Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - ప్రశ్న
కారులో వెళ్తున్న శేఖర్ దంపతులని ఎదురుగా లారీ వచ్చి గుద్దేసేంది. 
“నడవమ్మా పెళ్లి నడకలు, యిలా అయితే ఇంద్రసభ లో రంభ డాన్స్ వుంది మిస్ అయిపోతాము” అంటున్న దేవభటులుని చూసి శ్రీలక్ష్మి అయితే తను చనిపోయి స్వర్గం కి వచ్చాను అన్నమాట, అవునులే ఎన్నీ పూజలు చేసాను, ఫలితం వుంటుంది మరి అనుకుంది.


‘పాపం ఆయనని ఏ లోకంలోకి తీసుకుని వెళ్ళారో, అప్పటికి చెపుతోనే వున్నాను కొద్దిగా కృష్ణా రామా అనుకోమని, వింటేనా పాపం ఆ యమలోకంలో ఏం బాధ పడుతున్నారో’ అనుకుంది భర్త శేఖర్ గురించి.


ఇంద్రలోకం లోకి ప్రవేశించారు, కిటకిట లాడుతున్న సభని పరికించి చూసి, సినిమాలో చూపించినంత అందంగా లేదు అనుకుంది శ్రీలక్ష్మి. అదేమిటి ఇంద్ర దేముడి ఆసనం పక్కన వున్న ఋషి గారితో తన భర్త కూర్చుని ఏదో కబుర్లు చెప్పేస్తున్నారు అనుకుని తన పక్కన వున్న భటుడిని, “బాబూ నేను పూజలు చేసాను కాబట్టి స్వర్గం కి వచ్చాను, మరి అటువైపు ఋషి గారితో మాట్లాడుతో కూర్చుని వున్న మా ఆయన ఏ పూజ చెయ్యకుండా యిక్కడికి ఎలా వచ్చారు” అంది.


“మీ ఆయన అంటే మాకేం తెలుసమ్మా, వుండు ఎలా వచ్చాడో తెలుసుకుని చెపుతాను” అని మాయం అయిపోయాడు.


“ఒక గడియలో మళ్ళీ వచ్చిన భటుడు, “అమ్మా! ఆయన నీ కంటే ఎక్కువ పుణ్యం సంపాదించాడు. నువ్వు చేసే దేముడు పూజలకు రోజూ పువ్వులు కోసి సిద్ధం చేసేవాడు, నువ్వు ప్రశాంతం గా పూజ చేసుకోవటానికి తన టిఫిన్ తనే చేసుకునేవాడు, ఎండలో గుడికి వెళ్తోంది పాపం అని నిన్ను తన కారులో తీసుకుని వెళ్ళేవాడు. అన్నిటికంటే శివరాత్రి నాడు గోవు కి అభిషేకం చేసి శివకేశవులకి బేధం లేదని నిరూపించాడని శివుడు మెచ్చి స్వర్గంలోకం ప్రాప్తిరస్తు అన్నారుట, అది విషయం” అన్నాడు.


ఇంతలో ‘నారాయణా నారాయణ’ అంటూ సభలోకి నారదుడు ప్రవేశించాడు. ఆయన గురించి భూలోకంలో ఎన్నో కథలు విన్న శ్రీలక్ష్మి భక్తి గా ఆయన కాళ్లకు నమస్కారం చేసింది. 


“లేమ్మా, యింతవరకు భార్యాభర్తలు యిద్దరూ కలిసి ఒకే లోకం కి రావడం యిదే మొదటిసారి. అటు చూడు తల్లీ, మీ ఆయన దేవ గురువుగారిని కాకా పట్టి తను శాశ్వతంగా స్వర్గంలో వుండేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు చూడు గురువుగారు అలా విరగబడి నవ్వడం నేను అదివరకు చూడలేదు.


నీ భక్తికి మెచ్చి నీకు ఒక సహాయం చేస్తాను, వెళ్లి నీ భర్తకి నమస్కరించు, ఆయన చెప్పినట్టు చెయ్యి” అన్నాడు నారద ముని.


‘సరే స్వామి’ అని, మెల్లగా వెళ్లి భర్త కి ఎదురుగా నుంచుని నమస్కారం చేసి “మిమ్మల్ని మళ్ళీ యిలా కలవడం చాలా సంతోషం గా వుంది’. 


నారద ముని మహిమ వల్ల తన భార్యని గుర్తించి, “గురువుగారికి ప్రణామం చెయ్యి”, “స్వామి ఈమె నా భార్య, మహా భక్తురాలు, నిత్యం దైవ స్మరణతో గడిపేది, అందులో మీ మహిమలు గురించి ఎన్నో ప్రవచనాలు వినేది” అని చెప్పేడు..


సంతోషం తో గురువుగారు కమండలంలోని జలం తీసుకుని శ్రీలక్ష్మి మీద చల్లి, శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవించారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:22 PM



Users browsing this thread: