01-05-2026, 10:32 PM
రుద్రం భజే! ఎపిసోడ్ 15
గెస్ట్ హౌస్ లో నుంచి దీప్తి వాళ్ళని తీసుకుని బయటికి వచ్చి కిటికీలో నుంచి గ్యాస్ సిలిండర్ షూట్ చేసి మీర్జా విషయంలో డిసిషన్ సార్ నాకు ఇచ్చారు అని చెప్పి వ్యాన్ లో ఉన్న మిషన్ దగ్గరికి వచ్చాడు యోధ.
**************
బ్లాస్ట్ అయిన గెస్ట్ హౌస్ వైపు చూస్తూ "ఈ మీర్జా ఒక్కడే వస్తాడు అనుకున్నావా అని పొగరుగా చెప్పాడు, అందుకే పోయేటప్పుడు కూడా ఒక్కడే పోలేదు, రెస్ట్ ఇన్ పీస్ పైకి వెళ్ళిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉండు." అనుకుంటూ యోధ వాళ్ళ దగ్గరికి వచ్చింది పూజా.
వ్యాన్లో మిషన్ వైపు చూస్తూ "దీప్తి! నువ్వు చెప్పినట్లు హిమాలయాలలో ఉన్న వైరస్ ని బయటికి తీసే ప్రయోగం కోసం ఈ వస్తువుని వెతకడం లేదు అంతకన్నా పెద్దది ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు.
అతని ఎక్స్పరిమెంట్ ల గురించి మొత్తం స్టడీ చెయ్ ఎక్కడైనా ఈ వస్తువుతో ప్రయోగం గురించి మెన్షన్ చేశాడేమో తెలుస్తుంది." అని చెప్పాడు యోధ.
"మనం ఈ మిషన్స్ ని ఆన్ చేసి ఆ వస్తువుని పెట్టి చూస్తే ఏమవుతుందో తెలుస్తుంది కదా!" అని అడిగింది నీతూ.
"నో నో! అసలు ఈ ప్రయోగం ఏమిటో తెలుసుకోకుండా ఆ తప్పు చేయకూడదు చాలా డేంజర్!" అని చెప్పింది దీప్తి.
అంతలో అక్కడికి వచ్చి "సార్! మీరు చెప్పినట్లే అజీజ్ బాడిని అడవిలో ఒక కొండ దగ్గర ఉంచాము." అని చెప్పి గెస్ట్ హౌస్ బ్లాస్ట్ అయ్యి ఉండడం చూసి నీతూ దగ్గరికి వెళ్లి "మేడం! అందరూ పోయారా..? ఎవరైనా ఉన్నారా..?" అని నెమ్మదిగా అడిగాడు పుష్కర్.
"ఆ ముష్రు గాడు ఒక్కడు మిగిలాడు." అని చూపించింది నీతూ.
"అవునా?" అని వ్యాన్ దగ్గర ఉన్న ముష్రుని చూసి "నీ లక్కు బాగుందిరా.. వీళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరం అవుతుంది?" అని అడిగాడు ఏకవీర.
వ్యాన్ దగ్గర నుంచి వస్తు "అసలు వీడు వాళ్ళ గ్యాంగ్ లో మనిషే కాదు." అని చెప్పాడు యోధ.
ఆ మాట విని కంగారుగా చూస్తున్న ముష్రు వైపు చూసి "మరి ఎవరు అతను?" అని డౌట్ గా అడిగింది నీతూ.
"ఆ విషయం ముష్రు నోటి వెంట విందాము." అని గన్ లో బుల్లెట్స్ చూస్తూ చెప్పాడు యోధ.
"నన్నేమి చేయకండి వీళ్ళ దగ్గరికి నన్ను కలింగ సార్ పంపించారు." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ముష్రు.
ఆ మాట విని షాక్ అయ్యి "నువ్వు కళింగ మనిషివా..?" అంటూ యోధ వైపు చూసి "ఆ విషయం నువ్వు ఎలా కనిపెట్టావు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది దీప్తి.
"గెస్ట్ హౌస్ లో మీర్జా మనుషులందరినీ ఒక రూమ్ లోకి తీసుకు వెళ్ళమని వీడికి చెప్పాను అప్పుడే మీర్జా నోటి వెంట కలింగం పేరు బయటికి వచ్చింది.
వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ముష్రు వైపే చూశారు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అందుకే వీడిని ప్రాణాలతో ఉంచాను." అని చెప్పాడు యోధ.
"నాకు అప్పుడే డౌట్ వచ్చింది వీడి మీద అంత ప్రేమ ఏమిటి అబ్బా అనుకున్నాను ఇప్పుడు వీడి చావుకు వచ్చింది అందరి దెబ్బలు ఒక్కడికే పడతాయి." అని చెప్పింది పూజా.
ముష్రు దగ్గరికి వెళ్లి "కళింగ ఎక్కడ ఉన్నాడు? ఈ వస్తువుని ఆ మిషన్ లో పెడితే ఏం జరుగుతుంది?" అని అడిగింది నీతూ.
"కళింగ సర్ నాకు ఫోన్లో ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళతోపాటు వెళ్లి ఆ వస్తువు దొరికిన వెంటనే మిషన్ లో పెట్టి ఆన్ చేయమని చెప్పారు అంతకు మించి నాకు కూడా ఏమీ తెలియదు." అని చెప్పాడు ముష్రు.
"మీరు అంత నెమ్మదిగా అడిగితే వాడి నోటి వెంట ఒక్క ముక్క కూడా బయటికి రాదు." అని గన్ లోడ్ చేశాడు యోధ.
తన చేతిలో గన్ తీసుకుని "వీడు కూడా పోతే కళింగ ఎక్కడ ఉన్నాడో అసలు ఈ ప్రయోగం ఏమిటో కుడా తెలియదు." అని చెప్పి ముష్రు దగ్గరకు వెళ్లి
"నిన్ను ఇక్కడికి పంపించాడు అంటే కచ్చితంగా ఈ ప్రయోగం గురించి నీకు తెలిసే ఉంటుంది అదేమిటో చెప్పు ప్రాణాలతో ఉంటావు." అని అడిగింది దీప్తి.
సైలెంట్ గా ఉన్న ముష్రు దగ్గరికి వెళ్లి "దీప్తి! నువ్వు చెప్పింది కూడా కరెక్టే! బుల్లెట్ వేస్ట్ చేయకూడదు." అని చెప్పి పుష్కర్ జేబులో ఉన్న పెన్ను తీసి ముష్రు కాలులో పొడిచాడు యోధ.
కాలులో పెన్ను దిగడంతో బాధతో గట్టిగా అరుస్తున్న ముష్రు గొంతు కన్నా భయంతో గట్టిగా అరిచిన పూజా గొంతు రీసౌండ్ రావడంతో కంగారుగా వెనక్కి తిరిగి "బానే ఉన్నావు కదా!" అని అడిగింది నీతూ.
టెన్షన్ గా చూస్తూ "నేను బానే ఉన్నాను ఇలాంటివి చేసేటప్పుడు కాస్త చెప్పి చేయండి." అని ముష్రు కాలివైపు చూసి "పెన్ను ని ఇలా కూడా ఉపయోగిస్తారని నాకు ఇప్పుడే తెలిసింది." అని కంగారుగా చెప్పింది పూజా.
పుష్కర్ వైపు చూసి "తెల్లారిపోయింది మనం ఈ ప్లేస్ లో ఇంక ఉండకూడదు, నీ పెన్ను తీసుకోని వాడిని జీపులో ఎక్కించండి." అని చెప్పాడు యోధ.
"మరి ఈ మిషన్స్ ని ఏం చేద్దాము?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"ఏకవీర! ఆ వ్యాన్ తీసుకుని మా వెనకాల రా..!" అని చెప్పి జీప్ ఎక్కడు యోధ.
ముష్రుని జీపులో ఎక్కించి డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి స్టార్ట్ చేసి పక్క సీట్లో ఉన్న యోధ వైపు చూసి "ఎక్కడికి వెళ్ళమంటారు?" అని అడిగాడు పుష్కర్.
"మన గుడి దాటిన తర్వాత పాడుబడిన ఒక కోట ఉంది అక్కడికి వెళదాము ఆ ప్లేస్ కి ఊరు వాళ్ళు కూడా ఎవరు రారు." అని చెప్పాడు యోధ.
కాసేపటికి కోట దగ్గరికి చేరుకుని మిషన్ ఉన్న వ్యాన్ ఎవరికీ కనబడకుండా ఒక పక్కకు పెట్టి జీప్ లో ఉన్న ముష్రుని దింపి కోట లోపలికి తీసుకువెళ్లి "నిజంగానా వీడికి కలింగ గురించి ఏమీ తెలియదు అనుకుంటా!" అని చెప్పింది నీతూ.
"అలా అయితే ఇంక వీడితో మనకు పనే ఉంది చంపేయండి." అని చెప్పాడు యోధ.
వన్ మినిట్! డాడ్ కళింగ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ పంపించారు." అని లాప్టాప్ లో చూస్తూ
"యోధ! ఈ ఫోటో ఒక్కసారి చూడు ముష్రూ మనతో అబద్ధం చెప్పాడు ఇతను కళింగ తో చాలా క్లోజ్ ఉన్నాడు అంటే ఈ ప్రయోగం గురించి తనకి తెలిసే ఉంటుంది." అని చూపించింది దీప్తి.
లాప్టాప్ లో ఫోటో చూసి ముష్రు వైపు తిరిగి "ఈ వస్తువుతో ఏం చేయాలి అనుకుంటున్నారో చెప్పకపోతే థర్డ్ డిగ్రీ కి మించిన డిగ్రీ నీకు చూపిస్తాను దానికన్నా చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది." అని కోపంగా చూస్తూ చెప్పాడు యోధ.
ఆ మాట విని భయంగా చూస్తూ "నాకు ఆ బ్రతుకు వద్దు తెలిసింది మొత్తం చెబుతాను, 1995 లో కైలాస పర్వతం నుంచి మానససరోవరం వెళ్లే దారిలో తపస్సు చేసుకునే బౌద్ధ సన్యాసులకు ఒక గుహలో కొన్ని తాళపత్ర గ్రంధాలు దొరికాయి.
వాటిలో దైవ లిపిలో రాసి ఉండడం చూసి దుష్టుల కంటపడితే ప్రమాదం అని భావించి ఆ గ్రంథాలని టిబెట్లో ఒక ఆశ్రమంలో భద్రపరిచారు
చింగ్ యా అని చైనా మిలటరీ జనరల్ కైలాస పర్వతం మిస్టరీ చేదించి అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోవాలని అక్కడ రహస్యంగా ఉన్న నగరానికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.
ఆ గ్రంధాలు దొరికిన విషయం తెలుసుకుని తనకి ఉన్న పవర్ తో టిబెట్ గవర్నమెంట్ ని భయపెట్టి ఆశ్రమంలో ఉన్న గ్రంధాలు హ్యాండ్ ఓవర్ చేసుకుని జింగ్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ ద్వారా ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
ఆ గ్రంథాలలో ఉన్న కైలాస పర్వతం రహస్యం గురించి తెలుసుకోలేకపోయారు కానీ, నీ దగ్గర ఉన్న వస్తువు ఎక్కడ ఉందో దాని దగ్గరకు ఎలా వెళ్లాలో తెలుసుకున్నారు.
మూడు సంవత్సరాలు కష్టపడి కైలాస పర్వతం దగ్గర వెతికి 400 మంది సైనికులు మరణం అనంతరం ఆ వస్తువుని కనుక్కున్నారు, అది దొరికిన ప్లేస్ లో ఉన్న ఆధారాలను బట్టి ఆ వస్తువు ఒక నగరానికి దారి చూపుతుంది అని తెలుసుకున్నారు.
ఆ ప్రయోగం చేయడానికి అనువైన ప్రదేశం పాకిస్తాన్లో ఉందని తెలుసుకొని ఆ దేశాన్ని ఒప్పించి కారకొరం పర్వతాల దగ్గర ప్రయోగం మొదలుపెట్టారు కానీ ఇండియన్ ఏజెంట్స్ వల్ల అది ఫెయిల్ అయింది ఆ వస్తువు కూడా మిస్ అయ్యింది.
ఆ గ్రంథాలలో ఉన్న దాన్ని బట్టి అలాంటిది మరొక వస్తువు ఆ ప్రదేశంలోనే ఉందని తెలుసుకుని దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడ దొరకలేదు.
2015లో చైనా సైంటిస్టుల సహాయం తో కళింగ సార్ హిమాలయాల అడుగున ఉన్న కళేబరాలను బయటకు తీసి కొత్త రకం వైరస్ ని కనిపెట్టడంలో సక్సెస్ అయ్యారు.
అప్పుడు అన్ని దేశాలు ఆయనను బహిష్కరించడంతో చైనా దగ్గరికి తీసుకుంది. అప్పుడే మిలిటరీ జనరల్ చింగ్ యా ఈ వస్తువు గురించి అక్కడ దొరికిన ఆధారాలు గ్రంధాలు చూపించాడు.
అవి చూసి కళింగా సార్ నేను ఈ వస్తువు గురించి తెలుసుకోవడానికి ఐదు సంవత్సరాలు హిమాలయాల్లోనే ఉన్నాము. అక్కడ తపస్సు చేసుకుంటున్న చాలామంది వ్యక్తులను కలిసి వివరాలు సంపాదించడం మొదలుపెట్టాము.
అప్పుడే రేపాలి అనే టీబేట్ తాంత్రికుడుని కలిసాము ఆయన చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఆ వస్తువు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఒక మిషన్ తయారుచేసి దాని సిగ్నల్ కోసం వెతకడం ప్రారంభించాము.
నాలుగు నెలల క్రితం అనుకొని విధంగా ఆ వస్తువు సిగ్నల్ దొరికింది దానికోసం చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సార్ ఇండియాలో అడుగుపెట్టారు." అని చెప్పాడు ముష్రు.
"ఆ వస్తువు కోసం చైనా అంత ఫండింగ్ ఎందుకు చేస్తుంది? ఈ వస్తువు ద్వారా ఏ నగరం కనిపిస్తుంది." అని అడిగాడు యోధ.
"ఆ వస్తువుని ఆక్టివేట్ చేస్తే కైలాస పర్వతంలో ఉన్న కుబేరుడు నగరం అయ్యినా అలకాపురి ద్వారాలు తెరుచుకుంటాయి. దానికి సంబంధించిన ఆధారాలు కళింగ సార్ దగ్గర ఉన్నాయి." అని చెప్పాడు ముష్రు.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ కుబేరుడి నగరం "అలకాపురి డోర్స్ ఓపెన్ అవుతాయా..?" అని అడిగింది దీప్తి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)