01-05-2026, 10:39 PM
రుద్రం భజే! ఎపిసోడ్ 18
స్వామివారి పాదాల దగ్గర ఉన్న వస్తువుని ముష్రుని తీసుకుని ఢిల్లీ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి బయలుదేరారు యోధ వాళ్ళు.
శ్రీరంగం గుడిలో రాత్రి సమయంలో స్వామివారిని పూజించడానికి వచ్చే విభీషుడిని కలవడానికి నంది తో కలిసి బయలుదేరాడు కుబేరుడు.
***************
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుని నాయక్ కి కాల్ చేసి "జైహింద్ సార్! మేము ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాము ఫ్లైట్ 30 మినిట్స్ లేట్! ఢిల్లీ చేరుకునేసరికి నైట్ అవుతుంది." అని చెప్పాడు యోధ.
"ఓకే! మీరు ఫ్లైట్ దిగే టైమ్ కి అక్కడ ముగ్గురు ఏజెంట్లు రెడీగా ఉంటారు." అని చెప్పాడు నాయక్.
"సార్! కళింగ దగ్గర నుంచి ముష్రు కి మెసేజ్ వచ్చింది హవేలీ హోటల్ కి వెళ్లి ముస్తఫా ని కలవమని చెప్పాడు.
నాకు తెలిసి అతను ఐఎస్ఐ ఏజెంట్ అనుకుంటున్నాను.
మేము ఫ్లైట్ దిగిన వెంటనే ముష్రుని వాళ్ళు ఫాలో చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మిలటరీ హెడ్ క్వార్టర్స్ కి రావడం కుదరదు డైరెక్ట్ గా హవేలీ హోటల్ కి వెళతాము." అని చెప్పాడు యోధ.
"ఓకే! మీరు ఆపోజిట్ హోటల్ లో స్టే చేయండి మన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడే కలుస్తారు." అని చెప్పాడు నాయక్.
"సర్! వాళ్ళని గుర్తుపట్టడానికి కోడ్!" అని అడిగాడు యోధ.
"నీ ఫేవరెట్ కోడ్ ఉంది కదా జైశ్రీరామ్!" అని ఫోన్ పెట్టేసాడు నాయక్.
ఫ్లైట్ ఎక్కడానికి వెళుతూ దీప్తి వాళ్ళ వైపు చూసి "మనం ఢిల్లీలో దిగిన వెంటనే హవేలీ హోటల్ ఆపోజిట్ హోటల్ లో రూమ్స్ తీసుకుందాము." అని చెప్పి ముష్రు వైపు చూసి
"నువ్వు హవేలీ హోటల్ కి వెళ్ళు తెలివితేటలు చూపించావో నా సంగతి తెలుసు కదా పాకిస్తాన్లో ఉన్న సరే వచ్చి చంపేస్తాను." అని చెప్పాడు యోధ.
"సార్! మిమ్మల్ని మోసం చేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్లిన ఆ వస్తువు నా దగ్గర లేదని తెలిస్తే చంపేస్తారు, మీరు నన్ను వదిలేసిన మిమ్మల్ని నేను వదలను." అని చెప్పాడు ముష్రు.
"అలకాపురి తరుపులు తెరిచే అంత పవర్ఫుల్ ఐటమ్ కి పేరేమీ లేదా? వస్తువు అంటుంటే బాలేదు." అని అడిగింది పూజా.
"నాకు కూడా పేరేమిటో తెలీదు మేడమ్!" అని చెప్పాడు ముష్రు.
"ఆ ఐటమ్ పేరు విభీషణుడికి మాత్రమే తెలియాలి ఎందుకంటే మరొక వస్తువు ఆయన దగ్గరే ఉంది కదా!" అని చెప్పింది దీప్తి.
"నాకు రాకెట్ లో స్పేస్ లోకి వెళ్లి దానికన్నా ఈ కేసు గురించి తెలుసుకుంటుంటే భలే మజా ఉంది. మనకి ఒక్క గాడ్ అయ్యినా కనపడితే బాగుండు." అని చెప్పింది పూజా.
"మేడం! కుబేరుడికి సంబంధించిన వస్తువు మన దగ్గర ఉంది కాబట్టి ఆయన కనబడితే బెటర్ మనకు కూడా లాభం ఉంటుంది." అని నవ్వుతూ చెప్పాడు ఏకవీర.
"అవునా? అయితే ఆయన కనబడినప్పుడు ఏమేమి అడగాలో లిస్ట్ రాసి ఉంచుకో!" అని నవ్వుతూ చెప్పింది పూజా.
"నిజంగా దేవుడు మన ఎదురుగా వచ్చి నుంచుంటే నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు చూస్తూ ఉండిపోతాము." అని చెప్పింది నీతూ.
"మన ఎదురుగా వచ్చి నుంచుంటే ఆయన దేవుడు అని మనం గుర్తుపట్టాలి కదా!" అని చెప్పింది దీప్తి.
"ఎందుకు గుర్తుపట్టము మనం ఆ దేవుళ్ళని రోజు చూస్తూనే ఉంటున్నాము కదా!" అని చెప్పింది పూజా.
ఆ మాటకి నవ్వుతూ "ఆ రోజుల్లో అందరూ అలా ఉండేవారు కాబట్టి అలా ఉన్నారు ఇప్పుడు మనం ఎలా ఉన్నామో దేవుళ్ళు కుడా అలాగే ఉంటారు ఏదైనా వాళ్ళు సృష్టించింది కదా!" అని చెప్పాడు యోధ.
"కరెక్టే! అలా ఐతే గుర్తుపట్టడం చాలా కష్టం!" అని చెప్పింది పూజా.
"సరే! ఫ్లైట్ అనౌన్స్ మెంట్ వస్తుంది పదండి వెళదాము మనకి ఆ దేవుడు కనిపించినప్పుడు సంగతి కదా అప్పుడు చూద్దాము." అని చెప్పింది నీతూ.
**************
హిమాలయాల దగ్గర్నుంచి అదృశ్య రూపంలో నంది తో కలిసి శ్రీరంగం గుడి దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ "గుడి కూడా కట్టేశారు ఈ విభీషుణుడు ఇంకెప్పుడు వస్తాడు. " అని అడిగాడు కుబేరుడు.
"కంగారు పడకు కుబేర! ఈ గుడిలో స్వామివారిని పూజించడానికి ప్రతిరోజు విభీషణుడు కచ్చితంగా వస్తాడు." అని చెప్పాడు నంది.
"రాత్రి సమయంలో లంక నగరం నుంచి ఆ మహా సముద్రాన్ని దాటి ఈ గుడిలో ఉన్న స్వామివారిని పూజించడానికి విభీషుణుడు ఎందుకు వస్తున్నాడు?" అని అనుమానంగా అడిగాడు కుబేరుడు.
శ్రీరాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత విభీషుణుడు లంకకు బయలుదేరి వెళుతూ ఉండగా ఈ గుడిలో ఉన్న స్వామివారి విగ్రహం దొరికింది.
ఆ విగ్రహాన్ని లంకకు తీసుకుని వెళదాము అనుకుని కావేరి నది ఒడ్డున ఉంచాడు, కానీ ఆ స్వామి అక్కడి నుంచి కదలలేదు అందుకే అప్పటినుంచి ప్రతి రోజు పూజించడానికి ఇక్కడికి వస్తున్నాడు.
ఇది కలికాలం అవడం వల్ల అందరికీ కనపడకూడదు అందుకే రాత్రి సమయంలో వచ్చి పూజ చేసుకొని వెళుతున్నాడు. " అని చెప్పాడు నంది.
"అలా అయితే! ఈరోజు విభీషణుడు తప్పకుండా మనకి కలుస్తాడు." అని గుడి మెయిన్ గేట్ వైపు చూస్తూ "నంది! ఏదో తుమ్మెద గుడిలోకి వచ్చి గర్భగుడి వైపుకు వెళుతుంది చూడు." అని చెప్పాడు కుబేరుడు.
ఆ మాట విని చూస్తూ "అది తుమ్మెద కాదు విభీషణుడు సూక్ష్మ రూపంలో వస్తున్నాడు, ఆయన రాక్షసుడు నిజరూపం చూస్తే మనుషులు తట్టుకోలేరు." అని కుబేరుడుతో పాటు గర్భగుడిలోకి వెళ్ళాడు నంది.
గర్భగుడిలో స్వామి వారి ముందుకు వెళ్లి తన అసలు రూపం లోకి వచ్చి పూజ చేస్తున్న విభీషుణుడు దగ్గరికి వెళ్లి స్వర్ణ లంక మహారాజుకి వందనాలు." అని చెప్పాడు కుబేరుడు.
ఆ మాట విని స్వామి వారి పాదాల ముందు పూలు ఉంచి నమస్కరించి కళ్ళు తెరిచి తల పక్కకి తిప్పి చూసి "కుబేర, నంది! ఏమిటి ఈ సమయంలో మీరు కూడా స్వామివారి దర్శనానికి వచ్చారా..?" అని అడిగాడు విభీషణుడు.
"విషయం అది కాదు విభీషణ! నా అలకాపురి నగరం తలుపులు తెరిచే శక్తివంతమైన వస్తువు ఒకటి మీ దగ్గర ఉంది కదా మరొకటి హిమాలయాలలో ఉంది.
అది ఈ కలికాలంలో మానవుల చేతికి వెళుతుంది అని చెప్పాను నీకు గుర్తు ఉందా? ఆ సమయం రానే వచ్చింది." అని చెప్పాడు కుబేరుడు.
ఆ మాట విని కాసేపు ఆలోచించి "మా అన్న రావణుడికి బ్రహ్మ దేవుడు ప్రసాదించిన ఆకర్షణ పద్మాలు, అందులో ఒకటి నా దగ్గర భద్రంగా ఉంది. మరోటి నీ దగ్గరికి చేరుస్తానని హనుమంతుడు మాట ఇచ్చాడు కదా!" అని చెప్పాడు విభీషణుడు.
"ఇది కలికాలం మనం అనుకున్నట్లు జరగదు అసలు ఈ విషయం హనుమంతుడికి గుర్తుందో లేదో నా నగరం తలుపులు తెరవాలని చాలామంది ఎదురుచూస్తున్నారు ఆదే జరిగిందో నా పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించు,
అందుకే తపస్సులో ఉన్న హనుమంతుడి దగ్గరికి నీ సాయంతో వెళ్లాలి అనుకుంటున్నాను." అని చెప్పాడు కుబేరుడు.
ఆ మాటకి నవ్వుతూ "హనుమంతుడు తపస్సులో ఉన్న ఇచ్చిన మాట కోసం తన ఆత్మ శక్తి ఎప్పుడో బయలుదేరి ఉంటుంది ఇంతకీ ఇప్పుడు ఆ పద్మం ఎవరి దగ్గర ఉంది?" అని అడిగాడు విభీషణుడు.
"యోధ అని ఒక సైనికుడు మంచి వ్యక్తి దగ్గరే ఉంది కానీ అతను చుట్టూ ప్రమాదం కమ్ముకుని ఉంది. మనం కూడా వెళ్లి కాస్త సహాయం చేస్తే కుబేరుడు ప్రశాంతంగా ఉంటాడు ఈ లోకం కూడా ప్రశాంతంగా ఉంటుంది." అని చెప్పాడు నంది.
"విభీషణ! ఈ పనిలో నువ్వు నాకు సహాయం చేయాల్సిందే!" అని అడిగాడు కుబేరుడు.
"సరే! కైలాసంలో ఉండే నందినే తీసుకొచ్చావు నన్ను వదులుతావా..? మనం ఈ రూపాలలో కాదు వేషం, భాష అని మారిపోవాలి ఆ పద్మాన్ని నీ లోకానికి తీసుకు రాగలిగే శక్తీ ఉన్న మానవుడికి మనం మార్గం మాత్రమే చూపాలి అతని చేతులు మీదుగానే ఆ పద్మం నీ దగ్గరికి చేరాలి బాగా గుర్తుంచుకోండి." అని చెప్పాడు విభీషణుడు.
"ఆ విషయం నాకు తెలుసు! ఇది కలికాలం మానవులకి మనం మార్గం మాత్రమే చూపించగలము ప్రయత్నం వాళ్లే చేయాలి." అని చెప్పాడు కుబేరుడు.
"హనుమంతుడు ఈ కార్యానికి ఏ మానవుడిని ఎంచుకున్నాడో మనకి ఎలా తెలుస్తుంది?" అని అడిగాడు నంది.
"ఆ విషయం నేను చూసుకుంటాను." అని చెప్పి స్వామివారికి నమస్కరించి "ఇంక ఆ పద్మం ఉన్న చోటికి బయలుదేరుదామా?" అని అడిగాడు విభీషణుడు.
"సరే!" అని స్వామివారికి నమస్కరించి అక్కడ నుంచి గుడి బయటకు వచ్చి "ఆ బ్రహ్మ ఈ పద్మాలను రావణాసురుడికి ఇచ్చాడు ఆయన మరణించాడు కదా అయ్యినా ఈ పరీక్ష మళ్ళీ నాకు ఎందుకు పెట్టాడు?" అని అడిగాడు కుబేరుడు.
"ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కలిపురుషుడు మానవులతో చేయించే ప్రయత్నాలు ఆపడానికి ఆ భగవంతుడు ఇలాంటి పరీక్షలు పెడతాడు." అని చెప్పాడు నంది.
"మనం ఇప్పుడు యోధ దగ్గరికి ఆఫీసర్లు లాగా వెళ్లాలి మానవ రూపంలోకి మారండి." అని చెప్పి ఢిల్లీ లో హోటల్ దగ్గరికి తీసుకువెళ్లాడు విభీషణుడు.
"మనం ఆ ఆఫీసర్స్ ప్లేస్లోకి వచ్చాము మరి వాళ్ల సంగతి ఏమిటి?" అని అడిగాడు నంది.
"మన పని పూర్తి అయ్యే వరకు వాళ్లు నా లంక నగరంలో నిద్రపోతూ ఉంటారు." అని చెప్పాడు విభీషణుడు.
అక్కడ ఉన్న జనాలను చూసి "నేను ఇచ్చిన డబ్బుని ఇలా తగలేస్తున్నారు ఏంటి?" అని చుట్టూ చూస్తూ అడిగాడు కుబేరుడు.
"ఇది కలికాలం కుబేర ఇలాంటి ఘోరాలు ముందు ముందు చాలా చూడాలి, యోధ అతని మనుషులు హోటల్ దగ్గరికి వస్తున్నారు అనుమానం రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి." అని చెప్పి యోధ దగ్గరికి వెళ్లి "జైశ్రీరామ్!" అని చెప్పాడు విభీషణుడు.
ఆ కోడ్ విని "సార్ పంపించిన ఆఫీసర్స్ మీ ముగ్గురేనా? పేర్లు ఏమిటి?" అని అడిగాడు యోధ.
"నా పేరు భూషణ్ అని చెప్పాడు విభీషణుడు, నా పేరు నంద అని చెప్పాడు నంది, నా పేరు క్యూబ్ అని చెప్పాడు కుబేరుడు.
"గుడ్! మీరు ఆ రెస్టారెంట్లో వెయిట్ చేయండి నేను పది నిమిషాల్లో నా టీమ్ తో కలిసి వస్తాను." అని చెప్పి హోటల్ లోపలికి వెళ్ళాడు యోధ.
హోటల్ లోపలికి వెళ్తున్న యోధ వైపు చూసి "ఆ ఆకర్షణ పద్మం అతని చేతిలో ఉన్న బ్యాగ్ లో ఉంది." అని చెప్పాడు కుబేరుడు.

" రుద్రం భజే! ఎపిసోడ్ 18 " రచనకు రేటింగ్ ఇవ్వండి.......................

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)