04-05-2026, 12:13 PM
Part - 115
వెహికల్ లో ఉన్న డాక్టర్స్ చందు రా అని పిలుస్తూ ఉంటే వైభవ్ కదలకుండా బైక్ రైస్ చేస్తూ ఉంటాడు.
చందు వచ్చి వైభవ్ బైక్ ఎక్కుతుంది..అంతే వైభవ్ బైక్ గాలిలో ఎగురుతూ దూసుకు వెళ్ళిపోతుంది..డాక్టర్స్ నవ్వుకుంటారు.
ఒక లేడీ డాక్టర్ సౌమ్య కి కాల్ చేసి విషయం చెబుతుంది. ఎలాగైతేనే మా వాడు పడేసాడు అన్నమాట. చాలా సిన్సియర్గా ట్రై చేశాడు.
వాడి ప్రేమ నిజమే. కాకపోతే వాడి అల్లరికి చందు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు చందుకీ కూడా క్లారిటీ వచ్చింది.
థాంక్యూ అని చెప్పి ఫోన్ పెట్టేసి... వెంటనే శ్రీకర్ కి కాల్ చేస్తుంది. బిజీగా ఉన్న శ్రీకర్ రెండు సార్లు కి లిఫ్ట్ చేస్తాడు. శ్రీకర్ అని గట్టిగా అరుస్తుంది.
అబ్బా అని ఫోన్ దూరంగా పెట్టి చెవులు మూసుకుంటాడు. రాక్షసి.. నేను ప్రపోజ్ చేశాక నీకు ఎలాగైనా ధైర్యం ఎక్కువైపోయింది.
అంతకుముందు పిల్లిలాగా ఉండే దానివి. ఇప్పుడు మాత్రం రివర్స్ లో ఉన్నావని తిట్టుకుంటూ ఎందుకే అలా అరుస్తున్నావు అని అడుగుతాడు.
చందు వైభవ్ ని యాక్సెప్ట్ చేసింది అని గంతులు వేస్తూ చెబుతుంది. అవునా అని సింపుల్ గా అంటాడు. ఏంటి నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే అలా తీసి పడేసావు.
ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు. అదే ఎలా.. అది అంతే. మా అబ్బాయిలు సిన్సియర్గా ప్రేమిస్తే ఎదుటివారిని ఎలాగైనా మార్చగలరు.
ఫర్ సపోజ్ నిన్ను మార్చలేదు. నన్నా.. నేనేం మారాను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు అని వేళ్ళు తిప్పుతూ ఉంటాడు.
నాకేం మగ్గు గుర్తుకు రావడం లేదు. అవునులే.. పిల్లి పులి అయిన తర్వాత పిల్లి గురించి ఏం గుర్తు పెట్టుకుంటుంది. నేను కనిపిస్తే పారిపోయే దానివి.
చాటుగా చూసే దానివి. అలాంటిది నేను ప్రపోజ్ చేశాక ఎలా రెచ్చిపోతున్నావో. ఓ.. అదా.. నిన్ను చూసి కాదు. మరి.
మా నాన్నను చూసి. మధ్యలో మావయ్య ఎందుకు వచ్చాడు. మా నాన్న ఒప్పుకున్నారు కాబట్టి నేను ఓకే చేశాను.
మా నాన్నకి నచ్చావు కాబట్టి నేను రెచ్చిపోతున్నాను. అంతేగాని నా ప్రేమ ఏమీ లేదు అంటావు. ఆ మాట నేను అనలేదే...
మా నాన్న ఒప్పుకున్నారు అని చెబుతున్నాను. రాక్షసి ఎంతైనా ఆడపిల్లలు ఎప్పుడూ నాన్న నాన్న అనే కలవరిస్తారే..
థాంక్స్ అర్థం చేసుకున్నందుకు. అందుకే ఫ్యూచర్లో మనకి ఎంతమంది పిల్లలు పుట్టిన అందరూ ఆడపిల్లలే కావాలి. వాళ్ళందరూ నా వైపే మాట్లాడాలి.
అప్పుడు నువ్వు ఎంత జలస్ ఫీల్ అవుతావో చూడాలి అని ప్రస్టేషన్తో అంటాడు. అయ్యబాబోయ్ అంతమంది పిల్లలు అంటే నేను కనలేను శ్రీకర్.
మనకి ముచ్చటగా ఒక్కళ్లు చాలు అని గారంగా చెబుతూ ఉంటుంది. ఆ మాటలకి మెల్ట్ అవుతూ మరీ ఒక్కళ్ళే అంటే ఏలాగే.
పదిమంది అయినా ఉంటే బాగుంటుందేమో. చూడు అక్కడ నువ్వు ఒక్కదానివే. ఇక్కడ నేను ఒక్కడినే. అమ్మో వద్దు.
ఒక్కళ్ళు చాలు. అది అబ్బాయి అయితే చాలు అంతే. వెంటనే సీరియస్ అయిపోయి అబ్బాయి అయితే ఏముంటుంది.
పండగ అయినా హాలిడే అయినా అదే షార్ట్, టీషర్టు వేసుకుని తిరుగుతారు. అదే అమ్మాయిలైతే సీజన్ కి తగ్గట్టుగా రెడీ అవుతారు.
పట్టుపరికిణి వేసుకుని నగలన్నీ పెట్టుకుని నాన్న అని పరిగెత్తుకొని వస్తూ ఉంటే అని ఒక మైమరపుతో చెబుతూ ఉంటాడు.
హలో హలో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నారు. మనకి ఎంగేజ్మెంట్ కూడా అవలేదు. అది ముందు దృష్టిలో పెట్టుకో అని ఫోన్ పెట్టేస్తుంది.
ఫోన్ వైపు చూస్తూ నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అమ్మో ఇది మరీ మాయ చేస్తుంది అనుకుంటూ వర్క్ లోపడతాడు.
సూర్య ఆఫీస్ కి వచ్చి శ్రీకర్ దగ్గరికి వెళతాడు..ఏంట్రా ఇలా వచ్చావు. నీ ఫేస్ ఏంటి రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో ఉంది. చేస్తున్న వర్క్ పక్కన పెట్టి... వర్క్ మధ్యలో పొరపాటున కూడా ఆడవాళ్ళతో మాట్లాడకూడదు.
ముఖ్యంగా మన లైఫ్ పార్ట్నర్ తో. ఇప్పుడు సౌమ్యతో వచ్చిన ప్రాబ్లం ఏమిటి. అది చెప్పినా నీకు అర్థం కాదులే గాని తమరి ఏంటి ఇలా వచ్చారు.
కాలేజీకి వెళ్లడం లేదా.. ఇంకా కాలేజ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరో విశికి రివిల్ చేస్తావా.. అప్పుడే కాదు.
తను ప్రాజెక్ట్ ఓకే అయ్యి.. నలుగురిలో గర్వంగా నిలబెట్టాలి అప్పుడు. కానీ ఈ లోపు గౌతమ్ గాడు ఏదైనా చేస్తే.. వాడి చుట్టూ నా మనషులు ఉన్నారు.
ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ప్రాజెక్ట్ తొందరగా ఓకే చేయొచ్చు కదా...
అది నా పని కాదు. నాన్న క్యూటి డిసైడ్ చేసుకోవాల్సింది. ఇలాగైతే మీ పెళ్ళెప్పుడు జరగాలి. వెనకాల ఉన్న మా జంటలు అందరు పెళ్లిళ్లు ఎప్పుడు జరగాలి.
అంతే కంగారుగా ఉంటే చేసేసుకోవచ్చు కదా.. హలో అక్కడ మాట్లాడితే ముందు మా బావ పెళ్లి... మా బావ పెళ్లి అని కలవరిస్తుంది. వయసుతో వచ్చే ప్రాబ్లమ్స్ నువ్వు అర్థం చేసుకుంటే మంచిది.
ఈ వయసుకే ఇంత ఫిలాసఫీ వచ్చిందంటే… మీ నాన్న వయసుకు నువ్వు ఏమవుతావో భయం వేస్తుంది.
అప్పటికి నాకు పెళ్లి అయి… పిల్లలు కాలేజీలో…
నేను మాత్రం మా అమ్మాయి పెళ్లెప్పుడు అని తిరుగుతుంటాను.
సూర్య నవ్వుతూ... అది జరగాలంటే ముందు నువ్వు పెళ్లి పీటలు ఎక్కాలి కదా..
తమరి క్లియర్ చేస్తే మేము పీటలు ఎక్కుతాము. ఎక్కాక పడితే కష్టమని నేను వెయిట్ చేస్తున్నాను.
శ్రీకర్ సీరియస్‌గా... పడితే లేచి నిలబడే పరిస్థితి ఉండాలి.
నీలా లైఫ్ అంతా ప్లాన్ చేసి ఉండాలి.
ప్లాన్ కాదు రా… ఇది ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్.
అదేంట్రా… ప్రేమని కూడా ప్రాజెక్ట్‌లా ట్రీట్ చేస్తావా..
రిస్క్ అనాలిసిస్, టైమ్‌లైన్, సెక్యూరిటీ… అన్నీ ఉన్నాయి.
ఒక్క క్లయింట్ మాత్రమే ఎమోషనల్.
శ్రీకర్ నవ్వు ఆపుకుంటూ...
అయితే విశి నీ లైఫ్‌లో క్లయింట్ ఆ?
సూర్య చూపు విసురుతూ.. జాగ్రత్త… ఆ క్లయింట్ నిన్ను అన్నయ్య అంటుంది.
శ్రీకర్ తక్షణమే మాట మార్చుతూ.... నీ క్లయింట్ ఇన్నోసెంట్ కాబట్టి ఎన్నైనా చెబుతావు. అదే నాకు క్లయింట్ ఉంది చూసావా బాబు నోట్లో నుంచి ఊడి పడింది.
సూర్య నవ్వుతూ.. అందుకే నీకు పెళ్లి ఆలస్యం అవుతోంది.
నాకు ఆలస్యం కాదు రా… నీకు స్పీడ్ ఎక్కువ. విశి ని ఎక్కడ ఎలా మౌల్డ్ చేయాలో నీకు బాగా తెలుసు అది ప్రేమ భాషరా..
నీ భాష ఆ వైభవ్గాడికి కూడా వచ్చింది. ఏమిటి ఆళ్ళిద్దరూ ప్యాచ్ అప్ అయిపోయారా.. అవ్వడమే కాదు.
ఒకే బైక్ మీద వస్తున్నారు.
నువ్వేమో అన్నవరం. వీడు ఫారెస్ట్ నుంచి హైదరాబాద్. ఏదేమైనా అన్నదమ్ములు ఇద్దరు మచ్చ వేసుకుని పుట్టారు రా.. ఒకళ్ళు ప్రపోజ్ చేయకముందు.. మరొకళ్ళు ప్రపోజ్ చేసిన తర్వాత..
మీ అంత స్పీడు లేక ఇదిగో మా బండి ఇలా స్లో గా ఉంది అని దీనంగా చెబుతాడు.
స్పీడ్ కాదు… డైరెక్షన్ క్లియర్.
శ్రీకర్ టైం చూస్తూ.. సరే సరే…
ఈ డైరెక్షన్ క్లియర్ అయిన ప్రేమతో ఆఫీస్‌లో ఎన్ని గంటలు కూర్చుంటావో చూద్దాం.
సూర్య.. వర్క్ అయిపోతే వెళ్లిపోతాను.
శ్రీకర్ అల్లరిగా.. అదేంట్రా… ఏదో ప్రాజెక్టు అనాలసిస్ అని చెప్పావు. ఇప్పుడు విశి తో మాట్లాడడానికి వెళుతున్నావా..
క్లైంట్ అపాయింట్మెంట్ ఉంటే గాని మాట్లాడకూడదు ఏమో అని టీజ్ చేస్తాడు.
సూర్య సీరియస్ ఫేస్‌తో... మాట్లాడను… చూస్తాను.
శ్రీకర్ షాక్‌గా... ఏమిట్రా ఆ లాజిక్?
మాట్లాడితే ప్రాబ్లం. చూస్తే మోటివేషన్.
శ్రీకర్ చేతులు జోడిస్తూ... సార్… మీ ప్రేమకు ఒక సెల్యూట్
మా లాంటి వాళ్ళు ఇది సిలబస్‌లో పెట్టాలి.
సూర్య ఫోన్ తీసుకుంటూ... ముందు నీ సిలబస్‌లో సౌమ్య ని కూల్ చేయడం నేర్చుకో.
శ్రీకర్ నవ్వుతూ... నీ పెళ్లయ్యాక నీ పిల్లలకే నేనే ఫన్నీ అంకుల్.
సూర్య డోర్ వైపు నడుస్తూ... అప్పుడు కూడా నువ్వు ఇదే ఆఫీస్‌లో ఇదే కుర్చీలో ఉంటావ్.
శ్రీకర్... అంటే నా కెరీర్ స్టేబుల్ అన్నమాట
సూర్య నవ్వుతూ.. కెరీర్ స్టేబుల్…
మ్యారేజ్ మాత్రం పెండింగ్..
ఒరేయ్ దుర్మార్గుడా ఆగురా అని వెనకాలే పరిగెడతాడు.
కథ కొనసాగుతుంది........

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)