29-04-2026, 09:41 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 8
మీరు ఆఫీసర్లు అని నాకు అర్థమైంది ఆ ఫోటో లో ఉన్న వస్తువుని వెతుకుతూ ఇక్కడికి వచ్చారా అని నీతూ వాళ్ళని అడిగాడు యోధ.
ఆ మాట విని నీకు ఆ వస్తువు గురించి తెలుసా? అని అడిగింది దీప్తి.
***************
"ఆ ఫోటోలో కనిపించిన ఐటెమ్ గురించి నాకు తెలియదు కానీ దానికోసమే పాకిస్తాన్, చైనా ఆర్మీ హిమాలయాస్ దగ్గర వెతుకుతున్నారని మాత్రం తెలుసు!
నేను మన ఏజెంట్స్ ని కాపాడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ సోల్జర్ మొబైల్ లో ఆ ఫోటో చూశాను దాని కోసమే ఇక్కడ వెతుకుతున్నము అని అతను చెప్పాడు.
అది సరే వాళ్ళు అక్కడ వెతుకుతుంటే వీళ్ళు ఆ ఫోటో పట్టుకుని ఇక్కడ వెతుకుతున్నారు ఎందుకు? మీరు కూడా దానిని వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని అనుమానంగా అడిగాడు యోధ.
"ఆ విధమైన వస్తువు ఈ ఏరియాలో కూడా ఒకటి ఉందని తెలిసింది దాని సిగ్నల్ చైనా ఆర్మీ కనిపెట్టింది అందుకే వాళ్ళు వెతకడానికి మనుషుల్ని పంపిస్తున్నారు వాళ్ల కంటే ముందే మనం దానిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి." అని చెప్పింది నీతూ.
"అంత చిన్న వస్తువుని దేనికి ఉపయోగిస్తారు? దానికోసం రెండు దేశాల ఆర్మీ వాళ్ళు వెతకవలసిన పనేముంది?" అని డౌట్ గా అడిగాడు యోధ.
"ఆ విషయం తెలుసుకోవడానికి మేము కూడా వచ్చాము ఆ వస్తువుతో ఆ రెండు దేశాల వాళ్ళు కలిసి ఏదో ప్రయోగం చేయాలని చూస్తున్నారు." అని చెప్పింది దీప్తి.
"ఆ ఫోటో ఒకసారి నాకు చూపించండి?' అని అడిగాడు యోధ.
తన మొబైల్ ఓపెన్ చేసి ఫోటో చూపించింది నీతూ.
ఫోటో చూస్తూ "ఒకవేళ ఈ వస్తువు ఇక్కడ ఉంటే వెతకడం చాలా కష్టం! అసలు ఆది ఇక్కడికి ఎలా వచ్చింది?" అని అడిగాడు యోధ.
"ఆ వస్తువుని 25 సంవత్సరాల క్రితం మన ఏజెంట్ ఫ్యామిలీ ఇక్కడికి తీసుకు వచ్చారు అప్పుడే వాళ్ళు చనిపోయారు, కానీ దానికి సంబంధించిన ఫైల్ అతని దగ్గర దొరికింది కాబట్టి ఆ వస్తువును కూడా సేఫ్ గా ఉంచాడు అనుకుంటున్నాము." అని చెప్పాడు జీతిన్.
"అలా అయితే ఆ ఫైల్ తో అతను ఎక్కడ కనిపించాడో ఆ వస్తువు కూడా అక్కడే ఉంటుంది ఇలా తిరగడం వేస్ట్!" అని చెప్పాడు యోధ.
"అయితే! ఆ గుడి దగ్గరే ఆ వస్తువు ఉంటుంది. కానీ మాకు ఆ ఏరియా లో ఎక్కడ సిగ్నల్ దొరకలేదు." అని చెప్పింది దీప్తి.
"మా గుడి దగ్గర? అంటే మీరు చెప్పేది నాకు తల్లిదండ్రుల గురించా..?" అని అడిగాడు యోధ.
"అవును! నీ తల్లిదండ్రుల గురించి నీకు తెలుసో లేదో అని మేము చెప్పలేదు." అని అన్నాడు జీతిన్.
"నాకు తెలుసు! మా తల్లిదండ్రులు దేశం కోసం చనిపోయారని నాన్నగారు చెప్పారు ఆ ఫైల్ నేను ఒకసారి చూడొచ్చా?" అని అడిగాడు యోధ.
"హార్డ్ కాపీ లేదు సాఫ్ట్ కాపీ ఉంది దాంట్లో ప్రయోగం ఎలా చేయాలో తీరి మాత్రమే ఉంది అది దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం మాత్రం లేదు." అని మొబైల్ లో ఉన్న ఫైల్ చూపించింది దీప్తి.
ఫైల్ చూస్తూ "మీరు గుడి దగ్గర చెక్ చేశాను అని చెప్పారు కదా మీరు ఉపయోగించే మిషన్ ఏమిటి?" అని అడిగాడు యోధ.
"ఆ రెండు దేశాల వాళ్ళు హిమాలయాస్ లో రేడియేషన్ పసిగట్టే మిషన్స్ అందుకనే మేము కూడా అటువంటి మిషన్ తోనే ఇక్కడ సిగ్నల్ కోసం చూస్తున్నాము." అని చెప్పింది పూజా.
"ఒకవేళ ఈ వస్తువు గుడి దగ్గర ఉన్న మీ మిషన్స్ పనిచేయు ఎందుకంటే గుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది దానివల్ల ఆకాశం నుంచి ఎంతటి శక్తివంతమైన తరంగాలు వచ్చినా ఆ ధ్వజం ఐక్యం చేసుకుని గుడి మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది అందుకే ప్రతి గుడిలో ఆ పవిత్రత ప్రశాంతత ఉంటుంది.
ఈ ఫోటోలో ఆ వస్తువు మీద పవర్ జనరేట్ అవ్వగానే తరంగాలు ఆకాశంలోకి భూమిలోకి వెళుతున్నట్లు కనిపిస్తుంది ఆ వస్తువు నుంచి వచ్చే తరంగాల్ని ఆ ధ్వజస్తంభం తీసుకుంటుంది కాబట్టి మీకు సిగ్నల్ దొరకదు." అని చెప్పాడు యోధ.
ఆ మాట విని "అందుకేనా ఏ గుడిలోకి వెళ్ళిన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది?" అని అడిగింది దీప్తి.
"మన దేవాలయాలు కూడా సైన్స్ తో ముడిపడి ఉంటాయి ప్రతి గుడిలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అందువల్ల అక్కడ ఉన్న శక్తి ఇంక ఎక్కడ ఉండదు, అది తెలియక మాన వాళ్ళు పురాతన దేవాలయాలను పట్టించుకోవడమే మానేశారు అవి ప్రకృతికి మనకి అనుసంధానమై ఉంటాయి దానివల్ల ఎటువంటి విపత్తులు రాకుండా ఆపుతాయి." అని చెప్పాడు యోధ.
"నువ్వు చిన్నతనం నుంచి ఆ గుడిలోనే ఉన్నావు కదా ఇటువంటి వస్తువులు ఎప్పుడైనా చూసావా?" అని అడిగింది నీతూ.
"నో! మీరు సార్ దగ్గర పర్మిషన్ తీసుకోండి ఈ ఫోటో నాన్నగారికి చూపిద్దాం ఆయనకు తెలిసి ఉంటుంది." అని చెప్పాడు యోధ.
"మనం ఆ వస్తువు కోసం ఇక్కడ వెతుకుతున్నామని మీర్జా గ్యాంగ్ కి తెలిసిపోయింది కచ్చితంగా వాళ్ళు మళ్ళీ వస్తారు ఈలోపు ఆ వస్తువు ఎక్కడ ఉన్నాము మనం తెలుసుకోవాలి ఎటువంటి పరిస్థితిలో వాళ్ళ చేతికి వెళ్ళకూడదు." అని చెప్పాడు జీతిన్.
"ఒకవేళ ఆ వస్తువు అనేది ఇక్కడ ఉంటే దానిని నన్ను దాటి ఎవరు పట్టుకు వెళ్ళలేరు పదండి ఇంటికి వెళదాము." అని చెప్పాడు యోధ.
**************
యోధ వాళ్ల దగ్గర నుంచి పారిపోయి వాళ్ళు ఉండే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి అజీజ్ కి కాల్ చేశాడు సత్తి.
ఫోన్ లిఫ్ట్ చేసి "ఫస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్లారా..?" అని అడిగాడు అజిజ్.
"బాయ్! మీరు పంపించిన ఫోటోలో వస్తువు కోసం వేరే వాళ్ళు కూడా వెతుకుతున్నారు వాళ్లలో ఒకడు ఉన్నాడు బాయ్, మేము వాడి చెయ్యి సైజు కూడా లేము, వాడు కొట్టిన దెబ్బలకి మనవాళ్ళు ఎముకలు విరిగిపోయాయి." అని చెప్పాడు సత్తి.
"మీరు ఆ వస్తువు కోసం వెతుకుతున్నట్లు వాళ్లకు తెలిసిందా..?" అని అడిగాడు అజిజ్.
"అవును బాయ్! మా మొబైల్లో ఫోటో చూశాడు వాళ్ళు చూడడానికి ఆఫీసర్ లు లాగా ఉన్నారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు?" అని అడిగాడు అజిజ్.
"ఒక్క నిమిషం లైన్లో ఉండు." అని మీర్జా వైపు చూసి "ఆ ఐటెమ్ కోసం ఆఫీసర్లు కూడా రంగంలోని దిగారు ఇంక మనం ఎంట్రవ్వాలి." అని చెప్పాడు అజిజ్.
"సరే! సాయంత్రానికి మిషన్స్ వస్తున్నాయి ఉదయం బయలుదేరుదాము ఈలోపు అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోమను." అని చెప్పాడు మీర్జా.
ఫోన్లో మాట్లాడుతూ " సత్తి! వినబడింది కదా ఆ పని మీద ఉండండి. ఉదయానికి మేము అక్కడే ఉంటాము వాడి సంగతి చూద్దాము." అని చెప్పాడు అజిజ్.
"సరే బాయ్! త్వరగా రండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి తన వాళ్ళ వైపు చూసి "ఒరేయ్ ఇద్దరు వెళ్లి అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోండి. రేపు ఉదయానికి మన గ్యాంగ్ మొత్తం ఇక్కడకు దిగుతుంది వాళ్ల సంగతి చూద్దాము." అని కోపంగా చెప్పాడు సత్తి.
"సరే అన్న!" అని చెప్పి బైక్ తీసుకుని బయలుదేరి వెళ్లారు ఇద్దరు.
************
రూమ్ కి వెళ్లి నాయక్ కాల్ చేశాడు జీతిన్.
ఫోన్ లిఫ్ట్ చేసి "టెల్ మీ జీతిన్? మిమ్మల్ని యోధ కనిపెట్టేసాడా?" అని అడిగాడు నాయక్.
"ఎస్ సార్! ఈ విషయం మీకు ఎలా తెలిసింది?" అని డౌట్ గా అడిగాడు జీతిన్.
"నాకు యోధ గురించి బాగా తెలుసు" ఆదికాకుండా నీ దగ్గరనుంచి ఈ టైంలో కాల్ వచ్చింది అంటే అదే అనుకున్నాను ఇంతకీ ఏంటి విషయం? " అని అడిగాడు నాయక్.
"సార్! యోధ చెప్పిందాన్ని బట్టి మనం వెతుకుతున్న వస్తువు ఆ గుడిలోనే ఉంటుంది ఈ ఫోటో నారాయణ రావు గారికి చూపించి అడుగుదాము అనుకుంటున్నాము మీ పర్మిషన్ కోసం కాల్ చేశాను, ఆది కాకుండా దానిని వెతుక్కుంటూ మీర్జా గ్యాంగ్ కూడా ఎంటర్ అయ్యారు." అని చెప్పాడు జీతిన్.
"సరే! నారాయణ రావు గారికి విషయం చెప్పి ఆ వస్తువు గుడిలో ఉందేమో తెలుసుకోమను నువ్వు వెంటనే హైదరాబాద్ బయలుదేరు మీర్జా అక్కడికి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు హెల్ప్ చేయడానికి అక్కడ మన ఆఫీసర్ ప్రదీప్ ఉండడు." అని చెప్పాడు నాయక్.
"సార్! మరి నేను హైదరాబాద్ వెళ్తే ఇక్కడకి మీర్జా మనుషులు వస్తే..?" అని డౌట్ గా అడిగాడు జీతిన్.
"యోధ కి విషయం తెలిసిపోయింది కదా ఇంక వాడు చూసుకుంటాడు, నువ్వు వెంటనే బయలుదేరు నాకు మీర్జా ప్రజెంట్ ఫోటో కావాలి, నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎవరు ఇచ్చారో తెలియాలి." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్!" అని ఫోన్ పెట్టేసి నీతూ దగ్గరికి వెళ్లి "నారాయణ రావు గారితో ఆ వస్తువు గురించి మాట్లాడడానికి సార్ పర్మిషన్ ఇచ్చారు నేను ఒక చిన్న పని మీద బయటకు వెళుతున్నాను అవసరం అయితే కాల్ చేయండి." అని చెప్పాడు జీతిన్.
"ఓకే నో ప్రాబ్లం! నేను చూసుకుంటాను నువ్వు వెళ్లిరా..!" అని చెప్పి యోధ తో కలిసి తన ఇంటికి బయలుదేరారు నీతూ వాళ్ళు
ఇంటి దగ్గరికి వస్తున్న దీప్తి వాళ్ళని చూసి" ఏంటమ్మా అప్పుడే వచ్చేసారు? ఊరు చూడడం అయిపోయిందా..? " అని అడిగాడు నారాయణ రావు.
"నో అంకుల్! మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి అందుకే వచ్చాము." అని చెప్పింది దీప్తి.
"అవునా? విషయం ఏమిటో చెప్పండమ్మా?" అని అడిగాడు నారాయణ రావు.
మొబైల్ లో ఫోటో చూపిస్తూ "నాన్నగారు! ఈ ఫోటోలో ఉన్న వస్తువుని మీరు ఎప్పుడైనా చూశారా? ఇలాంటిది మన గుడి దగ్గర ఏమైనా ఉందా?" అని అడిగాడు యోధ.
ఆ ఫోటో చూస్తూ "ఇది స్వామి వారి పాదాల దగ్గర ఉంటుంది దీనిని ఎవరో ఒక భక్తుడు హుండీలో వేశారు దేనికి ఉపయోగపడుతుందో అర్థం కాక స్వామివారి పాదాలు దగ్గర ఉంచాను అప్పటినుంచి అక్కడే ఉంది." అని చెప్పాడు నారాయణ రావు.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)