28-04-2026, 03:39 AM
రుద్రం భజే! ఎపిసోడ్ - 6
ఇంట్లో ఉన్న దీప్తి వాళ్ళ దగ్గరకి వచ్చి తన పేరు జీతిన్ ఏజెంట్ అని పరిచయం చేసుకొని యోధ గురించి వివరంగా చెప్పి ఉదయం బయలుదేరడానికి రెడీగా ఉండండి మిషన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి ఏమాత్రం అనుమానం వచ్చినా యోధ కనిపెట్టేస్తాడు అని చెప్పాడు.
************
జితేన్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసి నాయక్ కి కాల్ చేసింది దీప్తి.
ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ బేబీ జితిన్ కలిసాడా..?" అని అడిగాడు నాయక్.
"యా.. ఇప్పుడే మాట్లాడాము, డాడ్! ఇక్కడ యోధ ఉండగా మేము రావాల్సిన అవసరం ఏముంది తనకి ఒక్క మాట చెపితే చాలు ఆ వస్తువు ఎక్కడ ఉన్నా సరే తీసుకువచ్చి మీ చేతిలో పెడతాడు." అని చెప్పింది దీప్తి.
"ఆ విషయం నాకు కూడా తెలుసు! యోధ హనుమంతుడు లాంటివాడు చూసి రమ్మంటే కాల్చి వస్తాడు ఇది చాలా సెన్సిటివ్ మేటర్!
అది కాకుండా ఇది దైవ మహిమ లేక అనుకోకుండా జరుగుతుందో నాకు తెలియదు ఈ కేసుతో లింక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ వస్తువు గురించి తెలుస్తుంది అని నాకు అనిపించింది.
ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఎవరికి దొరకని ఆ కెమెరా ఇప్పుడు యోధకి దొరికింది. అలాగే ఆ వస్తువు గురించి కూడా నీకు నీతూ కి తెలుస్తుంది అనుకుంటున్నాను." అని చెప్పాడు నాయక్.
ఆ మాటకి కాసేపు ఆలోచించి "ఈ కేసుతో నాకు నీతూ కి లింక్ ఏమిటి?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"ఆ విషయం మీరు ఆ వస్తువుని సంపాదించి దాని గురించి తెలుసుకున్న తర్వాత వివరంగా చెబుతాను, బెస్ట్ ఆఫ్ లక్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాయక్.
ఫోన్ పెట్టేసి నీతూ వైపు చూసి "ఈ మిలటరీ వాళ్ళు ఉన్నారే ఏ విషయం క్లారిటీగా చెప్పరు." అని చెప్పింది దీప్తి.
"ఆ విషయం నిజమే! కానీ వాళ్లు క్లారిటీగా చెప్తే కొన్ని విషయాలు విని మనం తట్టుకోలేము." అని చెప్పి అక్కడికి గౌరీ రావడం చూసి "హాయ్!" అని చెప్పింది నీతూ.
****************
అదే సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ముంబై నుంచి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో బయటికి వస్తున్న జనాల వైపు చూస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి.
అతని దగ్గరికి వచ్చి "మిస్టర్ అజీజ్! చీప్ గా టాక్సీ దొరుకుతుందా..?" అని అడిగాడు సూట్ లో స్టైల్ గా ఉన్న ఒక వ్యక్తి.
ఆ మాట విని "రెడీగా ఉంది రండి." అని లగేజ్ తీసుకుని కార్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడనుంచి వెళుతు "మీర్జా బాయ్! మిమ్మల్ని నేను గుర్తు పట్టలేదు చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా మీరు పంపించిన కోడ్ బాగా ఉపయోగపడింది." అని నవ్వుతూ చెప్పాడు అజిజ్.
"నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి నువ్వు ఇంకా బతికి ఉన్నావు, బ్రహ్మం ఎలా ఉన్నాడు.?" అని అడిగాడు మీర్జా.
"అచ్చ బాయ్! మీకోసం గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు." అని చెప్పాడు అజిజ్.
కాసేపటికి గెస్ట్ హౌస్ దగ్గర కార్ ఆగడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న మనిషి వైపు చూసి "నమస్తే మీర్జా భాయ్" వెల్కమ్ టు హైదరాబాద్!" అని చెప్పాడు బ్రహ్మం.
కారులో నుంచి కిందకు దిగుతూ "ఏంటి? చాలా సంవత్సరాల తర్వాత చూసినా నన్ను బానే గుర్తుపట్టావు." అని అడిగాడు మీర్జా.
"బాయ్! నిజం చెప్పనా..? అజిజ్ వెళ్ళింది మిమ్మల్ని తీసుకురావడానికి ఏ కదా, ఈ కారులో మీతో పాటు ఎక్కే ధైర్యం కూడా ఎవరు చేయరు అందుకే చూడగానే గుర్తు పట్టినట్లు యాక్షన్ చేశాను." అని నవ్వుతూ చెప్పాడు బ్రహ్మం.
"గుడ్! నిజం ఒప్పుకుని ప్రాణాలు కాపాడుకున్నావు ఇంతకీ నేను పంపించిన లొకేషన్ తెలుసుకున్నారా..?" అని అడిగాడు మీర్జా.
"ఆ ఏరియాలో ఆల్రెడీ మన టీమ్ దిగింది బాయ్! విషయం ఏమిటో చెబితే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను ఒక్కరోజులో పని క్లోజ్ చేసుకుని వచ్చేస్తారు చాకు లాంటి కుర్రాళ్ళని పంపించాను." అని చెప్పాడు బ్రహ్మం.
"అవునా?" అని తన దగ్గర ఉన్న ఫోటో చూపించి "ఈ వస్తువు 25 సంవత్సరాల క్రితం అక్కడ మిస్ అయింది దానిని వెతికి పట్టుకోవాలి ఒకరోజులో అయిపోతుందా..?" అని అడిగాడు మీర్జా.
ఆ ఫోటో చూస్తూ "ఏంటి బాయ్! మీరు మాట్లాడేది 25 సంవత్సరాల క్రితం పోయిన వస్తువుని ఇప్పుడు మనం వెతకాల? అసలు అక్కడ ఉందో లేకపోతే ఎవరికైనా దొరికితే పట్టుకుపోయారో ఈ డీల్ మనం తీసుకోవడం కూడా టైం వేస్ట్ బాయ్!" అని చెప్పాడు అజిజ్.
"ఈ కాంట్రాక్టు మనకి ఇచ్చిన వాళ్ళకి ఆ వస్తువు ఆ ఏరియా లోనే ఉన్నట్లు సిగ్నల్ అందింది. కానీ ఎక్కడ ఉందో కన్ఫామ్ గా చెప్పలేకపోతున్నారు, నేను ఎలాగైనా దానిని పట్టుకుని వస్తాను అని మాట ఇచ్చాను." అని చెప్పాడు మీర్జా.
"అసలు ఇది ఏమిటి బాయ్! చూడడానికి ఏదో చిన్న ప్లేట్ లాగా ఉంది దానికోసం నువ్వు రంగంలోకి దిగాల్సిన పని ఏముంది?" అని డౌట్ గా అడిగాడు బ్రహ్మం.
"ఆ వస్తువు తీసుకువెళ్లి వాళ్ళ చేతిలో పెడితే మన అకౌంట్ లో...!" అని చెప్పడం ఆపి "మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?" అని అడిగాడు మీర్జా.
"నువ్వు మినిమం 10 కోట్లు లేకుండా అడుగు బయటకు పెట్టవు ఆ విషయం నాకు తెలుసు!" అని నవ్వుతూ చెప్పాడు బ్రహ్మం.
ఆ మాటకి పగలబడి నవ్వుతూ "నీ కింద ఎంతమంది మనుషులు ఉన్నారు?" అని అడిగాడు మీర్జా.
"నా గ్యాంగ్ లో ఎటువంటి పనినైనా చేయగలిగిన వాళ్ళు వందమంది ఉన్నారు బాయ్ చిల్లర రౌడీలు అయితే లెక్కేలేదు." అని గొప్పగా చెప్పాడు బ్రహ్మం.
"ఆ వస్తువు నువ్వు కనిపెడితే నీ దగ్గర ఉన్న ఒక్కొక్కడికి కోటి రూపాయలు ఇస్తాను, మీ ఇద్దరికీ చేరుకో 50 కోట్లు ఇస్తాను మొత్తం రెండు వందల కోట్లు సరిపోతుందా..?" అని అడిగాడు మీర్జా.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "భాయ్! నువ్వు అదే మాట మీద ఉండు ఈరోజు నుంచి మా కుర్రాళ్ళ పని మా పని ఆ వస్తువుని కనిపెట్టడమే!" అని సంతోషంగా చెప్పాడు అజిజ్.
"బాయ్! నాకు ఒక చిన్న డౌట్, ఇంత చిన్న వస్తువుకి అంత పెద్ద అమౌంట్ ఇస్తున్నారు ఇంతకీ ఇది దేనికి ఉపయోగపడుతుంది?" అని అనుమానంగా అడిగాడు బ్రహ్మం.
"ఈ కాంట్రాక్ట్ ఫస్ట్ ఇబ్రహీం దగ్గరకు వెళ్ళింది దీని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేశాడు సడన్గా యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇంకా నీకు డీటెయిల్స్ కావాలా..?" అని అడిగాడు మీర్జా
ఆ మాటకి భయంగా చూస్తూ "అవసరం లేదు బాయ్! నాకు డబ్బులే కావాలి, డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి మా కుర్రాళ్ళకి పంపిస్తాను." అని ఫోన్ తీసి కాల్ చేశాడు అజిజ్.
జీప్ లో వెళుతూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "అజిజ్ బాయ్ కాల్ చేస్తున్నాడు స్లో చేయరా..!" అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి "నమస్తే బాయ్! మీరు చెప్పిన ఏరియాకి వెళుతున్నాము ఇంతకీ పనేమిటో చెప్పలేదు." అని అడిగాడు కార్లో ఉన్న వ్యక్తి.
"ఒరేయ్ సత్తి! నీకు ఒక ఫోటో పంపించాను దాంట్లో కనిపించే వస్తువు ఏ ఏరియాలో మిస్ అయ్యిందో డీటెయిల్స్ పంపించాను, ఆది కచ్చితంగా అక్కడే ఉంది దానిని కనిపెడితే మనిషికి కోటి రూపాయలు!" అని చెప్పాడు అజిజ్.
"బాయ్! ఇలాంటి ఆఫర్ ఇప్పటీవరకు నేను వినలేదు ఆ ఫోటోలో ఉన్న వస్తువు దొరికే వరకు ఈ ఏరియాలోనే ఉంటాము." అని సంతోషంగా చెప్పాడు సత్తి.
"రెండు రోజుల్లో మేము కూడా రంగంలోకి దిగుతున్నాము ఈలోపు ఆ ఏరియా మొత్తం ఒక్క రౌండ్ వేయండి విషయం చాలా సీక్రెట్ గా ఉండాలి." అని చెప్పాడు అజిజ్.
"ఓకే బాయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి జీప్ లో ఉన్న తన మనుషులు వైపు తిరిగి "ఒరేయ్! ఈ ఫోటోలో కనిపించే వస్తువు సంపాదిస్తే మనిషికి కోటి రూపాయలు అంట!" అని సంతోషంగా చూస్తూ చెప్పాడు సత్తి.
ఆ మాట విని మొబైల్ లాక్కుని ఫోటో వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందరు.
*************
జీజ్ యాంగ్ ఏరియా ఉన్న చైనా ఆర్మీ పోస్టు దగ్గరకి వచ్చి అక్కడ ఉన్న జింగ్ వైపు చూసి "మనం ప్రయోగం కోసం వెతుకుతున్న ఆ ఐటమ్ ఎలా ఉంటుందో ఇండియన్ ఆర్మీకి తెలిసింది." అని చెప్పాడు మిలిటరీ జనరల్ చింగ్ యా.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఆ ఐటమ్ ఎలా ఉంటుందో మనవాళ్ళకే సరిగ్గా తెలియదు వాళ్లకి ఎలా తెలిసింది? మనం చేసే ప్రయోగం గురించి కూడా తెలిసిపోయిందా..?" అని కంగారుగా అడిగాడు జింగ్.
"పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు దేశాలు కలిసి ఏదో ఒక ప్రయోగం చేస్తున్నాయి దానికి కావాల్సిన ఐటమ్ అది అని మాత్రమే వాళ్ళకి తెలుసు!
ఒకవేళ ప్రయోగం గురించి కూడా వివరాలు తెలిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ సదస్సులో దాని గురించి మాట్లాడేవారు, మాట్లాడలేదు కాబట్టి వాళ్లకి పూర్తి వివరాలు వాళ్ళకి తెలియదు." అని చెప్పాడు చింగ్ యా.
"ఆరోజు ఇండియన్ ఏంజెంట్ నా దగ్గర నుంచి తీసుకెళ్లిన ఫైల్ ఢీకొట్ చేస్తే మనం చేసే ప్రయోగం గురించి వాళ్లు కచ్చితంగా కనిపెడతారు." అని చెప్పాడు జింగ్.
"ఇండియన్ ఆర్మీ దీని గురించి తెలుసుకునే లోపల మనం ఈ ప్రయోగం కంప్లీట్ చేయాలి ఇండియాలో మనకి వచ్చిన సిగ్నల్ ని బట్టి అక్కడకి ఒక టీమ్ ని పంపించాను, ఇక్కడ కూడా వెతకడం స్పీడ్ చేయండి ఎలాగైనా మనం అనుకున్నది సాధించాలి." అని చెప్పాడు చింగ్ యా.
"ఓకే జనరల్! ఈరోజే కొత్త మిషన్ రీ దిగింది ఆ ఐటమ్ ఎంత లోతులో ఉన్నాయి కొండల లోపల ఉన్న కనిపెడుతుంది. మీరు టిబెట్ ని కంట్రోల్ చేయండి చాలు మనం వాళ్ళ పని సాఫీగా అయిపోతుంది." అని చెప్పాడు జింగ్.
అక్కడికి వస్తూ "ఆ ప్రయోగం వల్ల నా దేశానికీ ఏ లాభం లేకపోయినా పర్వాలేదు నాకేమైనా లాభం ఉంటుందా..?" అని అడిగాడు పాకిస్తాన్ మిలటరీ జనరల్ సయ్యద్.
"కచ్చితంగా ఉంటుంది అందుకే కదా ఆ ప్రయోగం మీ దేశంలో చేసేది ఆది కనుక సక్సెస్ అయితే నువ్వు ఎక్కడో ఉంటావు." అని చెప్పాడు చింగ్ యా.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)