01-05-2026, 12:02 PM
రుద్రం భజే! ఎపిసోడ్ 12
సత్తితో పాటు ఉన్న మనిషి ముష్రుతో మీర్జా వాళ్ళకి కాల్ చేయించి ఆ వస్తువు దొరికింది ఆఫీసర్లని కూడా పట్టుకున్నాము గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాము త్వరగా రండి అని చెప్పించడు యోధ.
***************
సత్తి, ముష్రు లను జీప్ లో పడేసి హ్యాండ్ కప్స్ వేసి దీప్తి వాళ్ళ వైపు చూసి "పుష్కర్ వాళ్ళు ఇంకా గుడిలోనే పడుకుని ఉన్నారు అనుకుంటా వెళ్లి లేపండి." అని చెప్పేడు యోధ.
ఆ మాట విని "నేను వెళ్లి లేపుతాను." అని హుషారుగా పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళింది పూజా.
యోధ వైపు చూసి "అసలు ఈ మీర్జా ఎవరు? ఈ వస్తువు కోసం అతను ఎందుకు వస్తున్నాడు?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"వన్ మినిట్!" అని చెప్పి ఫోన్ తీసి నాయక్ కి కాల్ చేసి "జైహింద్ సర్! ఇక్కడ అంత క్లియర్ ఉదయానికి మీర్జా కూడా నా చేతిలో ఉంటాడు." అని చెప్పాడు యోధ.
"గుడ్! మీర్జా దగ్గర జీతిన్ తో పాటు మరో ఆఫీసర్ ఉండి ఉంటాడు ఎలాగైనా వాళ్ళని సేఫ్ గా తీసుకురా..! అలాగే మీర్జాకి ఈ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు, ఆ వస్తువుతో వాళ్ళు ఎటువంటి ప్రయోగం చేయబోతున్నారో కూడా మనకి తెలియాలి." అని చెప్పాడు నాయక్.
"సార్! నేను వాళ్ళ మనిషితో మీర్జా కి కాల్ చేయించి ఆ వస్తువు మా హ్యాండ్ ఓవర్ లోనే ఉంది అని చెప్పించాను, వాడు కచ్చితంగా ఆ విషయం కాంట్రాక్ట్ ఇచ్చిన వాడికి కాల్ చేసి చెప్తాడు.
మీరు కర్నూలు హైవే లో ఆరు నెంబర్లు ట్రేస్ చేశాము అని చెప్పారు కదా వాటిని అబ్జర్వేషన్ లో పెట్టండి ఖచ్చితంగా మీర్జా కి కాంట్రాక్ట్ ఇచ్చిన పర్సన్ నెంబర్ ట్రేస్ అవుతుంది." అని చెప్పాడు యోధ.
"గుడ్ ఐడియా! నేను ఆ పనిలో ఉంటాను కానీ మీర్జాని తక్కువ అంచనా వేయకు వాడు ఒక జిత్తుల మారి నక్క!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాయక్.
ఫోన్ కట్ అవడంతో దీప్తి వైపు చూసి "మీర్జా ఎవరు అని అడిగావు కదా" వాడు ఒక మాఫియా లీడర్! నీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే భారతదేశంలో పుట్టి శత్రు దేశానికి సహాయం చేసే ఒక వెధవ!" అని కోపంగా చెప్పాడు యోధ.
"ఎస్! వాడు ఇండియన్ గవర్నమెంట్ హిట్ లిస్ట్ లో ఉన్నాడు కానీ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు అందుకనే తప్పించుకుని తిరుగుతున్నాడు కానీ ఇంకా కుదరదు." అని చెప్పింది నీతూ.
అంతలో గుడి దగ్గరికి వెళ్లి బయట ఉన్న కర్ర తీసుకుని లోపలకి వెళ్లి పుష్కర్, ఏకవీర లని దాంతో కొడుతూ "మర్యాదగా కళ్ళు తెరవండి లేకపోతే ఇంకా జీవితాంతం తెరవలేరు." అని గొంతు మార్చి చెప్పింది పూజా.
ఆ మాట విని భయంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి "మేడం" మీరా ఇంకా ఎవరో వచ్చారు అనుకున్నాను పై ప్రాణాలు పైనే పోయాయి. " అని పక్కన గురకబెట్టి నిద్రపోతున్న ఏకవీర ని ఒక్క తన్నుతాన్ని "పడుకుంది చాలు ఇంకా పద!" అని చెప్పాడు పుష్కర్.
ఆ మాటకి ఉలిక్కిపడి లేచి "ఏంటి ఆపరేషన్ కంప్లీట్ అయిందా? లేక నేను కూడా ఫీల్డ్ లోకి వెళ్ళాలా..?" అని అడిగాడు ఏకవీర.
"మీర్జా అంట ఎవరో ఇక్కడికి వస్తున్నాడు వాడిని పట్టుకోడానికి మీరిద్దరూ వెళ్లాలంట ప్రిపేర్ అవ్వండి." అని చెప్పి గుడి బయటకు వచ్చింది పూజా.
ఆ మాట విని మత్తు వదిలి వెనకాలే వచ్చి నీతూ వైపు చూసి "మేడం! మీర్జా ని పట్టుకోడానికి మేము వెళ్ళాలా..?" అని కంగారుగా అడిగాడు పుష్కర్.
నవ్వుతున్న పూజ వైపు చూసి "కంగారు పడకండి మీరు వెళ్ళనవసరం లేదులే!" అని చెప్పింది నీతూ.
అక్కడికి వచ్చి జీపులో చెయ్యి వెనక్కి తిరిగి ఉన్న సత్తి వైపు చూసి "మేడం! హ్యాండ్ కప్ సరిగ్గా వేయలేదు చెయ్యి వెనక్కి తిరిగింది." అని చెప్పాడు ఏకవీర.
"అది కరెక్ట్ గానే ఉంది నేనే చేతిని వెనక్కి తిప్పెను, గుడి దగ్గర ఐదు బాడీలు ఉన్నాయి తీసుకొచ్చి జీపులో పడేయండి మళ్లీ ఉదయం నాన్నగారు చూస్తే కంగారు పడతారు." అని చెప్పాడు యోధ.
ఆ మాట విని "ఓకే సార్!" అని బాడీలని తీసుకురావడానికి వెళ్లారు ఇద్దరు.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జైహింద్ సర్!" అని చెప్పాడు యోధ.
"జై హింద్ యోధ! నువ్వు చెప్పినట్లు ఆరు నెంబర్ల లో ఒక నెంబర్ కి మీరు ఉన్న ఏరియా నుంచి కాల్ వచ్చింది కానీ వాళ్లు మళ్లీ తిరిగి కాల్ చేయలేదు.
నాకు తెలిసి అక్కడికి వచ్చి ఆ వస్తువుని చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కాల్ చేస్తాడు అనుకుంటున్నాను కేర్ ఫుల్ గా ఉండండి." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్!" అని జీపులో ఉన్న సత్తి వైపు చూసి ఆలోచిస్తూ ఉన్నాడు యోధ.
************
ఆదే సమయంలో కారులో అరవకొండ వైపు వస్తూ ముష్రుతో ఫోన్లో మాట్లాడి "ఆ వస్తువు మనవాళ్ళ దగ్గరికి వచ్చింది త్వరగా వెళ్లాలి." అని చెప్పాడు మీర్జా.
"నాకు తెలుసు బాయ్ మన సత్తి గాడు సాధిస్తాడు." అని సంతోషంగా చెప్పాడు అజిజ్.
మీర్జా వైపు సంతోషంగా చూస్తూ "బాయ్! నీకు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేసి డబ్బులు రెడీ చేసుకోమను." అని నవ్వుతూ చెప్పాడు బ్రహ్మం.
ఇద్దరి మాటలు వింటూ సైలెంట్ గా లాప్టాప్ లోకి చూస్తూ "ఆ వస్తువు ఇంకా బయటికి రాలేదు మీ మనుషుల అబద్ధం చెప్పారు, ఒకవేళ వస్తువు బయటకి వస్తే నాకు సిగ్నల్ కనబడుతుంది." అని సీరియస్ గా చూస్తూ చెప్పాడు మీర్జా.
ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "సత్తి అలాంటోడు కాదు బాయ్! సిగ్నల్ అందడం లేదేమో సరిగ్గా చూడు కచ్చితంగా వస్తావు మన వాళ్ళ దగ్గరే ఉంటుంది." అని చెప్పాడు అజిజ్.
"నో! ఆ వస్తువు సిగ్నల్ కనబడడం లేదు నీ మనిషి తలమీద బ్లాక్ పాయింట్ లో గన్ పెడితే ఏది చెప్పమంటే అది చెబుతాడు కదా!" అని అడిగాడు మీర్జా.
"అది కూడా నిజమే బాయ్! నీతో మాట్లాడింది సత్తి కాదు ముష్రు వాడు నాతో అంత డేర్ గా ఇప్పటివరకు మాట్లాడలేదు." అని అనుమానంగా చూస్తూ చెప్పాడు అజిజ్.
"అంటే! అక్కడికి వెళ్ళిన మనవాళ్లని ఆఫీసర్లు పట్టుకున్నారంటవా..?" అని డౌట్ గా అడిగాడు బ్రహ్మం.
"ఎస్! ఖచ్చితంగా అదే జరిగింది మనల్ని పట్టుకోడానికి కూడా వల విసిరారు." అని ఆవేశంగా చూస్తూ చెప్పాడు మీర్జా.
"మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ ఆగిపోదామా..?" అని అడిగాడు అజిజ్.
"మధ్యలో ఆగడం అనేది ఈ మీర్జా లైఫ్ లో లేదు అరవకొండ దగ్గరికి వెళ్ళండి ఏం చేయాలో నేను చెబుతాను." అని చెప్పాడు మీర్జా.
*************
అదే సమయంలో జీప్ మీద కూర్చొని ఆలోచిస్తున్న యోధ దగ్గరికి వచ్చి "ఏమైంది? అంత సీరియస్ గా థింక్ చేస్తున్నావు?" అని అడిగింది దీప్తి.
"మీర్జా కి ఫోన్ వెళ్లిన తనకి కాంటాక్ట్ ఇచ్చిన వాడికి కాల్ చేయలేదు అంటే వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు నమ్మలేదు కచ్చితంగా అనుమానం వచ్చి ఉంటుంది వాళ్లకి నమ్మకం కలిగేటట్లు చేసి ఇక్కడికి రప్పించాలి." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి ఆలోచిస్తూ "వాళ్లకి నమ్మకం కుదరాలి అంటే మనం ఏం చేయాలి?" అని అడిగింది నీతూ.
"ఆ గుడిలో ఉన్న వస్తువుని బయటికి తీసుకురావాలి అప్పుడు వాళ్లకి సిగ్నల్ అందుతుంది వీళ్ళు చెప్పిన మాట నమ్ముతారు." అని చెప్పింది దీప్తి.
"ఎస్! నువ్వు చెప్పింది కరెక్ట్! ఆ వస్తువు సిగ్నల్ అందబట్టే వెతుక్కుంటూ ఈ ఏరియాకి వస్తున్నారు, మళ్లీ దానిని గుడి లోనుంచి బయటికి తీసుకు వస్తేనే వాళ్లకి నమ్మకం కుదురుతుంది మనం చెప్పిన ప్లేస్ కి వస్తారు." అని చెప్పాడు యోధ.
"కరెక్టే కాని మనం డేంజరస్ గేమ్ ఆడుతున్నామేమో!" అని కంగారుగా చెప్పింది పూజా.
"ఎస్! ఇది కచ్చితంగా డేంజరస్ గేమ్! కానీ మనకి కాదు." అని చెప్పి సుప్రభాతం టైం అవడంతో గుడి తలుపులు తెరవడానికి వస్తున్న తండ్రిని చూసి జీప్ మీద నుంచి కిందకు దిగి దగ్గరికి వెళ్ళాడు యోధ.
గుడి దగ్గరికి వస్తున్న యోధ ని వెనకాల ఉన్న దీప్తి వాళ్ళని చూసి "ఏంటి? మీరందరూ ఇక్కడ ఉన్నారు?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు నారాయణ రావు.
"నాకు నిద్ర పట్టలేదు నాన్నగారు!" అని చెప్పాడు యోధ.
ఆ మాట విని "ఒక సైనికుడికి నిద్ర పట్టలేదు అంటే ప్రమాద ఘడియలు ముందు ఉన్నాయని అర్థం!" అని చెప్పి మంత్రాలు చదువుతూ గర్భగుడి తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి
"మీరు వెతుకుతున్న ఆ వస్తువు ఇదే!" అని స్వామివారి పాదాల వైపు చూపించాడు నారాయణ రావు.
సింధూరం రంగులో మెరిసిపోతున్న వస్తువుని చూసి "ఆంజనేయ స్వామి వారి ఆయుధం లాగా ఉంది." అని మెరుస్తున్న కళ్ళతో చూస్తూ చెప్పింది పూజా.
"నాన్న గారు! 25 సంవత్సరాలుగా స్వామివారి రక్షణలో ఉన్న ఆ వస్తువుని ఇక్కడి నుంచి తీసుకు వెళ్లే సమయం వచ్చింది." అని చెప్పాడు యోధ.
ఆ మాట విని "ఆ భగవంతుడి ఆజ్ఞ అనుకుంటాను." అని మంత్రాలు చదువుతూ పాదాల దగ్గర ఉన్న ఆ వస్తువుని తీసి యోధ చేతిలో పెట్టి "ఇకనుంచి దీని రక్షణ బాధ్యత ఆ స్వామి నీకు ఇస్తున్నారు." అని చెప్పాడు నారాయణ రావు.
"సరే నాన్నగారు!" అని వస్తూవుని చేతిలోకి తీసుకుని కళ్ళకు అద్దుకొని నీతూ వాళ్ళ వైపు చూసి సైగ చేసి గుడి బయటికి వచ్చాడు యోధ.
**********
కార్ లో అరవకొండ వైపుకి వస్తూ లాప్ టాప్ లో సిగ్నల్ రావడం సంతోషంగా చూస్తూ "మీ మనుషులు సాధించారు." అని గట్టిగా అరిచాడు మీర్జా.
ఆ మాట విని సంతోషంగా కేరింతలు కొడుతూ "బాయ్ చెప్పాను కదా! మన సత్తి గాడు సాధిస్తాడు." అని డ్రైవర్ వైపు చూసి "స్పీడ్ గా వేళ్ళు!" అని చెప్పాడు అజిజ్.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)