04-05-2026, 12:00 PM
Part - 111
విశి, సూర్య తో తో బయటకి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది. మేడమ్ మాకేమి ట్రీట్ లేదా. సర్ ఈ వీకెండ్ నా చేతిలో తో నేనే వంట చేస్తాను.
అవన్నీ తర్వాత....సరదాగా ఎక్కడికైనా వెళదామా అని విశి చేతి వేళ్ళతో ఆడుతూ అడుగుతాడు..అబ్బో అయ్యగారికి గాలి మళ్ళీనట్టు ఉంది.
మరి ప్రేమలో పడ్డాక బోళ్ళు ఉంటాయి. అచికబుచ్చుకలు ఆడుకోవాలి. లేట్ నైట్ దాకా ఫోన్లో మాట్లాడుకోవాలి. అందరూ కన్నా ముందు ఫోన్ చేసి విష్ చేయాలి. అబ్బా చాలు చాలు నా డైలాగ్స్ అని నాకే తిరిగి చెప్తున్నారు.
లేదు క్యూటి ఇవన్నీ నేను సర్చ్ చేసినవే.. అవ్వ ఇలాంటి ఎవరైనా సెర్చ్ చేస్తారా... లేకపోతే మనకేమైనా ఎక్స్పీరియన్స్ వస్తుందా ఏమిటి..
ఇద్దరూ అలా నవ్వుకుంటూ మాట్లాడటం చూసినా గౌతమ్ మాత్రం బరుస్ట్ అయిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే విశి రిప్యుటేషన్ దెబ్బతీయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఇప్పటికే లేట్ అయింది పద అని సూర్య విశి ని ఇంటికి తీసుకు వస్తాడు. లోపలికి వెళ్ళేటప్పటికీ మాటలు వినిపిస్తూ ఉంటే ఎవరివో కొత్త గొంతులు అంటుంది.
అవునా పదా అని సూర్య నవ్వుతూ వెనకాలే వస్తాడు. లోపల చాలామంది ఆడవాళ్ళని చూసి విశి కంగారుగా భానుమతి వైపు చూస్తుంది.
భానుమతి నవ్వుతూ మాట్లాడడం చూసి రిలాక్స్ అయ్యి.. వెళ్లి తల్లి పక్కన నిలబడుతుంది. వచ్చారా అని...రా బాబు అని సూర్యని పిలవగానే వెళ్లి అక్కడ ఒక పెద్ద ఆవిడ పక్కన కూర్చుంటాడు.
విశి అలాగే చూస్తూ ఉంటుంది.. ఏమిటి అలా చూస్తున్నావు. అమ్మ వీళ్ళు... నీకు చెప్పలేదు కదా.. ఈరోజు మాటలు మాట్లాడుకోవడానికి దేవా సార్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చారు.
సూర్య వెంటనే అత్తయ్య నేను పరిచయం చేస్తాను అని లలిత గారి భుజం చుట్టూ చెయ్యవేసి మై స్వీట్ నానమ్మ..
మాధవిని చూపిస్తూ అమ్మమ్మ అని అవనినీ అమ్మ అని పరిచయం చేస్తాడు.
నివి నీ అత్తయ్య గా పరిచయం చేస్తాడు. విద్య అత్తయ్య సౌమ్య మదర్ అని చెబుతాడు. పూజిత ని మై రౌడీ లవ్లీ పిన్ని అని పరిచయం చేస్తే అందరికీ ఒక్కసారిగా నమస్కారం చేస్తుంది.
పూజిత సూర్య భుజం మీద ఒక్కటి వేసి ఇలా రారా అని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. విశి భయంగా చూస్తూ ఉంటే నువ్వు అసలు టెన్షన్ పడవలసిన అవసరమే లేదు.
మనది జాయింట్ ఫ్యామిలీ అయినా సరే ఫుల్ గా ఎంజాయ్ చేయడమే.. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు అంతే కదా అత్తయ్య అని లలిత వైపు చూస్తే..
మా డైలాగులు కూడా నువ్వే చెప్పేసావు కదా అని అంతే నమ్మ అంటారు..అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే విశి ని వాళ్ళందరి మధ్యన చూసిన భానుమతికి చాలా తృప్తిగా అనిపిస్తుంది.
అవనికి కూడా విశి బాగా నచ్చుతుంది. సూర్య అవని పక్కన కూర్చుని ఎలా ఉందమ్మా నీ కోడలు. బంగారు బొమ్మలాగ ఉంది.
జాగ్రత్తగా చూసుకో.. లలిత భానుమతి వైపు తిరిగి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దానికి నువ్వు ఒప్పుకోవాలి.
అయ్యో అమ్మ ఆర్డర్ వేయాలి కానీ ఇలా అడగకూడదు. ఆ మాటకి నవ్వుతూ మనలో అలా ఆర్డర్ వేసుకోవడం ఏమీ లేదు. అందరికీ నచ్చే అడుగు ముందుకు వేయడమే.
సరే చెప్పండమ్మా. రేపు విశి పెళ్లి అయిన తర్వాత నువ్వు కూడా మాతో పాటే ఉండాలి.. అది అని ఇబ్బందిగా చూస్తూ ఉంటే.. ఇంకా ఎక్కువ ఆలోచించకు.
నీకున్నది ఒక్కతే కూతురు. ఇక అల్లుడు అయినా కొడుకైన అంతా దేవా నే కదా.. ఇంకా ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు.
ఒక్కదానివే ఎక్కడ ఉంటావు.. ఈ విషయంలో మేము అందరం నిర్ణయం తీసేసుకున్నాము. మగవాళ్ళు కూడా రావాలి కానీ కొన్ని రోజులు సమయం పడుతుంది. ఈలోపు మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం.
లలిత గారి మాటలు విన్న విశి మనసులోని దిగులు కూడా మాయమవుతుంది. సూర్య వైపు కృతజ్ఞతగా చూస్తోంది.
సూర్య మాత్రం కోపంగా చూసి బయటకి వెళ్ళిపోతాడు. ఏమైంది సార్ కి. అమ్మ ఇప్పుడే వస్తాను అని సూర్య వెనకాల వచ్చి సార్ అని పిలిస్తే..
అలాగే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఎందుకు అలిగారో చెప్పొచ్చు కదా.. చెప్పను అని మళ్లీ ఇంకో పక్కకి తిరుగుతాడు. ముందుకు వచ్చి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది.
నా వైపు నువ్వు ఎందుకు అలా చూసావు. నేను ఎలా చూశాను అని ఒక నిమిషం ఆలోచిస్తూ ఉంటుంది. అది గుర్తుకు రావడం లేదు. ఎప్పుడు చూసాను.. ఎలా చూశాను.
నానమ్మ విషయం చెప్పగానే నువ్వు నా వైపు ఏదో థాంక్స్ అన్నట్టుగా చూసావు. అది నాకు నచ్చలేదు. ఆ మాటకి దేవా చేతులు పట్టుకుని ఎమోషనల్ అవుతూ...
మీకు నచ్చకపోయినా ఆ విషయంలో మీకు థాంక్స్ చెబుతాను..అమ్మ గురించి నాకు చాలా దిగులుగానే ఉంది. నా పెళ్లయిపోతే అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది. అసలు బ్రతకడం కూడా తెలియదు.. బయట ప్రపంచం తెలియదు. ఏమైపోతుందో అని చాలా టెన్షన్ పడ్డాను.
ఈ విషయం గురించి మీతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు కానీ నేను మాట్లాడకుండానే నా మనసులో బాధ తెలుసుకుని సాల్వ్ చేశారు...
కన్నీళ్ళని ఆపుకుంటూ చెబుతూ ఉంటే. పిచ్చి ఏమిటిది అని ఆ కళ్ళు తుడిచి.. అత్తయ్య అని నేను ఏదో పెదాలతోనే చెప్పలేదు.
మా అమ్మ తర్వాత అమ్మ స్థానం అత్తయ్యది. అలాంటిది ఒంటరిగా ఎందుకు వదిలేస్తాను..నువ్వు నా దగ్గర చెప్పడానికి ఆలోచిస్తున్నావు అంటే ఇంకా నువ్వు హక్కుగా ఫీల్ అవ్వలేదు అని అర్థమవుతుంది.
ఈ విషయం నేను సీరియస్ గా ఆలోచించాలి అంటాడు. భలేవారే సార్. మీ దగ్గరగా హక్కుగా ఫీల్ అవ్వకపోతేనే మీతో పాటు బైక్ మీద తిరుగుతానా..
హగ్ చేసుకుని కూర్చుంటానా... అయినా సరే నువ్వు చెప్పడం లేదు అంటే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్లాల్సిందే అని నడుం పట్టుకుని దగ్గరికి లాగుతాడు.
ఇద్దరి మధ్యన చేతులు పెట్టి సార్ ఏమిటిది అందరూ ఉన్నారు అని సిగ్గుపడుతూ ఉంటే...ఎవరూ లేకపోతే ఓకేనా..
సార్ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు భయం వేస్తుంది. ఆ భయం పోయింది అనుకో హక్కుగా ఫీల్ అవుతావు ఒకే ఒక్కసారి అంటాడు.
ఏమిటి అని భయంగా కళ్ళు టప టపా కొడుతూ ఉంటే.. ఒక్కసారి క్యూటి అంటాడు. దేని గురించి మాట్లాడుతున్నారు.
పెళ్లికి ముందు ఒక్కసారి రుచి చూడాలని ఉంది. అర్థమయ్యేటట్టుగా చెప్పండి సార్ . ఈ లేత గులాబీ రేకులను చప్పరించాలని ఉంది అని పెదవులపై వేళ్ళతో ట్యాప్ చేస్తూ ఉంటే.. సార్ అని సిగ్గుపడుతూ ఉంటే..
అబ్బా క్యూటి భయంకరంగా టెంప్ చేస్తున్నావు కదా.. ఎవరో దగ్గిన సౌండ్ వినపడుతుంది..వెంటనే సూర్యని ఒక తోపు తోసి పక్కకి నిలబడుతుంది.
శ్రీకర్ వచ్చి ఒరేయ్ ప్రేమలో పడి ఎన్నో రోజుల అవ్వలేదు అప్పుడే ఇంత అడ్వాన్స్ అయిపోతే ఎలాగా.. శ్రీకర్ ని చూడగానే అక్కడ నుంచి పరుగు అందుకుంటుంది.
పానకం లో పుడకలాగా ఇప్పుడే రాకపోతే కాసేపు ఆగి రావొచ్చు కదా... అలాగే అనుకున్నాను కానీ ఆంటీ భయపడ్డారు.
నువ్వు ఎక్కడ అడ్వాన్స్ అయిపోతావో అని. అమ్మ పంపించిందా.. లేకపోతే నేనెందుకు వస్తాను.
ఇద్దరూ లోపలికి వెళ్తారు.
అక్కడ విశి మాత్రం భానుమతి పక్కన కూర్చుని ఇంకా సిగ్గుతోనే ఉంటుంది.
చెవులు ఎర్రబడి, చేతులతో దుపట్టా ముడి వేసుకుంటూ ఉంటుంది.
ఏమైంది అమ్మా… అలా కందిపోయావు ?.భానుమతి మెల్లగా అడిగితే...
ఏమీలేదు అమ్మ… కాస్త గాలి తగిలింది అని తల వంచి చెబుతుంది.
లలిత గారు ఆ సిగ్గును గమనించి చిరునవ్వుతో,
పెళ్లి మాటలు కదా ఇలాగే ఉంటుంది లే అమ్మా…
ఇవి భయాలు కాదు, మధురమైన ఆత్రుతలు అంటారు.
ఆ మాటలు వినగానే విశి మనసు కాస్త తేలిక అవుతుంది.
ఇంతలో సూర్య లోపలికి వస్తాడు.
విశి వైపు చూడగానే ఇద్దరి కళ్లూ క్షణం పాటు కలుస్తాయి.
అది మాటలేని సంభాషణ.
నేను ఉన్నాను... నాకు తెలుసు... అన్నట్టుగా.
అవని సూర్యను పిలిచి.. రేయ్ విశి వాలకం చూస్తే నువ్వు ఏదో చేసినట్టే ఉన్నావు ఇప్పటినుంచి భయపెట్టే ప్రోగ్రాములు పెట్టుకోకు అర్థమవుతుందా..
నేనా… అసలు భయం ఎవరికొచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు అమ్మ అని నవ్వుతూ చెబుతాడు.
అందరూ నవ్వుతారు.
పూజిత మాత్రం విశి దగ్గరకు వచ్చి,
చూడు కోడలు పిల్ల … మా వాడి మాటలు వినిపించుకో
కానీ గుండె మాత్రం నీ చేతుల్లోనే పెట్టుకో. కొంగుకు గట్టిగా కట్టేసుకో అర్థమవుతుందా.. ఆ మాటలకి విశి సిగ్గుతో తలదించుకుంటుంది.
భోజనాలు అయ్యాక.. అందరూ మాటల్లో బిజీగా ఉన్నప్పుడు... సూర్య మెల్లగా విశి దగ్గరికి వచ్చి,
ఇప్పుడైనా భయం తగ్గిందా క్యూటి? అని అడుగుతాడు.
విశి తల ఊపుతూ.. భయం కాదు సార్…
ఇప్పుడు నమ్మకం ఎక్కువైంది అంటుంది. మీకు ఎప్పుడూ చెప్పే మాట అయినా సరే మళ్లీ మళ్లీ చెబుతాను అది మీకు కోపం వచ్చినా సరే.. మీరు నా పక్కన ఉంటే నాకు ధైర్యం భరోసా ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం మీరే..
ఆ ఒక్క మాట సూర్య ముఖంలో గర్వం, ప్రేమ రెండింటినీ తెస్తుంది.
అయితే అదే చాలూ… అంటూ దూరంగా నిలబడతాడు.
ఈసారి హద్దులు దాటకుండా.
కానీ మనసులు మరింత దగ్గరగా.
అక్కడ నుంచే
వాళ్ల పెళ్లి కాదు…
వాళ్ల కుటుంబం మొదలైనట్టు
అందరికీ అనిపిస్తుంది.
అందరి సంతోషాల నడుమ గౌతమ్ రివెంజ్ ప్లాన్.........

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)