01-05-2026, 11:51 AM
Part - 96
పెళ్లి కాకుండా ఇద్దరూ ఒక రూమ్ లో ఉండడం ఎలా అని.. ఒక వైపు విశిని ఒక దాన్నే రూమ్ లో ఉంచడం కరెక్ట్ కాదు అని మరోవైపు..
ఇద్దరం ఒకే రూమ్ లో ఉందాము అంటే విశి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. విశి కి కూడా పరిస్థితి అర్థం అయ్యి సార్ అని పిలుస్తుంది.
హ అని చూస్తే ఒక రూమ్ తీసుకోండి. పర్వాలేదా మీ మీద నాకు నమ్మకం ఉంది. విశి చెప్పినదానికి చిన్నగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తాడు.
ఇద్దరూ లిఫ్ట్ నుంచి బయటికి వచ్చి రూమ్ డోర్ తెరుస్తారు.
అందంగా, శుభ్రంగా, సేఫ్ సూట్ రూమ్. లోపల అడుగు పెట్టిన విశి కళ్లే పెద్దవై...
సార్… ఇది చాలా కాస్ట్ అయి ఉంటుంది అనుకుంటా…
సూర్య తల ఊపుతూ....
ఇట్స్ ఓకే విశి… సేఫ్టీ కన్నా ఏదీ ఇంపార్టెంట్ కాదు.
రెండు సపరేట్ బెడ్స్ చూసి విశి ఊపిరి తీసుకుంటూ ఒక బెడ్‌పై కూర్చుంది.
సూర్య బ్యాగ్‌ను ఓపెన్ చేస్తూ...
ఫ్రెష్ అయి వచ్చేస్తావా?
హా సార్.
విశి డ్రెస్ తీసుకొని వాష్ రూమ్ కి వెళుతుంది. వాష్‌రూమ్ కి వెళ్లిన విశి కొద్ది సేపటి తర్వాత హాయిగా స్నానం చేసి, సింపుల్ నైట్‌డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది.
సూర్యను చూసి కొంచెం ఎంబరాస్మెంట్‌గా తలదించుకొని వెళ్లి మంచం పైన కూర్చుంటుంది. ఫోన్ తీసుకుని భానుమతికి మెసేజ్ చేస్తుంది.
అంతలో సూర్య కూడా ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకుని బయటకు వచ్చేస్తాడు.
ఏమైనా తింటావా? అని అడుగుతాడు.
విశి చేతులు ఊపుతూ... అమ్మో వద్దు సార్… చాలా హెవీ అయిపోయింది. ఒక్క దుప్పటి ముసుగేస్తే కళ్లే మూసుకుంటున్నాయి. నిద్ర దేవి వెంట తీసుకెళుతోంది.
ఆ మాటకి సూర్య నవ్వుతాడు.
సార్… మీరు ఏమైనా తినండి. నాది సేమ్ పొజిషన్. నేను అలసిపోయాను
తలగడ ఒళ్ళో పెట్టుకుని ఇద్దరూ కొంచెం టైమ్ ఫ్రెండ్లా మాట్లాడుకుంటారు.
ఎక్కడ ఆగాలో ఇద్దరికీ అర్థమే... మర్యాద, గౌరవం, బౌండరీలు అన్నీ తెలిసిన ఒక ప్రేమ జంట.
రేపు లాంగ్ డ్రైవ్ ఉంది కదా… 6 కి రెడీ అవ్వాలి.
అయ్యో అంత ఎర్లీనా?
ఏం లెగలేవా.. ఎందుకు లెగలేను సార్.. మీ గురించే ఆలోచిస్తున్నాను. అంత ఎర్లీగా అంటే మీరు డ్రైవింగ్ చేయగలరో లేదో అని.
నా గురించి నేను చూసుకుంటాను గాని.. లేడీస్ రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు కదా.. నువ్వు తొందరగా లేచి రెడీ అవ్వు.
హలో సార్ నేను అసలు మేకప్ వేసుకోను. నిజమా.. మీరు ఎప్పుడూ నన్ను అబ్జర్వ్ చేయలేదా అని చిన్న బుచ్చుకున్నట్టుగా అడుగుతుంది.
విశి ముద్దు మొహాన్ని చూసి నవ్వుకుంటూ అమ్మాయిలని నేను ఎప్పుడు పట్టికలర్గా అబ్జర్వ్ చేయలేదు. అందరూ అనుకునే మాటే నేను అడిగాను.
సో నీలాంటి స్పెషల్ ఎక్స్ట్రా కాండిడేట్స్ ఉంటారు అని ఇప్పుడే అర్థమైంది. సూర్య కాంప్లిమెంట్ కి చిన్నగా సిగ్గుపడుతుంది.
కాసేపు నవ్వులు, చిన్న చిన్న జోక్స్.
గుడ్ నైట్ సార్.
గుడ్ నైట్ విశి.
రూమ్‌లో కేవలం ఏసీ హమ్, కర్టన్‌ల స్లయిట్ కదలికలు, మరియు ఇద్దరికీ వచ్చిన నిజమైన… ప్రశాంత నిద్ర.
రూమ్‌లో కర్టన్ గ్యాప్ నుంచి సూర్యకాంతి నెమ్మదిగా లోపలికి చేరుతోంది.
విశి ఇంకా దుప్పటి ముసుగేసి గాఢంగా నిద్రపోతుంది.
సూర్య ముందుగానే లేచిపోయి, కుర్చీలో కూర్చుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఏదో పని చూస్తుంటాడు.
సడన్‌గా బెడ్ పక్కన నుండి....
హ్మ్మ్మ్.. అని చిన్నగా మూలుగినట్టుగా విశి టర్నింగ్ అవుతుంది. అమ్మ కర్టిన్ దగ్గరికి లాగు అని దుప్పటిని పైకి లాక్కుంటుంది.
సూర్య నవ్వు ఆపుకుంటూ చూస్తాడు. కొంచెం తర్వాత విశి ఒక్కసారిగా కళ్లప్పగించి లేచి కూర్చుంటుంది.
సార్!! నేను నిన్న రాత్రి ఇలా నిద్రపోయానా?
అని తన జుట్టు మొత్తం గాలివాన తాకినట్టు అయిపోయినట్టు హడావుడిగా సరి చేసుకుంటుంది.
సూర్య నవ్వుకుంటూ... విశి… రిలాక్స్. ఏం ఏమీ కాదు. నిద్రపోయావంతే.
విశి ఇంకా పక్క బెడ్ కవర్ చూస్తూ... ఓహ్ గాడ్… నేను ఇలా పడుకున్నానా? కనీసం గుడ్ మార్నింగ్ సార్ అనడానికి ముందు నా హెయిర్ ఇలా? అని ముఖం చేతుల్లో దాచుకుంటుంది.
సూర్య నవ్వు ఆపుకోలేక... ఏంటి విశి సిగ్గుపడుతున్నావా అయినా నేనేమీ అనుకోవడం లేదు. చాలా క్యూట్ గా నిద్రపోయావు.
విశి కళ్ళని చిన్నగాపెట్టి సార్... మీరు నన్ను ఏడిపిస్తున్నారు.
సూర్య లైట్‌గా... చాలా క్యూట్‌గా నిద్రపోయావంటే నమ్మవా... వెంటనే విశి ముఖం టమాటో రెడ్ అయిపోతుంది.
సార్… ఇలాంటివి చెప్పకండి ప్లీజ్…
టైం చూసుకుని సార్ అని అరుస్తుంది. మళ్ళీ ఏమైంది అప్పుడే సెవెన్ అయిపోయింది. అవును మనం సిక్స్ కే బయలుదేరాలి అనుకున్నాము కదా..
మీరు ఎప్పుడో లేచారు. లేపాల్సింది అని గిల్టీగా అంటుంది. ఇప్పుడు ఏమైంది మన సెల్ఫ్ డ్రైవింగ్ ఏ కదా..
కొంచెం లేటుగా వెళతాము. బాగా అలసిపోయి ఉన్నావు.. పడుకున్నావు. లేపాలి అనిపించలేదు. కానీ డ్రైవింగ్ చేసిందంతా మీరే. నేను బ్యాక్ కూర్చున్నాను.
నేనేం అలిసిపోయి ఉంటాను సార్.ఎలాగైనా జర్నీ కదా. నో ప్రాబ్లం వెళ్లి ఫ్రెష్ అవ్వు. బ్రేక్‌ఫాస్ట్ కి వెళ్దాం.
షాల్ సరిచేసుకుంటూ అర్జంట్‌గా వాష్‌రూమ్ వైపు నడుస్తుంది.
సూర్య మాత్రం తల ఊపుకుంటూ, చిరునవ్వుతో... గుడ్ మార్నింగ్ విశి.. అని కాస్త గట్టిగా అంటాడు.
విశి డోర్ మూసే మధ్యలోనే.. గుడ్ మార్నింగ్ సార్…
అని సగం సిగ్గుతో.. సగం ఇబ్బందితో తలుపు వేస్తుంది.
తలుపు మూసిన తర్వాత తానలో తాను...
ఛ… ఎందుకిలా అయిపోయిందబ్బా…
విశి రెడీ అయ్యి వచ్చేటప్పటికి రూమ్ లోకి బ్రేక్ ఫాస్ట్ కాఫీ ఆర్డర్ పెడతాడు. విశి టేబుల్ దగ్గరకి వస్తుంది.
సూర్య అప్పటికే కూర్చుని కాఫీ ఆర్డర్ చేసి వెయిటింగ్.
విశి చైర్ దగ్గర కూర్చునే సమయంలో సూర్య ఆమెను ఒకసారి పై నుంచి కింద దాకా చూసి...
హ్మ్… ఇప్పుడు మాత్రం పూర్తిగా అమ్మాయిలాగా ఉన్నావు.
ఏం సార్! నేను ముందు ఇలాగే ఉన్నాను కదా..
సూర్య కాఫీ తాగుతూ... నిన్న రూమ్‌లో లేచినప్పుడు చూశానుగా… హరికేన్ విశి వెర్షన్.
విశి కళ్లను పెద్దవిగా చేసి... సార్ ప్లీజ్… అది నిద్ర వల్లే. అవి చెప్పక్కర్లేదుగా.
సూర్య నవ్వుతూనే... నిన్ను చూస్తే నాకు అర్థం అయ్యింది ఏమిటంటే … నిద్ర అంటే నిజంగా నీకు దేవతలా ఉంటుంది. నిద్ర పోయేటప్పుడు ప్రపంచం, ఇమేజ్, బౌండరీలు అన్నీ ఆఫ్ అయ్యిపోతాయి.
విశి ప్లేట్‌లో ఉన్న ఇడ్లీని చూస్తూ... సార్… ఇలా చాలా టీజ్ చేస్తుంటే… నేను మాట్లాడను. అలుగుతాను.
అవునా నీలో అలక అనే యాంగిల్ ఇప్పుడు వరకు చూడలేదు ప్లీజ్ ఒక్కసారి అలగవ అని టీజింగ్ వాయిస్ తో అడుగుతాడు.
విశి చేతులు జోడించి... ఈ ఒక్కరోజు నన్ను టీజ్ చేయకుండా ఉండండి, చూద్దాం మీ వల్ల అవుతుందా?
సూర్య వెంటనే నవ్వి.... ఒక్కరోజా? అది అసాధ్యం.
నీ ఎక్సప్రెషన్స్ చూడగానే ఆటో టీసింగ్ మోడ్ ఆన్ అయిపోతుంది. ఏమి చేయమంటావు చెప్పు..
విశి ప్లేట్‌తోనే అతన్ని కొట్టాలనుకున్నట్టుగా.. సార్… చాలా ఇబ్బంది పెడుతున్నారు.
అయితే నీకు ఒక్క ఛాలెంజ్.
ఇవాళ్టి ట్రిప్‌లో నువ్వు నన్ను ఒక్కసారి అయినా టీజ్ చేస్తే… నేను నిన్ను ఇక టీజ్ చేయను.
విశి ఐబ్రో రైజ్ చేస్తూ.. మిమ్మల్ని చేయలేను అనుకుంటున్నారా... అరే చేయమనే కదా నేను అంటున్నాను.
ఇప్పటివరకు నన్ను టీజ్ చేసే అవకాశం ఏ అమ్మాయికి ఇవ్వలేదు ఫస్ట్ నీకే ఇస్తున్నాను కాబట్టి యూస్ చేసుకో.
సూర్య ముఖం చూడటం కష్టమయ్యేలా అటు చూసి... మీకు ఎందుకు సార్ నన్ను టీజ్ చెయ్యాలి అనిపిస్తుంది. కాఫీ తాగుతూ నేను టీజ్ చేస్తున్న సరే ఎందుకు అబ్జెక్ట్ చెప్పకుండా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు.
ఏంటి… నేను అలా నవ్వుకుంటున్నానా..
విశి తలవంచుకొని చిన్నగా సార్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నా పని అంతే. ఏం ఆలోచిస్తున్నావు.. సీరియస్గా పెట్టాను అనుకోని సూర్యని చూస్తూ..
సార్… మీరు ఆలా ఎలా చెప్పేశారు.
సూర్య కప్పు పెట్టి... సరే... లెట్స్ ఈట్.
అదేంటంటే.. టీజ్ చేస్తున్నప్పుడు....నీవు క్యూట్‌గా రెయాక్ట్ అవుతావు.
విశి ముఖం వెంటనే పింక్ అయిపోతుంది.
సార్… ప్లీజ్ … ఇంకో మాట మాట్లాడితే టేబుల్ వదిలి వెళ్తాను
సూర్య చిన్నగా సైరన్‌లా ఓకే, ఓకే… అని చేతులు ఎత్తేస్తాడు.
కానీ ఆమె ప్లేట్‌లో దోసె కట్ చేస్తుండగా అతను మళ్ళీ నెమ్మదిగా...
బై ది వే... గుడ్ మార్నింగ్... హరికెన్ వెర్షన్ కాదు... నార్మల్ క్యూట్ వెర్షన్.
సార్…
సూర్య నవ్వి చేతిలో నాప్‌కిన్ పెడతాడు.
ఇద్దరూ నవ్వుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేస్తారు.
మధ్యలో వచ్చే చిన్న చిన్న ఐ కాంటాక్ట్స్ …
కంఫరటబుల్ సైలెన్స్ …
అలిగినట్టు నటించే విశి…
హర్ టీజ్ ఛాలెంజ్ ఇన్ మైండ్ …
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇంకా దగ్గరవుతుంది.
లగేజ్ ప్యాక్ చేసుకుని... రూమ్ చెక్ అవుట్ చేసి మళ్లీ స్టార్ట్ అవుతారు.
వైభవ్ మార్నింగ్ లేచి జిమ్ చేసి వచ్చి ప్రోటీన్ షేక్ తాగుతూ అందరినీ చూస్తూ ఉంటాడు. లేడీస్ భర్త ల కోసం హైరానా పడుతూ ఉంటే... సౌమ్య సైలెంట్ గా శ్రీకర్ తో ఫోన్ లో బిజీగా ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ కపుల్స్ మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ పెయిర్ తో ఎంజాయ్ చేస్తున్నారు. నేనే ఒంటికాయ సొంటికొమ్ములాగ ఇలా చూస్తూ ఉంటున్నాను.
ఇంతకీ నా చందు బేబీ ఏం చేస్తుందో ఏమిటో.. ఫోన్ చేయాలి. హ అదే చేయొచ్చు కదా.. నేను చేస్తే లోకువైపోతానేమో.
అంతరాత్మ బయటికి వచ్చి ఏడ్చావులే... చందు నీకెందుకు ఫోన్ చేస్తుంది. మేమిద్దరం లవర్స్ అయ్యాము కదా.....
అది నువ్వు అనుకుంటున్నావు. ఇంకా నీ పిల్ల రాక్షసి ఫిక్స్ అవ్వలేదు. ఎందుకు ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని రూమ్ కి వెళ్లి ఫోన్ చేస్తాడు.
చందు ఫోన్ లిఫ్ట్ చేస్తుందా.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)