25-04-2026, 10:09 AM
Part - 71
నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు తెలుసుకోవాలి అని.. కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుని వదిలి.. చందమామ ప్లీజ్ చూపించు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది.
చందమామలో కనిపిస్తున్న రూపం చూసి నోరు వదిలేస్తుంది. బాబోయ్ ఇలా జరుగుతుంది ఏమిటి.. ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తూ వెంటనే భవ్య కి కాల్ చేస్తుంది.
ఫోన్ లిఫ్ట్ చేసి ఏమిటే ఈ టైంలో ఫోన్ చేసావు. అంతా ఓకే నా.. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ విషయమా.. ఆంటీ బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగితే..
అమ్మ బాగానే ఉంది. నేను చెప్పేది వేరే విషయం. సరే చెప్పు అని కూల్ గా అడుగుతుంది. నీకు లాస్ట్ టైం చెప్పాను గుర్తు ఉందా..
ఏ విషయం గురించి అని నీరసంగా అడుగుతుంది.. అదే.. దేవాసార్ నా రూమ్ కి వచ్చారు అని చెప్పాను.. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు.
ఇప్పుడు ఏకంగా చందమామలో కనిపిస్తున్నారు అని ఒక సీక్రెట్ చెప్పినట్టుగా చెబుతుంది..అవునా మరి కనిపించినప్పుడు హాయ్ చెప్పకపోయావా..
చెబితే రెస్పాండ్ అవుతారంటావా... చెప్పి చూడు తెలుస్తుంది కదా.. నేను చెప్పాక సార్ చెప్పకపోతే.. ఒసేయ్ మొద్దు చందమామలో కనిపిస్తున్నారు అంటే.. అది నీ డ్రీమ్.
నీ ఊహలోకంలో ఉన్న మనిషి నువ్వు ఎలా అంటే అలా మాట్లాడుతారు కదా.. ఏమిటి ఇదంతా నా ఊహనా కాక చందమామలో ఎలా కనిపిస్తారే..
మనం బాగా ఇష్టపడిన వాళ్లు... మన ఊహల్లో.. మన ఆలోచనల్లో ముందు ఉంటారు..
ఫోన్ పెట్టేయ్.. నువ్వు డ్రీమ్స్ లో ఉండి పడుకోవడం లేదు. కానీ నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్.
దేవా సార్ ఇదంతా నా డ్రీమా. నిజం కాదా.. భవ్య చెప్పినట్టు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు అలాగే కనిపిస్తారా.. అంటే నా మనసులో ఉన్నది మీరేనా..
ఎప్పుడు మనిద్దరం అలా మాట్లాడుకోలేదు. మన చూపులు అలా లేవు కదా అని నోట్లో చూపుడు వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది.
ఫోన్ పెట్టి, విశి కాసేపు నిశ్శబ్దంగా మొబైల్ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటుంది. చెవుల్లో ఇంకా భవ్య వాయిస్ మోగుతూనే ఉంటుంది –
మనకి బాగా ఇష్టమైన వాళ్లు మన ఊహల్లో, మన కలల్లోనే ముందుగా కనిపిస్తారు విశీ…
ఆ మాటలు ఆమె మనసులో గాలి తాకినట్టుగా మెల్లగా తేలుతాయి.
కిటికీ దగ్గరకి వెళ్లి బయట చందమామ వైపు చూస్తుంది. ఆ వెన్నెల ఆమె ముఖంపై తాకుతుంది.. కళ్ళల్లో చిన్న తడిమిన వెలుగు.
దేవా సార్... నిజంగా మీరు నా కలల్లోకే వచ్చారా? నేను మీ ఊహా లోకంలోనే ఉంటున్నానా..
విశి ఆ చందమామనే చూస్తూ.. మెల్లగా కుర్చీలో కూర్చుని చేతిలో పెన్ తిప్పుకుంటుంది. పక్కన ఉన్న డైరీని తీసుకుని ఆలోచిస్తూ పేజీ మీద గీతలు గీస్తుంది.
ఆమె మనసు మరో లోకంలో..
దేవా సార్ చిరునవ్వు, ఆయన చూపులో ఉన్న సౌమ్యం, మాట్లాడినప్పుడు వచ్చే నెమ్మది.. నాకు గైడ్ చేసేటప్పుడు కమాండింగ్.. ఒక్కో స్మృతి ఒకొక మృదువైన సంగీతంలా నడుస్తూ ఉంటుంది.
దేవా సార్ వాయిస్‌లో ఉన్న ఆ శాంతి…
ఆ చూపులో ఉన్న ఆ మాయ…
తనకు అర్థం కాకపోయినా, ఆలోచనల్లో ఎప్పటికప్పుడు ఆయనే.
మన చూపులు అలా లేవు కదా… అని మళ్లీ మళ్లీ అనుకుంటూనే.... చూపుడు వేలు పెదవుల దగ్గర పెట్టుకుంటుంది.
మంచు కాంతిలో ఆమె కళ్ళు మెరిసిపోతాయి.
ఆలోచిస్తున్న కొలది విశి మనసు తేలిపోతుంది..
దేవా సార్ నవ్వుతూ చెప్పిన వాక్యాలు, కాఫీ కప్పులో మసకగా కరిగే స్మైల్, ఆయన వాయిస్ లొని లోతు అన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి.
చందమామలో ఆయన ముఖం మసకగా కనిపిస్తుంది.
విశి చిన్నగా నవ్వుకుంటూ..
అవును… ఇదే నా మనసు లోకం…
మీరు కనిపించేది కేవలం వెన్నెలలో కాదు… నా ఊహల్లో కూడా.
ఆ వెన్నెలలో ఆమె కళ్ళు తేలిపోతూ, నెమ్మదిగా మంచం మీద పడుకుంటుంది.
మెల్లగా కన్నులు మూసి దేవా సార్ ముఖం మరోసారి మెరుస్తుంది..
అది కలనా… నిజమా… విశి కి అర్థం కాదు.
చందమామ కాంతి అలా ముఖంపై తాకుతుంటే…
మనసు ఎందుకో చల్లగా, మృదువుగా మారిపోతోంది.
దేవా సార్ పేరు వినగానే కదిలే ఈ స్పర్శ ఏమిటి?
ఫోన్‌లో భవ్య నవ్వుతూ చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో
మనకి ఇష్టమైన వాళ్లు మన ఊహల్లో ముందుగా కనిపిస్తారు విశీ...
అదేనా ఇది?
నాకు నిజంగా ఇష్టమా దేవా సార్ అంటే?
లేదా… మనసు అలా ఒక మాయ చేసిందా?
మాట్లాడినప్పుడు ఆయన చూపులు ఎంత శాంతిగా ఉంటాయో… నా చూపులు నన్ను సూటిగా తాగుతున్నట్టుగా ఉంటాయి.
అవి మాటలకంటే ఎక్కువ చెప్పేవి.
సార్ నాతో మాట్లాడుతూ ఉంటే..
నేను వినేది ఆయన మాటలకన్నా ఆయన స్వరం.
ఆ తేలికపాటి మృదుత్వం…
మనసును ఏదో తెలియని లోకానికి తీసుకెళ్తుంది.
దేవా సార్ నా రూమ్‌కి వచ్చారు" — అప్పుడు భవ్యకి చెప్పాను.
ఇప్పుడు “చందమామలో కనిపించారు” అంటున్నా…
అది జోక్ కాదు, నిజంగానే కనిపించారు.
ఆ వెలుతురులో ఆయన ముఖం… స్పష్టంగా కనిపించింది.
కలలా అనిపించింది కానీ…
హృదయం మాత్రం చెప్పింది – “ఇదే నిజం.”
ఎప్పుడూ ఆయనతో అలా మాట్లాడలేదు,
కానీ మాటలకంటే ఎక్కువ జరిగినట్టుంది.
ఆ చూపుల్లో ఏమో ఒక సైలెంట్ ప్రామిస్.
నిన్ను తెలుసుకుంటున్నాను విశి అని చెప్పినట్టుగా.
ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు…
ఒక చిరునవ్వు కూడా ఆలోచనల్ని గజిబిజి చేస్తోంది.
ఇది ప్రేమనా? లేక కృతజ్ఞతా?
లేక కేవలం ఆయన సాన్నిధ్యం వదలని మంత్రం?
చందమామ వైపు చూస్తూ మెల్లగా నవ్వుకుంటుంది.
దేవా సార్… మీరు నా ఊహలోనా లేక నా లోకంలోనా?”
చెవుల్లో ఇంకా ఆయన స్వరం,
కళ్ళలో ఆయన ప్రతిబింబం,
హృదయంలో మాత్రం — నిశ్శబ్దంగా మొలకెత్తిన ప్రేమ.
విశి మెల్లగా...
దేవా సార్... నిజంగానే మీరు నా కలల్లోకే వస్తారా?
ఆలోచనల మధ్య కమ్ముకున్న నిశ్శబ్దం వెన్నెలతో కలిసి కలగా మారుతుంది.
కదులుతున్న వెన్నెలలో ఒక మసక కాంతి,
దానిలో ఆయన అడుగుల శబ్దం…
తెల్లటి మసక ప్రదేశం, గాలిలో తేలే చందమామ కాంతి...
దేవా సార్ అక్కడ నిలబడి ఉన్నారు.. చిరునవ్వుతో, సైలెంట్‌గా.
విశి ఆశ్చర్యంగా చూస్తూ...
సార్… మీరు… నిజంగానే ఉన్నారా?
సూర్య నవ్వుతూ..
నీ కలలో నేను ఎలా ఉండగలను విశి… నువ్వే నన్ను ఇక్కడకు పిలిచావు.
విశి నిశ్శబ్దంగా సూర్య ని చూస్తూ....
అయితే నా ఊహలన్నీ నిజమవుతాయా?
సూర్య చూపులో సాంత్వన..
నిజమవుతాయ్… మనసు చెప్పినది ఎప్పుడో ఒకరోజు నిజమే అవుతుంది.
విశి చూపులు వెన్నెలతో తడుస్తాయి.
అయితే… మీరు ఎందుకు ఇలా దూరంగా ఉంటారు?
దేవా సార్ తేలికగా...
దూరం అనేది కనిపించేది మాత్రమే…
మనసు దగ్గరగా ఉంటే, దూరం కేవలం వెన్నెల దూరం.
విశి నవ్వుకుంటూ సూర్య ని చూస్తూ...
ఇది కలనా?
సూర్య చిరునవ్వుతో దగ్గరకి వచ్చి చెబుతాడు..
అవును, కలే… కానీ నీ మనసులో పుట్టిన నిజమైన కల.
ఆ మాటతో చందమామ కాంతి మరింత మసకబారుతుంది.
విశి కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని గుండెల్లో దాచుకుంటుంది.
సూర్య వాయిస్ తేలికగా మోగుతుంది..
గుడ్ నైట్, విశి. గుడ్ నైట్ సార్..
కిటికీ అంచున సూర్యరశ్మి చందమామ వెన్నెలను తాకినట్టుగా లోపలకి జారుతుంది.
విశి కళ్ళు మెల్లగా తెరుస్తుంది.
తల పక్కనే ఉన్న డైరీ పేజీ తెరిచి ఉంది.. నిన్న రాత్రి వేసిన గీతలు ఇంకా అలా మసకబారుతూ...
కొన్ని క్షణాలు కదలకుండా తలపట్టుకుని పడ్డట్లే ఉంటుంది.
గత రాత్రి దేవా సార్‌తో మాట్లాడిన కల ఒక్కసారిగా స్పష్టమవుతుంది.
ఆ స్వరం... ఆ చూపు... ఆ గుడ్ నైట్, విశి అన్న మాట..
ఇప్పటికీ చెవుల్లో నిశ్శబ్దంగా ప్రతిధ్వనిస్తోంది.
విశి నిశ్శబ్దంగా తనకు తానే..
అది నిజంగా కలేనా?.. కానీ ఆ క్షణం ఎంత నిజంగా అనిపించింది.
ఆలోచనల్లో చిన్న చిరునవ్వు తేలుతుంది.
సార్ మాట్లాడినప్పుడు ఆ మృదుత్వం…
అదే కలలోనూ అలాగే ఉంది.
మనసు ఎలా ఇంత సరిగ్గా గుర్తుంచుకుంటుంది సార్ మాటల టోన్‌ని?
విశి లేచి కిటికీ దగ్గరకి నడుస్తుంది.
బయట ఆరుణ కాంతి, చెట్లపై పక్షుల గళం.
ఆమె చూపు ఆ వెలుతుర్లో తేలిపోతుంది.
మిమ్మల్ని ఎంత ఆలోచిస్తున్నానో, దేవా సార్…
మీకు తెలిస్తే నవ్వుతారా… లేక సైలెంట్‌గా చూస్తారా?
మొబైల్ పక్కన ఉంది..
దేవా సార్ పేరుతో ఉన్న కాంటాక్ట్ వైపు కాసేపు చూసింది.
ఒక క్షణం ఫోన్ తీయబోతుంది,
తర్వాత మెల్లగా వదిలేస్తుంది.
కలలో మాట్లాడాను… ఇప్పుడే మళ్లీ మాట్లాడాలా?
కాదు విశి… ఈ అనుభూతిని అలాగే ఉంచుకో.
ఈ నిశ్శబ్దం చాలా అందంగా ఉంది.
ఆమె ముఖంపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు.
మనసులో తేలికగా మారుమ్రోగిన రియాలిజషన్..
ఇది ప్రేమే అయి ఉంటుందేమో…
కానీ ఏ దూకుడు లేదు, ఏ బలవంతం లేదు…
ఇది మనసు గుండా నెమ్మదిగా నడిచే ఒక వెన్నెల వాక్యం.
సార్ కి నా ప్రేమ విషయం చెప్పాలా.. చెబితే ఎలా తీసుకుంటారు. ఇప్పుడు కాదు.. నేను ఒక పోసిషన్ లో నిలబడి.. నన్ను తీర్చి దిద్దుతున్న సార్ ముందు గర్వం గా నిలబడే అప్పుడు చెబుతాను..
ఆయన మలుస్తున్న శిల్పం ఆయనకే సొంతమని చెబుతాను. ఆయన కోసం మాత్రమే ఉన్నాను అని అర్థమయ్యే లాగా నా ప్రేమని చూపిస్తాను..
విశి ఎలా చెప్పబోతోంది......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)