో' అన్నాడు. అవతలినించి ఒక యువతి గొంతుక. 



" రఘూ! నేను రాగిణిని. నీ మనసు మాకు తెలిసింది. హిమజకోసం నువ్వు ఇంటికి వస్తున్నావని మాకు తెలుసు. నిన్నూ, నీ కుటుంబాన్ని యిష్టపడ్డాకే, హిమజ నిన్ను పాండీ తీసుకొచ్చింది. రాజా అన్న వ్యక్తి లేడు. హిమజ నిన్ను మనసారా ప్రేమిస్తోంది. ఇంటికి వెళ్ళి ఆమెకి ప్రపోజ్ చెయ్యి" 



 రాగిణి మాటలకు రఘు మదిలో కోటి వీణలు మ్రోగాయి. ఒక పూల గుత్తిని తీసుకుని ఇంటికి పరిగెత్తాడు. ఇంటిలో అడుగు పెట్టిన అతనికి అందంగా అలంకరించుకుని వున్న హిమజ యెదురువచ్చింది. 



" ఏం ! శ్రీవారూ! పారిపోయారు. అంది వెక్కిరింపుగా. 



" ఏం చేయను? నన్ను క్షమించు. నీ చనువుకి చలించి పారిపోయాను" అన్నాడు రఘు ప్రాధేయపూర్వకంగా. 



" నిన్ను యిష్టపడ్డాను కాబట్టే, చనువుగా వున్నాను" అంది హిమజ. 



 రఘు మోకాళ్ళ మీద కూర్చుని, పూలగుత్తిని ఆమె కిస్తూ" నా ప్రేమ దేవతా! నీతో కలిసి జీవించే వరమివ్వు" అన్నాడు.



హిమజ చిరునవ్వుతో గుచ్చాన్ని అందుకుని, " లవ్ యూ" అని అతన్ని కౌగలించుకుంది. 
 
 @@@@@@ 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 06:01 PM



Users browsing this thread: 1 Guest(s)