26-04-2026, 07:31 AM
Part - 74
వైభవ్ ని చూసి ఏంటి సుపుత్ర ఇలా వచ్చావు..మీతో మాట్లాడాలి నాన్న.. సీరియసా.. చాలా... సరే రా.. వెళ్లి పక్కన కూర్చొని వోళ్ళో పడుకుంటాడు.
పూజిత ఆశ్చర్యంగా చూస్తుంది. కొడుకు తల మీద చెయ్యి వేసి ఏంట్రా అని అడుగుతాడు..నాన్న అని ఆ చేయ్యి పట్టుకుని ముందుకు తీసుకుంటాడు. చెప్పరా కన్నా..
నేను అడిగే దానికి మీరు సిన్సియర్ గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు నాతో ఏమైనా ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయిపిస్తున్నావా ఏమిటి... ప్లీజ్ నాన్న. సరే అడగరా..
మీరు, అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆ పీడకల గురించి ఎందుకురా.. పూజిత పక్కనుండి గిల్లుతుంది. అబ్బా ఉండవే..
ప్లీజ్ నాన్న... సరే అడుగు . నీకు ప్రేమ అని ఎలా తెలిసింది.
ఎలా తెలిసింది అంటే.. వయసు ప్రభావం.. ఒళ్లో నుంచి లేచి సీరియస్గా చూస్తే..
సరే సరే చెబుతాను. మీ అమ్మని చూడగానే ఏమిటో అలా గంటలు మోగేసాయి. రౌడీ బేబీ లాగా రోడ్డు మీద నిలబడి కోడుతుంది.
నివి, వదిన చాలా సాఫ్ట్ గా ఉండడం చూసి మీ అమ్మ అడ్వెంచర్స్ భలే థ్రిల్ అనిపించాయి. మళ్లీ కలిస్తే చూద్దాంలే అనుకున్నాను.
నివి ఎంగేజ్మెంట్ టైం లో మళ్ళీ కనిపించింది అంతే.. బ్రహ్మ వేసిన ముడి అని ఫిక్స్ అయిపోయాను. ఇలా మీ అమ్మకి దొరికిపోయాను..
అందరికీ అలాగే గంటలు మోగుతాయా.. అది ఎవరి ఫీలింగ్ వాళ్ళది. ఇంతకీ నీకు ఎవరిని చూస్తే మోగాయి. ఏమీ అర్థం కావడం లేదు.
చాలా కన్ఫ్యూషన్ గా గందరగోళంగా ఉంది. మీరైతే క్లారిటీ ఇస్తారు అని వచ్చాను. ఎవరి విషయంలో..
మౌనంగా కూర్చుంటాడు. చందు విషయంలోన.. మీకెలా తెలిసింది. అది నీకు తప్ప అందరికీ తెలుసు. కానీ నీ ప్రేమని నువ్వే గుర్తించు. అదే ఎలా.. మీ అమ్మ కన్నా ఇంకా కన్ఫ్యూషన్ బోయ్ వి..
ఇప్పటికీ లైట్ గా క్లారిటీ వస్తుంది కదా.. మెల్లిగా అదే పెరుగుతుంది. ఎక్కువ ఆలోచించకుండా వెళ్లి పడుకో..
వైభవ్ గదిలోకి వెళ్లి పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు..
అసలు ప్రేమంటే ఏమిటి...
కోపమా.. స్నేహమా లేక ఇంకా ఏదైననా..
చందు గురించి ఆలోచిస్తూనే నిద్రపోతాడు..
విశి వర్క్ చేసి వైభవ్ కి పంపించి దేవా ఊహల్లో తేలుతూ మంచం పైన వాలుతుంది..
సూర్య కాలేజీలో విశి చెప్పిన సమాధానానికి మురిసిపోతూ ఉంటాడు..
ఇక శ్రీకర్, సౌమ్య ప్రేమ కబుర్లు చెప్పుకుని ఎప్పటికో నిద్ర దేవికి స్వాగతం పలుకుతారు..
ఉదయం అందరూ బద్దకంగా నిద్ర లెగుస్తారు.. వీకెండ్ అవ్వడం వలన రిలాక్స్డ్ గా కూర్చుంటారు. వైభవ్ మాత్రం అందరిలో ఉంటాడు కానీ కళ్ళు మాత్రం గుమ్మం వైపే ఉంటాయి.
అది అబ్జర్వ్ చేసిన సూర్య.. మన సింహద్వారం ఏమైనా మార్చాలా నాన్నమ్మ.. ఎందుకురా.. ఏమో వైభవ్ గాడు పొద్దున్నుంచి గుమ్మం వైపు సీరియస్గా చూస్తున్నాడు.
చేర్పులు మార్పులు కావాలేమో అని అడుగుతున్నాను. ఏరా అంటే... అలా ఏమీ లేదు క్యాజువల్ గా చూస్తున్నాను అంతే..
ఏమో నాకైతే అలా అనిపించడం లేదు. ఏదైనా మార్పులు కావాలంటే చెప్పు. చిటికలో చేయించేద్దాము. అంతేనా తాతయ్య.. మీ జనరేషన్ కి ఎలా కావాలంటే అలా చేయించుకోండి రా..
నామీద కౌంటర్ వేస్తున్నావు కానీ.. ఏమిటి ఈ రోజు బాబి దగ్గరికి వెళ్లడం లేదా.. నాకు అదే పనా మీ బాబీ చుట్టూ తిరగడం తప్ప ఇంకొక పని లేదా..
అవునా అనేటప్పటికి హాయ్ అన్న వాయిస్ వినపడుతుంది. ఈ కొత్త గొంతు ఎవరిది రా అని చూసి సూర్యా నోరు వదిలేస్తాడు.
లేడీస్ అందరూ ఎవరు అన్నట్టుగా చూస్తే.. వైభవ్ నవ్వాపుకుంటూ పక్కకెళ్ళి పెద్దమ్మ బాబీకి కాంపిటేషన్. అవునా.. అన్నయ్యని తెగ గోకేస్తుంది.
ఫోన్ నెంబర్ తీసుకోవడానికి ట్రై చేసింది గాని ఎస్కేప్ అయ్యాడు అని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసింది.. విశి ప్లేస్ లోకి ఇంకొకళ్ళు రావడమా.. రానిస్తానా.. కాసేపు నువ్వు సైలెంట్ గా ఉండు పెద్దమ్మ. జరిగే ఫన్ చూద్దాము..
హాయ్ సూర్య అని మెలికలు తిరుగుతుంది..హాయ్ నీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది.. స్టేట్ క్యాపిటల్ కి వెళ్లి సీఎం ఇల్లు అడగాలా ఏమిటి..
జై సింహ మాన్షన్ అని గూగుల్ మాత ని అడిగితే.. ఇదిగో ఇలా దారి చూపించింది వచ్చేసాను. మంచి పని చేశావు.
వచ్చిన గెస్ట్ ని ఇలాగే నుంచో పెట్టి మాట్లాడతావా.. అత్తయ్య అనుకుంటా కదా అని అవని కాళ్ళకి నమస్కారం చేస్తుంది.
వైభవ్.. సౌమ్య తో.. దీని వేషాలు మరీ ఎక్కువగా ఉన్నాయే బాబు. చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యి నేనేం చేస్తాను రా..
అక్కడ సూర్యనే నోరు వదిలేసాడు. ఇక మనమెంతా.. అలా అంటే ఎలాగా.. ఒక పని చెయ్ విశి కి కాల్ చేసి రమ్మను.
అప్పుడు గాని అన్నయ్య నన్ను ఊరు మొత్తం తిప్పించి కొట్టడు.. ఎందుకు... బాబి దృష్టిలో అన్నయ్య ఒక లెక్చరర్. ఇప్పుడు ఇదంతా చూస్తే చీట్ చేసాడు అనుకోదా..
మరి ఇప్పుడు ఏం చేయాలి రా.. జరిగా ఘోరాలని చూడడం తప్ప ప్రస్తుతం మన మాట్లాడలేము. అవని కంగారుగా లేగుమ్మ అని లేపుతుంది.
అయ్యో అత్తయ్య నన్ను బ్లెస్స్ చేయండి. ఏమని అని క్యూస్షన్ మార్క్ ఫేస్ తో కొడుకు వైపు చూస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలి అని బ్లెస్స్ చేయండి.
మీరు బ్లెస్స్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది... అంతేనా సూర్య. వామ్మో దీని వేషాలో అని సూర్య అనుకుంటూ.. ఎలా దీన్ని బయటికి గెంటాలి.
అలాగే.. అలాగే నమ్మ.. నువ్వు ఎలా కోరుకుంటే అలాగా అని లేపి కూర్చో ...థాంక్యూ అత్తయ్య అని కూర్చుంటుంది. పూజిత వచ్చి ఈ కాలంలో కూడా చీర కట్టుకునే వాళ్ళు ఉన్నారా..
నువ్వు చాలా పద్ధతిగా కట్టుకున్నావు. నాకు చీరలే అలవాటు చిన్నత్త.. చిన్నత్త అని ఒక్కసారి అందరి కళ్ళు బయటికి వచ్చి మళ్ళీ లోపలికి సర్దుకుంటాయి.
జీన్స్ అన్న.. మోడరన్ డ్రెస్సులు అన్న నాకు అస్సలు నచ్చదు. అవునవునమ్మ నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. చీర బానే కట్టుకున్నావు కానీ కాస్త నడవడం కూడా ప్రాక్టీస్ చేసుంటే బాగుండేది.
ఇంకా బాగా సెట్ అయ్యేది కదా విద్యా.. విద్య చిన్నగా నవ్వుతుంది.. ఆ మాటకి హిమ ముఖం మాడిపోతుంది. వెంటనే సర్దుకుని మిమ్మల్ని అందరిని చూసినా కంగారులో ఏదో అలా.. అలా అంటే..
అదేనమ్మ ఆ కంగారులో అలా అలా నడిచేసావు. ఇంతకీ ఇంత పొద్దుటే మా గృహాన్ని పావనం చెయ్యాలనుకున్న నీ ఉద్దేశ్యం ఏమిటో..
ఏమి చెప్పాలో తెలియక ఆలోచిస్తూ...హ.. చాలా రోజుల తర్వాత... ఈరోజు టైం దొరికింది అని పొద్దుటే గుడికి వెళ్లి అభిషేకం చేయించి రిటర్న్ వస్తూ మీ దగ్గరికి వచ్చాను.
ఇంత పొద్దుటే గుడికి.. ఏం గుడికి వెళ్ళావు అమ్మ అని లలిత అడుగుతుంది. ఏం గుడికి అంటే.. శివాలయానికి వెళ్లాను మామ్మగారు..
మా ఇంటి దగ్గరలో శివాలయాలు లేవే.. మీకు దగ్గరలో లేవు కొంచెం దూరంలో ఉంటే అక్కడ నుంచి ఇటు వచ్చానన్నమాట.
పూజ అయిన తర్వాత సూర్య తెగ గుర్తుకువచ్చాడు. కలిసి అప్పుడే రెండు రోజులు అయిపోతుంది. ఎలా ఉన్నాడా ఏమిటా అని బెంగగా అనిపించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చాను.
నేను ఇలా రావడం మీ అందరికీ ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది. క్షమించండి ఇంక నేను వెళతాను.. కుర్చీ లో నుంచి లేచినా హిమ ని ఎవరు ఆపరు.
అదేమిటి వెళతాను అన్నా ఎవరు ఆపడం లేదు. నా యాక్టింగ్ ఏమైనా తెలిసిపోయిందా ఏమిటి అని ఆలోచిస్తూ మెల్లిగా అడుగులు వేస్తూ ఉంటుంది.
ఒక్క నిమిషం ఆగమ్మా అని లలిత అంటే.. హమ్మయ్య ఈ పెద్దావిడ ఆగమన్నది అనుకుని చెప్పండి మామ్మగారు అంటుంది.
అవని అని పిలిస్తే.. వస్తున్నాను అత్తయ్య గారు అని చీర పసుపు కుంకుమ తీసుకొచ్చి పెట్టి బొట్టు పెడతారు. ఇప్పుడు ఎందుకు అత్తయ్య ఇవన్నీ..
మొదటిసారి మా ఇంటికి వచ్చావు. ఇంటి ఆడపడుచు తో సమానం. ఉత్తి చేతులతో ఎలా పంపిస్తాము. చల్లగా ఉండు అని బ్లెస్స్ చేస్తారు.
హమ్మయ్య ఒక పని అయిపోయింది అని మెల్లిగా బయట పడుతుంది. హిమా వెళ్లిపోయిన తర్వాత ఏంటమ్మా నువ్వు చేసిందని సూర్య కోపంగా అడుగుతాడు.
నేనేమి చేశాను రా.. అది అత్తయ్య అత్తయ్య అని మెలికలు తిరుగుతూ ఉంటే చీర పెట్టి మరీ చల్లగా ఉండు.. నువ్వు కావాల్సింది తీరుతుంది అని ఏదో బ్లెస్స్ చేస్తున్నావు.
ఒరేయ్ మీ అమ్మ చాలా తెలివిగా బ్లెస్ చేసింది.ఈ కాలం పిల్లలకి మాటలకి అర్థం తెలియక ఏదేదో అనుకుంటున్నారు.
ఏమంటున్నావు నానమ్మ... మీ అమ్మ ఏమని బ్లెస్స్ చేసింది. ఇంటి ఆడపడుచు తో సమానం అని చెప్పి బ్లెస్ చేసింది అంటే దాని అర్థం ఏమిటి..
ఇంటి ఆడపడుచు ఎవరు.. అత్తయ్య. అత్తయ్య, నాన్నకి చెల్లి అంటే ఆ తింగరిదాన్ని నాకు చెల్లిని చేశారా.. అంతే కదా..
అమ్మ నువ్వు కనపడవు కానీ పెద్ద కిలాడివి..ఇప్పటికి అర్థమైందా అని విక్రమ్ వస్తాడు.. మీరు ఎప్పుడు వచ్చారు..
ఇక్కడ జరుగుతున్న డ్రామా చూడలేక స్టడీ రూమ్ లో ఉండిపోయాను. ఇదంతా మీరు వెనక ఉండి నడిపించినది కాదా ఏమిటి... అంత నా అకౌంట్లో వేసేస్తున్నారు..
పెదనాన్న గైడెన్సా... మరి మనకు అంత బుర్ర ఎక్కడుంది. ఏదో మీ పెద్దనాన్న డైరెక్షన్లో అలా అలా గెంటుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేకపోతే ఈ ముదుర్లుని నేను ఎక్కడ మేనేజ్ చేయగలను.
హిమ ఆనందంగా ఇంటికి వెళ్లి డాడీ అని అరుస్తుంది. రమేష్ వచ్చి ఏమైందిరా అంత హుషారుగా ఉన్నావు. మన ప్లాన్స్ సక్సెస్.
ఫ్యామిలీ మొత్తం నీ బుట్టలో పడ్డారా.. ఇదిగో చీర కూడా పెట్టారు. పెట్టి ఏమని బ్లెస్స్ చేసారో తెలుసా... నువ్వు మా ఇంటి ఆడపడుచు తో సమానం. చల్లగా ఉండు అన్నారు.
అంతే ఆ మాటకి రమేష్ పాలిపోయిన మొఖంతో కూతురు వైపు చూస్తాడు.
హిమ పరిస్థితి ఏమిటి....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)