28-04-2026, 03:49 AM
Part - 85
ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నా మీద నమ్మకం ఉంది కదా చాలు. నేనే పక్కనే ఉండాలి అంటే ప్రతిసారి కుదరదు.
మీరు చెప్పేటప్పుడు నాకు బాగానే ఉంటుంది కానీ ఎందుకో మీరు నా కళ్ళ ముందు ఉంటే ఒక ధైర్యం వస్తుంది. మాట్లాడకపోయినా పర్వాలేదు అలా ఉంటే చాలు.. అయితే ఒక పని చెయ్యి. నా ఫోటో ఒకటి పెట్టుకో..
వెటకారమా సార్.. అయ్యో సజెషన్ ఇస్తే.. వెటకారం అంటావేమిటి.. ఇప్పటికే లేట్ అయింది పదా అని నవ్వుతాడు.
మీ నవ్వే చెబుతుంది ఎంత వెటకారం ఆడుతున్నారో అని మూతి తిప్పుకుంటూ బైక్ ఎక్కుతుంది.
రాజ్ ఇంటికి వెళ్ళేటప్పటికీ నివి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి శ్రీమతి ఎవరికోసం చూస్తున్నావు.
ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టావా.. అయ్యో అలా అంటారేమిటండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నాను అని చేతుల్లో బ్యాగ్ తీసుకుంటుంది.
బ్యాగ్ వైపు.. నివి వైపు చూస్తూ ఉంటే... ఏమిటండీ అలా చూస్తున్నారు రండి అని సోఫాలో కూర్చోబెడుతుంది ఎందుకు ఈరోజు ఇలా కొత్తగా మర్యాదలు చేస్తున్నావు. నాకు భయం వేస్తుంది.
భలేవారే మర్యాదలు చేస్తే భయపడతారు ఏమిటి అని మళ్లీ గుమ్మం వైపు చూస్తుంది.. ఎవరికోసం చూస్తున్నావు. పెళ్లిళ్లు బ్రోకర్ వస్తానన్నాడు.
అతని కోసమే... ఎందుకు మన చందు కి వైభవ్ ఉన్నాడు కదా.. ఉండండి స్నాక్స్ తీసుకొస్తాను అని వేడివేడిగా ఆనియన్ పకోడీ తీసుకొచ్చి చేతికి ఇస్తుంది.
తింటూ ఉండండి అనగానే ఏం జరుగుతుందో అర్థం కాక మెల్లిగా తింటూ ఉంటాడు.. ఈలోపు పెళ్లిళ్లు బ్రోకర్ వస్తే.. అమ్మ ఎందుకు హడావుడిగా రమ్మన్నారు.
మీరు రమ్మన్నారని ఉన్న పళంగా వచ్చేసాను. ఎవరికి సంబంధం చూడాలి. ఎవరికో ఐతే మిమ్మల్ని ఎందుకు రమ్మంటాను.
మా వారికే... అంతే.. ఆ మాటకి పకోడీ అడ్డుపడి పులమారుతుంది..అయ్యో మెల్లిగా తినండి అని వాటర్ పట్టిస్తుంది.
నాకు పెళ్లి ఏంటి అని రాజ్ కంగారుగా అడిగితే.. బ్రోకర్ అయోమయంగా చూస్తాడు. ఇదిగోండి మా వారి పెళ్లి చాలా దూరం నుంచి రావాలి.
ఏడు గోదావరి అవతల అంటారే అలా రావాలి. పెళ్లయిన తర్వాత కూడా అమ్మాయి నెలకి ఒకసారి పుట్టింటికి వెళ్లి వెళ్లి రావాలి.
మా వారు పెళ్ళాం ఊరెళితే ఎలా ఉంటుందా అన్నది ఎంజాయ్ చేయాలి. అంతేనా అండి అంటుంది.
రాజ్ కి మేటర్ అర్థమయ్యి తినే ప్లేట్ పక్కన పెట్టి బ్రోకర్ వైపు చూసి మీరు వెళ్ళండి..మళ్ళీ కబురు పంపుతామని పంపించి వచ్చి నిలబడతాడు.
ఏమైందండీ.. ఇంకొక బ్రోకర్ని పిలిపించానా.. గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేసి మోకాళ్ళ మీద కూర్చుని నడుం చుట్టూ చేతులు వేసి..
నీకు అంతా తెలిసిందని నాకు అర్థమైంది. ఏదో సరదాగా పిచ్చపాటి మాట్లాడుకున్నాం. మగవాళ్ళు అన్నాక ఆ స్వేచ్ఛ ఉండదా. దానిని నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటే ఎలాగా..
మన పెళ్లయినప్పటి నుంచి మీ కోరిక ఏదైనా తీరుస్తున్నాను కదా. అలాగే ఇది కూడా తీరుస్తాను. మీకు వేరే ఊరు అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు అలాగే చేస్తాను రాజ్.
ఇదిగో నువ్వు ఇలా అంటే నేను అలుగుతాను. హ ఏమిటి... అలా ఉంటే ఎలా ఉంటుందా అన్నాను కానీ నీ స్థానంలో ఇంకొకళ్ళు అనలేదు కదా బంగారం.
మా బుజ్జి కదా ఈ అలక పాన్పు కొద్దిగా దిగు. లేదు మీకు పెళ్ళాం ఊరెళితే అన్న సినిమా కావాలి అన్నారు కదా... సో నేను పుట్టింటికి వెళుతున్నాను.
ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అని సర్ది ఉన్న బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది. ఆల్రెడీ సర్దుకునే ఉన్నావా.
నా మేనల్లుడు కూడా రెడీగా ఉన్నాడు.
ఇదంతా వైభవ్ గాడి పనే కదా అని పళ్ళు నూరితే... వాడి చిన్న పిల్లోడు. వాడు ఏం చేసాడు అని బ్యాగ్ తీసుకుని బయటకి వస్తుంది.
చూడు నివి నా మీద అలిగి వెళితే బాగోదు. అయ్యో నాలాంటి గడుసువాళ్లతో మీరు ఎలా పడగలరండి.. ఒక అమాయకురాలుని తెచ్చి పెళ్లి చేస్తాను.
సరేనా నువ్వు పదరా అని వైభవ్ భుజం మీద కొడుతుంది. అలాగే అత్తయ్య అని బ్యాగు కార్ డిక్కీ లో పెట్టి రాజ్ దగ్గరికి వచ్చి..
ఏమన్నావు మామ.. నీ కూతురు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అంటే నువ్వే అడుగు అని ఫోజ్ కొట్టావు కదా.. ఇప్పుడు మా అత్తని తీసుకురావడానికి నీకు చుక్కలు కనపడతాయి.
హమ్మయ్య పుట్టింటికి వెళ్ళింది అని నువ్వు రిలాక్స్ గా ఉన్నా తలపోటే... వచ్చి బ్రతిమాలి తీసుకురావడం ఇంకా పెద్ద తలపోటు.
ఒరేయ్ అని ఏడుపు గొంతుతో పిలిస్తే.. అబ్బా ఎంత హాయినిస్తుంది మామ.. ఈసారి నుంచి నేను ఎప్పుడైనా అడిగినప్పుడు తిన్నగా సమాధానం చెప్పకపోతే మీకు ఇంతకన్నా బాగా జింకుచక అనుకుంటూ వెళ్ళిపోతాడు.
రాజ్ కోపంగా వినయ్ కి ఫోన్ చేస్తాడు. నీరసంగా చెప్పు బావ. నీ కొడుకు ఏదో ఉత్తముడని చెప్పావు. వాడు ఏం చేసాడో తెలుసా..
నా కింద ఆల్రెడీ పేలిపోయింది. నీకేం పేలిందిరా. అయితే విను అని వేలుతో తిప్పుతూ ఉంటాడు. ఫోన్లో కూడా ఎదవ సిగ్నల్స్ ఏంటి సరిగ్గా చెప్పు..
వినయ్ ఇంటికి రాగానే పూజిత ఎక్కడా కనిపించదు. గదిలోకి వెళ్లి టై లూస్ చేస్తూ ఉండేటప్పటికీ వెనక నుండి వచ్చి హత్తుకుంటుంది.
అమ్మో దయ్యం దయ్యం అని అరుస్తాడు. అదేమిటండి నేను ఎంత ముద్దుగా హత్తుకుంటే.. అలా అరుస్తున్నారు నువ్వా అని గుండెల మీద మెల్లిగా కొట్టుకుంటాడు.
ఇదిగో మీకోసం కాఫీ, టీ, జ్యూస్, స్నాక్స్ ఇంకా అంటే ఆగు.. ఎందుకు ఇన్ని రకాలు..ఎవరైనా ఏదో ఒకటే కదా తాగుతారు.
మీతో నేను ఉత్తమమైన ఇల్లాలు అనిపించుకుని.. మనం బెస్ట్ కపుల్ లాగా ఉండాలి కదా...ఆ డైలాగ్ కి ఒకసారి గా తలపైన వెంట్రుకలు అన్ని నిక్కబోడుచుకుంటే.. స్టార్స్ అన్ని పైన తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది.
వెంటనే పూజితని అక్కడ సోఫాలో కూర్చోపెట్టి... వేళ్ళు లాగుతూ ఎందుకు బంగారం నువ్వు ఇలాంటి కష్టమైన పనులన్నీ మీద వేసుకుంటావు.
నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో ఉత్తమమైన ఇల్లాలివే.. మనం బెస్ట్ కప్పుల్స్ మే.. అలా కుదరదండి నా సేవతో మిమ్మల్ని మెప్పించాలి.
వద్దు అని చెబుతున్నాను కదా.. నువ్వు అంత పెద్ద పెద్ద టాస్కులు నెత్తి మీద వేసుకుంటే నేనేం అయిపోవాలి. భలేవారే మీకోసమే కదా..
ఏది తాగుతారు. నువ్వు ఏది ఇచ్చినా నాకు పరవాలేదు అని భయంగా చేతులు రెండు దగ్గరకి పెట్టుకుంటాడు. అయ్యో మీరు ఎలా అంటే ఎలాగండి....మీకు నచ్చింది తీసుకోండి అని ట్రే ని ముందుకి జరుపుతుంది.
ఏం చేయాలో అర్థం కాక కాఫీ, టీ, జ్యూస్ అన్నీ ఒక దాంట్లో పోసుకొని గటకట తాగేసి సంతోషమా అంటాడు. మీ కాళ్లు ఇలా పెట్టండి నొక్కుతాను.
నా కాళ్ళ మీద నాకు కొన్ని రోజుల ఆశ ఉంది. ఆశ తీరిన వెంటనే నీకు అప్ప చెబుతాను..ఈరోజుకి వదిలేయవా ప్లీజ్ అని బ్రతిమాలితాడు.
అలాగంటారా సరే అయితే.. మీకోసం మీకు ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేస్తాను సరేనా అని చెంప మీద తట్టి వెళ్ళిపోతుంది. ఇది బావ జరిగింది.
ఏ నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్తో సచ్చిపోతున్నాను. అందుకే నేను ఆఫీసు రూమ్ లోకి వెళ్లి దాక్కుంటున్నాను.
అక్కడికైతే ఈ లేడీస్ రారు కదా...అన్నయ్యతో వర్క్ బిజీ అని అక్కడే ఉంచేస్తాను..మీ పనే బాగుందిరా..అందరూ ఒక చోట ఉండేటప్పటికీ ఎస్కేప్ అయిపోతున్నారు. నేను శ్రీ అనుకుని..
ఇంతకి శ్రీ, భరత్ పరిస్థితి ఏమిటి.. నాకు తెలియదు. భరత్ బావది ఏముంది.. విద్య కూర్చోమంటే కూర్చుంటుంది. నుంచో అంటే నుంచుంటుంది.
ఒక శ్రీ దే ఆలోచించాలి. ఫోన్ చేద్దామా.. ఎందుకులే.. అంతా అయ్యిన తర్వాత వాడే ఫోన్ చేస్తాడు అని ఫోన్ పెట్టేసి ఆఫీస్ రూమ్ లోకి పరుగు పెడతాడు.
కథ కొనసాగుతుంది.......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)