29-04-2026, 09:42 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 9
నీతూ మొబైల్ లో ఉన్న ఫోటో చూసి ఈ వస్తువుని ఎవరో హుండీలో వేశారు అది ఏమిటో తెలియక శుభ్రం చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచాను ఇప్పుడు కూడా అక్కడే ఉంది అని చెప్పాడు నారాయణ రావు.
*************
నారాయణ రావు చెప్పిన మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "25 సంవత్సరాలుగా దొరకని సిగ్నల్ ఇప్పుడు ఎలా దొరికింది?" అని అనుమానంగా అడిగింది దీప్తి.
"నాన్నగారు! ఈ మధ్యలో ఏమైనా గర్భగుడిలో స్వామి వారి దగ్గర ఉన్న వస్తువులు మొత్తం బయటకు తీసుకు వచ్చారా..?" అని అడిగాడు యోధ.
"నాలుగు నెలల క్రితం భూపతివర్మ గారు గర్భగుడిలో టైల్స్ వేయిస్తాను అంటే స్వామి వారి విగ్రహాన్ని తప్ప మిగతా వస్తువులు మొత్తం బయటికి తీసుకొచ్చాము." అని చెప్పాడు నారాయణ రావు.
ఆ మాట విని "ఎస్! అప్పుడు ఆ వస్తువు సిగ్నల్ వాళ్ళకి దొరికింది. ఇంకా దానిని ఇక్కడ ఉంచడం మంచిది కాదు వెంటనే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్లదాము." అని చెప్పింది నీతూ.
"అసలు! ఆ వస్తువు ఏమిటమ్మా? దాని గురించి అంత కంగారు ఎందుకు పడుతున్నారు?" అని అనుమానంగా అడిగాడు నారాయణ రావు.
"ఆ వస్తువుతో రెండు దేశాల వాళ్ళు హిమాలయాల దగ్గర ప్రయోగం చేస్తున్నప్పుడు యోధ తండ్రిగారైన ఏజెంట్ ప్రకాష్ దానిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇక్కడికి వచ్చారు.
మళ్లీ ఇలాంటి వస్తువు కోసం కైలాస పర్వతం దగ్గర నుంచి మనస సరోవరం వరకు రెండు దేశాల మిలిటరీ వెతుకుతున్నారు దీనికోసం ఇక్కడికి కుడా మనుషుల్ని పంపించారు." అని చెప్పింది నీతూ.
"అలా అయితే స్వామి వారి దగ్గర ఉన్న వస్తువు కూడా కచ్చితంగా కైలాస పర్వతం దగ్గరే వాళ్ళకి దొరికి ఉంటుంది. కైలాస పర్వతం అంటే పరమశివుడు నివాసం ఉండే స్థలం ఇది కూడా ఆయనకి సంబంధించింది అయ్యుంటుంది.
దీనిని కాపాడడానికి అప్పుడు యోధ తండ్రి పంపించాడు ఇప్పుడు కూడా ఎవరో ఒకరిని పంపించే ఉంటాడు ఆ శివయ్య!" అని చెప్పాడు నారాయణ రావు.
"ఆ వస్తువుని బయటికి తీసిన వెంటనే వాళ్ళకి సిగ్నల్ అందుతుంది ఈ టైమ్ లో తీసుకుని వెళ్లడం అంత సేఫ్ కాదు మనం ఉదయం బయలుదేరుదాము అప్పటివరకు గుడిలోనే ఉండనివ్వండి." అని చెప్పింది దీప్తి.
"ఈ విషయం వెంటనే సార్ కి చెప్పాలి." అని ఫోన్ తీసి నాయక్ కి కాల్ చేసింది నీతూ.
ఫోన్ లిఫ్ట్ చేసి టెల్ "నీతూ ఎనీ అప్డేట్!":అని అడిగాడు నాయక్.
"జైహింద్ సార్! మనం వెతుకుతున్న వస్తువు ఇక్కడ గుడిలో స్వామివారి పాదాల దగ్గరే ఉంది. నాలుగు నెలల క్రితం దానిని బయటకు తీసుకురావడం వల్ల సిగ్నల్ వాళ్ళకి అంది ఉంటుంది అనుకుంటున్నాము, దానిని తీసుకుని ఉదయం బయలుదేరి వస్తాము." అని చెప్పింది నీతూ.
"గుడ్! ఆ వస్తువు మిలిటరీ హెడ్ కోటర్స్ వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఆల్రెడీ మీర్జా హైదరాబాదులో దిగాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడి చేతిలోకి వెళ్ళింది అంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్! నైట్ కి గుడి దగ్గర పుష్కర్, ఏకవీర ని సెక్యూరిటీగా ఉంచుతాను దాన్ని తీసుకుని మార్నింగ్ మేము స్టార్ట్ అవుతాము." అని చెప్పింది నీతూ.
"ఓకే! వచ్చేటప్పుడు మీతో యోధని కూడా తీసుకురండి." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాయక్.
ఫోన్ పెట్టేసి యోధ వైపు చూసి "సార్! మాతో పాటు నిన్ను కూడా రమ్మన్నారు." అని చెప్పి పుష్కర్ వాళ్ళ వైపు చూసి "రేపు ఉదయం మనం బయలుదేరే వరకు మీరిద్దరు ఈ గుడి దగ్గరే ఉండాలి ఎవరైనా అడిగితే నిద్ర చేస్తున్నాము అని చెప్పండి." అని చెప్పింది నీతూ.
"ఓకే మేడం!" అని చెప్పారు ఇద్దరు.
"మీరేమీ కంగారు పడకండి ఈ గుడి దగ్గరికి ఎవరు రారు ఒకవేళ వచ్చిన స్వామి వారి దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయరు ఆయనే దానికి రక్షణగా ఉంటారు." అని చెప్పాడు నారాయణ రావు.
"నిజమే రావు గారు! కానీ మా డ్యూటీ ప్రకారం మేము ఉండాలి ఆ ఇద్దరిని ఇక్కడ ఉండనివ్వండి." అని చెప్పింది నీతూ.
"సరే మీ ఇష్టం!" అని చెప్పాడు నారాయణ రావు.
పుష్కర్ వాళ్ళ ఇద్దరినీ గుడి దగ్గర ఉంచి యోధాతో పాటు తన ఇంటికి వెళ్లి మొబైల్ లో ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ "అసలు ఈ వస్తువుతో ప్రయోగం చేస్తే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు." అని చెప్పింది పూజా.
అన్నం వడ్డిస్తూ "మీరెందుకు దాని గురించి హైరానా పడతారు? వాళ్ళ దగ్గరికి మా యోధని పంపించండి నాలుగు తగిలించి అసలు విషయం తెలుసుకుంటాడు కైలాస పర్వతం దగ్గర ఎవరైనా ఇటువంటి పనులు చేస్తారా..?" అని దీర్ఘం తీసుకుంటూ చెప్పింది అన్నపూర్ణ.
"ఆ కైలాస పర్వతం, మానస సరోవరం పవిత్రత మనకి తెలుసు వాళ్ళకి తెలియదు కదా! ప్రతిఫలం అనుభవిస్తారు." అని చెప్పాడు నారాయణ రావు.
అన్నం తింటూ "అంకుల్! కైలాస పర్వతం దగ్గరనుంచి వేరే లోకాలకు మార్గం ఉంది అని అంటుంటారు నిజమేనా..? పురాణాలలో దాని గురించి మీరు ఎప్పుడైనా చదివారా..?" అని అడిగింది దీప్తి.
"త్రేతయుగంలో మూనులు, ఋషులు, మహర్షులు హిమాలయాల్లో తపస్సు చేసుకుని అక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర కొలువై ఉన్న పార్వతీ పరమేశ్వరులని దర్శనం చేసుకునేవారు.
అలాగే భూమి కింద ఉన్న 14 లోకాలలో ఉన్న రాక్షసులు అసురులు, సర్పాలు కుడా దర్శనం కోసం అక్కడికి వచ్చేవారు
ఏ లోకానికైనా మార్గం అక్కడినుంచి ఉంటుంది అంటారు అందుకే ఆ పర్వతాన్ని అంత పవిత్రంగా కొలుస్తారు ఇప్పుడు కలికాలం కదా పాపం పెరిగిపోయింది భగవంతుడిని మనం కంటితో చూడలేము ఒకవేళ చూసినా తట్టుకోలేము." అని చెప్పాడు నారాయణ రావు.
"ఒకవేళ ఈ వస్తువుతో ఆ లోకాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారేమో!" అని డౌట్ గా అడిగింది పూజా.
"ఆ మాటే నిజమైతే వాళ్లు ఆ పరమశివుడి ఆగ్రహానికి గురై అక్కడే భస్మం అవుతారు." అని చెప్పింది అన్నపూర్ణ.
"ఒక వేళ భూమి అడుగున ఉన్న 14 లోకాలు వెళ్లడానికి ట్రై చేస్తున్నారేమో!" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"అంత చిన్న వస్తువుని ఆక్టివేట్ చేసి ఆ లోకాలకు ఎలా వెళతారు? పురాణాలలో ఉన్నది అంకుల్ మనకి చెబుతున్నారు, అక్కడ ఉన్న లోకాలన ఎవరు చూడలేదు, కనీసం కంటికి కనిపించే కైలాస పర్వతం మీదకి కుడా ఎవరు వెళ్ళలేదు." అని చెప్పింది నీతూ.
"అమ్మ గౌరీ! గుడి దగ్గర ఉన్న ఇద్దరికీ కూడా భోజనం తీసుకువెళ్ళు!" అని చెప్పి దీప్తి వాళ్ళ వైపు చూసి" కైలాస పర్వతం మీదకి వెళ్లడం అనేది ఆసాధ్యం!
ఆ శక్తీ మానవులకు లేదు, చాలామంది ప్రయత్నించారు కొంతమంది మరణించారు కొంతమందికి విరమించుకుని వెనక్కి వచ్చారు." అని చెప్పాడు నారాయణ రావు.
"అవును! ఆ పర్వతం మీద నుంచి వెళ్లిన చైనా మిలటరీ హెలికాప్టర్ ఏమైందో ఇప్పటికీ తెలియదు అప్పటినుంచి ఆ పర్వతం మీద హెలికాప్టర్స్ వెళ్లడం నిషేధించారు.
సాటిలైట్ లో ఆ పర్వతం దగ్గర ఏముందో చూడడానికి ట్రై చేసి ఓంకారం శబ్దం వినిపించి తెల్లటి వెలుతురు మాత్రమే కనిపించడంతో వెనక్కి తగ్గి మళ్ళీ ఆ ప్రయత్నం కుడా చేయలేదు." అని చెప్పాడు యోధ.
"అక్కడ అంత శక్తి ఉందని తెలిసిన తర్వాత కూడా ఆ ప్రదేశంలో దొరికిన వస్తువుతో ప్రయోగం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో కనిపెట్టారు." అని చెప్పింది దీప్తి.
పుష్కర్ వాళ్ళకి అన్నం ఇచ్చి వస్తూ "వాళ్ళు ఏది కనిపెట్టిన అక్కడ ఆంజనేయ స్వామి రక్షణగా తప్పస్సు చేసుకుంటూ ఉంటారు ఎవరి పప్పులు ఉడకవు తోకతో చుట్టి గిరాటు వేస్తారు." అని చెప్పింది గౌరీ.
"మీకు దైవం! మాకు సైన్స్! ఏది ఏమైనా అటువంటి ప్రయోగాలు చేయకుండా అడ్డుకోవాలి." అని చెప్పిన దీప్తి.
"అసలు ఈ బాధంతా ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇస్తే రెండు రోజుల్లో ఆ ఏరియా ఇండియా భూభాగం అవుతుంది." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "యోధ వెర్షన్ బాగుంది అప్పుడు ఈ టెన్షన్ ఉండదు ఆ 24 మంది లాగా అక్కడ ఇంకెవరూ కనిపించరు." అని చెప్పింది పూజా.
"అది సరే కానీ! ఆ 24 మందిని కొంపదీసి కైలాస పర్వతం పైకి దగ్గరికి పంపించావా ఏంటి?" అని అడిగింది దీప్తి.
"ఆ మూర్ఖులకి అంత అదృష్టం లేదు." అని చెప్పాడు యోధ.
భోజనం కంప్లీట్ అవడంతో "థాంక్యూ ఆంటీ! ఫుడ్ చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి మార్నింగ్ మేము స్టార్ట్ అవుతాము, మీ చేతి వంట తినడానికి తప్పకుండా మళ్ళీ వస్తాము." అని చెప్పింది దీప్తి.
"చాలా సంతోషం! ఉదయం పూజా కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారి పాదాలు దగ్గర ఉన్న వస్తువుని మీకు చేతికి ఇస్తాను." అని చెప్పాడు నారాయణ రావు.
"సరే అంకుల్!"అని చెప్పి అక్కడినుంచి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లారు ముగ్గురు.
**********
హైదరాబాద్ రాత్రి 12 దాటిన తర్వాత మిషనరీ లోడ్ చేసుకుని బ్రహ్మం వాళ్లతో కలిసి బయలుదేరాడు మీర్జా.
ఆ విషయం తెలుసుకుని ప్రదీప్ తో కలిసి హైవేలో వెహికల్స్ చెక్ చేస్తూ మిషన్స్ తో వెళుతున్న వ్యాన్ ఆపి "ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మిషన్స్ ఏమిటి?" అని అడిగాడు జీతిన్.
అక్కడికి కార్ లో వచ్చి కిందకి దిగి ఇది "సార్! ఇది సోలార్ ఎక్విప్మెంట్ దీనిని ఎందుకు ఆపారు? మా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి." అని చూపించాడు అజిజ్.
"అవునా?" అని బిల్స్ చూస్తూ కార్ దగ్గరికి వెళ్లి లోపల ఉన్న మీర్జా వైపు చూసి "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది పేరేమిటి?" అని అడిగాడు జీతిన్.
"నా పేరు అబ్రహం! సోలార్ మిషన్స్ ఫిట్ చేసే ఇంజనీర్!" చెప్పాడు మీర్జా.
"ఓకే!" అని ప్రదీప్ వైపు చూసి సైగ చేశాడు జీతిన్.
"సార్! ఈ బిల్స్ చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది స్టేషన్ దగ్గరికి తీసుకు వెళ్లి కంప్లీట్ గా చెక్ చేసిన తర్వాత వదులుదాము." అని చెప్పాడు ప్రదీప్.
ఆ మాట విని బ్రహ్మం వైపు కోపంగా చూస్తూ "మనం వెంటనే వెళ్లాలి ఇప్పటికే లేట్ అయింది." అని చెప్పాడు మీర్జా.
ఆ మాట విని కిందకు దిగి జీతిన్ దగ్గరికి వెళ్లి "సార్! మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందామా?" అని అడిగాడు బ్రహ్మం.
"ఓకే!" అని ప్రదీప్ దగ్గరికి వచ్చి "ఆ కార్ లో ఉన్న మనిషి ఫోటో తీసావా..?" అని నెమ్మదిగా అడిగాడు జీతిన్.
"ఎస్! ఆల్ యాంగిల్స్ లో తీసాను సార్ కి కూడా సెండ్ చేశాను." అని చెప్పాడు ప్రదీప్.
"ఓకే!" అని చెప్పి బ్రహ్మం దగ్గరికి వెళ్లి "చెప్పండి ఏంటి విషయం?" అని అడిగాడు జీతిన్.
"మీకు ఎంత కావాలో చెప్పండి మేము అర్జెంటుగా వెళ్లాలి." అని చెప్పాడు బ్రహ్మం.
"మిషనరీ చూస్తుంటే చాలా వాల్యూ ఉన్నట్లు ఉంది. మా సార్ తో మాట్లాడి చెబుతాను ఒక్క నిమిషం ఉండండి." అని చెప్పి పక్కకు వెళ్లి నాయకి కాల్ చేశాడు జీతిన్.
ఫోన్ లిఫ్ట్ చేసి "ఫొటోస్ వచ్చాయి అతను మీర్జా నే కన్ఫామ్! వాడు అరవకొండ వెళ్లడానికి వీల్లేదు అవకాశం ఉంటే అక్కడే లేపేయ్!" అని చెప్పాడు నాయక్.
" రుద్రం భజే! ఎపిసోడ్ 9 " రచనకు రేటింగ్ ఇవ్వండి....



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)