01-05-2026, 11:46 AM
Part - 94
సూర్య ఒకచోట బైక్ ఆపి.. ఆమెకు చూస్తూ...
మనిద్దరం ఇంతదూరం వచ్చాం…
కానీ అసలు జర్నీ ఇప్పుడే మొదలవుతుంది విశి..
ఆమె కళ్లలో ఒక చిన్న మెరుపు.
దేవా సార్...నాతో ఇలా ఎప్పటికీ ఉండారా..
అతను స్మైల్.
నువ్వు వెనక్కి చూస్తే… నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను.
ఎలా సార్..
మళ్లీ బైక్ స్టార్ట్ చేస్తాడు.
బైక్ మీద మొదలైన ప్రయాణం…
వారి హృదయాల్లో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
నేను ఉంటాను అంటే.. నువ్వు ఆర్గ్యు ఎందుకు చేస్తావు?
బైక్ మీద బాడీని ఒక్కసారిగా స్ట్రెచ్ చేస్తుంది.
విశిష్ట చేతులు కొంచెం లూస్ అవుతాయి.
హే జాగ్రత్త గట్టిగా పట్టుకో.
పరవాలేదు సార్ మీరు ఎక్కువ కంగారు పడుతున్నారు.
నీ గురించి కంగారు కాకపోతే ఇంకా ఎవరి గురించి ఉంటుంది.
విశిష్ట ఆ మాటకి చిన్నగా బ్లష్ అవుతూ సార్ మీరు ఎలా చెబుతూ ఉంటే ఏదో మూవీలో హీరో హీరోయిన్స్ ఇలా బైక్ మీద వెళుతూ ఉంటే..
హీరో మీలాగే చెబుతూ ఉంటే...అప్పుడు హీరోయిన్ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టు ఎందుకు అనవసరమైన రొమాంటిక్ డైలాగులు చెబుతావు అంటుంది.
దానికి సూర్య నవ్వుతూ అప్పుడు హీరో కూడా చెప్పిండాలే నువ్వే ఎక్కువ రొమాంటిక్ విషయాలు గురించి ఆలోచిస్తున్నావు అని..
అవునా నేను చెప్పకపోతే మీ వాయిస్ చెప్పడం లేదా..
సూర్య స్మైల్.
నేను కేర్ చేస్తున్నానని చెబుతుంది.
అది నాకు ఆల్రెడీ తెలుసు… కానీ ఆర్గ్యు మాత్రం చేస్తాను. ఎందుకో తెలుసా మన జర్నీ బోర్ కొట్టకుండా ఉండడానికి..
సూర్య చిన్నగా మిర్రర్ లోకి చూసి ఆమె ఎలా ఉన్నదో చెక్ చేస్తాడు.
విశిష్ట గమనిస్తుంది.
ఏం చూసారు ఇప్పుడు..
నువ్వు ఎలా ఉన్నావో చూసా.
ఎలా అంటే? నేను ఎగిరిపోయానేమో అనుకున్నారా..
అదిగో... ఇలా ఆర్గ్యు చేస్తావేమోనని చూసా.
నేను చూశానని నీకు ఎలా తెలుసు..
నన్ను మిర్రర్ లో చూశారంటే… నేను ఎందుకు చూడకూడదు.
సూర్య నవ్వి... అలా రెస్పాండ్ అవుతావు కాబట్టే చూశాను.
నన్ను ఆర్గ్యు మోడ్ లో చూసుకోవడమే గోల్ ఆ...
అవును....క్యూట్ గా ఉంటావు.
విశిష్ట మనసులో...
క్యూట్ అంటే… నేను ఓకే.
బట్ మీరు చెప్పినప్పుడు ఎందుకో హార్ట్ బీట్ పెరుగుతుంది… అది ఓకే కాదు.
విశి మనసులో మాట అర్థమైనట్టుగా సూర్య..అది నాకు ఓకే.
సూర్య హైవేలో స్పీడ్ కాస్త పెంచుతాడు.
స్లో చేయండి సార్.
ఈ రోడ్ సేఫ్.. ఎటువంటి రిస్క్ లేదు.
మీరు సేఫ్ అనుకున్నా… నాకు భయం ఉంటుంది… అనేది అర్థం చేసుకోండి ప్లీజ్..
సూర్య వెంటనే స్పీడ్ తగ్గిస్తాడు.
కాసేపు నిశ్శబ్దం.
సోరి... భయపడ్డావా.. మీరు ఉండగా నాకు భయం ఎందుకు సార్.
మీరు నా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అది మీ మనసుపెట్టి ఆలోచిస్తారు. నీ విషయంలో మనసుపెట్టి ఆలోచించడమే నాకు ఇష్టం.
విశి మౌనంగా ఉంటుంది. ఏమిటి నేను అలా ఉండడం తప్పా
విశి చిన్నగా తప్పు కాదు...
మీరు అలా ఉంటే నేను కంగారులో ఏమి మాట్లాడతానో.. ఏం తప్పు చేస్తానో అని భయం.
నేనుండగా నువ్వు ఆ భయాన్ని దగ్గరికి రానివ్వాల్సిన అవసరం లేదు.
కాఫీ షాప్ కనిపిస్తే బ్రేక్ ఇచ్చి బైక్ ఆపుతాడు.
ఇద్దరూ కాఫీ తాగుతుంటారు.
సూర్య ఫోన్ తో విశి ని ఫోటో తీసుకొని చూస్తాడు.
అది చూసిన విశి ఏం చేస్తున్నారు సార్. నా ఫోటో ఎందుకు తీసారు.
లైట్ లో బాగా కనిపిస్తున్నావు. బాగున్నావు అని తీశాను నీకు పంపించాను చూడు.
ఫోటోలో క్యూట్ గా కనిపిస్తూ ఉంటే … నేను ఎప్పుడూ సీరియస్ గా ఉండలేను.ఉండాలని ప్రయత్నించిన అవడం లేదు.
నాకు నీలో ఉండే ప్రతి యాంగిల్ ఇష్టమే.
విశిష్ట వెంటనే వెనక్కి తిరుగుతుంది.
ముక్కు నెమ్మదిగా పింక్.
మీరెలా మాట్లాడితే నేను కోపం చూపించాల్సి వస్తుంది.
నీ మాటకి చేష్టలకి సంబంధమే లేదు. కోపం అంటున్నావు కానీ బ్లష్ అవుతూ లేని కోపాన్ని చూపిస్తున్నావు అనిపిస్తుంది.
అంతలేదు. బ్లష్ అవ్వాల్సిన అవసరం నాకేమిటి.
అవునా... మరి కలర్ చేంజ్ అవుతున్నా చెవులు ఎవ్వరి అంటావు.
విశిష్ట చేతితో చెవులు దాచుకుంటూ.. ఏమో నాకేం తెలుసు.
సూర్య ఒక్క నిమిషం సైలెంట్ అవుతాడు. ఇద్దరూ కాఫీ తాగి మళ్ళీ బైక్ ఎక్కుతారు.
బైక్ మీద, విశిష్ట చోరవుగా సూర్య బ్యాక్ కి వాలి ఉంటుంది. సూర్య ఆ చొరవ కి చిన్నగా నవ్వుకుంటాడు.
ఎందుకు నవ్వుతున్నారు సార్..
అరే నవ్వే స్వాతంత్రం కూడా లేదా.. సందర్భం లేకుండా నవ్వు వస్తుంది అంటే ఎలా..
హ్మ్.. నువ్వు కంఫర్టబుల్గా చొరవుగా ఉన్నావు కాబట్టి నవ్వుకున్నాను చాలా..
అంటే నేను అలా ఉండకూడదా.. అలా అని నేను అన్నానా..
నువ్వు నాపై ఇలా వాలితే... నాకు కూడా కొంచెం... ఏమో…
ఏమో అంటే
నువ్వే చెప్పాలి.
నేను చెప్పానంటే... పరిస్థితులు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాయి.
ఆల్రెడీ వెళుతున్నయేమో అనిపిస్తుంది.
ఇద్దరు చిన్నగా నవ్వుకుంటారు.
ఒక బ్రిడ్జి దగ్గర చిన్న చెట్ల దగ్గర కోతులు కూర్చుంటాయి.
సూర్య బైక్ స్లో చేస్తాడు.
విశిష్ట వెంటనే... స్లో చేయకండి సార్. అక్కడ కోతులు చాలా ఉన్నాయి. నా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటే ఇంకా అంతే సంగతులు.
అవి నీ బ్యాగ్ కోసం చూడడం లేదు. మరి... నిన్ను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాయి.
నన్ను చూసా.. ఎందుకు..
వాటి జాతి ఏమిటా బైక్ మీద కూర్చుంది అని చూస్తున్నాయి.
సార్ అని ఉక్రోషంగా పిలుస్తుంది.
ఒక కోతి దగ్గరకి రాగానే .. విశిష్ట సూర్య బ్యాక్ ని గట్టి గా పట్టుకుంటుంది.
ఓహో... కోతి రాగానే నా మీద చాలా ఎఫెక్షన్ పెరిగినట్టుంది. ఎఫెక్షను కాదు ఏమీ కాదు. భయం సార్.
విశి పరిస్థితి చూసి సూర్య నవ్వు ఆపుకోలేక పోతాడు. నువ్వు ఇలా క్యూట్ గా భయపడితే... కోతులు కూడా సిగ్గుపడుతున్నాయి.
ప్లీజ్ సార్ తొందరగా వెళ్ళండి సరే టెన్షన్ పడకు అని బైక్ స్పీడ్ పెంచుతాడు. హమ్మయ్య అనుకునని రిలాక్స్ అవుతుంది.
హైవేలో ఒక పెద్ద ఆవు స్ట్రైటుగా రోడ్డుకి మధ్యలో నిలబడుతుంది.
సూర్య అది చూసి ఇది ఇక్కడ నిలబెడడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చి ఉంటారు.
విశి కూడా ఆలోచిస్తూ వాటికి ఎక్కడైనా నిలబడచ్చు అని గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉండి ఉంటది.
ఆవు బైక్ వైపూ చూస్తుంది.
దేవా సార్ ఆపండి. ఆవు ఆగు...
అద్భుతమైన చూపులు. ఒకరినొకరు చూసుకుంటూన్నట్టుగా ఆవు ముందుకు వస్తూ ఉంటుంది.
దయ చేసి దగ్గరికి రాకు పరువు పోతుంది.
సూర్య రెండు చేతులు పైకి లేపి.. మేడం మనం ఒక కష్టతరమైన ట్రాఫిక్ ని దాటాలి అనుకుంటా సార్ అని ఏడుపు ముఖంతో చూస్తుంది.
ఆవు చివరకు పక్కకి వెళ్తుంది.
ఇదే అసలు రోడ్డుపై డామినేషన్. ఏం చేస్తాం సర్ మీ స్పీడ్ కన్నా ఆవు కున్న ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంది.
ఇద్దరికీ తెలియకుండానే ఈ జర్నీలో ఇంకా దగ్గరవుతూ ఉంటారు.....



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)