25-04-2026, 10:07 AM
Part - 70
ఇప్పుడు చందు నీతో గొడవ పడడం లేదని నీకు నచ్చడం లేదా లేక నువ్వు తిరిగి రీకౌంటర్ వెయ్యలేకపోతున్నావని నచ్చడం లేదా.
రెండు ఒకటే కదా.. సరిగ్గా ఆలోచించి సమాధానం చెప్పు.. నీ ప్రశ్నకి అక్కడే జవాబు దొరుకుతుంది.
ఏమో పెదనాన్న. అందరూ నన్ను ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పొద్దుట అన్నయ్య.. రాగానే సౌమ్య.. ఇప్పుడు మీరు.
నాకు బాబీనే కరెక్ట్ గా జవాబు చెబుతుంది. అవును ఒక సామెత ఉందరా.. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలింది అని..
అలాగే నువ్వు మీ బాబి కలిస్తే అంతే అని సూర్య అంటాడు. అన్నయ్య నువ్వు మా ఇద్దరిని అవమానిస్తున్నావు. మా టాలెంట్ నీకు తెలియడం లేదు.
వద్దురా బాబు ఇద్దరి టాలెంట్ ని తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఇలా నాన్న దగ్గరికి వచ్చాను. ఆ మాటకి విక్రమ్ నవ్వితే...
వైభవ్ కోపంగా లేచి నేను మా బాబి తో మాట్లాడతాను. మీ ఇద్దరితో కటీఫ్ అని వెళ్ళిపోతాడు. వీడికి ఇంకా చిన్న పిల్లోడు లక్షణాలు పోలేదు.
కోపంగా వెళుతున్న వైభవని అవని ఆపి..ఏమైందిరా అలాగ ఉన్నావు.. చూడు పెద్దమ్మ వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు.
నేను ఈరోజు నుంచి వాళ్ళిద్దరితో మాట్లాడడం లేదు అని వెళ్ళిపోతాడు. మీ ఇద్దరికీ పనేమీ లేదా... చిన్నపిల్లోడిని అలా ఏడిపిస్తున్నారు.
అమ్మ వాడిని చిన్న పిల్లోడు అంటున్నావు..వాడు చేసే పనులు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా.. ఏదో అప్పుడప్పుడు చేస్తాడు.
పిల్లలు అన్నాక చేయరా ఏమిటి.. చిన్నప్పుడు నువ్వు ఎంత అల్లరి చేసేవాడివి. నేను చిన్నప్పుడు చేసిన అల్లరి..
ఇప్పుడు వాడు చేసేది రెండు ఒకటేనా..
పిల్లలు ఎప్పుడు చేసినా నాకు ఒకటే.. మీ అమ్మతో వాదించలేం లేము గాని గౌతమ్ ట్రీట్మెంట్ కి ఎలా ఉన్నాడు.. నా గెస్ కరెక్ట్ అయితే వాడు ఇప్పుడు ఆలోచనలో పడతాడు.
వాడికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది... ఈరోజు హిమకి ఫొటోస్ పంపించింది ఎవరు అని ఆలోచిస్తారు. ఎంత ఆలోచించినా వాడి పీత బుర్రకి ఏమీ తట్టదులే..
కానీ నువ్వు జాగ్రత్త సూర్య. ఇద్దరికీ ఒకేసారి ఎదురుపడకు. హిమకి నువ్వు ఎవరో తెలుసు.. ఆ గౌతమ్ నిన్ను ఒక లెక్చరర్ మాత్రమే అనుకుంటున్నాడు.
సో బి కేర్ఫుల్. నో ప్రాబ్లం.. సరళ కూడా లైన్లోకి వచ్చింది. కాబట్టి ఆ గౌతమ్ క్యూటి జోలికి రాకుండా తనే అడ్డుగా ఉంటుంది.
అలా అని గుడ్డిగా నమ్మొద్దు... మనుషులు తమకు అనుకూలంగా ఎటు ఉంటే అటు మారిపోతారు..
అవని మంచం మీద కాళ్లు రెండు పైకి పెట్టుకుని కూర్చుని ఇద్దరినీ చూస్తూ ఉంటుంది. ఏంట్రా అలా చూస్తున్నావ్ అని విక్రమ్ అడిగితే...
ఇద్దరూ ఏదో దేశ రాజకీయాలు చర్చించుకుంటున్నారు కదా... డిస్టర్బ్ చేయడం ఎందుకని చూస్తున్నాను. అబ్బో మా అమ్మ కూడా ఈ మధ్యన సెటైర్లు వేస్తుందే అని లేచి వెళ్లి అవని పక్కన కూర్చుంటాడు.
పోనీలే రా బాబు ఇప్పటికైనా నీకు ఒక అమ్మ ఉందని గుర్తించావు.. అలా అంటావేమిటి అమ్మ. నిన్ను గుర్తించకుండా మేము ఉంటామా..
చెప్పరేమి డాడీ.. ఆ విషయం మీ అమ్మకి కూడా తెలుసు. ఈ మధ్యన అలకలు ఎక్కువ అయ్యాయి.. నాకేమీ అలకలు ఎక్కువగా అవ్వలేదు.
మీరు ఇద్దరు బిజీ అయిపోయి నన్ను పట్టించుకోవడం లేదు. మీరు మీ బిజినెస్ గొడవలో.. వీడికి వీడి ప్రేమ గొడవ. అప్పుడే కోడలు రాకుండానే అత్తగారి అలకలు చూపిస్తున్నావా..
అలా అన్నారంటే మాత్రం నేను అలిగి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మా నాన్న దగ్గరికి వెళ్లి మీరు ఎంత బ్రతిమాలిన రాను.
హ్మ్.. నీకు ఇప్పుడు పుట్టింటి వైపు గాలి మళ్ళింది. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు. వద్దని నేను ఆపలేదు కదా.. చూశారా అంతకుముందేమో ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు.నాతోనే ఉండు అనేవారు.
ఈ మధ్యన ప్రేమ తగ్గిపోయింది. అందుకే వెళితే వెళ్ళు అంటున్నారు కానీ ముక్కు చీదుతూ కొడుకు వైపు చూస్తూ నువ్వు మాత్రం నా కోడలని ఇలా ఇబ్బంది పెట్టకు రా..
ఇప్పుడు నేనేమన్నాను అని నీ కొడుకుకి కంప్లైంట్ ఇస్తున్నావు. మీరేగా వెళ్ళిపోమన్నారు.. నేనెక్కడ వెళ్ళమన్నాను.
నువ్వు వెళతాను అంటే సరే అన్నాను. దానికి నేను వెళ్ళిపోమన్నట్టా.. అంతే కదా.. సూర్య నవ్వుతూ మీ ఇద్దరి గొడవలోకి నేను రాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని వెళ్ళిపోతాడు.
సూర్య వెళ్లిన తర్వాత విక్రమ్ డోర్ లాక్ చేసి అవని పక్కన కూర్చుని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. ఏం చేస్తున్నారు.
ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పట్టుకున్నాను. ఇందాక వెళ్ళిపోమన్నారు. ఇదిగో తల తోక లేకుండా మాట్లాడకు. నువ్వే అలిగావు.. నువ్వే వెళ్ళిపోతాను అన్నావు.
మళ్ళీ నేను వెళ్ళిపోమ్మన్నాను అని దెబ్బలాడుతున్నావు. ఏమైందిరా.. భర్త వైపు తిరిగి... గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. ఏంట్రా బెంగగా అనిపిస్తుందా..
తెలియదు కానీ ఏంటోలాగా ఉంది. సరే రా అని గుండెలపై పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటాడు. శ్రీవారు అని పిలిస్తే.. చెప్పండి శ్రీమతి గారు.
మన పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ నన్ను ఇలాగే పడుకోబెట్టుకుని జో కొడుతున్నారు కదా.. మీకు ఎప్పుడూ విసుగు రాలేదా..
అదేం ప్రశ్న..ప్లీజ్ ప్లీజ్ చెప్పరా... చెబితే నాకేంటి.. ఏం కావాలో దొరగారికి.. నువ్వు ఏది ఇచ్చినా నేను కాదనను.. నన్ను డైవర్ట్ చేయకుండా సమాధానం చెప్పండి..
నాలో ఉన్న ప్రాణాన్ని విసుక్కుంటే నాకు శ్వాస ఎలా అందుతుంతే తింగరి. నేను తింగరిని కాదు. చాలా తెలివైన దాన్ని.. అవునవును నీ తెలివి ఏ పాటిదో.. నాకు కాక ఇంకెవరికి తెలుసు..
వైభవ్ గదిలోకి వెళ్లి విశికి కాల్ చేస్తాడు. చెప్పు. బాబీ నేను హర్ట్ అయ్యాను. నేను కూడా... ఆ చందు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సైలెంట్ గా ఉంది. దానికి ఏదైనా హెల్త్ బాగోలేదు ఏమో అని నేను కన్సల్ చూపిస్తే...
దానికి ఎలాగుంటే నీకెందుకు. నువ్వు ఏమైనా మిస్ అవుతున్నావా అని నన్నే తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు. నాకు అలాగే ఉంది వైభవ్..
ఈరోజు ఒక పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. దాని గురించి మీ అన్నయ్యని సలహా అడిగితే... నన్ను అడుగుతావేమిటి.. నీకు తెలియదా అంటున్నారు.
అరే చెప్పాలి కదా.. వీళ్లు క్లియర్గా చెప్పరు. మళ్ళీ తిరిగి మనల్నే క్యూస్షన్స్ అడుగుతున్నారు..
ఆ చందు మరీ సైలెంట్ గా ఉంటుంది..అంతకుముందు నేను కౌంటర్ వేస్తే నాకు రీకౌంటర్ వేసి... దెబ్బలాడి నన్ను మా అమ్మ దగ్గర ఇరుక్కించేదాకా ఊరుకునేది కాదు. అలాంటిది ఇప్పుడు నేను ఎంత రెచ్చగొడుతున్న ఒక చిన్న స్మైల్ ఇచ్చి తన పని తను చేసుకుంటుంది.
అవునా.. ఎందుకని... అదే కదా నేను ఎవరిని అడుగుతున్నా మా అందరితో బాగానే ఉంటుంది. నీకే అలా అనిపిస్తుందంటే నువ్వే ఆలోచించుకో అంటున్నారు.
అరే.. ఇదేమన్నా ఐఏఎస్ ఎగ్జామా ఏమిటి.. ఆలోచించుకుని సమాధానం చెప్పడానికి..
చందుని అడగకపోయావా.. అడిగాను. అడిగితే ఏంటో వేదాంతం చెబుతుంది. దాని ఫిగర్ కి అసలు వేదాంతం సెట్ అవుతుందా.
ఏమో నేనెప్పుడూ అమ్మాయిని చూడలేదు కదా.. నేను చెబుతున్నాను కదా.. సరే ఎలా ఉంటుందో చెప్పు వింటాను..
ఎలా ఉంటుంది అంటే ఆలోచిస్తూ బయటకి చూస్తూ ఉంటాడు..
చందు... అచ్చు ఆ చందమామ లాగా ఉంటుంది.
మొదట చూడగానే సాధారణంగా అనిపిస్తుంది. అమావాస్య చంద్రుడు లాగా ఏమీ అర్థం కాదు. గొడవపడే అమ్మాయిలాగా ఉంటుంది.
కానీ దగ్గరగా చూసినవాళ్లకే తెలుస్తుంది... ఆమెలో ఉన్న సింపుల్ బ్యూటీ ఎంత రేర్ అని.
అది ఎప్పుడూ నాతో గొడవ పడుతూ ఉంటేనే నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది..
కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉంటుంది.
ఆ సైలెన్స్‌లోనే ఎన్ని మాటలు దాగి ఉన్నాయో అనిపిస్తుంది కానీ అర్థం కావడం లేదు.
విశి ఆశ్చర్యంగా కాస్త నవ్వుతూ
అంతగా గమనిస్తావా నువ్వు ఆమెను..
వైభవ్ తెలియకుండానే మనసులో మాట చెబుతూ ఉంటాడు.
ఎవరినైనా అర్థం చేసుకోవాలంటే, వాళ్లను గమనించాల్సిందే కదా...
చందు మాట్లాడకపోయినా, ఆమె కళ్లలో ఉన్న ఏకాగ్రత... ఏదో చెబుతుంది.
మరి ఆ చెప్తున్నదేమిటో... నాకు ఇంకా అర్థం కాలేదు.
ఒక క్షణం మౌనం.
విశి నెమ్మదిగా..
వైభవ్... నీకు చందమామ అందంగా కనిపించటమా లేక చందు లాగా కనిపించటమా?
తెలియదు... కాని చాలాసార్లు ఆ చందమామలో చందు నన్ను చూసి నవ్వినట్టుంది.
ఆ నవ్వు ఎలా ఉంటుంది. వెన్నెలంతా చల్లగా ఉంటుంది. కానీ ఈ మధ్యనే బాబి... బెట్టు చేస్తుంది. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అనుకుంటుంది.
ఎందుకు నీతో అలా ఉంటుంది.. తెలియదు. తెలియదు కాదు...నీ దగ్గరే సమాధానం ఉంది. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ చేశాను. నీకే పంపుతున్నాను.
విను. ఈ మధ్యకాలంలో మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి కూడా ఆలోచించు.. ఎందుకు నీకు దూరంగా ఉంటుందో ఆలోచించు.. ఎవరిని అడగవలిసిన అవసరం లేదు.
నీ మనసే నీకు సరైన దారి చూపిస్తుంది. థాంక్యూ బాబి.. నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు. మిగిలిన అందరూ నువ్వు మిస్ అవుతున్నావు.. మిస్ అవుతున్నావు అని నన్ను టార్చర్ పెడుతున్నారు అనుకో..
నీ గురించి నాకు తెలిసినంతగా మిగిలిన వాళ్ళకి తెలియదు కదా.. సరే నీకు ఒక గుడ్ న్యూస్. మనకి వి.జె.స్ కంపెనీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది.
రేపు నువ్వు ఏ టైం లో ఫ్రీ గా ఉంటావో చెప్పు కొటేషన్ ప్రిపేర్ చేద్దాము.. వావ్ సూపర్ గుడ్ న్యూస్. నీ కాలేజ్ అయిన తర్వాత మీట్ అవుదాం. ఓకే గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తుంది.
విశి చందమామ ని చూస్తూ.. మనం ఇష్టపడుతున్న మనిషి చందమామలో కనిపిస్తారా..మరి నా మనసులో ఎవరున్నారు.
నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు తెలుసుకోవాలి అని.. కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుని వదిలి.. చందమామ ప్లీజ్ చూపించు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది.
ఎవరు కనిపిస్తారు..........

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)