Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#20
రుద్రం భజే! ఎపిసోడ్ 5


గౌరీ చెప్పింది విని ఏంటి యోధ బ్లాక్ క్యాట్ కమాండో నా అని ఆశ్చర్యంగా అంది దీప్తి.

*************

ఆ మాట విని "బ్లాక్ క్యాట్ కమాండో అంటే అందరు అంత ఆశ్చర్యపోతున్నారు ఎందుకు? అతను కూడా సోల్జర్ ఏ కదా!" అని డౌట్ గా అడిగింది పూజా.

"బ్లాక్ క్యాట్ కమాండో అంటే సోల్జర్ ఏ కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా శత్రువుతో యుద్ధం చేయగలరు చేతిలో ఆయుధం లేకపోయినా సరే శత్రువుని ఎదుర్కోగలరు." అని చెప్పింది నీతూ.

"ఎటువంటి పరిస్థితుల్లోనైనా అంటే నాకు అర్థం కాలేదు." అని డౌట్ గా చూసింది పూజ.

"ఎయిర్, వాటర్, హీల్స్, ఎర్త్ ఎక్కడైనా సరే ఎనీ వెపన్ యూజ్ చేయగలరు, టెర్రరిస్టులు మీద మెరుపు దాడి చేయడానికి ఇండియన్ మిలటరీ ఈ బ్లాక్ క్యాట్ కమాండో కి ట్రైనింగ్ ఇస్తుంది దాంట్లో సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం ట్రైనింగ్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది." అని చెప్పింది నీతూ.

"గ్రేట్!" అని చెప్పింది పూజా.

"అసలు ఈ విషయం డాడ్ మనకెందుకు చెప్పలేదు." అని అనుమానంగా అడిగింది దీప్తి.

"ఈ మిషన్ గురించి యోధ కి తెలియకూడదు అనుకున్నారేమో ఎందుకంటే తన తండ్రి ఈ మిషన్ లోనే చనిపోయాడు దానివల్ల దీనిని పర్సనల్ గా తీసుకుంటాడు పర్సనల్ ఎలిగేషన్స్ మిలిటరీలో పని చేయవు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచుతారు." అని చెప్పింది నీతూ.

"అవును! యోధ 24 మందిని చంపేశాడు అని గౌరీ చెప్పింది. అసలు ఎవరిని చంపాడు? ఈ న్యూస్ బయటికి రాలేదు." అని డౌట్ గా అడిగాడు పుష్కర్.

అక్కడకి వచ్చి "పూజ మొదలైంది రండి." అని గౌరీ పిలవడంతో గుడి దగ్గరికి వెళ్లారు అందరు.

అక్కడికి వచ్చిన దీప్తిని చూపిస్తూ "యోధ! నాయక్ గారి అమ్మాయి!" అని చెప్పాడు నారాయణ రావు

"నాకు తెలుసు నాన్నగారు! ఇందాక చూసినప్పుడే గుర్తుపట్టాను మీరు ఇస్రోలో వర్క్ చేస్తున్నారు కదా! మా ఊర్లో ఏదైనా రాకెట్ టెస్ట్ చేయడానికి  వచ్చారా..?" అని నవ్వుతూ అడిగాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ "అలాంటిదేమీ కాదు జాబ్ టెన్షన్ తో రిలాక్స్ లేకుండా పోయింది అందుకే మీ ఏరియా బాగుంటుందని డాడ్ చెప్పారు, ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఒక వన్ వీక్ ఎంజాయ్ చేద్దామని వచ్చేసాను, అవును నేను మీకు తెలుసా..?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"మీ గురించి నాయక్ సర్ ఒక్కసారి చెప్పారు ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటో చూశాను అందుకే గుర్తుపట్టాను, ఇక్కడ ఉండే ప్రశాంతత మీకు ఎక్కడ దొరకదు హ్యాపీగా ఎంజాయ్ చేయండి." అని చెప్పాడు యోధ.

"మాకు ఈ ఏరియా పెద్దగా తెలియదు నువ్వు హెల్ప్ గా ఉంటావా..?" అని అడిగింది నీతూ.

"మీరేమీ కంగారు పడకండి యోధ మీకు మా ఊరు చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు చూపిస్తాడు నాయక్ గారి అమ్మాయి అంటే మా ఇంటి అమ్మాయితో సమానం!" అని చెప్పాడు నారాయణ రావు.

"సరే! మార్నింగ్ వెళదాము పూజ ప్రారంభమవుతుంది కూర్చోండి." అని చెప్పి లోపలికి వెళ్ళాడు యోధ.

పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి "యోధ! అంత స్వీట్ గా మాట్లాడుతున్నాడు 24 మందిని చంపేశాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు." అని చెప్పింది పూజా.

అంతలో అక్కడికి వచ్చి "భూపతి వర్మ గారు మీకు ఈ పళ్ళు ఇవ్వమన్నారు ఇక్కడ ఉండే అడవిలో కాసినవే తినండి." అని చెప్పి రూమ్ డోర్ క్లోజ్ చేశాడు ఆ వ్యక్తి.

"మిస్టర్! డోర్స్ క్లోజ్ చేసావ్ ఎందుకు?" అని సీరియస్ గా అడిగింది నీతూ.

"హాయ్! ఐయామ్ జితిన్ స్పెషల్ ఏజెంట్! మీరు ఇక్కడికి వస్తున్నారని నాయక్ సార్ చెప్పారు యోధ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే వెంటనే పసిగెట్టేస్తాడు." అని చెప్పాడు.

"మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని డౌట్ గా అడిగింది నీతూ.

"మేడం! మిలటరీ ఈ మిషన్ స్టార్ట్ చేసి మూడు నెలలు అవుతుంది అప్పుడే నేను ఇక్కడికి వచ్చి భూపతి వర్మ గారి దగ్గర పనిలో చేరాను, మీరు ఆ వస్తూవుని వెతకడానికి వచ్చారు, నేను ఆ వస్తువు కోసం బయట వ్యక్తులు ఎవరైనా వస్తే తెలుసుకోవడానికి వచ్చాను." అని చెప్పాడు జీతిన్.

"మరి నీ గురించి యోధకి కి తెలియదా?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"నేను RAW లో వర్క్ చేస్తాను మా గురించి ఎవరికీ తెలియదు నా పేరు కూడా జీతిన్ కాదు అసలు పేరు నా ఒక్కడికి మాత్రమే తెలుసు!" అని స్మైల్ ఇచ్చాడు.

"అవును! అసలు యోధని ఎందుకు సస్పెండ్ చేశారు?" అని అడిగింది దీప్తి.

"మూడు నెలల క్రితం కారకొరం హిల్స్ దగ్గర ఏదో జరుగుతుందని తెలుసుకుని కొంతమంది ఏజెంట్స్ ని అక్కడికి పంపించారు అక్కడ వెతుకుతున్న  చైనా, పాకిస్తాన్ సోల్జర్స్ మన ఏజెంట్స్ ని పట్టుకుని ఇండియన్ సిటిజన్స్ అని తెలుసుకున్నారు.

ఆ విషయం తెలుసుకుని నాయక్ సార్ రెండు గవర్నమెంట్స్ తో మాట్లాడి గొర్రెలు కాచుకునే వాళ్ళు రూట్ తప్పి వచ్చారు అని చెప్పి ఆ ఏజెంట్స్ ని రిలీజ్ చేయడానికి ఒప్పించి వాళ్ళని తీసుకురావడానికి నలుగురు రిస్క్యూటిమ్ ని పంపించారు దాంట్లో ఒక మెంబర్ యోధ.

సరిహద్దు రేఖ వెంబడి అంతర్జాతీయ రూల్స్ ప్రకారం ఎటువంటి వెపన్ యూజ్ చేయకూడదు ఎవరి వైపు నుంచి కాల్పులు జరిగాయో వాళ్లు యుద్ధం మొదలుపెట్టినట్లు అవుతుంది. అందుకే వెళ్ళిన నలుగురు పని ఏజెంట్స్ ని భద్రంగా తీసుకురావడమే అక్కడ ఎటువంటి ఎటాక్ చేయకూడదు ఎవరిని చంపకూడదు.

కానీ వీళ్ళ నలుగురు వెళ్లేసరికి అక్కడ ఉన్న మన ఏజెంట్స్ ని బట్టలు లేకుండా మంచులో పడుకోబెట్టి చిత్రహింసలు పెడుతూ ఉన్నారు ఆ విషయం వెంటనే నాయక్ సార్ కి కాల్ చేసి చెప్పాడు యోధ.

అక్కడ ఎటువంటి గొడవ జరగకూడదు మన వాళ్ళని తీసుకుని వెనక్కి వచ్చేయండి అని ఆర్డర్స్ ఇచ్చారు మిలటరీలో ఫస్ట్ రూల్ సుపీరియర్ ఆర్డర్స్ స్టిట్ గా ఫాలో చేయడమే దానికి కట్టుబడి ఏటువంటి గొడవ చేయకుండా ఏజెంట్స్ ని విడిపించి అక్కడి నుంచి వెళ్లడానికి రెడీ అయ్యారు యోధ టీమ్.

కానీ అప్పుడే ఒక ఏజెంట్ బట్టలు వేసుకుంటూ ఉండగా  సీక్రెట్ గా దాచుకున్న జైశ్రీరామ్ అని రాసి ఉన్న పేపర్ అక్కడ ఉన్న శత్రుదేశం దేశం సోల్జర్ కి దొరికింది.

జై శ్రీరామ్ అంటే మీ దేవుడి పేరు కదా అని చెప్పి కాలు కింద పెట్టి యూరిన్ పోయడానికి ట్రై చేశాడు, అప్పుడు వచ్చింది యోధ కి అసలైన కోపం ఒక్క దూకులో వెళ్లి వాడి గుండెల మీద ఒక్క గుద్దు గుద్దాడు వాడు మళ్ళీ పైకి లేగలేదు.

అక్కడ ఉన్న మిగతా వాళ్ళు యోధ ని మిగిలిన వాళ్ళని రౌండ్ చేసి చంపేయడానికి గన్స్ బదులు ఐరన్ రాడ్స్ కత్తులు బయటకు తీశారు." అని చెప్పాడు జీతిన్.

తను చెపుతుంది సీరియస్ గా వింటూ "తర్వాత ఏమైంది? చెప్పడం ఆపేసారేమిటి?" అని ఆత్రుతగా అడిగాడు ఏకవీర.

"అక్కడ ఉంది యోధ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేరా..? రెండు దేశాలకి వాళ్ళ సోల్జర్స్ ఏమైపోయారో తెలియలేదు ఇంకా వెతుకుతూనే ఉన్నారు.

ఆ పని చేసినందుకు అందరూ మెచ్చుకున్నారు కానీ ఆర్డర్స్ బ్రేక్ చేసినందుకు నాయక్ సర్ యోధ ని సస్పెండ్ చేశారు. ఆ కెమెరా కూడా తనకే దొరికింది దాంట్లో ఉన్న ఫోటోలు చూసే ఈ మిషన్ స్టార్ట్ చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు." అని చెప్పాడు జీతిన్.

"అది సరే! అక్కడ ఉన్న శత్రుదేశం సోల్జర్స్ ని యోధ ఏం చేశాడు? మూడు నెలలు వెతికిన కనపడకుండా ఏమైపోయారు?" అని డౌట్ గా అడిగింది నీతూ.

"ఆ విషయం యోధ తో పాటు వెళ్లిన ముగ్గురు బ్లాక్ క్యాట్ కమాండోస్ చెప్పాలి, లేకపోతే ఏజెంట్స్ చెప్పాలి ఎవరు నోరు విప్పలేదు నాకు తెలిసి నాయక్ సార్ కి తెలిసే ఉంటుంది." అని చెప్పాడు జీతిన్.

"యోధ చాలా మంచి పని చేశాడు డాడ్ చేసిన పని నాకు నచ్చలేదు." అని చెప్పింది దీప్తి.

"అక్కడ జరిగింది విన్న వాళ్ళకి అలాగే ఉంటుంది. కానీ ఏదైనా తేడా వస్తే యుద్ధం మొదలవుతుంది ఆ విషయం ఎవరు ఆలోచించరు." అని చెప్పాడు జీతిన్.

"సరేగాని! ఆ వస్తువుని వెతుక్కుంటూ ఎవరైనా ఇక్కడికి వచ్చారా..?" అని అడిగింది నీతూ.

"ఇప్పటివరకు ఎవరు రాలేదు కానీ దానిని వెతకడం కోసం  మీర్జా గ్యాంగ్ దగ్గరికి ఫోటో వచ్చింది. ఆ వస్తువు మిస్ అయింది ఈ ఏరియాలోనే కాబట్టి  తప్పకుండా ఎవరో ఒకరు వస్తారు." అని చెప్పాడు జీతిన్.

"మిలిటరీ ఆ వస్తువుని వెతుకుతున్న విషయం యోధాకి తెలుసా?" అని అడిగింది పూజ.

"యోధ సస్పెండ్ అయిన తర్వాత ఈ మిషన్ స్టార్ట్ చేశారు కాబట్టి తనకి దీని గురించి తెలియదు మనం కూడా చెప్పకూడదు." అని చెప్పాడు జీతిన్.

"ఆ వస్తువు ఈ ఏరియాలో మిస్ అయ్యి 25 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ రెండు దేశాలు ఇప్పుడు ఎందుకు వెతకడం స్టార్ట్ చేశాయి." అని డౌట్ గా అడిగింది నీతూ.

"ఆ విషయం గురించి నాకు కూడా తెలియదు." అని చెప్పాడు జీతిన్

"యోధకి తన తండ్రి ఒక ఏజెంట్ అని దేశం కోసం చనిపోయాడని తెలుసా?" అని అడిగింది దీప్తి.

"ఆ విషయం కూడా నాకు తెలియదు మీరు కూడా యోధ దగ్గర ఏమీ మాట్లాడకండి." అని చెప్పాడు జీతిన్.

"సరే! మనం ఫస్ట్ యోధ తల్లిదండ్రులు ఉన్న ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము." అని చెప్పింది నీతూ.

"జీతిన్! మనం వెళ్లడానికి మంచి వెహికల్ అరేంజ్ చేయండి." అని చెప్పింది దీప్తి.

"సరే! ఆ విషయం నేను చూసుకుంటాను మీ దగ్గర ఉన్న రేడియేషన్ మిషన్స్ యోధ కి కనబడకుండా చూసుకోండి." అని చెప్పాడు జీతిన్.



" రుద్రం భజే! ఎపిసోడ్ 5 " రచనకు రేటింగ్ ఇవ్వండి తద
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: రుద్రం భజే! ( POWER OF YODHA ) - by SivaSai - 27-04-2026, 12:12 PM



Users browsing this thread: 1 Guest(s)