26-04-2026, 07:34 AM
(This post was last modified: 26-04-2026, 07:35 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 76
గెలిస్తే గెలుస్తావు...లేకపోతే లేదు కానీ నీలో ఆడాలి గెలవాలి అనే ఒక స్పిరిట్ పెరుగుతుంది కదా అది ఇంపార్టెంట్ అనేవారు..ఇప్పుడు మీరు కూడా అలాగే చెబుతున్నారు..
నాన్న అంటే ఒక నమ్మకం ధైర్యం కదా.. నమ్మకం నాన్నతోనే వెళ్ళిపోయింది. ఇదిగో మళ్ళీ మీ రూపంలో తిరిగి వచ్చింది థాంక్యూ దేవా సార్.
సూర్య చిన్న చిరునవ్వుతో...
విశి … నమ్మకం ఎప్పుడూ మనుషుల్లో కాదు, మన లోపలే ఉండాలి.
ఎవరో మనకు నడవమన్నప్పుడు మనం నడుస్తాం..
కానీ ఒకరోజు మనమే మనల్ని నడిపించుకోవాలి.
మీ నాన్న ఇచ్చిన ధైర్యం ఇప్పుడు నీ గుండెలో ఉంది.
అది ఎప్పుడూ పోదు — కేవలం నిశ్శబ్దమై ఉంటుంది..
ఎవరో దాన్ని మళ్లీ గుర్తు చేస్తే… ఇలాగే మెల్లగా మేల్కొంటుంది.
మీ నాన్న జ్ఞాపకం ఉంచు...
గెలుపు అంటే ఫలితం కాదు, తిరిగి లేచే ధైర్యం.
ఆ ధైర్యం నీవు చూపుతున్నావు.
ఇప్పుడే నువ్వు గెలుస్తున్నావు అంతే..
నీలో ఉన్న ధైర్యాన్ని జస్ట్ నేను గుర్తు చేస్తున్నాను అంతే..
విశి అలాగే చూస్తూ ఉంటే...ఇలా రా అని అక్కడ ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు.
సూర్య మృదువుగా...
నమ్మకం... కొన్నిసార్లు మనిషిలో కాకుండా, మన గుండె ధ్వనిలో దాక్కుంటుంది.
అది మనం మర్చిపోయినా, మన కదలికల్లో ఉంటుంది...
మన చూపుల్లో, మన మాటల్లో... కొద్దిగా నాన్నలాగా.
మీ నాన్న వెళ్లిపోయినా,
ఆ ధైర్యం మాత్రం నీ లోపలే ఉంది..
నీ లోపల ఏదో భయం. నాన్న లేరు. నేను ఒంటరినైపోయాను అని ఏదేదో ఆలోచించి ఆ ధైర్యాన్ని నొక్కి పెట్టేశావు.
ఇప్పుడది మళ్లీ తలెత్తి చూస్తోంది.
గెలవడం కంటే, ఆ ధైర్యాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం.
అది నీలో ఉంది విశి..
అది చాలదు అనిపించవచ్చు...
కానీ ఆ ధైర్యాన్ని నిలబెట్టుకోవడమే.. నిజమైన గెలుపు.
సూర్య చూపు కాసేపు విశి మీదే ఉంటుంది. విశి ఆలోచన ఎలా ఉందో చూస్తూ క్యూటి ఓపెన్..
విశి మాత్రం మెల్లగా చూపు తిప్పి సూర్య ని చూస్తు ఉంటుంది..
ఆ చూపులో ఆశ్చర్యం లేదు.. ఒక నిశ్చింత ఉంది.
ఎంతకాలంగా ఎవరో ఇలా మనసుని తాకే మాటలు చెప్పలేదనిపిస్తుంది.
విశి హృదయం సూర్య ని చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. సూర్య... విశి ని డిస్టర్బ్ చేయకుండా చూస్తూ ఉంటాడు.
సార్ మాట్లాడినప్పుడు ఎందుకో మనసు నిశ్శబ్దమవుతుంది… సార్ మాటలు తప్ప ఇంక ఏమీ వినిపించవు.
నాన్నలాగే, మాటలకంటే ఎక్కువగా ఏదో భరోసా ఇస్తారు.
ఆ తలంపు రాగానే విశి మనసు తేలిక పడుతుంది చిన్న చిరునవ్వుతో సూర్య వైపు చూస్తూ ఉండిపోతుంది.
అది దేవా సార్ కి కాదు, తన మనసుకే...
అందులో కృతజ్ఞత, గౌరవం, కొద్దిగా తలమునకలైన భావన.
విశి చూపు దేవాపై నిలబడిపోతుంది.
అదే చూపులో ఒక మౌనమైన కృతజ్ఞత మెరిసిపోతుంది.
హలో విశిష్ట ఏం ఆలోచిస్తున్నావు అని చెయ్యి ఊపుతాడు. విశి తేరుకొని నథింగ్ సార్.. మీ మాటలు వింటుంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుంది.
నిరాశలో కూరుకుపోతున్న వాళ్లకి మీ మాటలు ఒక వెలుగు రేఖను చూపిస్తాయి. మరి ఎక్కువగా పొగిడేయకు. అసలే ఆకలేస్తుంది.
ఏమీ తినకుండానే వెళ్ళిపోతాను. ఆ మాటకి నవ్వుతూ ఈరోజు ట్రీట్ నాదే.. తప్పకుండా మేడం..
రండి అని అక్కడే ఉన్నా రెస్టారెంట్ కి వెళ్లి చెప్పండి సార్.. ఏం ఆర్డర్ ఇవ్వను. నీవు ఏది ఇచ్చిన నాకు ఒకే.. నో సార్.. ఈరోజు ట్రీట్ నాది. సో మీరు ఆర్డర్ ఇవ్వాలి.
సరే అనే ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, గోంగూర చికెన్ ఆర్డర్ ఇస్తాడు.
సార్ ఈ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అవునా మన టేస్ట్ లు కూడా ఒకటే అన్నమాట..
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు. పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించి చూస్తే అక్కడ శ్రీకర్, సౌమ్య వైభవ్ ఉంటారు.
మీరు వచ్చి ఎంతసేపు అయింది అని సూర్య అడిగితే.. అదే ఇద్దరు టేస్ట్ లు ఒకటే అని మాటల్లో మునిగిపోయారు కదా.. అప్పుడే వచ్చాము.
మరి పిలవచ్చు కదా.. ఏమో లవ్ బర్డ్స్ కి డిస్టబ్ అవుతుందేమో అని శ్రీకర్ అంటూ ఉంటే.. సూర్య కాలు తొక్కుతాడు.
విశి చూసి ఏమన్నారు సార్.. అదే మా లవ్ బర్డ్స్ కి డిస్టర్బ్ అవుతుంది అని చెబుతున్నాను అంతే కదా సౌమ్య.. అంతే...
వైభవ్ మాత్రం డల్ గా కూర్చుంటాడు. ఏమైంది వైభవ్ అంత డల్ గా ఉన్నావు అని విశి అడిగితే... పో బాబి నేను నీతో మాట్లాడను.
ఇప్పుడు నేనేం చేశాను అని నామీద అలిగావు. మీరిద్దరూ లంచ్ కి వచ్చినప్పుడు నన్ను కూడా పిలవాలి కదా... ఏదో మీరు తిన్నాక మిగిలిన ఒక గుప్పెడు మెతుకులు పెడితే నాకు సరిపోతుంది కదా..
అయ్యో వైభవ్ ఎంత మాట అన్నావు.. ఈ లంచ్ ప్రోగ్రాం అనుకోకుండా జరిగినది. ఆక్చువల్గా నేను డ్రెస్సెస్ తీసుకోవడానికి అని సార్ హెల్ప్ అడిగాను.
అన్నయ్య నీకు డ్రెస్సెస్ కొనే వరకు వచ్చాడా.. లేదు లేదు హెల్ప్ అడిగా. నేనే మనీ పే చేయాలి. కాని ఏం జరిగిందో తెలుసా..
వెంటనే విశి ఇంటికి వెళ్ళాలేమో.. ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా..
పరవాలేదులే అన్నయ్య.. బాబీని చెప్పనివ్వి. ఏదో మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెబుతున్నట్టుంది. అవును సార్.
ఇది చెబితే సౌమ్యకి కూడా యూస్ అవుతుంది కదా..
అవునా నాకు కూడా యూస్ అయ్యే విషయమా.. అయితే చెప్పు వింటాను. సౌమ్య... మావయ్య ఫోన్ చేస్తున్నట్టున్నారు.
ఆల్రెడీ చెప్పాను బావ. శ్రీకర్ వచ్చి తీసుకు వెళ్ళడం నాన్నకి తెలుసు. నువ్వు చెప్పు..
వావ్ సూపర్ అని చెప్పట్లు కొడుతూ ఒక వాయిస్ వినపడుతుంది. అంతే అప్పుడు దాకా నవ్వుతూ మాట్లాడిన విశి సైలెంట్ అయిపోయి అటు చూస్తోంది.
దగ్గరగా వచ్చి ఏంటి విశి.. రూపాయి... రూపాయి లెక్క వేసుకుని చూసుకునే నువ్వు.. నా దగ్గర 10 లక్షలు అప్పనంగా కొట్టేసి ఎంజాయ్ చేస్తున్నావా అని గౌతమ్ వెటకారంగా మాట్లాడుతాడు.
ఆ మాటకి సూర్యకి చాలా కోపం వస్తుంది. కానీ విశి చెప్పే సమాధానమే ఇంపార్టెంట్ అని చూస్తూ ఉంటాడు.
విశి కోపంగా నీ దగ్గర నేనేమీ కొట్టెయ్యలేదు. అది బిజినెస్ డీల్. బిజినెస్ డీల్ ప్రకారమే నువ్వు నాకు ఇచ్చావు. అంతేగాని ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు కదా...
అయినా మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు... ఎనీమీస్ కాదు.. అలాంటప్పుడు నువ్వు నా పర్సనల్ స్పేస్ లోకి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదేమో..
పరవాలేదు విశిష్ట. మాటలు బాగా నేర్చావు. ఈ మాటలు అంతా నీ పక్కన ఉన్న ఈ దేవాని చూసే కదా ఎగురుతున్నావు.
లేదు నాలో ఉన్న ధైర్యం చూసి ఎగురుతున్నాను.
నాలో ఉన్న ధైర్యం నాకే చెందింది.
ఎవరూ నేర్పాల్సిన అవసరం నాకు లేదు.
ఎందుకంటే... నువ్వు దానిని నాలో చంపాలని ప్రయత్నించావు.
కానీ నేను దాన్ని నిలబెట్టుకున్నాను.
గౌతమ్ స్మిర్క్ చేస్తూ....
వావ్… పెద్ద మాటలు చెబుతున్నావు.
విశిష్ట చిన్న స్టెప్ ముందుకి వేస్తూ..
మాటలు కాదు గౌతమ్… సత్యం.
నువ్వు నా మీద చూపిన దొంగ ప్రేమ, అవమానం, నమ్మకానికి చేసిన ద్రోహం..
అవి నాకు పాఠం నేర్పాయి.
ఇప్పుడు ఎవరి ఎదుట నిలబడాలో, ఎవరి కోసం మౌనంగా ఉండాలో నాకు స్పష్టంగా తెలుసు.
సూర్య సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు.. కానీ ఆ చూపులో గర్వం ఉంటుంది.
మనసులోనే.. ఇదే విశిష్ట... నేను కోరుకుంది. నీలో ధైర్యం తెగింపు మొదలవ్వాలి.
అది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే అడుగుపడాలి..
విశిష్ట అంత ధైర్యంగా నలుగురిలో సమాధానాలు చెబుతూ ఉంటే గౌతమ్ తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా ఆ ధైర్యాన్ని బలహీన పరచాలి అనుకుంటూ..
గౌతమ్ స్మైల్‌తో... కళ్ళలో కటువుతనంతో..
ఏం విశిష్ట… ఈ ధైర్యం అంతా ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చింది?
పాత రోజుల్లో అయితే నీ శబ్దం కూడా వినిపించేది కాదు.
ఇప్పుడు ఒక్కో మాట కత్తిలా విసుర్తున్నావు.
విశిష్ట సైలెంట్‌గా ఒక నిమిషం చూస్తూ..
ఈ ధైర్యం ఎప్పుడూ నాలోనే ఉంది. అప్పుడు మాట్లాడలేకపోయాను
ఎందుకంటే అప్పుడు నువ్వు నన్ను ఎమోషనల్ గా వీక్ చేసావు.
ఇప్పుడు నేను నా ధైర్యం మీద నిలబడ్డాను.
నా శబ్దం కూడా వినపడలేదు అంటున్నావు కదా అది భయం కాదు గౌతమ్… నిన్ను నమ్మిన పాపమే నన్ను మౌనం చేసింది.
గౌతమ్ దగ్గరకి వస్తూ, వాయిస్ పెంచుతూ..
ఓహ్… ఇప్పుడు నేనో విలన్ అయిపోయానా ?
నీ దగ్గర ఉన్న వాళ్లందరూ హీరోలే కదా...
ముఖ్యంగా ఈ దేవా...
ఎంత దగ్గరయ్యాడు చెప్పు విశిష్ట… నీ డెసిషన్స్ కూడా ఇప్పుడు అతడే తీసుకుంటాడా?
సూర్య కోపంతో ముందుకు రావాలనుకుంటాడు, కానీ ఆగిపోతాడు. విశిష్ట వైపు చూస్తూ... ఉంటాడు. గౌతమ్ మాట్లాడే మాటలకి మిగిలిన వాళ్ళకి కూడా చిరాకు వస్తూ ఉంటుంది.
వైభవ్ అయితే లేచి కొట్టాలి అన్నంత కోపం వస్తూ ఉన్న సూర్య చూపులకి ఆగిపోతాడు.
విశిష్ట గట్టిగా... కంట్రోల్‌తో..
మాటల్లో తక్కువగా దూషణ, ఎక్కువగా గౌరవం ఉండాలి గౌతమ్.
ఎందుకంటే నీ గతం ఇప్పటికీ నన్ను అవమానించడానికి కాదు..
నువ్వు ఒకప్పుడు సాయం చేశావు అని గుర్తు చేయడానికి ఉంది.
గౌతమ్ నవ్వి..
సాయం? నేను చేసానా నీకు సాయం?
విశిష్ట కళ్ళలో తడి తళుకుతో, కానీ గట్టిగా...
అవును. చేసావు.
కానీ ఆ సాయం పక్కనే నీ స్వార్థం కూడా పెరిగింది.
అదే నిన్ను చిన్నవాడిని చేసింది…
అదే నన్ను పెద్దగా మార్చింది.
గౌతమ్ మాట దొరకక, కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఏంటి గౌతమ్ మాట్లాడలేకపోతున్నావా. నా వర్క్ ని అన్యాయంగా తీసుకుని ఏదో దానం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చావు. కానీ ఆ రోజుల్లో నాకు ఆ డబ్బులే అవసరం అయ్యి గొప్ప సాయంగానే భావించాను
విశిష్ట ప్రశాంతంగా
ఇంకోసారి నా వ్యక్తిగత స్పేస్ లోకి వస్తే..
అది పాత విశిష్ట కాదు అని నీకే తెలుస్తుంది.
గౌతమ్ వెనక్కి అడుగు వేస్తాడు. సూర్య చిన్న స్మైల్‌తో చూస్తాడు.
గౌతమ్ పరిస్థితి...
విశిష్టాలోఆత్మవిశ్వాసం.............

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)