Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం
పుణ్యం కోసం
రచన : జీడిగుంట శ్రీనివాసరావు

అలా డబ్బాలు వెతుకోక్కపోతే నాలుగు జంతికలు వేసుకోవచ్చుగా, నాకు కుడి చెయ్యి పని చెయ్యదు. లేకపోతే నేనే చేసే దానిని అంది శ్రీలక్ష్మి, భర్త శేఖరం తో.


జంతికలు చెయ్యడానికి నీ చెయ్యి పనికిరాదు, తినడానికి నాకు పళ్ళు నొప్పి. అందుకే పాత స్టాక్ ఏమైనా వుందేమో అని డబ్బాలు వెతుకుతున్నాను అన్నాడు. 


సరే గాని 24 గంటలు  భగవంతుడి థ్యాసే గాని భర్తకి రెండు మైసూర్ బజ్జిలు గాని, లేదా  టమోటో పులిహోర చేద్దామని గాని నీకు వుండదా అన్నాడు భార్య తో.


తిరిగి తిరిగి నా మీదకి వచ్చారా, సాయంత్రం అలా బజారు వెళ్ళినప్పుడు ఏమైనా కొని తెచ్చుకోవాలి, అన్నీ ఇంట్లోనే అమర్చి పెట్టాలి అంటే నా వల్ల కాదు. రోజూ మీరు కూడా  భగవంతుడి గురించి కొంతసేపు తలుచుకుంటే మళ్ళీ మానవ జన్మ వస్తుంది, లేకపోతే జంతువు గా పుడతారని గరికిపాటి వారు, చాగంటి వారు రోజూ చెపుతున్నారు అంది శ్రీలక్ష్మి.


నాతో చెప్పినప్పుడు చూద్దాం లే, అయినా నీ పుణ్యం లో సగం నాకిస్తావుగా అన్నాడు.. 


ఇదేమన్నా వండుకున్న కూర అనుకున్నారా నాకు లేకపోయినా మీకు వడ్డించడానికి, నా మాట విని రేపటి నుండి  భాగవతం పుస్తకం నుంచి రెండు పేజీలు చదువుకోండి, మీ మంచికే చెప్పేది అంది. 


సరే రేపటి నుండి చదువుతానులే అని మేడ మీదకి వెళ్ళిపోయాడు శేఖరం మొక్కలకి నీరు పోయడానికి.


తోటలో కాసిన గులాబీలు, చామంతి, మల్లెపూలు కోసి దేముడు గదిలో పెట్టాడు, భార్య ఉదయమే లేచి స్నానం చేసి దేముడికి ఒక గంటసేపు అయినా పూజ చేస్తుంది. శేఖర్ లేచి సాయిరాం అనుకుంటూ స్టవ్ దగ్గరికి వెళ్లి కాఫీ కలుపుకుని వచ్చి టీవీ లో న్యూస్ చూడటం మొదలుపెట్టాడు.


మేడమీద నుంచి కిందకి దిగుతో, త్వరగా స్నానం చేసి  శివుని విగ్రహం మీద పాలు పోసి, మారేడు దళం పెట్టండి,  రోజు శివరాత్రి అని గుర్తుందా అంది భర్త తో శ్రీలక్ష్మి.


ఓహో ఈరోజు శివరాత్రా, అయితే చలి తగ్గిపోతుంది అన్నాడు. 


నా ఖర్మ,  రోజు నేను ఉపవాసం, మీరు కూడా ఉపవాసం వుంటారా అంది.


షుగర్ పేషెంట్స్ ఉపవాసం వుండకూడదు, నేను నాకోసం వంట చేసుకుంటాలే అన్నాడు శేఖర్.


సరే అయితే త్వరగా స్నానం చేసి రండి శివాలయం కి వెళ్లి అభిషేకం చేసుకుందాం, ఈరోజు చేసిన అభిషేకం ఎంతో పుణ్యం యిస్తుంది అంది శ్రీలక్ష్మి.


చూడు.. ఒక పక్కన పూజలతో పుణ్యం సంపాదించుకుని, యింకో పక్కన నన్ను సాధిస్తో పాపం తెచ్చుకుంటున్నావు. చివరికి మిగిలేది సున్నా, అందుకే నీ పూజలు నువ్వు చేసుకో, నా దారికి రాకు, నేను మనసులోనే దేముడిని తలచుకుంటో వుంటాను తెలుసా అన్నాడు శేఖర్.


తలుపు దగ్గరగా వేసి నేను గుడికి వెళ్తున్నా అంది. 


వుండు, ఎండలో ఎలా వేడతావు, నేను దింపుతాను అని లేచి చెంబుడు నీళ్లు తలమీద పోసుకుని, బట్టలు మార్చుకుని కారు గుడివైపు పోనిచ్చాడు. 


బాబోయ్ ఏమిటి  జనం, అభిషేకం చేయాడానికే! నేను  అరుగు మీద కూర్చొని వుంటాను, నువ్వు త్వరగా పూజ ముగించుకుని రా అన్నాడు శేఖర్. 


యింత దూరం వచ్చారుగా, మీరుకూడా రండి అభిషేకం చేద్దురుగాని అంది శ్రీలక్ష్మి.


 జనం లో నేను నుంచోలేను, త్వరగా రా అని అక్కడ అరుగు మీద కూర్చున్నాడు. చాలా పెద్ద గుడి,  గుడి చుట్టూ నాలుగు సార్లు తిరిగేస్తే ఈరోజు వాకింగ్ అయిపోతుంది అనుకుంటూ నడవడం మొదలుపెట్టాడు. మనసు తనంతట తనే శంభో శంకరా అంటోంది. అరగంట తరువాత శ్రీలక్ష్మి బయటకు వచ్చి భర్త కోసం చూస్తే, గుడి చుట్టూ తిరిగేస్తున్న శేఖర్ కనిపించాడు.


మీరే నయ్యం గుడి చుట్టూ ప్రదక్షణ చేసుకున్నారు, నన్ను ఒక్కక్షణం కూడా దేముడిని చూడనివ్వలేదు పాడు జనం అంది శ్రీలక్ష్మి. 


అయితే అభిషేకం చెయ్యలేదా? అన్నాడు శేఖర్.
ఎక్కడా, జనం తోసేస్తో వుంటే అంది చేతిలోని బుట్ట భర్త చేతికి యిస్తో.


సరే కూర్చో, అంటూ బుట్టలోని అరటిపళ్ళు అక్కడే వున్న ఆవుకి వేసి, పాలు ఆవు మీద పోసాడు. 


అయ్యో అయ్యో అదేమిటి.. నేను సాయంత్రం వేరే గుడికి వెళ్దాం అనుకుంటూ వుంటే పళ్లు, పాలు ఆవుమీద గుమ్మరిస్తారా, నాదీ తప్పు బుట్ట మీ చేతికివ్వడం అంది కోపంగా శ్రీలక్ష్మి.


యింకా శివరాత్రి సాయంత్రం కూడా వుందా అన్నాడు నవ్వుతు కారు ముందుకి పోనిస్తో. 


నన్ను విసిగించకండి. చిరాకుగా వుంది అంది శ్రీలక్ష్మి.


శేఖర్ తన కోసం వండిన అన్నం తినేసి పడుకున్నాడు. శ్రీలక్ష్మి భక్తి టీవీ లో శ్రీశైలమహాత్యం చూస్తో కూర్చుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మరణ శిక్ష - by k3vv3 - 28-04-2026, 10:21 PM



Users browsing this thread: 1 Guest(s)