26-04-2026, 07:38 AM
Part - 77
విశిష్ట లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ కి గౌతమ్ ఆశ్చర్యపోతాడు. వెనక్కి అడుగు వేస్తూ నీ సంగతి తర్వాత చూస్తాను అని వెళ్ళిపోతాడు...
దేవ వైపు తిరిగి థాంక్యూ సార్...మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడాను అంటే అది మీ వల్లనే. మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే..
వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సూర్య ఒక్కసారే ఓ మై గాడ్ అని చేతితో మొఖాన్ని కప్పుకుంటాడు. శ్రీకర్ ఏమైందిరా అంటే..
అటు చూడు ఆ హిమ ఇటే వస్తుంది. ఇక్కడ నన్ను చూసింది అంటే ఇంకా అంతే సంగతులు. సరే నువ్వు ఎస్కేప్ అవ్వు.
విశి ని వైభవ్ డ్రాప్ చేస్తాడు. వైభవ్ కూడా తెలుసు కదరా... మీ అన్నదమ్ములు ఇద్దరు నీ అని.. వాడు మాస్క్ పెట్టుకుని తీసుకువెళ్తాడు.
హిమ చూపు ఎంతసేపు నీపైనే ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళ మీద ఉండదు కదా.. సరే అనే ఫోన్ వస్తున్నట్టుగా ఒక నిమిషం ఉండి..
విశి.. నాకు అర్జెంటు కాల్ వస్తుంది. నిన్ను వైభవ్ డ్రాప్ చేస్తాడు.. ప్రాబ్లం ఏమీ లేదు కదా.. అయ్యో సార్ మీరు వెళ్ళండి. ఓకే అని స్పీడ్ గా వెళ్ళిపోతాడు.
ఎంత తప్పించుకుని వెళదాము అనుకున్నా హిమ కళ్ళల్లో పడతాడు. సూర్యా.. సూర్య అని ఎగురుతుంది. వైభవ్ అడ్డుగా నిలబడి..
రా బాబీ.. ఇంకా వెళదాము నేను చాలా అలసిపోయాను అని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతాడు.
సూర్య ఇక తప్పక వెనక్కి తిరిగే హాయ్..నువ్వేంటి ఇక్కడ. అది నేను అడగాలి మీరేంటి... మీలాంటి వాళ్లు కూడా షాపింగ్ కి వస్తారా..
ఏం మేం బట్టలు వేసుకోమా ఏమిటి.. ఆ మాటకి హిమ మెలికలు తిరుగుతూ... నా ఉద్దేశం అది కాదు. మీకు సపరేటుగా డిజైనర్స్ ఉంటారు కదా.
ఎంతమంది ఉన్నా ఒక్కొక్కసారి వచ్చి షాపింగ్ చేయాలి అనిపిస్తుంది. నీలాంటి ఫిగర్ ఇలా బయట తిరిగితే చాలా ప్రాబ్లం కదా....
ఎంత మంది వెంట పడతారో.. డిజైనర్ ని ఇంటికి పిలిపించుకోవచ్చు కదా.. ఇలా తిరిగితే టాన్ అయ్యిపోవు..
హ.. మాటకి మురిసిపోతూ.. చెవి వెనక్కి హెయిర్ తోసుకుంటూ.. పిలిపించుకోవచ్చు కానీ నాకు కూడా ఇలా షాపింగ్ చేయడం అంటేనే ఇష్టం.
చూశారా మనిద్దరి అభిప్రాయాలు కూడా ఒకటే.. అవునవును ఇప్పుడే తెలుస్తుంది. అని ప్యాంటు పాకెట్లో రెండు చేతులు పెట్టుకుంటాడు.
షాపింగ్ చేద్దామా అని అడుగుతుంది. ఓ.హిమ సో సోరి ఇప్పుడే నా షాపింగ్ అవ్వడం... నా లగేజ్ వెళ్లిపోవడం జరిగింది.
ఇంతసేపు నేను బయట ఉన్న ప్రాబ్లం కదా.. నీ కన్నా ఎవరికి బాగా తెలుసు చెప్పు. నెక్స్ట్ టైం చేద్దాం. ఓకే.. యు క్యారీ ఆన్ అని హమ్మయ్య అనుకుని మెల్లిగా జారుకుంటూ ఉంటే..
సూర్య అని పిలుస్తుంది. అబ్బా.. ఈ జిడ్డు వదిలేటట్టు లేదు అనుకుని చెప్పు హిమా అని కష్టంగా నవ్వుతాడు. ఈ సండే మీరు ఫ్రీ గానే ఉంటారా..
వై... డాడీ మిమ్మల్ని స్పెషల్గా లంచ్ కి ఇన్వైట్ చేశారు. ఆ రోజు మీరు ఫ్రీగా ఉంటే లంచ్ కి పిలుద్దామని.. నా షెడ్యూల్ గురించి నీకు తెలుసు కదా..
నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు ఫుల్ షెడ్యూల్ లాక్ అయిపోయింది. ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ప్లాన్ చేద్దాం ఓకే.. సిక్స్ మంత్స్ తర్వాత అని ఆశ్చర్యంగా చూస్తోంది.
మరి.. నా వర్క్ ఎలా ఉంటుందో నీకు తెలియదా.. అసలు ఇప్పుడైనా నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి.. రిలాక్స్ అవుదామని ఒక మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను.
బట్ అస్తమానం అంటే బాగోదు కదా... సరేనా బాయ్.. టేక్ కేర్ అని వెళ్ళిపోతాడు.
వెళుతున్న సూర్యనే చూస్తూ ఇంత బిజీ పర్సన్ అంటే ఎంత రాయల్ లైఫ్. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి గాని..
ఆ గౌతమ్ గాడిని ఎందుకు అని మైమరపుగా చూస్తూ ఉంటుంది. గౌతమ్ లగేజ్ బ్యాగులతో అక్కడికి వచ్చి హిమ అని పిలుస్తాడు. ఏమిటి అని చిరాగ్గా అంటుంది.
లగేజ్ మొత్తం నాకు ఇచ్చేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు. షాపింగ్ వచ్చినప్పుడు నాతో ఉండాలని తెలియదా..
కమాన్ గౌతమ్.. నన్ను వదిలేసి ముందు వెళ్ళింది ఎవరు.. నువ్వు కాదా.. ఆ విశిష్ట కనిపించింది అని సొల్లు కార్చుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు నన్ను అంటున్నావా..
నేను వెళ్ళింది ఎందుకో నీకు తెలియదా...ఎలా వెళ్ళినా సరే వదిలేసి వెళ్ళింది నువ్వు. ఏదో తెలిసిన ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా తప్పేనా..
అయినా ఈ మధ్యన నీకు నామీద అనుమానాలు ఎక్కువ అయిపోయాయి. ఇంత అనుమానం మనిషతో కలిసి ట్రావెల్ చేయాలంటే నావల్ల కాదు.
ఇంటికి వెళ్ళగానే డాడీకి చెప్పేస్తాను. గౌతమ్ కి నాకు సెట్ అవ్వదు. బ్రేకప్.. మీ బిజినెస్ విషయాలు మాత్రం మీరిద్దరే హ్యాండిల్ చేసుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తాను.
తర్వాత మీరిద్దరూ పడండి అని రాని కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంది. అరె హిమా ఇప్పుడు నేను ఏమన్నానని అంతా బాధపడుతున్నావు అని చెయ్యి పట్టుకుంటాడు.
ప్లీజ్ గౌతమ్.. నా చెయ్యి వదులు. ఇలా రా.. వచ్చి కూర్చో.. ఐస్క్రీం తెస్తానుండు అని తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టి ఇది తిను.
చల్లబడతావు. నువ్వు ఈ మాల్ లో తప్పిపోతావేమో అని కంగారుగా అడిగాను కానీ నీ మీద అనుమానమా.. నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే..
అంతేనా .. నిజం. నన్ను నమ్ము. ఇంకా ఏమైనా షాపింగ్ ఉందా. లేదు గౌతమ్ ఇప్పటికే నువ్వు నాకోసం చాలా ఖర్చు పెట్టేశావు. ఇంటికి వెళదాము అని లెగుస్తుంది.
సరే అని బ్యాగ్స్ మోసుకుంటూ వస్తాడు. పిచ్చి గౌతమ్.. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నిన్ను వాడుకుంటానే ఉంటాను.
ఇలాంటివాడు నాకు సెక్యూరిటీగా వచ్చాడు అంటే నా లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో నాకే తెలుసు. తర్వాత ఆ సూర్యని తిప్పుకుంటాను.
బ్యాగ్స్ మోస్తూ.. మీ నాన్న నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు అని సైలెంట్ గా ఉంటున్నాను. నా చేత నువ్వు వాచ్మెన్ పని దగ్గర నుంచి సర్వెంట్ పనిదాకా అన్నీ చేయిపిస్తున్నావు.
ఒకసారి వి. జె. స్. కంపెనీతో నా ప్రాజెక్టు ఓకే అవ్వాలి అప్పుడు నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను. అది చూసి మీ నాన్న నా కాళ్లు పట్టుకుని బ్రతిమాలాలి.
ఏడవాలి. అప్పుడు.. నాకు చేస్తున్న అవమానాలకి రివేంజ్ తీర్చుకుంటాను.
కార్లో లగేజ్ సర్ది వెళదామా బేబీ అంటే.. హ బేబీ అని సూర్యనే ఊహించుకుంటూ ఉంటుంది.
సూర్య శ్రీకర్ కారులో కూర్చుని వాటర్ బాటిల్ తీసుకుని నెత్తిపై నుంచి పోసుకుంటాడు. సౌమ్య, శ్రీకర్ ఒకేసారి హే బావ అంటే..
అబ్బా.. అదేం జిడ్డు కేసు రా.. ఎంత వదిలించుకుందామంటే అంత పాకంలాగా పట్టుకుంటుంది.
మరి తమరి బ్రాండ్ ఏమిటి.. ఫ్యూచర్ జై సింహ కంపెనీస్ కి సీఈఓ. ద గ్రేట్ విక్రమ్ జై సింహ ముద్దుల గారాల కొడుకువి.
అది చాలదా.. నీ వెంటపడి సొల్లు కార్చడానికి.. నీ ప్లేసులో మన ఇంటి వాచ్మెన్ ఉన్నా సరే దానికి ఓకే. ఈ విషయం ముందే చెప్పుంటే వాచ్మెన్ పెట్టి హ్యాండిల్ చేసే వాడిని కదా..
వాచ్మెన్ యస్ బాస్ అనగలడు గాని..నీలాగా స్పాంటెన్స్ గా కౌంటర్లు వెయ్యలేడు కదా..
ఛ.. ఈరోజు మొత్తం అంతా నా క్యూటితోనే ఉండాలి అనుకున్నాను. ఈ ఇడియట్స్ ఇద్దరు మూడు స్పాయిల్ చేశారు.
నీ క్యూటి తో టైం స్పెండ్ చేయాలంటే అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోవాలమ్మా.. అప్పుడే కుదురుతుంది. ఇలా లోకల్లో ఉంటే ఎలా కుదురుతుంది.
అందుకే ప్లాన్ చేశాను. ఏమిటి.. కంపెనీతో క్యూటి టైప్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ ఫుల్లుగా రౌండ్స్ వేస్తాము.
హైదరాబాద్ టు వైజాగ్.. అబ్బో మా బావ రొమాంటిక్ ఫెలో అవుతున్నాడా.. నేను అవితే గాని నీ చెల్లి ఓపెన్ అవ్వదు.
సరే.. రెండు జంటలు బైక్స్ మీద వెళదామా.. వద్దు మీకు కావాలి అనుకుంటే ఊటీ వెళ్లండి..ఏంటి బావ అంత మాట అనేసావు అని షర్టు బటన్స్ పట్టుకుని లాగుతూ ఉంటే..
ఆ చేతి మీద ఒకటి కొట్టి.. మీరు ఆల్రెడీ ఓల్డ్ లవర్స్.. మేము ఫ్రెష్ లవర్స్. మీరు మాతో వస్తే ఎలా చెప్పు. మీరు ఏమో ఎక్స్పీరియన్స్ తో ఏదేదో చెబుతూ... చేస్తూ ఉంటారు.
మేము ఇప్పుడే కదా అడుగులు వేస్తున్నాము. కాబట్టి మీ దారి మీదే.. మా దారి మాదే. ఆ మాటకి సౌమ్య.. బావ అక్కడ అంత సీను లేదు. మాటలే..
అమ్మని ఎంత మాట అనేసావు. మొహమాట పడతావు.. బిగుసుకుపోతున్నావు అని చిన్నగా నేను హ్యాండిల్ చేస్తూ ఉంటే.. ఇంక లాభం లేదు..
ఈ శ్రీకర్ అంటే ఏంటో ఇంకా చూపించాల్సిందే.. ఒకప్పుడు పిల్లి లాగా ఉండేదానివి. ఇప్పుడు పులిలాగా మారిపోయావు.
ప్రతిదానికి కౌంటర్లు వేస్తున్నావు ఏమిటి సంగతి. అయ్యో శ్రీకర్ నువ్వు ఉండగా కూడా నేను పిల్లిలాగా ఉంటే నువ్వు ఫీల్ అవుతావు కదా.. అబ్బా సెంటిమెంట్తో కొట్టమంటే నీ తర్వాతనే..
వైభవ్ విశి ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సరే బాబీ ఇక నేను వెళతాను. హే వైభవ్ ఒక్క నిమిషం అని బైక్ పట్టుకుంటుంది.
చెప్పు బాబి నాతో చందు విషయం మాట్లాడావు కదా.. నీకేం అర్థం అయింది..
బైక్ మీద అలాగే కూర్చుని ఒక చేతిని మడిచి.. రెండో చేతితో బుగ్గ మీద టాప్ చేసుకుంటూ.. అర్థమైనట్టు ఉంటుంది అర్థం కానట్టు ఉంటుంది.
అది దెబ్బలాడితే బాగుంటుంది. మౌనంగా ఉంటే చిరాకు వస్తుంది. దీనినే ప్రేమ అంటారు. నిజమా బాబి నీకు ఎలా తెలిసింది. ఈ మధ్యనే ఏదో తెలుస్తూ ఉన్నాయిలే..
ఈ వదిన మరిదిల తెలివి ఎటు వెళుతుందో..
కథ కొనసాగుతుంది................

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)