Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
మనసు తెలిసింది
రచన: C..S.G . కృష్ణమాచార్యులు
 



రఘు లెక్చరరుగా పనిచేస్తున్న కళాశాలలోని సంగీత శాఖ ఆధ్వర్యంలో ఒకనాడు వర్ధమాన సంగీత కళాకారిణి హిమజ కచ్చేరి జరిగింది. రఘు సంగీత ప్రియుడు. చిన్నతనంలో సంగీత సాధన చేసాడు కానీ, చదువు వొత్తిళ్ళ వల్ల అదెంతో కాలం సాగలేదు. పాటలు వింటూ చదువు కోవడం, నిద్ర కుపక్రమించడం అతని కలవాటు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుల కచేరీలకు హాజరవడం కూడా అతనికి యిష్టమే. మధురమైన హిమజ గాత్రంలో త్యాగయ్య, అన్నమయ్య, పురందర దాసు కీర్తనలు ప్రాణంపోసుకుని శ్రోతలనలరించాయి. వయసులో చిన్నదైనా, మంచి ప్రతిభ చూపించిందని పెద్దలు ఆశీర్వదించారు, రఘు ఆమె అందానికి, రాగాలాపనకి ముగ్ధుడయ్యాడు. ఆమె ఆకర్షణలో పడిన అతనిలో వింత ఆలోచనలు చెలరేగాయి. 



ఇటువంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే జీవితం ధన్యమైపోతుంది, కానీ ఆమెను భార్యగా పొందే అర్హత.. నాకెక్కడి ది? ఆమెకు నా వల్ల కలిగే లాభం గాని, పెరిగే అంతస్థు కానీ యేముంటుంది? అలా అనుకొని ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరించాలా? ఎలాగైనా ఆమె దృష్టిలో పడి, ఆమెకు నా పట్ల ఆసక్తి కలిగేలా చేసుకోవాలి? ఆమెది యీవూరే అన్నారు.. డేవుడు కరుణిస్తే, ఆమె నన్ను గుర్తించి, ప్రేమించి, పెళ్ళి చేసుకోవచ్చు.. కానీ నా మనసు తెలిపేదేలా? " బాగా ఆలోచించిన తర్వాత రఘు ఒక నిర్ణయానికి వచ్చాడు. 
 @@@ 



రఘు సంగీతం లెక్చరర్ దగ్గర ఆమె చిరునామా తీసుకున్నాడు. ఒక శుభ సాయంత్ర సమయంలో, ఆమె యింటికి వెళ్ళాడు. ఇంటి ముందు చతురస్రాకారంలో వున్న పూల మొక్కల మధ్య వున్న ఆకు పచ్చని పచ్చిక, సూర్య కాంతికి తళతళా మెరుస్తోంది. పచ్చికలో ఒక ప్రక్క, టీ త్రాగుతూ హిమజ తల్లిదండ్రులు కనిపించారు. వారి దగ్గరకు వెళ్ళి తనను పరిచయం చేసుకున్నాడు. నిజాయితీపరునిగా కనబడాలని తను వచ్చిన విషయమిలా సూటిగా చెప్పాడు. 



"మీ అమ్మాయి హిమజ పాట కచేరి విని ఆమె అభిమానినయ్యాను. కచేరీ విని చప్పట్లు కొట్టడమే కాకుండా, స్నేహితుడిగా మీ కుటుంబానికి తోడుగా వుండాలనిపించింది. ఇది నా విజిటంగ్ కార్డ్. మీకే అవసరమున్నా, నాకు ఫోన్ చేయండి.



హిమజ తల్లిదండ్రులు సంతోషించారు. 



"అమ్మాయి పాట కఛ్చేరీలని తిరుగుతూ వుంటుంది. మా అబ్బాయి సేల్స్ మేనేజర్. టూర్లు తిరుగుతూంటాడు. ఎప్పుడైనా అవసరముంటే వాడి స్నేహితులు వస్తారు. ఇప్పుడు నీవు వస్తానంటున్నావు. సంతోషం. అమ్మాయిని కలుస్తావా?" అని హిమజ తండ్రి అడిగాడు. 



" వద్దులెండి. నెలాఖరున కళామందిరంలో పాడుతున్నారు కదా. అప్పుడు కలుస్తాను" అన్నాడు రఘు నిర్వికారంగా. 



హిమజ తల్లి టీ తీసుకువచ్చి రఘుకిచ్చింది. తన వుద్యోగం, కాలేజీ గురించి వాళ్లడిగిన ప్రశ్నలకు ఆతడు సమాధానమిస్తూనే, సంభాషణని రాజకీయాలు, క్రికెట్, యువతలో పెరుగుతున్న దురలవాట్లు వంటి అంశాలపైకి మళ్ళించాడు. దానితో స్వేచ్చగా ఒక గంటసేపు మాట్లా డుకున్నారు. తర్వాత రఘు వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. 



అతను వెళ్ళిన తర్వాత, హిమజ వచ్చి కూర్చుంది. 
"రఘు అని కాలేజ్ లెక్చరర్. నీ అభిమాని అట. ఏదైనా సహాయం కావాలంటే పిలిస్తే వస్తానని కార్డ్ యిచ్చి వెళ్ళాడు. వింతగా వుంది. " 



"నాన్నా! అతనికి పెళ్ళయిందా?" కూపీ లాగే డిటెక్టివ్ లా అడిగింది హిమజ.
 
"ఇంకా కాలేదు. పీ యెచ్ డీ చేస్తున్నాడట. అది త్వరలోఅయిపోతుందట. తర్వాతే పెళ్ళి అని చెప్పాడు" 



"నాన్నా! అతను నేరుగా నన్ను పెళ్ళి చేసుకుంటానని అడగకుండా యిలా చేస్తున్నాడు. తొందరలోనే ముసుగు తీస్తాడు చూడు" అంది హిమజ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి వుయ్యాలలూగుతూ. 



"అంతే నంటావా? కానీ నాకలా అనిపించలేదు. ఏదో ఒక సంగీతాభిమాని, మంచి వాడు అని అనిపించింది. చూదాం?" అన్నాడు హిమజ తండ్రి. 



"అలా జరిగినా మంచిదే. ఏదో రోజు పెళ్ళి చేయాలిగా! ఇప్పటికే ఆలశ్యమయ్యింది. జీవితాంతం సంగీతం పాడుకుంటూ కూర్చుంటుందా?" అంది హిమజ తల్లి చిరాకుగా. 



"అంటే దోవన పోయేవాడొచ్చినా పెళ్ళి చేసేస్తావా?" తల్లి మీద యెగిరి పడింది హిమజ. 



"వీడని కాదు. నీకు ఎవరు నచ్చితే వాడే. త్వరగా తేల్చు" అంది హిమజ తల్లి అనునయంగా. 



"సరే. సీరియస్ గా ఆలోచిస్తా" అంది హిమజ సాలోచనగా. 



 @@@@
 
రఘు ప్రవర్తన వల్ల హిమజకి కాస్త ఆశాభంగమైంది. గడిచిన మూడు వారాలలో రఘు నుంచి ఫోన్ గాని మెసేజ్ గాని లేదు. రెండు రోజుల్లో కచేరి వుందనగా, హిమజకు అందరి అభిమానుల లాగే రఘు, " మీ కచేరీ కోసం ఎదురు చూస్తున్నాం" అన్న మెసేజ్ పంపాడు. 



 కచేరి రోజు వుదయం హిమజకి ఒక సమస్య వచ్చింది. ఆమె స్నేహితురాలు రాగిణి వస్తున్న బస్, వూరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో చెడిపోయింది. సమయం చూస్తే వుదయం మూడు గంటలు. వేరే బస్ రావడానికి ఒక గంట ఆలశ్యమవుతుందని చెప్పారు. 



సమయానికి హిమజ అన్నవూరిలోలేడు. ఆమె తండ్రి, రఘుకి ఫోన్ చేసి సహాయమడుగుదామని అన్నాడు. హిమజ గత్యంతరం లేక అతనికి ఫోన్ చేసి చెప్పింది. 
 రఘు, " ఇప్పుడే బయలుదేరుతున్నా. ఆమె ఫోటో నాకు పంపండి" అని చెప్పాడు.



ఒక అరంగట తర్వాత రాగిణి హిమజకి ఫోన్ చేసింది. 
" రఘు వచ్చాడు. నాకు తోడుగా వున్న దంపతులతో అతని కారులో వస్తున్నాను" అని చెప్పింది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - పుణ్యం కోసం - by k3vv3 - 04-05-2026, 05:54 PM



Users browsing this thread: 1 Guest(s)