Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
మా ఆవిడ ని వదిలి వుండలేను, నేను చేసిన పుణ్యం అయిపోగానే వెళ్ళిపోవాలి స్వామి, నా మీద కూడా కటాక్షం చూపించండి గురువుగారు అన్నాడు శేఖర్.


నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనేక కథలు చెప్పి నవ్వించావు అని కమండలం లోనుండి జలం తీస్తోవుంటే, గురువుగారు, నీళ్లు కొద్దిగానే జల్లండి, నాకు నెత్తిమీద నీళ్లు పడితే జలుబు చేస్తుంది అన్నాడు శేఖర్ తలవంచుతూ. 


మళ్ళీ నవ్వించేశావు అంటూ జలం చల్లి శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవించారు. అంతే గురువుగారి కుర్చీనుంచి మాయం అయ్యిపోయారు 


గురువుగారు గురువుగారు అంటూ కంగారుగా పిలుస్తున్న శేఖర్ దగ్గరికి నవ్వుతు వచ్చిన నారద ముని, యింకా ఎక్కడ గురువుగారు, తను చేసిన తపస్సు ఫలితం వలన ఇంద్రుడు కి గురువుగారు గా పదవి వచ్చింది. యిప్పుడు తన తపస్సు ఫలం ఉపయోగించి మీకు శాశ్వతంగా యిక్కడ ఉండేడట్లు దీవించారు. దానితో ఆయన తపస్ ఫలితం అయిపొయింది, భూలోకం లో కి వెళ్లిపోయారు, మళ్ళీ ఒక యుగం తపస్ చెయ్యాలి నారాయణా అన్నాడు నారద ముని.


అయ్యో మా వల్ల గురువుగారు మళ్ళీ భూలోకంలో కి వెళ్లిపోయారా నారాయణా నారాయణ అన్నాడు చెంపలు వేసుకుంటో శేఖర్.


ఏమిటి కళ్ళు తెరవగానే వాట్సాప్ మెసేజ్ లు చూసుకునే మీరు, నారాయణా నారాయణ అంటూ కలవరింతలు, లేవండి, తొమ్మిది గంటలు అయ్యింది అంటున్న భార్య గొంతు విని, ఉలిక్కిపడి లేచి, అమ్మయ్యా ఇదంతా కల అన్నమాట. గురుద్రోహం చేసాను అని భయపడ్డాను అనుకుని లేచి స్నానం పూర్తి చేసుకుని పట్టుపంచె కట్టుకుని పూజా గదిలోకి ప్రవేశించాడు.


 అప్పటికే దీపారాధన చేసి పువ్వులతో అలంకరణ చేసి పూజ చేసుకుని శ్రీలక్ష్మి వెళ్లినట్టుంది, దీపారాధన కాంతులతో వేంకటేశ్వరస్వామి మెరిసిపోతున్నాడు, శివుడి మీద పాలు పోసి, నుదుటిన విభూతి రాసుకుని రుద్రాక్ష మాలతో కళ్ళుమూసుకొని జపం చేసుకువడం మొదలెట్టాడు. మొహం కడుకోవడానికి వెళ్లిన భర్త యింకా రాలేదేమిటి అనుకుంటూ మేడమీద గదికి వచ్చి చూసిన శ్రీలక్ష్మి పూజాగదిలో కఠోర జపం లో వున్న భర్తని చూసి, బాగానే వుంది ఏమిచేసినా అతే అనుకుంటూ వచ్చేసింది.


మొహం నిండా విభూతి నుదట కుంకం బొట్టుతో మెట్లు దిగుతు ఏమో అనుకున్నాను.. పూజామందిరం లో వున్న ప్రశాంతత ఎక్కడా దొరకదు లక్ష్మి, యిన్నాళ్ళు కబుర్లతో కాలక్షేపం చేసేసాను,  రోజు నుంచి నాది నీ దారే అంటూ రాత్రి వచ్చిన కల గురించి వివరించి చెప్పాడు.


నీ పని నువ్వు చెయ్యి. ఫలితం గురించి నీకు బాధ్యత లేదు, అది నేను చూసుకుంటా అన్న భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ ని నమ్మి ఎవ్వరికీ అపకారం చేయకుండా మన జీవితం గడపాలి అంతే అంది శ్రీలక్ష్మి.
 శుభం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:24 PM



Users browsing this thread: 1 Guest(s)