Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
దాదాపు నాలుగున్నర గంటల వేళ, రాగిణి యిల్లు చేరింది. హిమజ స్నేహితురాలిని కౌగలించుకుని, అయిదింటికి వచ్చే బస్ అన్నావు. అంత తొందరగా యెలా వచ్చావే" అంది.



" ఏమో ఆఘమేఘాల మీద వచ్చి చతికిల పడ్డాడు. రఘు లేకుంటే చీకట్లో దోమలతో యుద్ధం చేస్తూండే దాన్ని" అంది రాగిణి. 



హిమజ తండ్రి వచ్చి, " మాట నిలబెట్టుకున్నావు రఘు. థాంక్స్" అని రఘు చేయి పట్టుకుని చెప్పాడు. 



" పరవాలేదండి. ఒకరికొకరం. నేను వస్తాను" అని రఘు అక్కడ నుంచి వచ్చేసాడు. 



" ఎవరే అతను? నీ అభిమానినని చెప్పాడు. బాయ్ ఫ్రెండేమోనని అనుకున్నా!" చిలిపిగా అడిగింది రాగిణి. 



" ఏమో నాకర్థ కావడంలేదు. నువ్వు కూపీలాగక పోయావా?. 



" ఎక్కడ, నాతో వచ్చిన దంపతులతోనే కాలక్షేపం చేసాడు"



" సంథింగ్ మిస్టీరియస్" అంది హిమజ సాలోచనగా. 



 @@@@



కళా మందిర్ లో హిమజ కచ్చేరి జరిగింది. అందరితో పాటు రఘు కూడా అభినందనలు తెలిపాడు. హిమజకు అతడిని చూడగానే తెలియని ఆనందం కలిగింది. అతని ముఖంలోని ప్రసన్నత, ఆకర్షణీయమైన అతని రూపు, ఆమెను ఆకర్షించాయి. అతని కనులలో ప్రతిఫలిస్తున్న అతని గుండెలలోని ప్రేమను ఆమె కనిబెట్టగలిగింది. ఒక చూడ చక్కని, మంచి వ్యక్తి. ముఖ్యంగా సంగీత విద్వాంసుడు కాడు. ఆమెకు సంగీతం ఒక హాబీయే గాని వృత్తి కాదు. అందువల్ల వుద్యోగస్తుడిని చేసుకోవాలని అనుకుంది. కొంత మంది కలెక్టర్ స్థాయి వాడు వస్తాడని చెప్పినా ఆమెకు హోదా, అధికారం కన్న ప్రేమగా చూసుకునే భర్త, ప్రశాంత జీవనం చాలని వారిని వారించేది. 



రఘు గురించి ఆమె యిలా ఆలోచించింది. రఘు ఎలా వ్యూహం పన్నాడొ, అలాగే నేనూ తెలివిగా వ్యవహరించాలి. రఘు గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోవాలి. సమగ్ర జీవితానికి కుటుంబం అవసరం. త్వరపడకూడదు. ప్రేమ మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. 



 ఆరు నెలలకాలం గడిచి పోయింది. రఘు అనేక సార్లు, హిమజ యింటికి వచ్చి వెళ్లాడు. ఆమె తల్లి దండ్రులకు బాగా దగ్గరయ్యాడు. మధ్య కొడుక్కి కన్నా, రఘుకే వాళ్ళు తమ అవసరాలను చెప్తున్నారు. హిమజని, ఆమె తల్లిదండ్రులను ఒక పండుగ రోజున, ఇంటికి తీసుకువెళ్ళి తన కుటుంబాన్ని పరిచయం చేసాడు. అతని కుటుంబ సభ్యులు హిమజను ప్రేమగా చూసుకున్నారు. చిన్న వయసులో మంచి ప్రావీణ్యం చూపుతున్నందుకు ప్రశంసించారు. 
 @@@@



 రఘుకి పిహెచ్. డీ డిగ్రీ వచ్చింది. అతను తన సంతోషాన్ని పంచుకోవడానికి స్వీట్స్, పూలు తీసుకుని హిమజ యింటికి వచ్చాడు. హిమజ తల్లిదండ్రులు అతడిని మనస్పూర్తిగా అభినందించి, " శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు" అని ఆశీర్వదించారు. కొద్ది సేపు తన భవిష్యత్తు గురించి, వారితో ముచ్చటించి బయలుదేరాడు రఘు. 



అతను గుమ్మం దాటుతుండగా, హిమజ వచ్చి శుభా కాంక్షలు తెలిపింది. 
" ఒక అయిదు నిమిషాలు వుండగలరా!" అని చుట్టూ చూసింది. దగ్గరలో యెవరూ లేరని నిర్ధారణ చేసుకుని, రఘు నడిగింది, 



"మీరు నన్ను ప్రేమిస్తున్నారా?"



"నిజం చెప్పాలంటే అవును. కానీ మీరెక్కడ, నేనెక్కడ. అందుకే మీ పాటను మాత్రమే ప్రేమిస్తున్నాను?" అని తెలివిగా జవాబిచ్చాడు రఘు. 



"నా వుద్దేశ్యంలో ప్రేమకు కులమతాలు, ఆస్తి అంతస్తులు అడ్డుకావు. కానీ నా విషయంలో, ఒక సమస్యవుంది. లేకుంటే మిమ్మల్ని నిరుత్సాహ పరిచేదాన్ని కాదు" అంది హిమజ. 



"పరవాలేదు లెండి. "అని తన నిరుత్సాహాన్ని కనబడనీయకుండా బదులిచ్చాడు రఘు. 



"మీకు నా మీద ప్రేమ వుండడం నిజమైతే, నిస్వార్ధంగా నాకో సహాయం చేయగలరా?" ఆశగా అడిగింది హిమజ. 



"తప్పకుండా చేస్తాను. మీ పాట విన్న ఋణం తీర్చుకుంటాను" అని తన సంసిద్ధత తెలియ చేసాడు రఘు. 



"నేను రాజా అనే వ్యక్తిని ప్రేమించాను. నా తల్లితండ్రులు వొప్పుకున్నారు కానీ నా అన్న కది యిష్టం లేదు. అన్నయ్యే నా పెళ్ళి బాధ్యత తీసుకున్నాడు. ఎంత బతిమిలాడినా ఒప్పుకోవడం లేదు. అందుకే పారిపోవాలని నిశ్చయించుకున్నాను" మెల్లగా చెప్పింది హిమజ. 



 "నేను మీకెలా సహాయం చేయగలను" నీరసంగా అడిగాడు రఘు. అతని మనసులో చెలరేగిన తుఫాను చిహ్నాలు అతని వదనంలో ద్యోతకమవుతున్నాయి. అవి చూసి హిమజ లోలోన నవ్వుకుంది. 



"మీరు కేవలం నాకు తోడుగా వుంటే చాలు. మొత్తం నేనే ప్లాన్ చేసి చెప్తాను. " అంది. 
 ఇదెంతో సులభమైన పని అన్నభావన అమె మాటల్లోవ్యక్తమైంది. 



 "అలాగే. నాకు వచ్చే బుధవారం నుంచి వేసవి సెలవలు ప్రారంభమవుతాయి. అప్పుడైతే నాకు వీలుంటుంది" అని తన సంసిద్ధతను తెలియచేసాడు. 



 @@@@
 
రెండు వారాల తర్వాత, హిమజ, రఘుతో కలిసి పుదుచెర్రీలో నివాసముంటున్న తన స్నేహితురాలి యింటికి వెళ్ళింది. అమె స్నేహితురాలు తన భర్తతో కలిసి అమెరికాలో వుంటున్న తన అక్క దగ్గరికి వెడుతూ హిమజ కోసం ఇంటి తాళం చెవులు ప్రక్కింట్లో యిచ్చింది. హిమజను చూస్తూనే ప్రక్కింటి రాజ్యలక్ష్మి గారు తాళం చెవులిస్తూ, ఏం కావాలన్నా నిర్మొగమాటంగా అడగమని చెప్పారు. 



 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:56 PM



Users browsing this thread: 1 Guest(s)