Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
హిమజ ఆమెకు ధన్యవాదాలు చెప్పి లోనికి వచ్చి, " ఎలా వుంది, మన ప్రయాణం, మన నివాసం?" అని వుత్సాహంగా రఘు నడిగింది. 



ఇంతవరకు ఓకే. ముందుంది మొసళ్ళ పండుగ. రాజా వస్తాడా? మీ అన్నయ్య వస్తాడా? సస్పెన్స్!" 



"విలన్లా నీకా ఆశుభం మాటలెందుకు? రాజా రేపు సాయంత్రానికల్లా నా ముందుంటాడు అంది హిమజ సందేహాలకు ఆస్కారమే లేనట్లు. 



  మాటలకు, అప్పటికప్పుడే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలన్నకోరిక కలిగింది రఘుకు. కానీ చేసేది లేక, కోరికను అణచివేసి స్నానం చేయడానికి వెళ్ళాడు. 



అతను వచ్చేటప్పటికి కాఫీ, వుప్మా తయారు చేసి యెదురు చూస్తోన్న హిమజ, " రా రా! ఇవి చల్లారిపోకముందే లాగించేద్దాం. " అంది.
 
" ఓకే! నాకు కూడా వంట వచ్చు. కోరితే సహాయపడగలను" అన్నాడు రఘు.
 
"అయితే ఇంకేం? మనిద్దరం ఒక ఆదర్శ ప్రేమ జంటగా, ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ వుందాం. రాజా మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి" అంది సంబరంగా హిమజ. 



 రాజా ప్రస్తావన రాగానే రఘు ముఖంలొ రంగులు మారాయి. 
 " భలే వారే! నాతో కలిసి ఆడి పాడడం, రాజా పట్ల అపరాధమవుతుంది. జోక్స్ వేయకు" అని తన అనిష్టత వ్యక్తం చేసాడు రఘు. 



 రఘు మాటలను ఖండిస్తూ హిమజ " అదెలా? నువ్వు నన్ను ప్రేమించావు. నేను నిన్నుఆత్మీయ స్నేహితుడిగా ప్రేమిస్తున్నాను. మనం ప్రేమికులన్నది నిజం. అది దాచిపెట్టటం అపరాధం కాదా? " అని అడిగింది. 



 " నీలాంటి సంస్కారవంతులిలా మాట్లాడవచ్చా?" అసహనంగా అడిగాడు రఘు. 



" రాజా వచ్చి ప్రేమతో నా బాధ్యత తీసుకునే దాకా నేను స్వతంత్రురాలినే. అతను రాకముందే, నా జీవితం.. నీకంకితం అని పాడుతూ తిరగడానికి, నేనేం పాతకాలం సినిమా హీరోయిన్ని కాదు" అంది హిమజ. 



" నీతో వాదించడం బుద్ధి తక్కువ పని" అని లెంపలేసుకున్నాడు రఘు. 



" నీకు సరదాగా వుండడం రాదు. నేను మాత్రం నిన్ను నా బాయ్ ఫ్రెండుగా భావించి అట పట్టిస్తా" అంది నవ్వుతూ హిమజ. 



" దీన్నే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అంటారు" అని రఘు టిఫెన్ తినడం ప్రారంభించాడు. 



కూర్చునివున్న రఘు నానుకుని నిలబడి, హిమజ అతని జుట్టుని చేత్తో చెరిపేస్తూ, " తెలివైన అమాయకుడు. " అంది. ఆమె స్పర్శతో రఘు మనసొక వింత అనుభూతిని పొందింది. 
 
 @@@@



సాయంత్రం ఒక బైక్ అద్దెకు తీసుకుందాం. పంచవటి లో ఆంజనేయుని దర్శనం చేసుకుని, తర్వాత తిన్నగా మణకుల వినాయకుని కోవెల చేరి, స్వామినర్చించి, బీచ్ లో తిరిగి, వద్దాం!" అంది హిమజ. ఇద్దరూ బయలుదేరే సమయానికి ప్రక్కింటి రాజ్యలక్ష్మి యెదురు వచ్చింది.

" ఎక్కడకో బయలుదేరారు, వెళ్ళి రండి" అంది ఆవిడ. 



" అవునండీ పిన్ని గారు, పంచవటికని బయలుదేరాం, లక్ష్మీదేవిలా యెదురొచ్చారు" అని రఘువైపు చూసి, " ఏమండీ ఇలా రండి. కొత్త దంపతులం. పిన్ని గారి ఆశీర్వాదం తీసుకుందాం " అని పిలిచింది. 
తప్పించుకునే వీలులేక రఘు, హిమజతో కలిసి ఆమె పాదాలకు నమస్కరించాడు. వారు తనకిచ్చిన గౌరవానికి పొంగిపోతూ ఆమె" దీర్ఘ సుమంగళీ భవ! కలకాలం హాయిగా జీవించండి" అని ఆశీర్వదించారు. 



ఆమె వెళ్ళిన తర్వాత, రఘు, హిమజతో. " నువ్వు సైకోలా తయారవుతున్నావు. ఆవిడకు అబద్ధాన్ని అలవోకగా చెప్పావు. " అన్నాడు. 



 హిమజ మందహాసం చేస్తూ " రారా! లేటవుతోంది" అంటూ అతని చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది. 



దైవ దర్శనాలు పూర్తిచేసుకుని బీచ్ వొడ్డున కూర్చున్నాక, అతనికి దగ్గరగా జరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని హిమజ, ". ఏది నా ప్రేమికుడిగా, కవిత్వం చెప్పు" అంది. 



 ఆమె స్పర్శ వల్ల కలిగే అనుభూతులకి జడిసి రఘు దూరంగా జరిగి " అలా పదే పదే ప్రేమికుడు అనకు. అయినా నేను లెక్కల మాస్టారిని. నేను కవిత్వం చెపితే, ఆల్ జీబ్రాలే. 



ఏం కాదు. కవి కాని ప్రేమికుడు వుండడు. చెప్పాల్సిందే"



 “నీ కంత నమ్మకముంటే.. నీ ఖర్మ, రేపు చెప్తా “ అన్నాడు. 



"మదర్ ప్రామిస్. అంటూ మళ్ళీ అతనికి దగ్గరిగా జరిగి, , అతని భుజం మీద తలవాల్చి, కాస్త రొమాంటిక్ గా వుండరాదూ. ఎందుకలా సీరియస్ గా వుంటావు. అంది. చేసేదిలేక రఘు అలాగే వుండిపోయాడు. 



కొద్ది సేపు సముద్రతీరంలో గడిపిన తర్వాత ఇద్దరూ భోజనం ముగించుకుని యిల్లు చేరారు. దుస్తులు మార్చుకుని రఘు పడుకోబోతుండగా హిమజ పరుగున వచ్చింది, " చూడు. మెసేజ్" అంది ఫోన్ అతని చేతికిచ్చి. 



"వాతావరణం అనుకూలించక అన్ని ఫ్లైట్స్ రద్దయ్యాయి. తిరిగి యెప్పుడు నడుపుతామో తెలియ చేస్తాం"



"అరే! ఇప్పుడెలా? " అనబోయిన రఘు, హిమజ కన్నీరు చూసి, " ఇప్పుడేం కష్టమొచ్చిందని కన్నీరు? ఇంకో నాలుగు రోజుల్లో వస్తాడు. నిరీక్షిద్దాం" అని సముదాయింపుగా అన్నాడు. 







"నువ్వు పూర్వకాలం మనిషివి. ఆడ, మగసన్నిహితంగా వుంటే మొగుడూ పెళ్ళాలేనా?" అని విసుక్కుంది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:57 PM



Users browsing this thread: 1 Guest(s)