29-04-2026, 09:36 AM
Part - 87
రాజ్, చందు వచ్చేటప్పటికి వింతగా వెరైటీగా కనపడుతూ ఉంటుంది. భరత్, వినయ్ ఒక పక్కగా నిలబడి ఉంటే రాజ్ వాళ్ల పక్కకి చేరి ఏం జరుగుతుంది రా ఇక్కడ..
నీ రెండో పెళ్లికి సంబంధించిన మాటలు..
ఇంకా గొడవ వదలలేదా.. నివి వదిలితే మిగిలిన అందరూ వదిలేస్తారు కానీ నివి వదిలేటట్టుగా కనిపించడం లేదు.
బుజ్జగించు బావ అని వినయ్ గెడ్డం పట్టుకుంటే ఇంటి దగ్గర ఆల్రెడీ చేశాను రా. అది సరిపోయినట్టు లేదు. ఇంకా ఎలా బుజ్జగించాలి.
ఇంతకి విక్కీ ఏం చేస్తున్నాడు. ఎక్కడో పెళ్ళాంతో సేవలు చేయించుకుంటూ ఉంటాడు. వెంటనే విక్రమ్ కి కాల్ చేస్తాడు.
ఏంట్రా.. ఎక్కడున్నావు.. గదిలో.. కింద ఇంత మహాభారతం జరుగుతూ ఉంటే నువ్వు గదిలో ఏం చేస్తున్నావు కిందకి రా..
మహాభారతమా... ఏం జరుగుతుంది అని నవ్వుతూ బయటికి వస్తాడు.. నీ చిన్న కొడుకు పెట్టిన పెంటకి.. నీ ముద్దుల చెల్లెలు చేస్తున్న రాద్ధాంతం.
అందుకే అనేది నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి అని.. అంత సీక్రెట్ ప్లేస్ లో కూడా డేటా కలెక్ట్ చేస్తారని ఎవరు అనుకుంటారు రా..
ప్లీజ్ రా బాబు వచ్చి.. నీ చెల్లిని కంట్రోల్ చెయ్. ఇన్ని సంవత్సరాలు అయిన పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం రావడం లేదు.
పక్కనే వస్తున్న అవని వీపు మీద ఒక్కటేస్తుంది. ఏమిటే..
అని కళ్ళు ఎగరేస్తే ఏమీ లేదని మూతి తిప్పి వెళ్ళిపోతుంది.
ఈ మధ్యన భార్యామణికి అలకలు ఎక్కువైంది..అలిగే టైం లోనేమో బిక్కు బిక్కు మంటు చూసింది.. ఇప్పుడేమో ఈ సింహాన్ని వణికించాలనుకుంటుంది.
ఈ యాంగిల్ కూడా బాగుందిలే అని నవ్వుకుంటూ వస్తున్న...
వచ్చి చెల్లి పక్కన కూర్చుని ఏమైందిరా.. చూడు అన్నయ్య మీ బావగారు రెండో పెళ్లి చేసుకుంటారంట.. అది కూడా ఏడు గోదావరుల అవతల ఉన్న అమ్మాయిని.
రాజ్ తలగోక్కుంటూ.. నేనెప్పుడూ అన్నాను అనుకుంటూఉంటాడు. వినయ్ ఏమైంది బావ అలా చూస్తున్నావు.
నేను అనని డైలాగులు కూడా మీ చెల్లి కలిపేస్తూ ఉంటే నెక్స్ట్ ఎలా వెళ్లాలా అర్థం కావడం లేదు.. అవన్నీ ఇంటి దగ్గర మీ చెల్లి కొట్టినవే..
అప్పుడు నువ్వు ఏమి అనలేదా. బుజ్జిగించాను రా..
ఏమని బుజ్జగించావు .. ఒకసారి జరిగినది అంతా గుర్తుచేసుకొని.. చెప్పడం ఎందుకులే అని..
ఏదో ఒకటి.. నీ తర్వాతే ఏదైనా అని చెప్పాను. నీ తర్వాతే ఏదైనా అంటే అది ఇలా అల్లేసింది.. ఏంటి బావ అల్లుడు వచ్చే టైం అయింది ఇంకా పెళ్ళాన్ని బుజ్జగించడం రావడం లేదు.
పెద్ద తమరు ఈ టాపిక్ లో పీహెచ్డీ చేసినట్టు. అదిగో పూజిత వస్తుంది. వెంటనే అలర్ట్ అయ్యి.. విక్రమ్ పక్కన కూర్చుంటాడు.
వీడు మాత్రం పెళ్ళానికి సు.. సుసు.. పోస్తాడు. మనకి మాత్రం నీతి సూత్రాలు చెబుతాడు.
బావ ఊరికేనే అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలియదా.. అవన్నీ అప్పుడు అన్నయ్య. ఇప్పుడు కాదు అని ముక్కు చీదుతుంది.
ఇక రాజ్ తప్పక వెళ్లి నివి ముందు కింద కూర్చొని ఇదిగో నివి.. ఎప్పుడైనా నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. నేనేమన్నాను..
పెళ్ళాలు వేరే ఊరు అయితే ఎలా ఉంటుందో చూడాలి అన్నారు. అంతేగాని పెళ్ళాన్ని మారుస్తాను అనలేదు కదా. మీరైనా చెప్పండి అత్తయ్యగారు నేను అన్న దాంట్లో అంత అర్థం ఉందా..
నివి ఇంకా ఆపు. అల్లుడుగారు బ్రతిమాలుతుంటే నీ పెంకి ఏడుపు ఏమిటి.. ఎప్పటికీ అర్థం చేసుకుంటావు. ఏదో వాళ్ళ సరదాగా అనుకున్న మాటలు నువ్వు అంత సీరియస్గా తీసుకుంటున్నావు.
ఇంకా అల్లుడొచ్చే టైం అయింది..ఇప్పటికీ కూడా రాజ్ నిన్ను బ్రతిమాలతూ ఉంటే వచ్చే అల్లుడు ముందు ఎంత లోకువగా ఉంటుంది.
కళ్ళు తుడుచుకుని ఇంకెప్పుడూ అలా మాట్లాడనని చెప్పమనమ్మ. కలలో కూడా మాట్లాడను సరేనా.. నీకు ఏది కావాలంటే అది కొంటాను.
ఇప్పుడే షాపింగ్ కి వెళ్దామా. ప్రస్తుతానికి మూడ్ లేదులే అని కళ్ళు తుడుచుకుంటుంది.అమ్మయ్య నేను సేఫ్ అనుకుంటాడు.
ఒక తుఫాను వెలిసింది. భరత్ విద్యాని గదిలోకి తీసుకువెళ్లి వెనకనుంచి పట్టుకొని.. నా బంగారం కదు.. నువ్వు ఎప్పటిలాగానే ఉండవే..
నీలో ఈ రెబల్ చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మీరే కదా అంటే....ఇంక ఎప్పుడూ అలా అడగను. నా విద్య ముద్దుగా బంగారంలాగా నాకు నవ్వుతూ ఎదురు వచ్చే నా పాత పెళ్ళమే కావాలి.
సరే అంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి ఈసారి ఒప్పుకుంటున్నాను. వెళదామా. తప్పకుండా శ్రీమతి. హమ్మయ్య నేను గట్టెక్కేసాను.
ఇంక వినయ్ శ్రీ మిగిలారు. వినయ్ సీరియస్ గా లేచి పూజిత చేయ పట్టుకుని లాక్కు వెళతాడు. మాధవి ఒరేయ్ ఏమైంది రా అలా లాగుతున్నావు.
ఇప్పుడే వస్తాను అత్తయ్య అని గదిలోకి తీసుకువెళ్లి షర్టు హాండ్స్ పైకి మడత పెడుతూ ఏంటే ఎక్కువ చేస్తున్నావు. హ అని చేతులు కట్టుకొని చూస్తుంది. వెంటనే హ్యాండ్స్ కిందకి దించి చూడు పూజిత బుజ్జులు..
నువ్విలా ఉంటే అస్సలు బాగోలేదు. నేను ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాను. ఈ వయసులో దాన్ని మార్చితే ఎలాగా..
ఎంత కన్ఫ్యూజ్ అవుతాను. నువ్వు నా రౌడీ బేబీ లాగా ఉంటేనే నాకు ఇష్టం. ఆ రౌడీ బేబీ ని చూసే కదా నేను ప్రేమలో పడ్డాను. ప్లీజ్ నువ్వు ఇలా ఉండి నన్ను భయపెట్టదు.
అది కాదండి అంటే.. వద్దు మనం ఎలా ఉన్నా బెస్ట్ కపులే.. వదిన అలా ఉంటుంది కాబట్టే అన్నయ్య హ్యాండిల్ చేస్తున్నాడు. నేను ఇలా ఉంటాను కాబట్టి నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అంతే..
నన్ను నువ్వు కాకపోతే ఎవరు భరించగలుగుతారు చెప్పు బంగారం. ఈ మాటలకు ఏమి తక్కువ లేదు పదండి.
కిందకి వెళ్లి ఏం చెబుతావు.
మా ఆయన నన్ను భయపెట్టారు అని చెప్పమంటారా ? అలా చెబితే అప్పుడే పుట్టిన పసిపాప కూడా నమ్మదే.. నవ్వుతూ ఎవరు ఏమి అడగరు కానీ పదండి అని వెళుతుంది. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుంటాడు.
శ్రీ... కిచెన్ లో నేహా ముందు మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ఎలా వండినా నేను తింటాను కదా. ఎందుకు ఇలా కొత్త కొత్తగా అడుగుతావు.
మీరే కదా అమాయకంగా ఉండాలి అన్నారు.మరి అమాయకంగా అంటే అన్ని అడిగే కదండి చెయ్యాలి. నీకు ఈ అమాయకత్వం అస్సలు సూటి కాదు.
అవని అవనీయే.. నువ్వు నువ్వే. దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది.
లేచి నిలబడి చేతులు కట్టుకొని ఒకరితో ఒకరిని కంపేర్ చేయకూడదు. ఎవరి నేచర్ వాళ్ళదే.. ఎవరి స్వభావం వాళ్ళదే.
రకరకాల పువ్వులన్ని కలిసి దండ అయినట్టుగా స్నేహమైనా, రిలేషన్ అయినా అంతే..భిన్న మనస్తత్వాలు కలిసినదే కుటుంబం..అర్థం చేసుకుని వెళ్ళాలి.
గుడ్ ఇన్ని సంవత్సరాలకు మీ బుర్ర పనిచేయడం మొదలైంది. వెళ్ళండి. నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను తీసుకొస్తున్నాను.
ఏంటి పంచదార వేసా.. ఏదో మిమ్మల్ని అడిగాను కానీ అలా ఎందుకు వండుతాను.. నాకు తెలియదా అని నవ్వుతుంది.. పెళ్ళాలా మజాకానా అనుకుని గుండె మీద చెయ్యి వేసుకుంటాడు.
వాతావరణమంతా తేలిక పడింది అనుకునే సమయానికి సూర్య వచ్చి ఏమైంది.. అందరూ అలా ఉన్నారు? అత్తయ్య కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయి.
ఏమైంది అత్తయ్య.. నిన్ను ఎవరు ఏమిన్నారు అని అడుగుతాడు. వెంటనే రాజ్ రెండు చేతులతో నమస్కరం చేసి ఒరేయ్ ఇప్పుడే మీ అత్తని కూల్ చేసి లైన్లో పెట్టుకున్నాను.
మళ్ళీ నువ్వు అడిగి మొదటికి తీసుకురాకు. ఆ టాప్ ఇప్పి హైదరాబాద్ ని ముంచకురా..
వైభవ్ కామ్ గా చందు చేయ పట్టుకుని గదిలోకి తీసుకువెళతాడు. వదులు వైభవ్.. ఏంటిది అందరూ ఉన్నారు.
అసలు ఏమైందే నీకు.. నాతో మాట్లాడటం తగ్గించేసావు. ఎక్కడ తగ్గించాను. కలిసినప్పుడు మాట్లాడుతున్నాను కదా.. ఎక్కడ మాట్లాడుతున్నావు.
పొడిపొడిగా మాట్లాడుతున్నావు. అవునా కాదా ఈ అని పళ్లు బయటపెట్టి ఒక చిన్న స్మైల్ ఇవ్వడం తప్ప ఇంకేమైనా మాట్లాడుతున్నావా..
ఇప్పుడు నీకు ఏం కావాలి. ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద తిరుగుతున్నావు అంట.. ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు నన్నే కదా పిలిచేదానివి.
ఇప్పుడు ఎందుకు పిలవలేదు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా.. పిలిచినా గొడవపడతావు. పిలవకపోయినా గొడవ పడుతున్నావు.
పిలిచి నువ్వు అనే మాటలు అనిపించుకోవడం కన్నా నా పని నేను చేసుకుంటే బెటర్ అనుకుంటే దానికి 100 వంకలు పెడుతున్నావు. అనుమానంగా చూస్తూ ఈరోజు గొడవకు అంతటకే కారణం నువ్వేనా..
ఎటో చూస్తూ వాళ్ల గొడవకి నాకు సంబంధం ఏమిటి. నిజం చెప్పు అని కాలర్ పట్టుకుంటుంది.
పట్టుకున్న చందు వైపు చూస్తూ ఎంత ధైర్యం ఉంటే నా కాలర్ పట్టుకున్నావే..
దీనికి ధైర్యం ఎందుకురా.. నా రెండు చేతిలో సరిపోవా.. ఇంతకీ ఏం చేశావురా. నేనేమీ చేయలేదు. నా ఫోను క్యాబిన్లో మర్చిపోయాను. వెళ్లి తెచ్చుకున్నాను అంతే..
వీళ్ళందరికీ గ్రూప్ కాల్ కనెక్ట్ చేసావా.. నేనా చేయలేదే.. అనుకోకుండా నా వేలు కాల్ మీదకు వెళ్ళిపోయినట్టు ఉంది. అయితే ఇప్పుడేమంటావు.
చూడు మా నాన్న ఎలా బ్రతిమాలుతున్నాడో. మరి మర్యాదగా అడిగాను. చందు ఏం చేస్తుంది.. ఎక్కడుంది. నువ్వే కనుక్కో..
ఇంపార్టెంట్ వర్క్ మీద తిరుగుతుంది.తెలుసుకో అని పోజ్ కొట్టాడు. మరి ఆ పోజునంత దింపాలి కదా..
దింపడం అంటే ఇదా.. మా నాన్నతో పాటు మిగిలిన వాళ్ళని కూడా ఇరికించేసావు కదా. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు చందు.
ఏమిటి... చాలాసేపటి నుంచి నువ్వు నా కాలర్నే పట్టుకుని ఉన్నావు. ఇదేమన్నా మర్యాదగా ఉందా.. నీకు మర్యదా ఇచ్చేది ఏమిట్రా.
పోనీలే ఆడపిల్లవి అని చూస్తూ ఉంటే తెగ రెచ్చపోతున్నావేమిటి అని నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు.
రేయ్ ఏం చేస్తున్నావురా అని తడబడుతూ అడుగుతుంది. ఏమైంది చందు ఇప్పుడు దాకా బెకబెకమంటూ అరిచావు కదా..
ఇప్పుడు ఎందుకు మాట తడబడుతుంది.. మర్యాదగా నడుం మీద చెయ్యి. ఏమయిందే పిల్ల రాక్షసి.. ఈ వయసులో మాట తడబడుతూ.. గొంతు తడారిపోతుంది అంటే అర్థం ఏమిటో తెలుసా..
చందు రియాక్షన్.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)